Tecno: ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్‌పై లిస్టైన Tecno Pova 6

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Pova 6 సిరీస్
  • లైనప్ లో రానున్న Tecno Pova 6, Pova 6
  • ఎఐఆర్ఐఎమ్ సైట్ పై లిస్టైన Tecno Pova 6

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో Pova 6 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Tecno Pova 6 మరియు Tecno Pova 6 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం. తాజాగా Tecno Pova 6 డివైజ్ థాయిలాండ్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎస్ఐఆర్ఐఎమ్ పై లిస్టైంది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 SIRIM లిస్టింగ్ వివరాలు

  • Tecno Pova 6 డివైజ్ ఎస్ఐఆర్ఐఎమ్ వెబ్‌సైట్ పై L17 సర్టిఫికేషన్ కోడ్ తో లిస్ట్ అయ్యింది.
  • ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ ఇమేజ్ ద్వారా ఫోన్ పేరు ఖరారైంది.
  • మోడల్ నంబర్, పేరు తప్పా మరే ఇతర వివరాలు ఈ సర్టిఫికేషన్ ద్వారా రివీల్ కాలేదు.
  • Tecno Pova 6 Neo, Pova Pro 5G డివైజెస్ కూడా ఈ లైనప్ లో లాంచ్ అవుతాయని సమాచారం. వీటి మోడల్ నంబర్లు L16, L19 గా ఉండే అవకాశం ఉంది.

Tecno Pova 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Tecno Pova 6 Pro 5G డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ గతంలో గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి. లిస్టింగ్ ప్రకారం, Tecno Pova 6 Pro 5G లో కర్వ్డ్ డిస్ప్లే, 2436*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Pro 5G డివైజ్ ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లిస్ట్ అయ్యింది.
  • కెమెరా: Tecno Pova 6 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెకండరీ సెన్సర్ వివరాలు, ఫ్రంట్ కెమెరా వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno Pova 6 Pro 5G బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు. అయితే డివైజ్ 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని సమాచారం.
Previous articleOPPO: లీకైన OPPO F25 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్
Next articleVivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo Y200e 5G ధర
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.