Google Pixel Fold - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 20 Apr 2023 06:16:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన Pixel 7a, Pixel Fold ఫోన్ల లాంచ్ తేదీ, ధర; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/google-pixel-7a-pixel-fold-launch-date-leak-expected-specs/ Wed, 19 Apr 2023 05:53:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=5943 ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మే 10 వ తేదీన I / O 2023 డెవలపర్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ని గూగుల్ పరిచయం చేయనుంది. దాంతో పాటు, గూగుల్ సంస్థ Pixel 7a, Pixel Fold ఫోన్లను లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కంపెనీ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదు. కానీ, FrontPageTech వెబ్ సైట్ కి చెందిన John Prosser, […]

The post లీకైన Pixel 7a, Pixel Fold ఫోన్ల లాంచ్ తేదీ, ధర; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 27 నుంచి అందుబాటులోకి రానున్న Google Pixel Fold
  • Pixel Fold తో పాటు Pixel 7a అనౌన్స్ అయ్యే అవకాశం
  • Pixel 7a ధర 499 డాలర్లు (సుమారు రూ.41,000) ఉండే చాన్స్

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మే 10 వ తేదీన I / O 2023 డెవలపర్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ని గూగుల్ పరిచయం చేయనుంది. దాంతో పాటు, గూగుల్ సంస్థ Pixel 7a, Pixel Fold ఫోన్లను లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కంపెనీ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదు. కానీ, FrontPageTech వెబ్ సైట్ కి చెందిన John Prosser, Pixel 7a మరియు Pixel Fold డివైజెస్ ఎప్పుడు ప్రీ-ఆర్డర్ మరియు కొనుగోలుకి అందుబాటులోకి వస్తాయో తెలిపారు. దీంతోపాటు, Pixel 7a ధర ఒక రిపోర్ట్ ద్వారా రివీల్ అయ్యింది.

Google Pixel 7a, Pixel Fold లాంచ్ తేదీ (లీక్)

  • మే 10 వ తేదీన Google Pixel Fold లాంచ్ అవుతుందని అంచనా. మే 10 నుంచి గూగుల్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయని సమాచారం.
  • మే 30 నుంచి పార్ట్నర్స్ మరియు క్యారియర్ ఔట్‌లెట్స్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. జూన్ 27 నుంచి ఫోల్డబుల్ ఫోన్ సేల్ కి వస్తుంది.
  • పిక్సెల్ 7ఏ మే 10 ప్రకటన తర్వాత అందుబాటులోకి వస్తుందని జాన్ చెప్పారు. ఇకపోతే ఈ డివైజ్ చార్‌కోల్, స్నో, సీ అండ్ కోరల్ కలర్ ఆప్షన్స్ లో గూగుల్ స్టోర్ ద్వారా మాత్రమే లభించనుంది.
  • పిక్సెల్ 7ఏ తర్వాత గూగుల్ సంస్థ పిక్సెల్ 6ఏ ని నిలిపివేయదని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

Google Pixel 7a ధర (అంచనా)

  • పిక్సెల్ 7ఏ ధరను 9to5Google వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. దాని ప్రకారం, ఈ ఫోన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.41,000) గా ఉండనుంది. పిక్సెల్ 6ఏ కంటే ఇది 50 డాలర్లు ఎక్కువ.

Pixel 7a స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • Pixel 7a స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సిమ్మెట్రికల్ బెజెల్స్, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో రానుంది.
  • ఈ డివైజ్ లో టెన్సర్ జీ2 చిప్సెట్ వాడనున్నారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో ఈ ఫోన్ రానుంది.
  • పిక్సెల్ 7ఏ లో 64ఎంపి సోని ఐఎంఎక్స్787 సెన్సర్, 13ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10.8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Pixel Fold స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

  • Pixel Fold డివైజ్ లో 7.57-ఇంచ్ ఫోల్డబుల్ మెయిన్ స్క్రీన్ మరియు 5.78-ఇంచ్ ఔటర్ స్క్రీన్ ఉంటాయి.
  • ఈ ఫోల్డబుల్ ఫోన్ టెన్సర్ జీ2 చిప్సెట్ తో వస్తోంది. ఇందులో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఈ డివైజ్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. అయితే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ గురించి సమాచారం ఇంకా రాలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Pixel 7a, Pixel Fold ఫోన్ల లాంచ్ తేదీ, ధర; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
2023 మార్చిలో లాంచ్ కానున్న Google Pixel Fold https://www.91mobiles.com/telugu/google-pixel-fold-launch-timeline/ Tue, 11 Oct 2022 08:45:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=2848 హైలైట్స్ 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Google Pixel Fold శాంసంగ్ తయారు చేసిన యూటీజీ డిస్ప్లే తో రానున్న Pixel Fold గత కొన్నేళ్ళుగా Pixel Fold పై పని చేస్తున్న గూగుల్ కంపెనీ Google కంపెనీ ఇటీవలె గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Pixel 7, Pixel 7 Pro మోడల్స్ ఉన్నాయి. వీటితో పాటు గూగుల్ పిక్సెల్ వాచ్ కూడా లాంచ్ అయ్యింది. ఇక […]

