Lava Agni 2 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 26 May 2023 14:59:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! https://www.91mobiles.com/telugu/5-best-alternatives-to-lava-agni-2-5g/ Fri, 26 May 2023 14:59:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=6507 స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G […]

The post Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె భారత్ లో లాంచైన Lava Agni 2 5G
  • Lava Agni 2 5G ధర రూ.21,999
  • Lava Agni 2 5G రేంజ్ లో అందుబాటులో ఉన్న ఇతర బెస్ట్ ఆప్షన్స్

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G నిలవనుంది. Lava Agni 2 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది.

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ లో 4700 బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో, 2ఎంపి డెప్త్ కెమెరాలు ఉన్నాయి. 5జీ, 4జీ ఇతర అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

Lava Agni 2 5G కి ప్రత్యామ్నాయ ఆప్షన్స్

1. OnePlus Nord CE 3 Lite
2. OPPO A78 5G
3. Samsung Galaxy A23
4. Redmi K50i 5G
5. Motorola Edge 30

OnePlus Nord CE 3 Lite

  • 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
  • స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్
  • 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ
  • 8జిబి వర్చువల్ ర్యామ్
  • 108ఎంపి ఈఐఎస్ కెమెరా
  • 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ డివైజ్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.

OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగిన డిస్ప్లే, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ తో వచ్చింది. ఇది బ్యాటరీ లైఫ్ ని పెంచడమే గాక, యాప్స్ మధ్య మారడాన్ని తేలిక చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు 200 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడ్ తో వచ్చాయి. ఈ డివైజ్ లో 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉండటం విశేషం.

OnePlus Nord CE 3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఈఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OPPO A78 5G స్పెసిఫికేషన్స్

  • 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 8ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

OPPO A78 5G ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. OPPO A78 5G ఫోన్ 7.9 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Samsung Galaxy A23 స్పెసిఫికేషన్స్

  • 6.6-inch FHD+ IPS LCD డిస్ప్లే
  • Qualcomm Snapdragon 695 చిప్
  • 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 50ఎంపి క్వాడ్ కెమెరా సెటప్
  • 13ఎంపి సెల్ఫీ కెమెరా

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ అందించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Samsung Galaxy A23 స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Redmi K50i స్పెసిఫికేషన్స్

  • డైమెన్సిటీ 8100 చిప్సెట్
  • 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్
  • 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ
  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

రెడ్ మీ కే50ఐ 5జీ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, రెడ్ మీ నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ ని పోలి ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్లో ఉన్నాయి. అయితే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం లేదు.

6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 650 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. బలమైన మన్నిక కొరకు, రెడ్ మీ కే50ఐ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో డిస్ప్లే కు భద్రత కల్పించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇక ఫోటొగ్రఫీ కోసం రెడ్ మీ కే50ఐ 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64ఎంపి శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 2ఎంపి మాక్రో సెన్సర్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8ఎంపి కెమెరా ఉంది.

3.5ఎంఎం హెడ్ ఫోన్ జ్యాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్, లిక్విడ్ కూలింగ్ 2.0 టెక్నాలజీ వంటి కనెక్టింగ్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ లో 5080ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Edge 30 స్పెసిఫికేషన్స్

  • స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్
  • 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 4020 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ

మోటోరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్, డాల్బి అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి.

Motorola Edge 30 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా (మ్యాక్రో ఆప్షన్), 2ఎంపి డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

The post Lava Agni 2 5G రేంజ్‌లో వేరే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ 5 బెస్ట్ ఆప్షన్స్‌ని చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Lava Agni 2 5G https://www.91mobiles.com/telugu/lava-agni-2-5g-launched-india-price-specs-availability/ Tue, 16 May 2023 09:36:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=6329 స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G […]

The post కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Lava Agni 2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Lava Agni 2 5G
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • ఫస్ట్ సేల్ లో యూజర్లకు లభించనున్న రూ.2,000 డిస్కౌంట్

