భారత్‌లో లాంచైన Galaxy F15 5G 8GB RAM వేరియంట్

Highlights

  • డైమెన్సిటీ 6100+ చిప్‌తో వచ్చిన గెలాక్సీ ఎఫ్15 5జీ
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా గెలాక్సీ ఎఫ్ 15 సేల్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గత నెలలో భారతీయ మార్కెట్ లో Galaxy F15 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇది 4జిబి మరియు 6జిబి ర్యామ్ మోడల్స్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు 8జిబి వేరియంట్‌ని కంపెనీ లాంచ్ చేసింది. Galaxy F15 5G లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ ఉన్నాయి. ఓసారి గెలాక్సీ ఎఫ్15 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Galaxy F15 5G 8GB RAM వేరియంట్ ధర

Galaxy F15 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఫోన్ రూ.14,999 కే లభిస్తుంది.

ఆఫర్ లో భాగంగా, గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ కొనుగోలుపై రూ.1,299 విలువగల 25 వాట్ చార్జర్‌ను 299 కే లభించనుంది.

Galaxy F15 5G డివైజ్ ని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియట్ ధర రూ.12,999 మరియు 6జిబి ర్యామ్ + 128జిబి రూ.14,999 గా ఉన్నాయి.

Galaxy F15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F15 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy F15 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy F15 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.