Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy F55 5G

Highlights

  • త్వరలో Galaxy F55 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
  • ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 8జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy F55 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గెలాక్సీ ఎమ్55 కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Samsung Galaxy F55 5G గూగుల్ ప్లే లిస్టింగ్

Samsung Galaxy F55 5G గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన విషయాన్ని తొలుత 91mobiles గుర్తించింది. ఈ ఫోన్ Galaxy M55 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. SM7450 మోడల్ నంబర్ తో ఓ చిప్సెట్ లిస్టింగ్ పై కనిపించింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ కి సంబంధించిందని అర్థమవుతోంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

గెలాక్సీ ఎమ్55 డివైజ్ గెలాక్సీ సీ55 గా కూడా రీబ్రాండ్ అవ్వనుందని సమాచారం. ఇదే ఫోన్ చైనాలో గెలాక్సీ వై55 అనే పేరుతో కూడా లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

లిస్టింగ్ ప్రకారం, ఈ అన్ని మోడల్స్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 8జిబి ర్యామ్, వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఉంటాయని తెలుస్తోంది.

Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Samsung Galaxy F55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.