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా సంస్థ భారత్ లో తాజాగా అగ్ని స్మార్ట్ ఫోన్ సక్సెసర్, కొత్త Lava Agni 2 5G డివైజ్ ని లాంచ్ చేసింది. Lava Agni 2 5G డివైజ్ గ్రీన్-కలర్ తో ఉన్న కర్వ్డ్ రియర్ ప్యానెల్, భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ని కలిగి ఉంది. 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వచ్చిన చవకైన స్మార్ట్ ఫోన్ గా Lava Agni 2 5G నిలవనుంది. ఇదివరకు ఈ పేరు Realme 10 Pro Plus కి ఉండేది. ఇకపోతే Lava Agni 2 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వచ్చింది. సరే, Lava Agni 2 5G డివైజ్ స్పెసిఫికేషన్స్, సేల్ తేదీ, ఫీచర్స్, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Lava Agni 2 5G ధర, సేల్ వివరాలు

Lava Agni 2 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర రూ.21,999 గా ఉంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద యూజర్లు ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ పొందనున్నారు. ఈ డిస్కౌంట్ అన్ని ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై వర్తిస్తుంది. దీంతో Lava Agni 2 5G ధర రూ.19,999 కి తగ్గనుంది.

Lava Agni 2 5G డివైజ్ మే 24 వ తేదీన ఉదయం 10 గంటల నుంచి అమెజాన్ ద్వారా సేల్ కి రానుంది. ఈ ఫోన్ గ్రీన్ కలర్ లో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Lava Agni 2 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్-బ్యాక్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ 3డీ డ్యూయల్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్ డెప్త్, హెచ్డీఆర్, హెచ్డీఆర్ 10, హెచ్డీఆర్ 10+, వైడ్‌వైన్ ఎల్1 ఉన్నాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • డైమెన్సిటీ 7050
  • 8జిబి ర్యామ్
  • 256జిబి స్టోరేజీ

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉన్నాయి. లావా కంపెనీ రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, మూడేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ హామినిస్తోంది.

కనెక్టివిటీ, బ్యాటరీ

  • 5జీ
  • 4700ఎంఏహెచ్
  • 67 వాట్

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ లో 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ ఉంది. డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 5జీ, 4జీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఈ ఫోన్ లో అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా
  • 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా

Lava Agni 2 5G లో 50ఎంపి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. అయితే లావా సంస్థ అన్ని కెమెరా సెన్సర్స్ వివరాలను వెల్లడించలేదు. కానీ, రూమర్స్ ని బట్టి, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి సెన్సర్ ఉంటుందని సమాచారం.

The post కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Lava Agni 2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఖరారైన Lava Agni 2 లాంచ్ తేదీ; ధర, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/lava-agni-2-5g-official-launch-date-may-16-design-revealed/ Sat, 13 May 2023 05:19:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=6293 స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఈ నెలలో Lava Agni 2 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. మే 16 న ఈ ఫోన్ లాంచ్కానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. తాజాగా ఈ ఫోన్ హ్యాండ్స్-ఆన్ ఇమేజ్ లీకైంది. దీంతో రియర్ డిజైన్ ఎలా ఉందో తెలిసింది. ఓసారి స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ, సమయం, అంచనా స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Lava […]

The post ఖరారైన Lava Agni 2 లాంచ్ తేదీ; ధర, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈ నెలలో భారత్‌లో లాంచ్ కానున్న Lava Agni 2
  • డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోన్న స్మార్ట్ ఫోన్
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Lava Agni 2

స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఈ నెలలో Lava Agni 2 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. మే 16 న ఈ ఫోన్ లాంచ్కానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. తాజాగా ఈ ఫోన్ హ్యాండ్స్-ఆన్ ఇమేజ్ లీకైంది. దీంతో రియర్ డిజైన్ ఎలా ఉందో తెలిసింది. ఓసారి స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ, సమయం, అంచనా స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Agni 2 ఇండియా లాంచ్ తేదీ, సమయం

మే 16 న మధ్యాహ్నం 12 గంటలకు Lava Agni 2 డివైజ్ లాంచ్ కానుందని కంపెనీ తెలియజేసింది. ఆసక్తిగల యూజర్లు Lava Agni 2 లాంచ్ ఈవెంట్ ని యూట్యూబ్ మరియు ఫేస్బుక్ లలో చూడవచ్చు. లాంచ్ తర్వాత ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా Lava Agni 2 ని కొనుగోలు చేయవచ్చు.

భారత్ లో Lava Agni 2 ధర (అంచనా)

Lava Agni 2 స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ రీసెంట్ గా నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. రీసెంట్ రిపోర్ట్ ద్వారా ఈ ఫోన్ ధర భారత్ లో రూ.20,000 గా ఉంటుందని తెలిసింది.

