Amazon - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 29 Jan 2024 18:08:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor X9b 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు; లీకైన అమెజాన్ లిస్టింగ్! https://www.91mobiles.com/telugu/honor-x9b-5g-india-launch-date-confirmed-and-amazon-listing-leaked/ Mon, 29 Jan 2024 18:07:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=9967 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor భారత మార్కెట్ లోకి Honor 90 అనే డివైజ్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు హానర్ సిద్ధమవుతోంది. Honor X9b పేరుతో రాబోవు ఈ ఫోన్ కి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Honor X9b డివైజ్ అమెజాన్ ఇండియా పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియా […]

The post Honor X9b 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు; లీకైన అమెజాన్ లిస్టింగ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ ఇండియాపై లిస్టైన Honor X9b
  • ఫిబ్రవరి 15న లాంచ్ కానున్న డివైజ్
  • సన్‌రైజ్ ఆరెంజ్ కలర్‌లో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor భారత మార్కెట్ లోకి Honor 90 అనే డివైజ్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు హానర్ సిద్ధమవుతోంది. Honor X9b పేరుతో రాబోవు ఈ ఫోన్ కి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Honor X9b డివైజ్ అమెజాన్ ఇండియా పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. సరే, ఓసారి Honor X9b లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Honor X9b ఇండియా లాంచ్ తేదీ

  • Honor X9b స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ తన ‘ఎక్స్‌ప్లోర్ హానర్’ తన X ఖాతా ద్వారా ప్రకటించింది.
  • ఎక్స్‌ప్లోర్ హానర్ పోస్ట్ ప్రకారం, Honor X9b డివైజ్ ఫిబ్రవరి 15 న లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • పోస్ట్ లో షేర్ చేయబడిన డివైజ్ ని గమనిస్తే, కర్వ్డ్ డిస్ప్లేని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది.
  • బౌన్స్ డిస్ప్లే ఫీచర్ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీని తొలిసారిగా హానర్ ఇండియాలో ఈ డివైజ్ ద్వారా పరిచయం చేస్తోంది.
  • ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్ క్రింద పడిపోయినప్పటికీ సురక్షితంగానే ఉంటుంది.

Honor X9b అమెజాన్ లిస్టింగ్ (లీక్)

  • Honor X9b స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ పై టిప్‌స్టర్ పారస్ గుగ్లాని గుర్తించారు. ఆ వెనువెంటనే స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
  • ఇకపోతే, అమెజాన్ లిస్టింగ్ ద్వారా Honor X9b యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
  • Honor X9b స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.
  • Honor X9b డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్ లో లభించనుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం.
  • Honor X9b డివైజ్ కర్వ్డ్ డిస్పలే, పంచ్ హోల్ కటౌట్, సర్క్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, మెటల్ కేసింగ్ ని కలిగి ఉంది.
  • Honor X9b తొలుత చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు అవే స్పెసిఫికేషన్స్ తో భారత్ లో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Honor X9b స్పెసిఫికేషన్స్ (చైనా)

  • డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్‌జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor X9b 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు; లీకైన అమెజాన్ లిస్టింగ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/honor-90-5g-gets-huge-discount-know-the-details/ Sun, 14 Jan 2024 09:40:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=9723 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Honor 90 5G ఫోన్ తో రీఎంట్రీ ఇచ్చింది. Honor 90 5G డివైజ్ భారత్ లో రూ.37,999 ధరతో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయం నుంచి ఈ ఫోన్ పై హానర్ సంస్థ పలుమార్లు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరోసారి పడిపోయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా […]

The post Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తక్కువ ధరకి లభిస్తోన్న Honor 90 5G
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ డీల్
  • 200ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Honor 90 5G ఫోన్ తో రీఎంట్రీ ఇచ్చింది. Honor 90 5G డివైజ్ భారత్ లో రూ.37,999 ధరతో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయం నుంచి ఈ ఫోన్ పై హానర్ సంస్థ పలుమార్లు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరోసారి పడిపోయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా Honor 90 5G డివైజ్‌ అన్ని ఆఫర్లతో కలుపుకుని రూ.20,000 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Honor 90 5G పై భారీ డిస్కౌంట్

