
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో F25 Pro 5G ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం భారతీయ వినియోగదారులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో 2024 ఫిబ్రవరి 29న లాంచ్ కానుందని సమాచారం. ఒప్పో నుంచి రాబోవు ఈ ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.
OPPO F25 Pro 5G ధర
- OPPO F25 Pro 5G ధర భారతీయ మార్కెట్ లో రూ.25,000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- OPPO F25 Pro 5G యొక్క బేస్ వేరియంట్ ధర రూ.22,999 మరియు టాప్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంటుందని అంచనా.
OPPO F25 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OPPO F25 Pro 5G లో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.
- ప్రాసెసర్: OPPO F25 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OPPO F25 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చే అవకాశం ఉంది.
- కెమెరా: OPPO F25 Pro 5G లో 64ఎంపి ఒమ్నివిజన్ వొవి64బి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- కెమెరా ఫీచర్స్: OPPO F25 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ మరియు బ్యాక్ 4కే అల్ట్రా-క్లియర్ వీడియోతో ఈ ఫోన్ వస్తోందని కంపెనీ చెబుతోంది. అంటే సెల్ఫీ కెమెరా మరియు రియర్ కెమెరా ద్వారా యూజర్ 4కే వీడియోని రికార్డ్ చేయవచ్చు.
- బ్యాటరీ: OPPO F25 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