Lava Agni 2 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Lava Agni 2 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో రానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.

డిస్ప్లే

  • 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Lava Agni 2 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి క్వాడ్ కెమెరా

Lava Agni 2 స్మార్ట్ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.

చిప్సెట్

  • డైమెన్సిటీ 7050

Lava Agni 2 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోంది.

స్టోరేజీ

  • 256జిబి స్టోరేజీ
  • 8జిబి ర్యామ్

Lava Agni 2 స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని ఎక్స్‌పాండ్ చేసుకునే వీలుంది.

ఓఎస్

  • ఆండ్రాయిడ్ 13

Lava Agni 2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ

  • 5జీ
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్

Lava Agni 2 స్మార్ట్ ఫోన్ లో 5జీ, బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

Lava Agni 2 డిజైన్

  • సర్క్యులర్ కెమెరా మాడ్యూల్
  • రిఫ్లెక్టివ్ టెక్షర్ బ్యాక్ ప్యానెల్

లీకైన Lava Agni 2 ఇమేజ్ ద్వారా ఫోన్లో సర్క్యులర్ కెమెరా, మల్టీ-సెన్సర్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, ఏఐ మ్యాట్రిక్స్ కెమెరా ఉంటాయని తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ స్మూద్, రిఫ్లెక్టివ్ టెక్షర్ ని కలిగి ఉంది.

The post ఖరారైన Lava Agni 2 లాంచ్ తేదీ; ధర, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Lava Agni 2 5G ధర, డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్; ఈ నెలలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/lava-agni-2-5g-india-price-key-specs/ Mon, 08 May 2023 14:16:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=6217 ప్రముఖ స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలోనే Lava Agni 2 5G లాంచ్ చేయబోతోంది. 2021 లో లాంచైన అగ్ని 5జీ కి Lava Agni 2 5G సక్సెసర్ గా వస్తోంది. Lava Agni 2 5G లో ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయని సమాచారం. అయితే, లావా సంస్థ ఇంకా లాంచ్ తేదీని ఖరారు చేయలేదు. ఈలోపు, Lava Agni 2 5G ప్రధాన స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన రిపోర్ట్ ఒకటి నెట్టింట్లో […]

The post లీకైన Lava Agni 2 5G ధర, డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్; ఈ నెలలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే నెలలో Lava Agni 2 5G లాంచ్ అవుతుందని అంచనా
  • ఇంకా లాంచ్ తేదీని ప్రకటించని కంపెనీ
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ తో రానున్న డివైజ్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా త్వరలోనే Lava Agni 2 5G లాంచ్ చేయబోతోంది. 2021 లో లాంచైన అగ్ని 5జీ కి Lava Agni 2 5G సక్సెసర్ గా వస్తోంది. Lava Agni 2 5G లో ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయని సమాచారం. అయితే, లావా సంస్థ ఇంకా లాంచ్ తేదీని ఖరారు చేయలేదు. ఈలోపు, Lava Agni 2 5G ప్రధాన స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన రిపోర్ట్ ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది.

ఆ రిపోర్ట్ ప్రకారం, Lava Agni 2 5G డివైజ్ డిజైన్ మరియు డిస్ప్లే విషయంలో అప్‌గ్రేడ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే భారత్ లో ఈ ఫోన్ ధర దాదాపు రూ.20,000 గా ఉంటుందని సమాచారం. సరే, ఓసారి Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Agni 2 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • కర్వ్డ్ అమోలెడ్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Lava Agni 2 5G లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉంటుందని సమాచారం. ఈ రెండు కూడా గత మోడల్ అగ్ని 5జీ తో పోల్చితే మంచి మార్పులని చెప్పాలి. ఇవ్ననీ లావా అగ్ని 2 5జీ ని మేటిగా నిలబెట్టే అవకాశం ఉంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • ఎల్ఈడీ ఫ్లాష్

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా మాడ్యూల్ క్రింద ఉంది. కెమెరా మాడ్యూల్ లుక్ బాగుంది. ఫోన్ లవర్స్ ని ఆకట్టుకునే రీతిలో కెమెరా మాడ్యూల్ ని డిజైన్ చేశారు. ఇది గత మోడల్ తో పోల్చితే సూపర్ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

చిప్సెట్

  • డైమెన్సిటీ 7050

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్సెట్ డైమెన్సిటీ 1080 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్. ఇక గత మోడల్ అగ్ని 5జీ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ తో వచ్చింది. Lava Agni 2 5G డివైజ్ డబుల్-రీఇన్‌ఫోర్స్‌డ్ ప్రీమియమ్ గ్లాస్ బ్యాక్ డిజైన్ తో వస్తోంది.