  • అమెజాన్ తీసుకొచ్చిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా Honor 90 5G స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకి లభిస్తోంది. క్రింద అందించిన ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
  • Honor 90 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.28,999 గా ఉంది.
  • Honor 90 5G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.30,999 గా ఉంది.
  • అంతేకాదు, దీనికి తోడు అమెజాన్ Honor 90 5G పై రూ.6,000 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఫోన్ ధరలు వరుసగా రూ.22,999 మరియు రూ.24,999 గా ఉంది.
  • ఎస్బీఐ యూజర్లు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా రూ.3,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.19,249 కి చేరుతుంది.
  • Honor 90 5G బాక్స్ లో ఛార్జర్‌ని హానర్ ప్రొవైడ్ చేయడం లేదు. కానీ, 30 వాట్ అడాప్టర్ ని అమెజాన్ ద్వారా హానర్ సంస్థ ఉచితంగా అందిస్తోంది.
  • Honor 90 5G డివైజ్ దీపావళి సీజన్ తర్వాత రెండో భారీ డిస్కౌంట్ తో యూజర్ల ముందుకు వచ్చింది. కానీ, మొదటిసారిగా రూ.20,000 లోపు ధరతో లభిస్తోంది.
  • Honor 90 5G డివైజ్ అందిస్తోన్న ఫీచర్లను గమనిస్తే, ఈ ధర సరైనదేననిపిస్తోంది. ఓసారి Honor 90 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Honor 90 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 5G లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor 90 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కలర్స్: Honor 90 5G స్మార్ట్‌ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon గ్లోబల్ సైట్‌లో లిస్టైన Redmi 13C; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-13c-listed-on-global-amazon-website-price-specs-availability/ Wed, 08 Nov 2023 09:10:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=8757 Redmi 13C స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. భారత మార్కెట్ లో Redmi 13C ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. కానీ, గ్లోబల్ అమెజాన్ వెబ్‌సైట్ పై మాత్రం పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఫోటోలతో సహా లిస్ట్ అయ్యింది. అలాగే Redmi 13C ధర కూడా ఈ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి. Redmi 13C స్పెసిఫికేషన్స్ స్క్రీన్: Redmi 13C లో […]

The post Amazon గ్లోబల్ సైట్‌లో లిస్టైన Redmi 13C; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన Redmi 13C
  • అమెజాన్ సైట్ లో లిస్టైన Redmi 13C
  • త్వరలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం

Redmi 13C స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. భారత మార్కెట్ లో Redmi 13C ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. కానీ, గ్లోబల్ అమెజాన్ వెబ్‌సైట్ పై మాత్రం పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఫోటోలతో సహా లిస్ట్ అయ్యింది. అలాగే Redmi 13C ధర కూడా ఈ సైట్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Redmi 13C స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 1650*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 ఎంపీ2 జీపీయూ వాడారు.
  • ఓఎస్: Redmi 13C స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 16 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Redmi 13C ధర

  • Redmi 13C స్మార్ట్‌ఫోన్ ఒకే ఒక్క మెమొరీ వేరియంట్ లో గ్లోబల్ అమెజాన్ సైట్ లో లిస్ట్ అయ్యింది.
  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. దీని ధరను 140.54 డాలర్లు (సుమారు రూ.11,700) గా నిర్ణయించారు.
  • Redmi 13C డివైజ్ మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

The post Amazon గ్లోబల్ సైట్‌లో లిస్టైన Redmi 13C; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
నేడే అమెజాన్‌లో Tecno Phantom V Flip ఎర్లీ బర్డ్ సేల్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-5g-early-bird-sale-via-amazon-price-specs-availability/ Sun, 01 Oct 2023 12:42:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=8237 మొబైల్ ఫోన్ మేకర్ Tecno ఇటీవలె తన తొలి ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. Tecno Phantom V Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. నేటి నుంచి భారతీయ మార్కెట్ లో Amazon ద్వారా Tecno Phantom V Flip ప్రీ-ఆర్డర్స్ మొదలవుతున్నాయి. క్లామ్‌షెల్ ఫోన్ కేటగిరీలో Tecno Phantom V Flip డివైజ్ అత్యంత చవకైనదిగా నిలుస్తోంది. Tecno Phantom V Flip లో సర్క్యులర్ కవర్ డిస్ప్లే, కార్నింగ్ […]

