Realme GT Neo 6: 16GB ర్యామ్, 120W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన రియల్మీ కొత్త ఫోన్

Highlights

  • చైనాలో Realme GT Neo 6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్
  • 120 వాట్ సూపర్ వూక్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Realme GT 6T భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో రియల్మీ GT Neo 6 డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 16జిబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Realme GT Neo 6 ధర

Realme GT Neo 6 స్మార్ట్‌ఫోన్ 4 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme GT Neo 6 12జిబి ర్యామ్ మోడల్ ధర రూ.24,500 గా ఉంది. 16జిబి + 1టిబి మోడల్ ధరను రూ.34,500 గా నిర్ణయించారు. ఈ ఫోన్ లింగ్సీ పర్పుల్, లిక్విడ్ నైట్ (వైట్) మరియు కాంగ్యే హ్యాకర్ (గ్రీన్) కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Realme GT Neo 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 రెండు ర్యామ్ మోడల్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించారు.

కెమెరా: Realme GT Neo 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడారు.

బ్యాటరీ: Realme GT Neo 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme GT Neo 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.