OPPO: రివీలైన Reno 12 సిరీస్ టీజర్

Highlights

  • మే 23న OPPO Reno 12 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న రెనో 12, 12 ప్రో
  • టీజర్ ద్వారా రివీలైన డిజైన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో Reno 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Reno 12 మరియు OPPO Reno 12 Pro ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. మే 23న ఈ సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. నేడు ఒప్పో కంపెనీ కొత్త టీజర్‌ని విడుదల చేసింది. దీంతో రెనో 12 యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

OPPO Reno 12, Reno 12 Pro డిజైన్ టీజర్

OPPO Reno 12 సిరీస్ యొక్క టీజర్‌ కంపెనీ వెబ్‌సైట్ లో కనిపిస్తోంది. అలాగే చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై కూడా టీజర్ షేర్ అయ్యింది.

రెనో 12 సిరీస్ ఫోన్లు గ్లాసీ ఫినిష్ తో వస్తున్నట్లు రివీలైన ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఏఐ కెమెరా సిస్టమ్ అని మాడ్యూల్ పై రాసి ఉంది.

కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, టీజర్ ద్వారా సిల్వర్ మరియు పర్పుల్ కలర్స్ రివీల్ అయ్యాయి.

డివైజ్‌ని గమనిస్తే, కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ ఉంది.

OPPO Reno 12 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO Reno 12 సిరీస్ ఫోన్లు 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8250 చిప్సెట్ ఉంటుంది. OPPO Reno 12 Pro లో డైమెన్సిటీ 9200 స్టార్ స్పీడ్ ఎడిషన్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 12 సిరీస్ 12జిబి లేదా 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి లేదా 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటాయి.

కెమెరా: OPPO Reno 12 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: OPPO Reno 12, OPPO Reno 12 Pro డివైజెస్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నాయి.

ఓఎస్: OPPO Reno 12 సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: OPPO Reno 12 సిరీస్ ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

Previous articleVivo Y200 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Next articleMoto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.