The post 2023 మార్చిలో లాంచ్ కానున్న Google Pixel Fold first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 ప్రథమార్థంలో లాంచ్ కానున్న Google Pixel Fold
  • శాంసంగ్ తయారు చేసిన యూటీజీ డిస్ప్లే తో రానున్న Pixel Fold
  • గత కొన్నేళ్ళుగా Pixel Fold పై పని చేస్తున్న గూగుల్ కంపెనీ

Google కంపెనీ ఇటీవలె గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Pixel 7, Pixel 7 Pro మోడల్స్ ఉన్నాయి. వీటితో పాటు గూగుల్ పిక్సెల్ వాచ్ కూడా లాంచ్ అయ్యింది. ఇక తొలిసారిగా కంపెనీ, పిక్సెల్ ట్యాబ్లెట్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 2023 ప్రథమార్థంలో Pixel Fold ఫోన్ ని తీసుకురావాలని గూగుల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ప్రకారం, ప్రస్తుతం గూగుల్ Pixel Fold పై పని చేస్తున్నట్లు సమాచారం. అలాగే 2023 మొదటి త్రైమాసికంలో ఈ ఫోన్ ని గూగుల్ లాంచ్ చేయనుందని రాస్ యంగ్ చెప్పారు. అంటే వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.

Pixel Fold క్యాన్సిల్ అయ్యిందా అనే యూజర్ ప్రశ్నకు బదులిచ్చిన యంగ్, 2023 జనవరి నుంచి ప్యానెల్ షిప్మెంట్స్ మొదలవుతాయని తాను విన్నట్లు తెలిపారు. యూఎస్ఏ లోకి 2023 స్ప్రింగ్ సీజన్ లో ప్రవేశిస్తుందని యంగ్ చెప్పారు.

పాస్ పోర్ట్ అనే కోడ్ నేమ్ తో కనిపించిన Pixel Fold ఈ ఏడాదే లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాజ్ తెలిపాడు. అయితే గూగుల్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. రీసెంట్ గా జరిగిన గూగుల్ ఈవెంట్ లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో లాంచ్ చేసిన గూగుల్, Pixel Fold గురించి ఏమీ మాట్లాడలేదు.

ఆగస్టు నెలలో ట్రేడ్ మార్క్ మరియు ఐపీవో లిస్టింగ్ పై Pixel Fold కనిపించింది. ఆ డిజైన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లాగా ఉంది. దీన్ని బట్టి గూగుల్ Pixel Fold పై పని చేస్తున్నట్లు స్పష్టమైంది.

ఈ ఏడాది మొదట్లో మరో టిప్‌స్టర్ జాన్ ప్రాసర్, గూగుల్ Pixel Fold నిజమేనని ట్వీట్ చేశారు. తర్వాత రాస్ యంగ్ కూడా అదే విషయాన్ని తెలిపారు. ఎన్నో కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయనున్నాయని, అందులో గూగుల్ కూడా ఒకటి అని రాస్ తెలిపారు.

అయితే గూగుల్ Pixel Fold ఏయే స్పెసిఫికేషన్లతో వస్తుందో ఇంత వరకు తెలియదు. అయితే, గూగుల్ తన ఫోల్డ్ డివైజ్ లో శాంసంగ్ తయారు చేసిన అల్ట్రా-తిన్ గ్లాస్ (యూటీజీ) ని వాడబోతున్నట్లు సమాచారం. గత కొన్నేళ్ళుగా గూగుల్ కంపెనీ, Pixel Fold పై పని చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో శాంసంగ్ కంపెనీ ఫోల్డబుల్ ఫోన్స్ సెగ్మెంట్ లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అలాగే శాంసంగ్ ఫోల్డబుల్ డివైజెస్ కి డిమాండ్ కూడా బాగానే ఉంది. ఇటీవలె మరో కంపెనీ వివో కూడా ఫోల్డబుల్ డివైజ్ ని లాంచ్ చేసింది. మరి గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 2023 మార్చిలో లాంచ్ కానున్న Google Pixel Fold first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Google Pixel Fold స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/google-pixel-fold-design-leaked/ Tue, 09 Aug 2022 05:25:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=1557 హైలైట్స్: నెట్టింట్లో ప్రత్యక్షమైన గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ స్పెసిఫికేషన్స్ మరియు బాడీ మెటీరియల్ వివరాలు 2కే డిస్ప్లే, టెన్సర్ 2 చిప్, 50 ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉండే అవకాశం సిరామిక్ బ్యాక్ ప్యానెల్ తో రానున్న గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఇక గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ పై ఆశలు వదులుకున్న తరుణంలో, కొత్త లీక్ ఒకటి ఆన్ లైన్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ యొక్క […]

