OPPO A58 4G: 6.72-ఇంచ్ డిస్ప్లే, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ58 4జీ!

Highlights

  • భారత్ లో OPPO A58 4G ధర రూ.14,999
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా డివైజ్ అమ్మకాలు
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo భారత్ లో నేడు ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. OPPO A58 4G అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉత్తమమైన స్పెసిఫికేషన్స్, గ్రేట్ లుక్ తో ఈ డివైజ్ వచ్చింది. 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి OPPO A58 4G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A58 4G ధర

OPPO A58 4G స్మార్ట్ ఫోన్ భారత్ లో ఒకే మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు. ఒప్పో అధికార వెబ్ సైట్ తో పాటు, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా మరియు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా OPPO A58 4G డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. OPPO A58 4G స్మార్ట్ ఫోన్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A58 4G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: OPPO A58 4G లో మీడియాటెక్ హీలియో జీ85 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 12-నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి-జీ52 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO A58 4G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.50 శాతం చార్జ్ అవ్వడానికి కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A58 4G డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.