Motorola: లీకైన Razr 50 Ultra యురోపియన్ మార్కెట్ ధర

Highlights

  • త్వరలో Motorola Razr 50 Ultra లాంచ్
  • రివీలైన యూరోపియన్ మార్కెట్ ధర
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో రేజర్ 40 సిరీస్ కి సక్సెసర్ Razr 50 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె బీఐఎస్ పై Motorola Razr 50 Ultra లిస్టైంది. దీంతో త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని స్పష్టమైంది. ఇప్పుడు, Motorola Razr 50 Ultra యురోపియన్ మార్కెట్ ధర, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Motorola Razr 50 Ultra ధర, స్టోరేజీ (లీక్)

Dealntech వెబ్‌సైట్ ద్వారా Motorola Razr 50 Ultra యొక్క ధర, స్టోరేజీ వివరాలు రివీల్ అయ్యాయి.

లీక్ ప్రకారం, ఈ ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 1200 యూరోలుగా ఉంది. అంటే భారత కరెన్సీలో దీన్ని రూ.1,07,634 గా చెప్పవచ్చు.

Motorola Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్ పాంటోన్ సర్టిఫైడ్ పీచ్ ఫజ్, బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Motorola Razr 50 Ultra డిజైన్ మరియు ఇతర వివరాలు

కొన్ని రోజుల క్రితం మోటోరోలా రేజర్ 50 అల్ట్రా యొక్క లైవ్ ఇమేజ్ కొన్ని రోజుల క్రితం రివీల్ అయ్యింది. డిజైన్ చూడటానికి Edge 40 Ultra మాదిరి ఉంది.

లీకైన ఇమేజ్‌ని చూస్తే, బ్యాక్ ప్యానెల్ పై హారిజంటల్ డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. రేజర్ బ్రాండింగ్ మరియు ఫోల్డబుల్ హింజ్ మధ్యలో ఉన్నాయి.

రియర్ ప్యానెల్ పై భారీ సెకండరీ డిస్ప్లే కనిపిస్తోంది. ఇది గత మోడల్ మాదిరే ఉంది.

Motorola Razr 50 Ultra ముందువైపు డిస్ప్లే పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ తో కనిపిస్తోంది. వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున కనిపిస్తున్నాయి.

Motorola Razr 50 Ultra ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్స్

మెయిన్ డిస్ప్లే: Motorola Razr 40 Ultra లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఎల్టీపీవో పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1 హెర్ట్జ్ – 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ హెచ్డీఆర్10+, 123 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 22:9 యాస్పెక్ట్ రేషియో, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

కవర్ స్క్రీన్: Motorola Razr 40 Ultra లో 3.6-ఇంచ్ క్విక్‌వ్యూ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 1056*1066 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Razr 40 Ultra లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Motorola Razr 40 Ultra లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.

ఓఎస్: Motorola Razr 40 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా: Motorola Razr 40 Ultra స్మార్ట్ ఫోన్ లో 12ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Motorola Razr 40 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 3800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఇతర ఫీచర్లు: Motorola Razr 40 Ultra లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, వీగన్ లెదర్ బ్యాక్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.