Global launch - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 11 Oct 2024 16:08:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Camon 30S: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-camon-30s-globally-launched-8gb-ram-50mp-camera/ https://www.91mobiles.com/telugu/tecno-camon-30s-globally-launched-8gb-ram-50mp-camera/#respond Fri, 11 Oct 2024 16:08:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=14047 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Camon 30S స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ త్వరలోనే భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా విడుదల కానుంది. ఈ హ్యాండ్సెట్ లో వర్చువల్ టెక్నాలజీతో 16జిబి వరకు ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Tecno Camon 30S […]

The post Tecno Camon 30S: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Tecno Camon 30S విడుదల
  • 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Camon 30S స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ త్వరలోనే భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో కూడా విడుదల కానుంది. ఈ హ్యాండ్సెట్ లో వర్చువల్ టెక్నాలజీతో 16జిబి వరకు ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Tecno Camon 30S ధర, కలర్ ఆప్షన్స్

  • Tecno Camon 30S స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం పాకిస్తాన్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. 256జిబి వేరియంట్ ధర PKR 59,999 (సుమారు రూ.18,000) గా ఉంది.
  • Tecno Camon 30S డివైజ్ బ్లూ, నెబులా వయొలెట్, సెలెస్టియల్ బ్లాక్ మరియు డాన్ గోల్డ్ కలర్స్ లో లభిస్తుంది.
  • బ్లూ కలర్ వేరియంట్ కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చింది. దీని బ్యాక్ ప్యానెల్‌పై సూర్యకాంతి పడినప్పుడు రంగు మారుతుంది.

Tecno Camon 30S స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Camon 30S స్మార్ట్‌ఫోన్‌లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ వరకు హైబ్రైట్నెస్ మోడ్, 10-బిట్ ప్యానెల్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

చిప్సెట్: Tecno Camon 30S స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Camon 30S 6జిబి+128జిబి, 8జిబి+128జిబి, మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్‌కి లభిస్తుంది.

కెమెరా: Tecno Camon 30S స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి 1/1.56″ సోని ఐఎంఎక్స్896 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్‌లో డ్యూయల్ ఫ్లాష్ కూడా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Camon 30S లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Tecno Camon 30S లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Tecno Camon 30S లో ఐపీ53 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Tecno Camon 30S: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-camon-30s-globally-launched-8gb-ram-50mp-camera/feed/ 0
Samsung Galaxy A16 5G: 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ16 5జీ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-globally-launched-with-6-years-os-updates/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-globally-launched-with-6-years-os-updates/#respond Mon, 07 Oct 2024 13:04:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=13960 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా గ్లోబల్ మార్కెట్ లో కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇకపోతే, ఈ ఫోన్ 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్ తో రావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7-ఇంచ్ భారీ […]

The post Samsung Galaxy A16 5G: 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ16 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Galaxy A16 5G విడుదల
  • 6 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్
  • 6.7-ఇంచ్ భారీ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా గ్లోబల్ మార్కెట్ లో కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. ఇకపోతే, ఈ ఫోన్ 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్ తో రావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7-ఇంచ్ భారీ అమోలెడ్ స్క్రీన్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క డిజైన్, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A16 5G డిజైన్

Samsung Galaxy A16 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంది. ఫోన్ కి ఫ్రంట్ లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఫ్లాట్ ప్యానెల్ అందించారు. ఈ ఫోన్ 7.9 మందం ఉంటుంది. డివైజ్‌కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి.

Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ బ్లాక్, లైట్ గ్రే, గోల్డ్ మరియు లైట్ గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A16 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A16 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A16 5G డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. మార్కెట్స్‌ను బట్టి వేరియంట్స్ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1.5టిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: Samsung Galaxy A16 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A16 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది యూఎస్బీ టైప్-సీ 2.0 పోర్ట్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Samsung Galaxy A16 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G డివైజ్ లో ఐపీ54 రెసిస్టన్స్ రేటింగ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉన్నాయి.

Samsung Galaxy A16 5G ధర

Samsung Galaxy A16 5G డివైజ్ శాంసంగ్ డచ్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. కానీ ధర వెల్లడి కాలేదు. అయితే, రూ.15,000 లోపు ఈ ఫోన్ ధర ఉంటుందని అంచనా వేయవచ్చు.

