HMD Aura: తక్కువ బడ్జెట్‌లో గ్లోబల్‌గా లాంచైన హెచ్ఎండి ఆరా, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • ఆస్ట్రేలియాలో HMD Aura లాంచ్
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ 60Hz డిస్ప్లే
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Nokia మాతృ సంస్థ HMD గ్లోబల్ వరుసబెట్టి తన బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. హెచ్ఎండి పేరుతో ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో కొన్ని ఫోన్లను లాంచ్ చేసిన ఈ సంస్థ తాజాగా ఆస్ట్రేలియాలో HMD Aura అనే డివైజ్ ని విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో లాంచైన ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 4జిబి ర్యామ్, 13ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. ఓసారి HMD Aura యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

HMD Aura స్పెసిఫికేషన్స్

స్క్రీన్: HMD Aura లో 6.55-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 900*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Aura లో యూనిఎస్ఓషీ చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.6GHz. గ్రాఫిక్స్ కోసం పవర్‌వీఆర్ జీఈ8322 జీపీయూ వాడారు.

మెమొరీ: HMD Aura డివైజ్ 4జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 64జిబి స్టోరేజీ అందించారు. మెమొరీ కార్డ్ సాయంతో 256జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: HMD Aura లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: HMD Aura లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

ఇతర ఫీచర్లు: HMD Aura లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

HMD Aura ధర

HMD Aura డివైజ్ ఆస్ట్రేలియాలో సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతుంతో తెలుసుకుందాం.

HMD Aura 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను 180 ఆస్ట్రేలియన్ డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో దీన్ని రూ.9,799 గా చెప్పవచ్చు.

HMD Aura డివైజ్ గ్లేసియర్ గ్రీన్ మరియు ఇండిగో బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

HMD Aura స్మార్ట్‌ఫోన్‌ని హెచ్ఎండి గ్లోబల్ త్వరలోనే భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది.