iQOO Neo 7 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:01:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 120వాట్ ఫాస్ట్ చార్జింగ్, డైమెన్సిటీ 8200 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన iQOO Neo 7 https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-5g-launched-india-price-specs-availability/ Thu, 16 Feb 2023 07:21:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=4956 నేడు భారత్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లాంచైంది. ఈ ఫోన్ కోసం గేమింగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మిడ్ రేంజ్ లో గేమింగ్ కి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. పవర్ఫుల్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ని ఈ ఫోన్ లో వాడారు. ఈ ఫోన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. 5000 […]

The post 120వాట్ ఫాస్ట్ చార్జింగ్, డైమెన్సిటీ 8200 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన iQOO Neo 7 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన iQOO Neo 7 స్మార్ట్ ఫోన్
  • 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్, 64ఎంపి కెమెరా, 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన iQOO Neo 7
  • భారత్ లో iQOO Neo 7 ధర రూ.29,999 నుంచి ప్రారంభం

నేడు భారత్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లాంచైంది. ఈ ఫోన్ కోసం గేమింగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మిడ్ రేంజ్ లో గేమింగ్ కి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. పవర్ఫుల్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ని ఈ ఫోన్ లో వాడారు. ఈ ఫోన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది.

iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ లో అందించడం విశేషం. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి iQOO Neo 7 యొక్క ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో iQOO Neo 7 ధర

భారత్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, ఫ్రాస్ట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. HDFC, ICICI, SBI కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ ని కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2,000 ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నేటి నుంచి అనగా ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 1 గంట నుంచి అమెజాన్ మరియు ఐకూ వెబ్‌సైట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

iQOO Neo 7 స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 93.77 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1200 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 1.07 బిలియన్ కలర్స్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

iQOO Neo 7 ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి-జీ610 జీపీయూ వినియోగించారు. 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్, ఇన్‌ఫ్రారెండ్ సెన్సర్, టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్/గ్లొనాస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO Neo 7 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 120వాట్ ఫాస్ట్ చార్జింగ్, డైమెన్సిటీ 8200 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన iQOO Neo 7 first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో ఐకూ నియో 7 5జీ ధర, ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ (లీక్డ్) https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-5g-india-price-ram-storage-leaked-before-launch/ Sat, 11 Feb 2023 03:30:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=4880 భారత్ లో వచ్చే వారం iQOO Neo 7 5G లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఫిబ్రవరి 16 న iQOO Neo 7 5G ని లాంచ్ చేయబోతున్నట్లు ఐకూ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చైనీస్ మోడల్ iQOO Neo 7 SE 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా iQOO Neo 7 5G భారత మార్కెట్ లోకి వస్తోంది. iQOO Neo 7 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో రానున్నట్లు […]

The post భారత్‌లో ఐకూ నియో 7 5జీ ధర, ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో ఫిబ్రవరి 16 న లాంచ్ కానున్న iQOO Neo 7 5G
  • చైనాలో లాంచైన iQOO Neo 7 SE 5G వర్షన్ కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా వస్తోన్న iQOO Neo 7 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానున్న iQOO Neo 7 5G

భారత్ లో వచ్చే వారం iQOO Neo 7 5G లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఫిబ్రవరి 16 న iQOO Neo 7 5G ని లాంచ్ చేయబోతున్నట్లు ఐకూ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చైనీస్ మోడల్ iQOO Neo 7 SE 5G కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ గా iQOO Neo 7 5G భారత మార్కెట్ లోకి వస్తోంది. iQOO Neo 7 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో రానున్నట్లు లీకైన వివరాల ద్వారా తెలుస్తోంది. అలాగే అప్‌గ్రేడెడ్ బ్యాటరీ మరియు చార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తోందట.

ఫిబ్రవరి 16 న iQOO Neo 7 5G ఫోన్ యొక్క ధర, సేల్ తేదీని కంపెనీ ప్రకటించనుంది. అయితే తాజాగా ఓ లీక్ ద్వారా ఫోన్ కి సంబంధించిన ధర, ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.