ర్యామ్, ఓఎస్

  • 8జిబి ర్యామ్
  • ఆండ్రాయిడ్ 13

Lava Agni 2 5G లో 8జిబి వరకు ర్యామ్ ఉంటుందని గీక్ బెంచ్ ద్వారా తెలిసింది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు తెలిసిన వివరాలు ఇవే. బ్యాటరీ కెపాసిటీ, చార్జింగ్ స్పీడ్, ఫ్రంట్ కెమెరా సెన్సర్ వివరాలు ఇంకా తెలియలేదు. త్వరలోనే ఇవి కూడా తెలియనున్నాయి. త్వరలోనే లావా సంస్థ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post లీకైన Lava Agni 2 5G ధర, డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్; ఈ నెలలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో వస్తోన్న Lava Agni 2; మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/lava-agni-2-5g-mediatek-dimensity-7050-chipset-launch-timeline-may/ Tue, 02 May 2023 13:04:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=6132 స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తాజాగా Lava Agni 2 స్మార్ట్ ఫోన్ ని టీజ్ చేసింది. ఈ 5జీ ఫోన్ కొన్ని రోజుల్లో లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని లావా వెల్లడించలేదు. లాంచ్ కి ముందు Lava Agni 2 కి చెందిన ముఖ్య సమాచారం నెట్టింట్లో ప్రత్యక్షమైంది. లావా నుంచి వస్తోన్న ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో రానుందని సమాచారం. నేడు మీడియాటెక్ […]

The post మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో వస్తోన్న Lava Agni 2; మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లావా నుంచి వస్తోన్న ప్రీమియమ్ ఆఫరింగ్ Lava Agni 2
  • డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో డివైజ్ రానుందని ఖరారు
  • మే నెలలో Lava Agni 2 లాంచ్ అవుతుందని అంచనా

స్వదేశీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తాజాగా Lava Agni 2 స్మార్ట్ ఫోన్ ని టీజ్ చేసింది. ఈ 5జీ ఫోన్ కొన్ని రోజుల్లో లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని లావా వెల్లడించలేదు. లాంచ్ కి ముందు Lava Agni 2 కి చెందిన ముఖ్య సమాచారం నెట్టింట్లో ప్రత్యక్షమైంది. లావా నుంచి వస్తోన్న ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో రానుందని సమాచారం.

నేడు మీడియాటెక్ సంస్థ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ని లాంచ్ చేసిన కాసేపటికే Lava Agni 2 సమాచారం బయటకు వచ్చింది. సరే, ఓసారి Lava Agni 2 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Agni 2 5G గురించి ఇప్పటి వరకు తెలిసిన సమాచారం

  • మీడియాటెక్ డైమెన్సిటీ 7050
  • మాలి-జీ68 జీపీయూ

Lava Agni 2 డివైజ్ ఈ నెలలోనే లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోందని సమాచారం. ఈ చిప్సెట్ 2.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. మాలి-జీ68 జీపీయూ ఈ చిప్సెట్ తో పెయిర్ అయ్యింది. ఈ 6ఎన్ఎమ్ ప్రాసెసర్ 200ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యూయల్ 5జీ, 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, వై-ఫై 6 కి సపోర్ట్ చేస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ కి రీబ్యాడ్జ్ వర్షన్ గా డైమెన్సిటీ 7050 చిప్సెట్ వచ్చిందని తెలుస్తోంది. సెగ్మెంట్ లో ఉన్న ఇతర చిప్సెట్స్ పెర్ఫామెన్స్ తో పోటీపడేందుకై డైమెన్సిటీ 1080 చిప్సెట్, డైమెన్సిటీ 7050 పేరుతో రీబ్రాండ్ అయి వచ్చిందని సమాచారం.

మీడియాటెక్ 7050 చిప్సెట్ మే 10 న చైనాలో లాంచ్ కానున్న Realme 11 Pro+ 5G లో కూడా కనిపించనుంది.