The post Samsung Galaxy A16 5G: 6 ఏళ్ళ ఓఎస్ అప్డేట్ సపోర్ట్‌తో గ్లోబల్‌గా లాంచైన గెలాక్సీ ఏ16 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a16-5g-globally-launched-with-6-years-os-updates/feed/ 0
itel P65C: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఐటెల్ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/itel-p65c-globally-launched-8gb-ram-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/itel-p65c-globally-launched-8gb-ram-5000mah-battery/#respond Fri, 04 Oct 2024 12:09:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=13922 యూజర్ల కోసం తక్కువ ధరలో ఫోన్లను తీసుకొచ్చే కంపెనీల్లో ముందు వరుసలో ఉంటుంది ITEL సంస్థ. తాజాగా ఈ కంపెనీ పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. itel P65C పేరుతో ఈ డివైజ్ జాంబియా దేశంలో విడుదలైంది. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. itel […]

The post itel P65C: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఐటెల్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జాంబియాలో లాంచైన itel P65C
  • 13ఎంపి ప్రైమరీ కెమెరా
  • యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్

యూజర్ల కోసం తక్కువ ధరలో ఫోన్లను తీసుకొచ్చే కంపెనీల్లో ముందు వరుసలో ఉంటుంది ITEL సంస్థ. తాజాగా ఈ కంపెనీ పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. itel P65C పేరుతో ఈ డివైజ్ జాంబియా దేశంలో విడుదలైంది. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

itel P65C డిజైన్

itel P65C స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే లుక్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. డివైజ్‌కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫ్లాట్ ప్యానెల్ ఉంది. జాంబియాలో ఈ ఫోన్ మూన్‌లిట్ బ్లాక్, అరోరా బ్లూ మరియు బ్రిలియంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel P65C స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: itel P65C లో 6.6-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: itel P65C లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: itel P65C డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: itel P65C డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: itel P65C లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: itel P65C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

itel P65C ధర, లభ్యత

itel P65C స్మార్ట్‌ఫోన్ ధర జాంబియాలో K2200 గా ఉంది. భారత కరెన్సీలో దీన్ని రూ.7,000 గా చెప్పవచ్చు.

The post itel P65C: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఐటెల్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/itel-p65c-globally-launched-8gb-ram-5000mah-battery/feed/ 0
Infinix Smart 9: హీలియో జీ81 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/infinix-smart-9-globally-launched-with-helio-g81-chip/ https://www.91mobiles.com/telugu/infinix-smart-9-globally-launched-with-helio-g81-chip/#respond Thu, 03 Oct 2024 07:16:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=13882 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix గ్లోబల్‌గా స్మార్ట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Smart 9 పేరుతో వచ్చిన ఈ డివైజ్ మలేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఎంట్రీ లెవెల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ అందించారు. ఈ డివైజ్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Infinix Smart 9 ధర Infinix Smart 9 […]

The post Infinix Smart 9: హీలియో జీ81 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మలేషియాలో Smart 9 విడుదల
  • 6.7-ఇంచ్ 120 హెర్ట్జ్ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ81 చిప్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix గ్లోబల్‌గా స్మార్ట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Smart 9 పేరుతో వచ్చిన ఈ డివైజ్ మలేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఎంట్రీ లెవెల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ అందించారు. ఈ డివైజ్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Smart 9 ధర

Infinix Smart 9 డివైజ్ ప్రస్తుతం మలేషియన్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీని ధరను 299 రింగిత్ లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో దీన్ని సుమారు రూ.6,200 అని చెప్పవచ్చు. బ్లాక్, మింట్ గ్రీన్, గోల్డ్ మరియు సిల్వర్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి దీనికి సంబంధించి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Infinix Smart 9 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Infinix Smart 9 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90.2% స్క్రీన్-టు-బాడీ రేషియో, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Smart 9 స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.0 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 అందించారు.

ఆపరేటింగ్ సిస్టమ్: Infinix Smart 9 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ గో ఓఎస్ పై పని చేస్తుంది. తక్కువ ర్యామ్ పై పని చేసే గూగుల్ గో యాప్స్ ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

మెమొరీ: Infinix Smart 9 స్మార్ట్‌ఫోన్ 3జిబి/4జిబి ర్యామ్, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో, గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ పొందవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ తో మెమొరీని 2టిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: Infinix Smart 9 లో 13ఎంపి రియర్ కెమెరా అందించారు. దీనికి తోడు ఒక డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Smart 9 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Smart 9 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఓటీజీ సపోర్ట్ కూడా ఉంది. దీని ద్వారా యూఎస్బీ పెన్ డ్రైవ్, కీబోర్డ్, మౌజ్ వంటి వాటిని ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు.

