Realme 11 5G ఇండియా లాంచ్ ఖరారు; టీజ్ చేసిన కంపెనీ!

Highlights

  • భారత్ లో ఈ నెలలో Realme 11 5G లాంచ్ అయ్యే అవకాశం
  • Realme 11 5G తో పాటు లాంచ్ కానున్న Realme 11x 5G
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తోన్న Realme 11 5G

Realme 11 సిరీస్ లో భాగంగా Realme 11 Pro 5G, Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసాక రియల్మీ సంస్థ ఇప్పుడు Realme 11 5G ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా కంపెనీ డబుల్ లీప్ కమింగ్ సూన్ అనే ట్యాగ్ లైన్ తో ఓ టీజర్ వదిలింది. అయితే అప్పుడు రియల్మీ ఫోన్ పేరు తెలపలేదు. Realme 11 5G లాంచ్ కానుందని మేం అంచనా వేస్తున్నాం. టీజర్ ఇమేజ్ లో కనిపించిన భారీ కెమెరా మాడ్యూల్ ని బట్టి డివైజ్ Realme 11 5G అయ్యుంటుందని అంచనా.

ఈ నెలలోనే లాంచ్ కానున్న Realme 11 5G, Realme 11x 5G

Realme 11 5G తో పాటు కంపెనీ Realme 11x 5G డివైజ్ ని కూడా లాంచ్ చేయనుందని సమాచారం. భారత్ లో Realme 11x 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందని సమాచారం. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. భారత్ లో ఈ డివైజ్ పర్పుల్ డాన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.

మరోవైపు, Realme 11 5G స్మార్ట్ ఫోన్ 128జిబి స్టోరేజీ, 256జిబి స్టోరేజీతో రానుంది. ఈ రెండు కూడా 8జిబి ర్యామ్ తో రానున్నాయి. ఇకపోతే Realme 11 5G స్మార్ట్ ఫోన్ గ్లోరీ గోల్డ్ మరియు గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

Realme 11 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • స్క్రీన్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Realme 11 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్, మాలి-జీ57 ఎమ్‌సీ2 జీపీయూ ఉన్నాయి.
  • స్టోరేజీ: Realme 11 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Realme 11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎమ్6 ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Realme 11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Realme 11 5G స్మార్ట్ ఫోన్ లో వై-ఫై 5, బ్లూటూత్ 5.2 సపోర్ట్, డ్యూయల్ సిమ్ 5జీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.