OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో రానున్న Ace 3 Pro, లీకైన స్పెసిఫికేషన్స్

Highlights

  • త్వరలో OnePlus Ace 3 Pro లాంచ్
  • 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్
  • ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఒక ఏస్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. OnePlus Ace 3 Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ 6100 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

OnePlus Ace 3 Pro చార్జింగ్ స్పీడ్ వివరాలు (లీక్)

OnePlus Ace 3 Pro డివైజ్ చార్జింగ్ సపోర్ట్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక Weibo పై షేర్ చేసింది.

OnePlus Ace 3 Pro ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని ఈ లీక్ ద్వారా రివీల్ అయ్యింది. గత మోడల్ OnePlus Ace 2 Pro 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

ఇదే లీక్ ద్వారా OnePlus Ace 3 Pro డివైజ్ యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

డిస్ప్లే: OnePlus Ace 3 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1.6కే రెజుల్యూషన్ (2780*1264 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Ace 3 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ దీనికి జతచేయనున్నారు.

మెమొరీ: OnePlus Ace 3 Pro డివైజ్ 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.

కెమెరా: OnePlus Ace 3 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Ace 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus Ace 3 Pro లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OnePlus Ace 3 Pro డివైజ్ 2024 మూడో త్రైమాసికంలో లాంచ్ అవుతుందని డిజిటల్ చాట్ స్టేషన్ అంచనా వేసింది. గత మోడల్ OnePlus Ace 2 Pro 2023 ఆగస్టులో లాంచ్ అయ్యింది. తన ఏస్ సిరీస్ ఫోన్లను గ్లోబల్ గా టీ-సిరీస్ పేరుతో లాంచ్ చేయడాన్ని వన్‌ప్లస్ ఆపేసింది. చివరగా 2022 లో OnePlus 10T మార్కెట్ లోకి వచ్చింది.