ఇతర ఫీచర్లు: Infinix Smart 9 లో ఎఫ్ఎమ్ రేడియో, 300% వాల్యూమ్ ప్లస్ ఫీచర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post Infinix Smart 9: హీలియో జీ81 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-smart-9-globally-launched-with-helio-g81-chip/feed/ 0
Realme C65s: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన రియల్మీ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/realme-c65s-globally-launched-8gb-ram-50mp-camera/ https://www.91mobiles.com/telugu/realme-c65s-globally-launched-8gb-ram-50mp-camera/#respond Tue, 01 Oct 2024 10:19:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=13862 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా గ్లోబల్ మార్కెట్ లో సీ-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme C65s పేరుతో ఈ డివైజ్ వియత్నాం దేశంలో విడుదలైంది. ఈ ఫోన్ లో 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే, 16జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి రియల్మీ సీ65ఎస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Realme C65s […]

The post Realme C65s: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వియత్నాంలో Realme C65s విడుదల
  • 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా గ్లోబల్ మార్కెట్ లో సీ-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme C65s పేరుతో ఈ డివైజ్ వియత్నాం దేశంలో విడుదలైంది. ఈ ఫోన్ లో 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.74-ఇంచ్ భారీ డిస్ప్లే, 16జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి రియల్మీ సీ65ఎస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme C65s ధర

Realme C65s స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను VND 42,90,000 (సుమారు రూ.14,500) గా పెట్టారు.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను VND 47,90,000 (సుమారు రూ.16,000) గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర VND 52,90,000 (సుమారు రూ.18,000) గా ఉంది.

Realme C65s స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C65s లో 6.74-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 560 నిట్స్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C65s లో ఎంట్రీ లెవెల్ యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme C65s డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme C65s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Realme C65s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme C65s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme C65s లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, వై-ఫై 5, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme C65s లో ఐపీ54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ రేటింగ్, ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ ఉన్నాయి. ఇంకా 4 ఏళ్ళ వరకు స్మూథ్ పెర్ఫామెన్స్‌ను కంపెనీ హామీ ఇస్తోంది.

The post Realme C65s: 8GB ర్యామ్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన రియల్మీ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-c65s-globally-launched-8gb-ram-50mp-camera/feed/ 0
Moto G75 5G: 50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/moto-g75-5g-globally-launched-50mp-ois-camera-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/moto-g75-5g-globally-launched-50mp-ois-camera-5000mah-battery/#respond Tue, 01 Oct 2024 08:16:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=13859 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Moto G75 5G పేరుతో ఈ ఫోన్ పశ్చిమ ఐరోపాలో లాంచ్ అయ్యింది. త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16జిబి వరకు ర్యామ్, […]

The post Moto G75 5G: 50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వెస్టర్న్ యూరప్‌లో Moto G75 5G విడుదల
  • త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Moto G75 5G పేరుతో ఈ ఫోన్ పశ్చిమ ఐరోపాలో లాంచ్ అయ్యింది. త్వరలో భారత్ సహా ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G75 5G ధర, కలర్స్

Moto G75 5G స్మార్ట్‌ఫోన్ ధరను 369 యూరోలు (సుమారు రూ.27,000) గా నిర్ణయించారు. నవంబర్ 5వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్‌కి వస్తోంది. చార్కోల్ గ్రే (మ్యాట్), ఆక్వా బ్లూ మరియు సకులెంట్ గ్రీన్ (వీగన్ లెదర్) కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Moto G75 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G75 5G లో 6.78-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 5, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G75 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: Moto G75 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. 5 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 6 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ర్యామ్, స్టోరేజీ: Moto G75 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో వచ్చింది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Moto G75 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Moto G75 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Moto G75 5G లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, MIL-STD-810H రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Moto G75 5G డివైజ్ 166.09 మి.మీ పొడవు, 77.24 మి.మీ వెడల్పు, 8.44 మి.మీ మందం, 208 గ్రాముల బరువు ఉంటుంది. మ్యాట్ ఫినిష్ వేరియంట్ 166.09 మి.మీ పొడవు, 77.24 మి.మీ వెడల్పు, 8.34 మి.మీ మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది.