The post నేడే అమెజాన్‌లో Tecno Phantom V Flip ఎర్లీ బర్డ్ సేల్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె భారత్ లో లాంచైన Tecno Phantom V Flip
  • అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip సేల్
  • 1.32-ఇంచ్ సర్క్యులర్ కవర్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్

మొబైల్ ఫోన్ మేకర్ Tecno ఇటీవలె తన తొలి ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది. Tecno Phantom V Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. నేటి నుంచి భారతీయ మార్కెట్ లో Amazon ద్వారా Tecno Phantom V Flip ప్రీ-ఆర్డర్స్ మొదలవుతున్నాయి. క్లామ్‌షెల్ ఫోన్ కేటగిరీలో Tecno Phantom V Flip డివైజ్ అత్యంత చవకైనదిగా నిలుస్తోంది.

Tecno Phantom V Flip లో సర్క్యులర్ కవర్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్, మాలి జీ77 జీపీయూ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Tecno Phantom V Flip ధర, లాంచ్ ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

భారత్ లో Tecno Phantom V Flip ధర, లాంచ్ ఆఫర్స్, లభ్యత

ఎర్లీ బర్డ్ సేల్ లో భాగంగా Tecno Phantom V Flip ధరను భారత్ లో రూ.49,999 గా నిర్ణయించారు. నేడు, అనగా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ద్వారా Tecno Phantom V Flip ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్ మిస్టిక్ డాన్, ఐకానిక్ బ్లాక్ కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2640) రెజుల్యూషన్, 413పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 22:9 యాస్పెక్ట్ రేషియో, Schott UTG గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • కవర్ డిస్ప్లే: Tecno Phantom V Flip లో 1.32-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే, 466*466 పిక్సెల్స్ రెజుల్యూషన్, 352పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్, మాలి జీ77 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వరకు మెమొరీ ఫ్యూజన్ (ర్యామ్), 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13.5 ఫ్లిప్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno Phantom V Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ మరియు ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip లో స్టీరియో స్పీకర్, డీటీఎస్ ఆడియో, టైప్-సీ పోర్ట్, హై-రెజ్ ఆడియో, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వై-ఫై, జీపీఎస్ ఉన్నాయి.
  • చుట్టుకొలత, బరువు: Tecno Phantom V Flip డివైజ్ 171.72 మి.మీ పొడవు, 74.05 మి.మీ వెడల్పు, 6.95మి.మీ మందం, 194 గ్రాముల బరువు ఉంటుంది.

The post నేడే అమెజాన్‌లో Tecno Phantom V Flip ఎర్లీ బర్డ్ సేల్; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Nokia X30 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.12,000 తగ్గింపు! https://www.91mobiles.com/telugu/nokia-x30-5g-price-cut-by-rs-12000-sale-on-amazon/ Wed, 13 Sep 2023 09:33:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=8000 ప్రజాదరణ పొందిన Nokia బ్రాండ్ 2023 సంవత్సరం ప్రారంభంలో భారతీయ మార్కెట్ లో Nokia X30 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 6 నెలల తర్వాత, కంపెనీ Nokia X30 5G ధరను రూ.12,000 తగ్గించింది. అంటే, మీరు కొత్త మరియు శక్తివంతమైన 5G డివైజ్ ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ డీల్ మీకు తగినదని చెప్పవచ్చు. సరే, ఓసారి Nokia X30 5G యొక్క అసలు ధర, తగ్గింపు ధర, […]

The post Nokia X30 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.12,000 తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ లో అందుబాటులో ఉన్న Nokia X30 5G
  • 8జిబి+256జిబి ఆప్షన్ తో వచ్చిన డివైజ్
  • కలర్ ఆప్షన్స్: ఐస్ వైట్, క్లౌడీ బ్లూ