The post లీకైన Google Pixel Fold స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ స్పెసిఫికేషన్స్ మరియు బాడీ మెటీరియల్ వివరాలు
  • 2కే డిస్ప్లే, టెన్సర్ 2 చిప్, 50 ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉండే అవకాశం
  • సిరామిక్ బ్యాక్ ప్యానెల్ తో రానున్న గూగుల్ పిక్సెల్ ఫోల్డ్

ఇక గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ పై ఆశలు వదులుకున్న తరుణంలో, కొత్త లీక్ ఒకటి ఆన్ లైన్లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో తెలిసాయి. అప్పుడెప్పుడో నవంబర్ 2021 లో గూగుల్ పిక్సెల్ మడతబెట్టే స్మార్ట్ ఫోన్ గురించి వార్తలను విన్నాం. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2022 ప్రథమార్థంలో పిక్సెల్ ఫోల్డ్ లాంచ్ అయ్యుండాల్సింది. కానీ అలా జరగలేదు. అయితే ఇప్పుడు కొన్ని నెలల తర్వాత, ఈ మడతబెట్టే హ్యాండ్సెట్ యొక్క ధర శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 కంటే తక్కువేనని తెలిసింది.

అయితే, మడతబెట్టే ఫోన్ల విభాగంలో బలంగా పాతుకుపోయిన శాంసంగ్ ముందు గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ నిలబడలేదని తొలుత గూగుల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ భావించారట. ఆశ్చర్యకరంగా, 2022 ఫిబ్రవరిలో, గూగుల్ సంస్థ మళ్ళీ పిక్సెల్ ఫోల్డ్ పై పని చేయడం మొదలుపెట్టిందని రాస్ యంగ్ ట్వీట్ చేశాడు. ఇక అప్పటి నుంచి ఇంకెప్పుడు పిక్సెల్ ఫోల్డ్ గురించి వినిపించలేదు. ఇప్పుడు వీబో పోస్ట్ ద్వారా ప్రముఖ నమ్మదగిన టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ యొక్క స్పెసిఫికేషన్స్ ని బయటపెట్టింది. దీంతో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ పై ఆశలు సజీవంగా నిలిచినట్లైంది.

Google Pixel Fold స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, ఫాక్స్‌కాన్ తో గూగుల్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందాన్ని బట్టి, ఫాక్స్‌కాన్ 2022 లో గూగుల్ కి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ ని తయారు చేయాల్సి ఉంటుంది. ఫాక్స్‌కాన్ కంపెనీ యాపిల్, సోనీ ఉత్పత్తులను తయారు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్ కూడా ఈ సంస్థతో చేతులు కలిపింది. ఫాక్స్‌కాన్ రానున్న రోజుల్లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ డివైజెస్ ను తయారు చేయనుంది. 2020 లో గూగుల్ సంస్థ తన ప్రొడక్షన్ ని చైనా నుంచి వియాత్నం కి మార్చిన నేపథ్యంలో తాజా నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మనకు కొన్ని రకాల సర్‌ప్రైజ్ లను అందించకపోతే అది గూగుల్ పిక్సెల్ ఫోన్ ఎలా అవుతుంది చెప్పండి? సరే, ఇప్పుడు పిక్సెల్ మడతబెట్టే ఫోన్ గురించి చూద్దాం. పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ సంప్రదాయ ప్లాస్టిక్, గ్లాస్, మెటల్ బాడీకి బదులు సిరామిక్ బాడీతో రానుంది. ఇదే కనుక నిజమైతే, ఇదే తొలి సిరామిక్ గూగుల్ పిక్సెల్ హ్యాండ్సెట్ అవుతుంది.

ఇప్పుడు హార్డ్‌వేర్ గురించి తెలుసుకుందాం. లీక్‌స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, పిక్సెల్ ఫోల్డ్ లో 2కే డిస్ప్లే, సెంటర్ పంచ్-హోల్ కటౌట్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటాయి. గూగుల్ సొంత చిప్ అయిన టెన్సర్ 2 ప్రాసెసర్ ను ఇందులో వాడుతున్నారు. పిక్సెల్ ఫోల్డ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సోనీ ఐఎంఎక్స్787 సెకండరీ లెన్స్ ఉంటాయి.

The post లీకైన Google Pixel Fold స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>