The post Moto G75 5G: 50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన మోటోరోలా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g75-5g-globally-launched-50mp-ois-camera-5000mah-battery/feed/ 0
Honor 200 Smart: 5,200mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన హానర్ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/honor-200-smart-globally-launched-5200mah-battery/ https://www.91mobiles.com/telugu/honor-200-smart-globally-launched-5200mah-battery/#respond Mon, 30 Sep 2024 05:32:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=13830 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor తన 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Honor 200 Smart పేరుతో ఈ డివైజ్ జర్మనీలో విడుదలైంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 35 వాట్ సూపర్‌చార్జ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Honor 200 […]

The post Honor 200 Smart: 5,200mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన హానర్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జర్మనీలో Honor 200 Smart విడుదల
  • ఐపీ64 వాటర్ & డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్
  • 6.8-ఇంచ్ 120హెర్జ్ట్ ఎల్సీడీ స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor తన 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Honor 200 Smart పేరుతో ఈ డివైజ్ జర్మనీలో విడుదలైంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 35 వాట్ సూపర్‌చార్జ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor 200 Smart ధర, కలర్ ఆప్షన్స్

Honor 200 Smart జర్మనీ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. రానున్న రోజుల్లో ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ విడుదల కానుంది. జర్మనీలో ఈ ఫోన్ ధర 199.90 యూరోలు (సుమారు రూ.18,599) గా ఉంది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Honor 200 Smart ఇండియా లాంచ్ పై ఇంకా స్పష్టత లేదు.

Honor 200 Smart స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Honor 200 Smart లో 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, టీఎఫ్‌టీ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Honor 200 Smart లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 613 జీపీయూ అందించారు.

మెమొరీ: Honor 200 Smart డివైజ్ 4జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. 4జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో 8జిబి వరకు ర్యామ్ ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీ అందించారు.

కెమెరా: Honor 200 Smart లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Honor 200 Smart లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Honor 200 Smart లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Honor 200 Smart: 5,200mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన హానర్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-200-smart-globally-launched-5200mah-battery/feed/ 0
Xiaomi MIX Flip: 12GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన షావోమి మిక్స్ ఫ్లిప్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-globally-launched-12gb-ram-know-full-details/ https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-globally-launched-12gb-ram-know-full-details/#respond Fri, 27 Sep 2024 10:19:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13802 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. Xiaomi MIX Flip పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఇది షావోమి యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్. ఈ ఫోన్ 4-ఇంచ్ భారీ కవర్ స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. […]

The post Xiaomi MIX Flip: 12GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన షావోమి మిక్స్ ఫ్లిప్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Xiaomi MIX Flip లాంచ్
  • 4-ఇంచ్ కవర్ డిస్ప్లే
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది. Xiaomi MIX Flip పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఇది షావోమి యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్. ఈ ఫోన్ 4-ఇంచ్ భారీ కవర్ స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఓసారి ఈ ఫ్లిప్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Xiaomi MIX Flip ధర, లభ్యత

Xiaomi MIX Flip స్మార్ట్‌ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధర 1299 యూరోలు (సుమారు రూ.1,21,000) గా ఉంది.

ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం యూరప్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఇతర మార్కెట్స్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు.

Xiaomi MIX Flip డివైజ్ బ్లాక్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Xiaomi MIX Flip స్పెసిఫికేషన్స్

ఇంటర్నల్ స్క్రీన్: Xiaomi MIX Flip లో 6.86-ఇంచ్ ఎల్టీపీవో 1.5కే క్రిస్టల్‌రెజ్ డిస్ప్లే, 2912*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డీసీ డిమ్మింగ్, 3000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్, యూటీజీ గ్లాస్ ఉన్నాయి.

ఔటర్ డిస్ప్లే: Xiaomi MIX Flip లో 4-ఇంచ్ 1.5కే క్రిస్టల్‌రెజ్ స్క్రీన్, 1392*1280 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డీసీ డిమ్మింగ్, 3000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, షావోమి గ్లాస్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

చిప్సెట్: Xiaomi MIX Flip లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.3 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ ఇచ్చారు.

ర్యామ్, స్టోరేజీ: Xiaomi MIX Flip డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వచ్చింది.

కెమెరా: Xiaomi MIX Flip లో 50ఎంపి లైట్ ఫ్యూజన్ 800 ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి60ఏ40 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Xiaomi MIX Flip లో పవర్ బ్యాకప్ కోసం 4780 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Xiaomi MIX Flip డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Xiaomi MIX Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.4 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Xiaomi MIX Flip డివైజ్ 167.5 మి.మీ పొడవు, 74.02 మి.మీ వెడల్పు, 16.19 మి.మీ మందం (మడిచినప్పుడు), 7.8 మి.మీ మందం (తెరిచినప్పుడు), 192 గ్రాముల బరువు ఉంటుంది.

