Moto Razr 2022 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 26 Oct 2022 11:27:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన Moto Razr 2022: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/moto-razr-2022-launched-in-europe-price-specs/ Wed, 26 Oct 2022 11:27:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=3075 హైలైట్స్ ఇటీవలె చైనాలో లాంచ్ అయిన Moto Razr 2022 ఫోల్డబుల్ ఫోన్ తాజాగా యురొపియన్ మార్కెట్ లో లాంచ్ అయిన Moto Razr 2022 త్వరలో భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Moto Razr 2022 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా ఇటీవలె తన నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు మోటోరోలా అధికారికంగా అంతర్జాతీయ మార్కెట్ లో Moto Razr 2022 ని లాంచ్ చేసింది. […]

The post గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన Moto Razr 2022: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇటీవలె చైనాలో లాంచ్ అయిన Moto Razr 2022 ఫోల్డబుల్ ఫోన్
  • తాజాగా యురొపియన్ మార్కెట్ లో లాంచ్ అయిన Moto Razr 2022
  • త్వరలో భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Moto Razr 2022

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా ఇటీవలె తన నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు మోటోరోలా అధికారికంగా అంతర్జాతీయ మార్కెట్ లో Moto Razr 2022 ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యురోపియన్ మార్కెట్ లో విడుదలైంది. అయితే ఇంకా భారత లాంచ్ తేదీ వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే మోటోరోలా ఈ సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

Moto Razr 2022 ధర

Moto Razr 2022 ఐరోపా దేశాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 1200 యూరోలు (సుమారు రూ.98,500) గా ఉంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ శాటిన్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ లో లభించనుంది.

Moto Razr 2022 స్పెసిఫికేషన్స్

Moto Razr 2022 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2.7-ఇంచ్ ఓఎల్ఈడీ కవర్ స్క్రీన్ ఉన్నాయి. ఈ కవర్ స్క్రీన్ ద్వారా దాదాపు అన్ని ఫంక్షన్స్ ని ఫోన్ ని తెరవకుండానే జరపవచ్చు. Moto Razr 2022 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. 8జిబి/128జిబి, 12జిబి/256, 18జిబి/512 ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Moto Razr 2022 స్మార్ట్ ఫోన్ లో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఫిజికల్ సిమ్ స్లాట్ కాకుండా ఈ ఫోన్ లో ఈ-సిమ్ సౌకర్యం కూడా ఉంది. ఐపీ52 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్, డాల్బి అట్మాస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Moto Razr 2022 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto Razr 2022 లో ఓఐఎస్ తో కూడిన 50 మెగాపిక్సెల్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇంకా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు సెంటర్డ్ పంచ్ హోల్ లో 32ఎంపి కెమెరా ఉంది.

రూమర్లు నిజమైతే కనుక, త్వరలోనే Moto Razr 2022 భారత్ లో లాంచ్ అవ్వబోతోంది. ఒకవేళ లాంచ్ అయితే, ఇటీవలె మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 కి గట్టి పోటీ ఇవ్వనుంది. రెండు డివైజెస్ కూడా దాదాపు ఒకే విధమైన డిజైన్, స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉన్నాయి. అయితే భారత మార్కెట్ లో Moto Razr 2022 ఫోన్ ని ఎంత ధరతో లాంచ్ చేస్తారో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన Moto Razr 2022: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Moto X30 Pro, Moto Razr 2022 లాంచ్ తేదీలో మార్పు https://www.91mobiles.com/telugu/motorola-razr-2022-moto-x30-pro-launch-rescheduled/ Fri, 05 Aug 2022 07:06:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=1512 హైలైట్స్: ఆగస్టు 11 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ కానున్న మోటో ఎక్స్30 ప్రో, మోటో రేజర్ 2022 శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తర్వాత జరగనున్న మోటోరోలా లాంచ్ ఈవెంట్ గ్లోబల్ మార్కెట్ లో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో రిలీజ్ కానున్న మోటో ఎక్స్30 ప్రో మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 లాంచ్ ఈవెంట్ ఆగస్టు 11 వ తేదీకి రీషెడ్యూల్ కాబడింది. ఈ ఈవెంట్ లో మోటోరోలా 200 […]

The post Moto X30 Pro, Moto Razr 2022 లాంచ్ తేదీలో మార్పు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 11 మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ కానున్న మోటో ఎక్స్30 ప్రో, మోటో రేజర్ 2022
  • శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ తర్వాత జరగనున్న మోటోరోలా లాంచ్ ఈవెంట్
  • గ్లోబల్ మార్కెట్ లో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో రిలీజ్ కానున్న మోటో ఎక్స్30 ప్రో

మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 లాంచ్ ఈవెంట్ ఆగస్టు 11 వ తేదీకి రీషెడ్యూల్ కాబడింది. ఈ ఈవెంట్ లో మోటోరోలా 200 ఎంపి కెమెరా ఫోన్ ని రిలీజ్ చేయనుంది. లెనోవో చైనా జీఎం చెన్ జిన్ పోస్ట్ చేసిన టీజర్ ని బట్టి, మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 ఆగస్టు 11 న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతున్నట్లు తెలుస్తోంది.