Lava Agni 2 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • అమోలెడ్ డిస్ప్లే

Lava Agni 2 లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని రీసెంట్ లీక్ ద్వారా తెలిసింది. గతంలో వచ్చిన అగ్ని 5జీ ఫోన్ 90 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ని కలిగి ఉంది. లీకైన సమాచారం నిజమే అయితే ఇది డిస్ప్లే విభాగంలో మంచి అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

ఓఎస్, ర్యామ్, స్టోరేజీ

  • ఆండ్రాయిడ్ 13
  • 8జిబి/128జిబి

కొన్ని రోజుల క్రితం గీక్ బెంచ్ పై Lava Agni 2 డివైజ్ కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలిసింది.

Lava Agni 2 ధర (అంచనా)

  • ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం

లీక్ ప్రకారం, Lava Agni 2 డివైజ్ ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం ఉంది. అగ్ని 5జీ డివైజ్ రూ.20,000 లోపు ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే Lava Agni 2 గురించి ఇంకా లావా నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో వస్తోన్న Lava Agni 2; మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
డైమెన్సిటీ 1080 చిప్‌తో వస్తోన్న Lava Agni 2 5G; గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-agni-2-5g-geekbench-listing-mediatek-1080-processor-other-key-specs/ Wed, 01 Mar 2023 12:17:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=5170 తరచూ ఫోన్లను విడుదల చేస్తూ, చైనీస్ బ్రాండ్స్ కి పోటీనిస్తూ.. క్రమంగా ఎదుగుతోంది స్వదేశీ బ్రాండ్ Lava. లావా సంస్థ వద్ద ఎంట్రీ లెవెల్ ఫోన్ల నుంచి మిడ్-రేంజ్ ఫోన్ల వరకు వివిధ రకాల హ్యాండ్సెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో లావా డివైజెస్ ని జనాలు బాగానే కొంటున్నారు. కంపెనీ విడుదల చేస్తోన్న ఫోన్లు నాణ్యత కలిగి ఉండటంతో వినియోగదారులు లావా ఫోన్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. Lava Agni 2 5G గురించి తాజాగా ఒక […]

The post డైమెన్సిటీ 1080 చిప్‌తో వస్తోన్న Lava Agni 2 5G; గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్
  • బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై కనిపించిన Lava Agni 2 5G డివైజ్
  • MediaTek Dimensity 1080 చిప్సెట్ తో వస్తోన్న Lava Agni 2 5G

తరచూ ఫోన్లను విడుదల చేస్తూ, చైనీస్ బ్రాండ్స్ కి పోటీనిస్తూ.. క్రమంగా ఎదుగుతోంది స్వదేశీ బ్రాండ్ Lava. లావా సంస్థ వద్ద ఎంట్రీ లెవెల్ ఫోన్ల నుంచి మిడ్-రేంజ్ ఫోన్ల వరకు వివిధ రకాల హ్యాండ్సెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో లావా డివైజెస్ ని జనాలు బాగానే కొంటున్నారు. కంపెనీ విడుదల చేస్తోన్న ఫోన్లు నాణ్యత కలిగి ఉండటంతో వినియోగదారులు లావా ఫోన్ల పట్ల ఆకర్షితులవుతున్నారు.

Lava Agni 2 5G గురించి తాజాగా ఒక సమాచారం బయటకు వచ్చింది. బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై Lava Agni 2 5G దర్శనమిచ్చింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలిసింది. సరే, పదండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

గీక్‌బెంచ్ పై కనిపించిన Lava Agni 2 5G

ప్రముఖ భారతీయ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, LXX504 అనే మోడల్ నంబర్ కలిగిన Lava ఫోన్ ఒకటి గీక్‌బెంచ్ పై కనిపించింది. ఆ డివైజ్ Lava Agni 2 5G అయ్యుండే అవకాశాలు అధికంగా ఉన్నాయని సదరు టిప్‌స్టర్ గుగ్లాని అభిప్రాయపడుతున్నారు.

Lava Agni 2 5G స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

ఇక, గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, Lava Agni 2 5G గా భావింపబడుతోన్న ఆ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ని కలిగి ఉంది. అలాగే 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ ఆ ఫోన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన లీక్ అందించిన చిప్సెట్ సమాచారాన్ని తాజా లీక్ కూడా ధృవీకరిస్తోంది. అయితే సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 13 ఓఎస్ గురించి లేటెస్ట్ లీక్ ద్వారానే స్పష్టమైంది. ఇదే ఓఎస్ త్వరలో లాంచ్ కాబోయే Lava Agni 2 5G ఉంటుందని ఆశిద్దాం.