The post Xiaomi MIX Flip: 12GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన షావోమి మిక్స్ ఫ్లిప్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-globally-launched-12gb-ram-know-full-details/feed/ 0
Infinix Zero Flip: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన జీరో ఫ్లిప్ https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-globally-launched-50mp-camera-8gb-ram/ https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-globally-launched-50mp-camera-8gb-ram/#respond Fri, 27 Sep 2024 08:52:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=13798 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన ఫ్లిప్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Zero Flip పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే. ఇకపోతే, ఈ డివైజ్ లో 6.9-ఇంచ్ ప్రైమరీ డిస్ప్లే, 3.64-ఇంచ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్, 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 4720 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి […]

The post Infinix Zero Flip: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన జీరో ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Infinix Zero Flip విడుదల
  • 512జిబి స్టోరేజీ, 4720ఎంఏహెచ్ బ్యాటరీ
  • 6.9-ఇంచ్ ప్రైమరీ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన ఫ్లిప్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Zero Flip పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ఇదే. ఇకపోతే, ఈ డివైజ్ లో 6.9-ఇంచ్ ప్రైమరీ డిస్ప్లే, 3.64-ఇంచ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్, 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 4720 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Zero Flip ధర

Infinix Zero Flip 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 600 డాలర్లు (సుమారు రూ.50,100) గా ఉంది. బ్లాసమ్ గ్లొ మరియు రాక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Zero Flip స్పెసిఫికేషన్స్

ఇంటర్నల్ డిస్ప్లే: Infinix Zero Flip లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (1080*2640 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ఔటర్ డిస్ప్లే: Infinix Zero Flip లో 3.64-ఇంచ్ అమోలెడ్ ఔట్ స్క్రీన్, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

చిప్సెట్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Infinix Zero Flip డివైజ్ 16జిబి వరకు ర్యామ్ (ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో కలిపి), 8జిబి స్టాండర్డ్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Infinix Zero Flip లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి శాంసంగ్ జెఎన్1 ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

రియర్ కెమెరా: Infinix Zero Flip లో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 ఓఐఎస్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు మరియు వెనుకాల కెమెరాలతో 4కే 60ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. వ్లాగింగ్, డీవీ మోడ్, గోప్రో మోడ్ లు ఈ కెమెరాలో ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,720 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 10 వాట్ రివర్స్ చార్జింగ్ కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Infinix Zero Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, జెబిఎల్ డ్యూయల్ స్పీకర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Infinix Zero Flip డివైజ్ 170.35 మి.మీ పొడవు, 73.4 మి.మీ వెడల్పు, 7.64 మి.మీ మందం ఉంటుంది.

The post Infinix Zero Flip: 50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన జీరో ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-flip-globally-launched-50mp-camera-8gb-ram/feed/ 0
Tecno Spark 30 4G: 64ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-spark-30-4g-globally-launched-64mp-camera-8gb-ram/ https://www.91mobiles.com/telugu/tecno-spark-30-4g-globally-launched-64mp-camera-8gb-ram/#respond Mon, 23 Sep 2024 08:01:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=13679 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Spark 30 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 30 పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ, 16జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. సరే, స్పార్క్ […]

The post Tecno Spark 30 4G: 64ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Tecno Spark 30 విడుదల
  • 256జిబి స్టోరేజీ, 64ఎంపి కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో Spark 30 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 30 పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ, 16జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. సరే, స్పార్క్ 30 ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Spark 30 ధర, లభ్యత

Tecno Spark 30 స్మార్ట్‌ఫోన్ టాంజానియా దేశంలో లాంచ్ అయ్యింది. టెక్నో టాంజానియా అధికార వెబ్‌సైట్ లో ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. అయితే ధర వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఆర్బిట్ వైట్ మరియు ఆర్బిట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Tecno Spark 30 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Spark 30 లో 6.78-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark 30 లో మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్ అందించారు. సాధారణ వాడకానికి, గేమింగ్ కి ఈ ఫోన్ సరిపోతుంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 30 స్మార్ట్‌ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో యూజర్లకు 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Tecno Spark 30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 14ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Spark 30 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Tecno Spark 30 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Tecno Spark 30 లో డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ స్పీకర్, డాల్బీ అట్మాస్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Tecno Spark 30 4G: 64ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-30-4g-globally-launched-64mp-camera-8gb-ram/feed/ 0