భారత్ లో ఐకూ నియో 7 5జీ ధర, సేల్ వివరాలు (లీక్డ్)

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ Neo 6 5G కి సక్సెసర్ గా వస్తోంది. iQOO Neo 7 5G రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో రానున్నట్లు సమాచారం. బేస్ మోడల్ అయిన 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. ఇక టాప్ మోడల్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇకపోతే టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ మోడల్ రూ.34,999 ధరతో లాంచ్ కానుందని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని తెలిపాడు.

రూ.4,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ తో iQOO Neo 7 5G లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ చెప్పాడు. ఈ ఆఫర్ బ్యాంక్ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో కలుపుకుని వర్తిస్తుందని అతడు తెలిపాడు. అంటే అన్ని ఆఫర్లు పోనూ iQOO Neo 7 5G ఫోన్ రూ.30,999 కి లభించనుంది. టిప్‌స్టర్ 8జిబి + 128జిబి వేరియంట్ ధర వెల్లడించలేదు.

అయితే ఫిబ్రవరి 19 లేదా 20 వ తేదీన భారత్ లో iQOO Neo 7 5G సేల్ మొదలవుతుందని గుగ్లాని తెలిపాడు. అమెజాన్, ఐకూ ఈ-స్టోర్, వివో ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా iQOO Neo 7 5G ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఇంటెస్టెల్లార్ బ్లాక్, ఫ్రాస్ట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

ఐకూ నియో 7 5జీ స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

ఇప్పటి వరకు రివీల్ అయిన లీక్స్ ని బట్టి, iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8200 చిప్సెట్ తో రానుందని స్పష్టమైంది. ఇక పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది. iQOO Neo 7 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, ఫ్లాట్ స్క్రీన్, సెంటర్ హోల్ పంచ్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్‌లో ఐకూ నియో 7 5జీ ధర, ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
12GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో వస్తోన్న iQOO Neo 7 5G ఇండియన్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-5g-indian-variant-ram-storage-antutu-score/ Fri, 27 Jan 2023 10:00:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=4665 అందుబాటు ధరల్లో అధిక ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ తక్కువ సమయంలోనే ప్రముఖ బ్రాండ్ గా అవతరించింది iQOO. త్వరలోనే ఈ సంస్థ iQOO Neo 7 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఈ లోపు ఫోన్ కి సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఫోన్ కోసం వెయిట్ చేసే వారు లాంచ్ తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 16 న ఈ ఫోన్ […]

The post 12GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో వస్తోన్న iQOO Neo 7 5G ఇండియన్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోన్న iQOO Neo 7 5G
  • భారతదేశపు తొలి డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఫోన్ గా నిలవనున్న iQOO Neo 7 5G
  • ప్రస్తుతం అమెజాన్ ఇండియా, ఐకూ ఇండియా వెబ్‌సైట్స్ ద్వారా అందుబాటులో ఉన్న iQOO Neo 7 5G ల్యాండింగ్ పేజెస్

అందుబాటు ధరల్లో అధిక ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తూ తక్కువ సమయంలోనే ప్రముఖ బ్రాండ్ గా అవతరించింది iQOO. త్వరలోనే ఈ సంస్థ iQOO Neo 7 5G ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఈ లోపు ఫోన్ కి సంబంధించిన ఎన్నో లీక్స్, రూమర్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇక ఫోన్ కోసం వెయిట్ చేసే వారు లాంచ్ తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 16 న ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన కీలక వివరాలు తెలిసాయి. 12GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోంది. ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

ఐకూ నియో 7 5జీ ర్యామ్, స్టోరేజీ, అంటుటు స్కోర్

iQOO Neo 7 5G ఫోన్ 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో రానున్నట్లు సమాచారం. భారతదేశపు తొలి డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఫోన్ గా iQOO Neo 7 5G నిలవనుంది. ప్రస్తుతం అమెజాన్, ఐకూ ఇండియా వెబ్ సైట్స్ లో iQOO Neo 7 5G మైక్రోసైట్స్ దర్శనమిస్తున్నాయి. ఐకూ కంపెనీ యొక్క Extended RAM 3.0 టెక్నాలజీ ద్వారా ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ కెపాసిటీతో వస్తోంది.