Lava Agni 2 5G కి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది.

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానున్నట్లు సమాచారం. అలాగే పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇంకా ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Lava Agni 2 5G ధర విషయానికి వస్తే, రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ లో ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

రూ.20,000 నుంచి రూ.25,000 ధర పెడితే కనుక హెచ్డీ+ డిస్ప్లే ఇవ్వడం సరైంది కాదు. యూజర్ కూడా వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఈ ధర శ్రేణిలో ఇప్పుడు అన్నీ ఫోన్లు దాదాపుగా ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేని అందిస్తున్నాయి. మార్కెట్ లో Lava మరింతగా సక్సెస్ కావాలంటే, ఇటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డైమెన్సిటీ 1080 చిప్‌తో వస్తోన్న Lava Agni 2 5G; గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 1080 చిప్సెట్ తో లాంచ్ కానున్న Lava Agni 2 5G https://www.91mobiles.com/telugu/lava-agni-2-5g-to-feature-mediatek-dimensity-1080-chipset-launch-on-the-cards/ Tue, 14 Feb 2023 13:29:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=4916 2021 లో దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ Lava భారతీయ మార్కెట్ లో Lava Agni 2 5G ని లాంచ్ చేసింది. ఇప్పుడు టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో Pricebaba వెబ్ సైట్ Lava Agni 2 5G కి సంబంధించిన ఒక కథనాన్ని వెలువరించింది. ఈసారి లావా సంస్థ Lava Agni 2 5G తో పాటు ఒక ప్రో-వేరియంట్ ని కూడా తీసుకురానుందని పారస్ గుగ్లాని చెబుతున్నాడు. అయితే, కంపెనీ నుంచి ఇప్పటి […]

The post Dimensity 1080 చిప్సెట్ తో లాంచ్ కానున్న Lava Agni 2 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.20,000 నుంచి రూ.25,000 రేంజ్ లో ఉండనున్న Lava Agni 2 5G ధర
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న Lava Agni 2 5G
  • Lava Agni 5G కి సక్సెసర్ గా వస్తోన్న Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్

2021 లో దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ Lava భారతీయ మార్కెట్ లో Lava Agni 2 5G ని లాంచ్ చేసింది. ఇప్పుడు టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో Pricebaba వెబ్ సైట్ Lava Agni 2 5G కి సంబంధించిన ఒక కథనాన్ని వెలువరించింది. ఈసారి లావా సంస్థ Lava Agni 2 5G తో పాటు ఒక ప్రో-వేరియంట్ ని కూడా తీసుకురానుందని పారస్ గుగ్లాని చెబుతున్నాడు. అయితే, కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు.

Lava Agni 2 5G మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ గా మార్కెట్ లోకి రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో ఈ ఫోన్ రానుంది. Lava Agni 2 5G డివైజ్ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో లాంచ్ కానుంది. ఓ రిపోర్ట్ ద్వారా Lava Agni 2 5G యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Lava Agni 2 5G స్పెసిఫికేషన్స్

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్ తో రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడనున్నట్లు సమాచారం. రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో+ డివైజెస్ లో కూడా ఇదే చిప్సెట్ వాడారు.

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యమా్, 128జిబి స్టోరేజీతో రానుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. పవర్ బ్యాకప్ కోసం Lava Agni 2 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోందని అంచనా. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ డివైజ్ లో టైప్-సీ పోర్ట్ అందించారు.

Lava Agni 2 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంటుంది. Lava Agni 2 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని ఇస్తున్నారు. ఇది పవర్ బటన్ లోనే ఎంబెడ్ అయి వస్తోంది. భారత్ లో Lava Agni 2 5G ధర రూ.25,000 లోపు ఉండనుంది. ఇదే గనుక నిజమైతే డైమెన్సిటీ 1080 చిప్సెట్ కలిగిన చవకైన ఫోన్ గా Lava Agni 2 5G నిలిచే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Dimensity 1080 చిప్సెట్ తో లాంచ్ కానున్న Lava Agni 2 5G first appeared on 91Mobiles Telugu.

]]>