
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గ్లోబల్ మార్కెట్ తో పాటు, భారత్ లో ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M15 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గతంలో ఈ ఫోన్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు Samsung Galaxy M15 5G డివైజ్ ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy M15 5G రెండర్స్ (లీక్)
Galaxy M15. pic.twitter.com/6NHNFgpjaE
— Evan Blass (@evleaks) March 1, 2024
- Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ రెండర్స్‌ని టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
- Samsung Galaxy M15 5G డివైజ్ బ్లూ, గ్రీన్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు రెండర్స్ ద్వారా తెలుస్తోంది.
- Samsung Galaxy M15 5G డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
- Samsung Galaxy M15 5G డివైజ్ లో ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, భారీ చిన్ కనిపిస్తున్నాయి.
- లీకైన రెండర్ తప్పా, Samsung Galaxy M15 5G కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు.
Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy M15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57-ఎంపీ2 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంటుంది.
- కెమెరా: Samsung Galaxy M15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎండి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.











