ఐపీ69కే రేటింగ్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన Nokia XR21

Highlights

  • వివిధ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన Nokia XR21
  • ఐపీ69కే రేటింగ్ ఈ ఫోన్ లో ముఖ్యమైన ఫీచర్
  • రానున్న కొన్ని నెలల్లో భారత్‌లో లాంచ్ కానున్న Nokia XR21

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ సరికొత్త బ్రాండ్ న్యూ రగ్డ్ నోకియా స్మార్ట్ ఫోన్ తో మన ముందుకు వచ్చింది. తాజాగా Nokia XR21 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 64ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ69కే రేటింగ్ తో రావడం విశేషం. Nokia XR21 లో ఇదే ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఫీచర్ వల్లన ఫోన్ డస్ట్, హై-టెంపరేచర్, హై-ప్రెషర్ వాటర్ నుంచి రక్షణ పొందుతుంది.

Nokia XR21 రగ్డ్ స్మార్ట్ ఫోన్ ని ఇంటా బయటా రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు. ఈ డివైజ్ అసలైతే Nokia XR30 అనే పేరుతో లాంచ్ అవుతుందని అంచనా వేసారు. కానీ, Nokia XR21 పేరుతో లాంచ్ అయ్యింది. గత మోడల్ Nokia XR20 కి ఇది సక్సెసర్ గా వచ్చింది. సరే, ఓసారి Nokia XR21 డివైజ్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Nokia XR21 ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

  • Nokia XR21 స్మార్ట్ ఫోన్ ధర జర్మనీలో EUR 599 (సుమారు రూ.54,216) గా ఉంది. యూకే లో GBP 499 (సుమారు రూ.51,267) గా ఉంది. ఈ ధరలు 6జిబి+128జిబి మోడల్‌కి వర్తిస్తాయి.
  • సరికొత్త Nokia XR21 డివైజ్ ప్రస్తుతం జర్మనీతో పాటు పలు ఎంపిక చేయబడ్డ మార్కెట్స్ లో అందుబాటులో ఉంది. జూన్ నుంచి యూకే లో అందుబాటులోకి వస్తోంది.
  • Nokia XR21 స్మార్ట్ ఫోన్ పైన్ గ్రీన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia XR21 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 550నిట్స్ బ్రైట్నెస్

Nokia XR21 లో 6.49-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 20:9 డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

రియర్ కెమెరా విభాగం

  • 64ఎంపి కెమెరా
  • 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా

Nokia XR21 లో 64ఎంపి రియర్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా విభాగం

  • 16ఎంపి కెమెరా

Nokia XR21 లో సెల్ఫీస్ మరియు వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

చిప్సెట్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695
  • 6జిబి/128జిబి

Nokia XR21 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. అడ్రెనో 619ఎల్ జీపీయూ గ్రాఫిక్స్ ని ఈ చిప్సెట్ కి పెయిర్ చేసారు. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

  • 4800ఎంఏహెచ్
  • 33వాట్

Nokia XR21 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్, ఐపీ రేటింగ్స్

  • ఆండ్రాయిడ్ 12
  • ఐపీ68/ఐపీ69కే

Nokia XR21 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ ఐపీ68 మరియు ఐపీ69కే రేటింగ్స్ ని కలిగి ఉంది.

కనెక్టివిటీ

  • స్టీరియో స్పీకర్స్
  • 3.5ఎంఎం ఆడియో జాక్

Nokia XR21 స్మార్ట్ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Nokia XR21 ఇండియా లాంచ్ ఎప్పుడు?

Nokia XR21 డివైజ్ భారతీయ మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. కంపెనీ అధికార ప్రకటన చేయాల్సి ఉంది. అయితే రానున్న కొన్ని నెలల్లో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.