ప్రజాదరణ పొందిన Nokia బ్రాండ్ 2023 సంవత్సరం ప్రారంభంలో భారతీయ మార్కెట్ లో Nokia X30 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 6 నెలల తర్వాత, కంపెనీ Nokia X30 5G ధరను రూ.12,000 తగ్గించింది. అంటే, మీరు కొత్త మరియు శక్తివంతమైన 5G డివైజ్ ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ డీల్ మీకు తగినదని చెప్పవచ్చు. సరే, ఓసారి Nokia X30 5G యొక్క అసలు ధర, తగ్గింపు ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia X30 5G పై డిస్కౌంట్

  • Nokia X30 5G పై కంపెనీ రూ.12,000 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోన్ ని రూ.36,999 కే కొనుగోలు చేయవచ్చు.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ మరియు కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.
  • ఐస్ వైట్, క్లౌడీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో Nokia X30 5G లభిస్తుంది.
  • 2023 ఫిబ్రవరిలో రూ.48,999 ధరతో Nokia X30 5G డివైజ్ మార్కెట్ లోకి లాంచ్ చేయబడింది.

Nokia X30 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Nokia X30 5G లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • చిప్సెట్: Nokia X30 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు.
  • స్టోరేజీ, ర్యామ్: Nokia X30 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Nokia X30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Nokia X30 5G లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Nokia X30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Nokia X30 5G లో ఐపీ67 రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ ఉన్నాయి.

The post Nokia X30 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.12,000 తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ https://www.91mobiles.com/telugu/amazon-great-summer-sale-2023-best-deals-on-smartphones/ Thu, 04 May 2023 10:15:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=6165 విభిన్న కేటగిరీలకు చెందిన ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందించే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023 ప్రారంభమైంది. ప్రముఖ బ్రాండ్స్ అయిన Samsung, Apple, OPPO, iQOO, Sony, Asus తదితర ఎన్నో కంపెనీలకు చెందిన ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయి. సేల్ లో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు కూడా అందిస్తున్నారు. మీరు గనుక ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం లేదా 5జీ కనెక్టివిటీ గల ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే వివిధ ధరల […]

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

విభిన్న కేటగిరీలకు చెందిన ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందించే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023 ప్రారంభమైంది. ప్రముఖ బ్రాండ్స్ అయిన Samsung, Apple, OPPO, iQOO, Sony, Asus తదితర ఎన్నో కంపెనీలకు చెందిన ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయి. సేల్ లో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు కూడా అందిస్తున్నారు. మీరు గనుక ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం లేదా 5జీ కనెక్టివిటీ గల ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే వివిధ ధరల శ్రేణుల్లో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మీకోసం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేట్ లో అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలను అందిస్తున్నాం. అంతేకాదు, ఈ ఇ-కామర్స్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ మరియు కొటక్ బ్యాంక్ లకు చెందిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై అలాగే ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్లపై లభిస్తోన్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ డీల్స్

Apple iPhone 14 (128 GB)

Apple iPhone 14 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ లో 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, ప్రో-లెవెల్ 12ఎంపి డ్యూయల్ కెమెరా, ఆటో-ఫోకస్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మెరుగైన డీటెయిల్స్ మరియు రంగుల కొరకు Apple iPhone 14 లో ఫోటోనిక్ ఇంజిన్ అందించారు. స్మూద్ మరియు స్టేబుల్ వీడియోలను అందించేందుకు ఈ ఫోన్ లో యాక్షన్ మోడ్ అనే ఫీచర్ ఇచ్చారు. ఈ ఫోన్ లో ఏ15 బయోనిక్ చిప్ వాడారు. అలాగే ఈ డివైజ్ లో 5జీ కనెక్టివిటీ ఉంది.

అసలు ధర: రూ.71,999
డీల్ ధర: రూ.66,359 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలుపుకుని)

Apple iPhone 14 Plus (256 GB)

పెద్ద స్క్రీన్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి Apple iPhone 14 Plus డివైజ్ సరిగ్గా సరిపోతుంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉంది. Apple iPhone 14 Plus లో అడ్వాన్స్‌డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ఫోటోనిక్ ఇంజిన్ అందించారు. ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉండటం వల్లన 26 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ ని సింగిల్ చార్జ్ పై పొందవచ్చు. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వచ్చింది. ఈ ఫోన్ లో ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ తో పాటు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఉంది.