అసలైతే మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 ఫోన్స్ లాంచ్ ఆగస్టు 2 న జరగాల్సి ఉండగా, కొన్ని గంటల ముందు హఠాత్తుగా ఈవెంట్ రద్దైంది. అంతకు ముందు వన్ ప్లస్ ఏస్ ప్రో లాంచ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది. సరిగ్గా అదే రోజున న్యాన్సీ పాట్రీషియా పెలోసీ తైవాన్ దేశాన్ని విజిట్ చేయడంతో చైనాలో రేగిన రాజకీయ అలజడి కారణంగా, ఈవెంట్ ను రద్దు చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

Moto X30 Pro, Moto Razr 2022 లాంచ్ తేదీలో మార్పు

లెనోవో మొబైల్ చైనా జీఎం చెన్ జిన్ వీబో లో పోస్ట్ చేసిన టీజర్ లో మోటో రేజర్ 2022 యొక్క కవర్ డిస్ప్లే కనిపిస్తోంది. ఈ డిస్ప్లే లో ఒక క్లాక్, డేట్ ఉన్నాయి.శాంసంగ్ తన ఫోర్త్-జెన్ ఫోల్డ్, ఫ్లిప్ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసిన తదుపరి రోజునే మోటోరోలా మోటో ఎక్స్30 ప్రో, మోటో రేజర్ 2022 లను లాంచ్ చేయనుంది.

ఈవెంట్ ముగిసిన తర్వాత మోటో ఎక్స్ 30 ప్రో, మోటో రేజర్ 2022 సేల్ కి వెళ్ళే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఈ ఫోన్స్ అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వనున్నాయి. మోటో ఎక్స్30 ప్రో, మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా అనే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అవుతుంది.

క్వార్ట్జ్ బ్లాక్, ట్రాన్‌క్విల్ బ్లూ అనే రెండు రంగుల ఆప్షన్స్ లో మోటోరోలా రేజర్ 2022 లభించనుంది. ఇక దీని ధర 1,150 యూరోలు, (దాదాపు రూ.94,000). మరోవైపు, ప్రపంచపు తొలి 200 ఎంపి కెమెరా ఫోన్ అయిన మోటో ఎక్స్ 30 ప్రో వైట్, గ్రే అనే రెండు కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర 899 యూరోలు (దాదాపు రూ.71,500).

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 3-ఇచ్ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 50ఎంపి+13ఎంపి రియర్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు మోటోరోలా రేజర్ 2022 స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.

The post Moto X30 Pro, Moto Razr 2022 లాంచ్ తేదీలో మార్పు first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రివీల్ అయిన Moto Razr 2022 ప్రధాన ఫీచర్లు https://www.91mobiles.com/telugu/motorola-razr-2022-spotted-on-geekbench-before-launch/ Wed, 27 Jul 2022 05:46:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=1280 హైలైట్స్: ఆగస్టు 2 న జరగబోవు మోటోరోలా లాంచ్ ఈవెంట్ లో ఎంట్రీ ఇవ్వనున్న మోటో రేజర్ 2022 స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 120హెర్ట్జ్ ఫోల్డబుల్ ప్యానెల్ తో వస్తున్న రేజర్ 2022 మోటో రేజర్ 2022 ధర 1,150 యూరోలు (దాదాపు రూ.94,000) ఉంటుందని అంచనా ఆగస్టు 2 న మోటోరోలా నిర్వహిస్తున్న లాంచ్ ఈవెంట్ లో మోటో రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో […]

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Moto Razr 2022 ప్రధాన ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 2 న జరగబోవు మోటోరోలా లాంచ్ ఈవెంట్ లో ఎంట్రీ ఇవ్వనున్న మోటో రేజర్ 2022
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 120హెర్ట్జ్ ఫోల్డబుల్ ప్యానెల్ తో వస్తున్న రేజర్ 2022
  • మోటో రేజర్ 2022 ధర 1,150 యూరోలు (దాదాపు రూ.94,000) ఉంటుందని అంచనా

ఆగస్టు 2 న మోటోరోలా నిర్వహిస్తున్న లాంచ్ ఈవెంట్ లో మోటో రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే లాంచ్ ఈవెంట్ కు ముందు, మోటోరోలా రేజర్ 2022 ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు, ఫోన్ కవర్ డిస్ప్లే యొక్క గేమింగ్ కేపబులిటీ ఏంటో తెలియజేసింది. ఇప్పుడు చైనా సామాజిక మాధ్యమం వీబో పై మోటోరోలా ఒక కొత్త టీజర్ ను షేర్ చేసింది. దీన్ని బట్టి, మోటో రేజర్ 2022 లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ వాడినట్లు స్పష్టమైంది. మరో విషయమేంటంటే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న మొదటి ఫోల్డబుల్ ఫోన్ మోటో రేజర్ 2022 కావడం విశేషం.