ఇక డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో కూడిన iQOO Neo 7 5G AnTuTu స్కోర్ విషయానికి వస్తే ఇది 893,690 స్కోర్ ని నమోదు చేసింది. ఈ స్కోర్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ కి చెందినదని కంపెనీ చెప్పింది.

ఐకూ నియో 7 5జీ స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తోంది. iQOO Neo 7 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫుల్ సైజ్ 3డీ కూలింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 5జీ కనెక్టివిటీ, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. iQOO Neo 7 5G యొక్క కెమెరా విభాగానికి వస్తే, ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. ఈ మోడల్ లో అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో రావడం లేదు. ఈ ఫోన్ ధర దాదాపు రూ.30,000 గా ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా ఉంటుంది.

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియా అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 12GB LPDDR5 ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో వస్తోన్న iQOO Neo 7 5G ఇండియన్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
BIS వెబ్‌సైట్ పై కనిపించిన iQOO Neo 7 5G; 120Hz రిఫ్రెష్ రేట్, 12GB ర్యామ్ తో వస్తున్న డివైజ్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-5g-bis-website-specs-price-launch-timeline/ Tue, 13 Dec 2022 09:06:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=3956 హైలైట్స్ 2023 జనవరిలో లాంచ్ కానున్న iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ BIS వెబ్‌సైట్ పై I12214 అనే మోడల్ నంబర్ తో కనిపించిన iQOO Neo 7 5G 12జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్న iQOO Neo 7 5G వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ రీసెంట్ గా చైనాలో ఐకూ 11 సిరీస్ ఫోన్లను […]

The post BIS వెబ్‌సైట్ పై కనిపించిన iQOO Neo 7 5G; 120Hz రిఫ్రెష్ రేట్, 12GB ర్యామ్ తో వస్తున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 జనవరిలో లాంచ్ కానున్న iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్
  • BIS వెబ్‌సైట్ పై I12214 అనే మోడల్ నంబర్ తో కనిపించిన iQOO Neo 7 5G
  • 12జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్న iQOO Neo 7 5G

వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ రీసెంట్ గా చైనాలో ఐకూ 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లతో పాటు iQOO Neo 7 SE అనే ఫోన్ ని కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు ఐకూ సంస్థ iQOO Neo 7 5G అనే ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే తాజాగా iQOO Neo 7 5G బీఐఎస్ వెబ్ సైట్ లో ఐ12214 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. దీంతో ఈ ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కానుందని స్పష్టమైంది. లీక్‌స్టర్ పారస్ గుగ్లాని iQOO Neo 7 5G యొక్క లాంచ్ టైమ్ లైన్, ధర శ్రేణి, స్పెసిఫికేషన్స్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి iQOO Neo 7 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 5G ఇండియా లాంచ్ , ధర (అంచనా)

Pricebaba వెబ్ సైట్ iQOO Neo 7 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ ని వెలికితీసింది. టిప్‌స్టర్ ప్రకారం, iQOO Neo 7 5G ఫోన్ 2023 జనవరిలో లాంచ్ అవుతుందని అంచనా. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.30,000 గా ఉండే అవకాశం ఉంది.

iQOO Neo 7 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 12జిబి ర్యామ్ తో వస్తోంది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO Neo 7 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Neo 7 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, వై-ఫై తదితర బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BIS వెబ్‌సైట్ పై కనిపించిన iQOO Neo 7 5G; 120Hz రిఫ్రెష్ రేట్, 12GB ర్యామ్ తో వస్తున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>