అసలు ధర: రూ.94,999
డీల్ ధర: రూ.74,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ తో కలుపుకుని)

Samsung Galaxy M33 5G

Samsung Galaxy M33 5G డివైజ్ అద్భుతమైన ఆల్-రౌండర్ మిడ్ రేంజ్ ఫోన్. ఈ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎగ్జినోస్ 1280 ఆక్టా-కోర్ చిప్సెట్ తో వచ్చింది. Samsung Galaxy M33 5G లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంది. ఇంటెలిజెంట్ వాయిస్ ఫోకస్, పవర్ కూల్ టెక్నాలజీ, ఆటో డేటా స్విచింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అసలు ధర: రూ.17,999
డీల్ ధర: రూ.14,999 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G గ్రేట్ మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఐ ఆటో ఫోకస్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ఉన్నాయి.

అసలు ధర: రూ.13,999
డీల్ ధర: రూ.12,499 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Samsung Galaxy M14 5G

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్, వాయిస్ ఫోకస్, శాంసంగ్ వాలెట్, సెక్యూర్ ఫోల్డర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉన్నాయి. ఈ ఫోన్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

అసలు ధర: రూ.16,490
డీల్ ధర: రూ.12,490 (అన్ని బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Redmi 12C

Redmi 12C ఒక చక్కటి బడ్జెట్ ఫోన్. ఈ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్, 50ఎంపి ఏఐ డ్యూయల్ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరా, పొట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉన్నాయి. Redmi 12C డివైజ్ బ్యాక్ ప్యానెల్ స్ట్రైప్డ్ డిజైన్ తో వస్తోంది.

అసలు ధర: రూ.11,499
డీల్ ధర: రూ.8,999 (బ్యాంక్ డిస్కౌంట్ కలిపి)

Redmi 10A

Redmi 10A డివైజ్ బ్యూటిఫుల్ EVOL డిజైన్ తో వచ్చింది. ఈ బడ్జెట్ ఫోన్ లో 6.53-ఇంచ్ హెచ్డీ+ఐపీఎస్ డిస్ప్లే, 13ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ వాడారు.

అసలు ధర: రూ.8,999
డీల్ ధర: రూ.7,849 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Realme Narzo N55

Realme Narzo N55 స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ లో 6.76-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ డిజైన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 64ఎంపి ఏఐ కెమెరా ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడారు. ఈ డివైజ్ లో డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

అసలు ధర: రూ.12,999
డీల్ ధర: రూ.10,999 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)

realme narzo 50i Prime

Realme Narzo 50i Prime స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 400 నిట్స్ బ్రైట్నెస్, 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ లేదు. 4జీ నెట్వర్క్ సపోర్ట్ ఉంది. యూనిసాక్ టైగర్ టీ612 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. మల్టీటాస్కింగ్ పెర్ఫామెన్స్ కోసం 4జిబి ర్యామ్ అందించారు.

అసలు ధర: రూ.8,999
డీల్ ధర: రూ.6,299 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)

Samsung Galaxy M53 5G

Samsung Galaxy M53 5G డివైజ్ ప్రస్తుతం కొనసాగుతోన్న సేల్ లో ఉత్తమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పవర్ఫుల్ మిడ్-రేంజ్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ వాడారు. ఈ ఫోన్ లో 5జీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108ఎంపి క్వాడ్ కెమెరా, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో బిల్ట్-ఇన్ వేపర్ కూలింగ్ చాంబర్ అందించారు.

అసలు ధర: రూ.27,999
డీల్ ధర: రూ.23,249 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

iQOO 11 5G

iQOO 11 5G స్మార్ట్ ఫోన్ సేల్ లో భాగంగా ఆకర్షణీయమైన ధరకి దొరుకుతోంది. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 2కే ఈ6 అమోలెడ్ 6.78-ఇంచ్ డిస్ప్లే, బిల్ట్-ఇన్ వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, వీ2 చిప్ ఉన్నాయి. అలాగే 50ఎంపి జీఎన్5 అల్ట్రా-సెన్సింగ్ కెమెరా ని ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ 120 వాట్ ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ తో వచ్చింది.

అసలు ధర: రూ.64,990
డీల్ ధర: రూ.49,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>