ఇక మోటో రేజర్ 2022 1,150 యూరోలకు అంటే దాదాపు రూ.94,000 లకు అమ్ముడు కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. క్వార్ట్జ్ బ్లాక్ మరియు ట్రాన్క్విల్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఆగస్టు 2 న రాత్రి 7.30 గంటలకు మోటో రేజర్ 2022 లాంచ్ అయ్యాక అన్ని విషయాలపై క్లారిటీ రానుంది.

Geekbench లిస్టింగ్

మోటోరోలా XT2251 అనే మోడల్ నంబర్ తో మోటో రేజర్ 2022 గీక్ బెంచ్ పై దర్శనమిచ్చింది (via). స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు గీక్ బెంచ్ లిస్టింగ్ పై కనిపిస్తున్నాయి. ఇక హ్యాండ్సెట్ సింగిల్-కోర్ టెస్టులో 1251 పాయింట్లను స్కోర్ చేయగా, మల్టీ-స్కోర్ టెస్టులో 4076 పాయింట్లు స్కోర్ చేసింది.

Moto Razr 2022 స్పెసిఫికేషన్స్

మోటో రేజర్ 2022 స్పెసిఫికేషన్స్ గతంలోనే లీకైన విషయం తెలిసిందే. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ కలిగిన మోటో రేజర్ 2022 ఫోన్ 12 జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ని కలిగి ఉండనుంది. ఇక ఈ ఫోన్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై మోటో రేజర్ 2022 పని చేయనుంది.

మోటో రేజర్ 2022 ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ ఫోల్డబుల్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 3 అంగుళాల రియర్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

Moto Razr 2022 స్పెక్స్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్
  • 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ ఫోల్డబుల్ డిస్ప్లే
  • 3 అంగుళాల కవర్ డిస్ప్లే
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 50ఎంపి+13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

ఇక మోటో రేజర్ 2022 కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. ఈ ఫోన్ వెనకాల 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఈ ఫోన్లో ముందువైపున 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Moto Razr 2022 ప్రధాన ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
ఆగస్టు 2 న లాంచ్ అవుతోన్న Motorola Razr 2022, Moto X30 Pro https://www.91mobiles.com/telugu/motorola-razr-2022-launch-confirmed-specs-price/ Fri, 22 Jul 2022 13:49:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=1179 హైలైట్స్: ఆగస్టు 2 న చైనాలో ఓ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న మోటొరోలా మోటోరోలా రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్30 అల్ట్రా ఫోన్స్ ని లాంచ్ చేయనున్న కంపెనీ 200ఎంపి కెమెరా, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్30 అల్ట్రా ప్రత్యేకతలు ఎన్నో రూమర్లు, లీక్స్ అనంతరం, తొలి 200 ఎంపి కెమెరా ఫోన్, మోటో ఎక్స్30 ప్రో (మోటో ఎడ్జ్30 అల్ట్రా/ గ్లోబల్ గా ఫ్రాంటియర్) తో […]

The post ఆగస్టు 2 న లాంచ్ అవుతోన్న Motorola Razr 2022, Moto X30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 2 న చైనాలో ఓ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న మోటొరోలా
  • మోటోరోలా రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్30 అల్ట్రా ఫోన్స్ ని లాంచ్ చేయనున్న కంపెనీ
  • 200ఎంపి కెమెరా, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్30 అల్ట్రా ప్రత్యేకతలు

ఎన్నో రూమర్లు, లీక్స్ అనంతరం, తొలి 200 ఎంపి కెమెరా ఫోన్, మోటో ఎక్స్30 ప్రో (మోటో ఎడ్జ్30 అల్ట్రా/ గ్లోబల్ గా ఫ్రాంటియర్) తో పాటు మోటోరోలా రేజర్ 2022 ఈ ఏడాది లాంచ్ అవుతోంది. చైనా సామాజిక మాధ్యమం Weibo (via) ద్వారా మోటోరోలా లాంచ్ ఈవెంట్ ని అనౌన్స్ చేసింది. చైనాలో ఆగస్టు 2 న ఈ ఈవెంట్ జరగబోతోంది. అంటే ఆగస్టు 10 న జరిగే శాంసంగ్ అన్ ప్యాక్డ్ ఈవెంట్ కి కొన్ని రోజుల ముందే ఇది జరగనుంది.

గత వారం, మోటోరోలా రేజర్ 2022 కు సంబంధించిన ఫస్ట్ లుక్ ని మోటోరోలా రివీల్ చేసింది. ఇక నిన్న రేజర్ 2022 కవర్ డిస్ప్లే యొక్క గేమింగ్ కేపబులిటీని మనకు పరిచయం చేసింది. మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్30 అల్ట్రా లో 200ఎంపి కెమెరా ఉండనుందని మోటరోలా కన్ఫర్మ్ చేసింది. ఇది 1/1.22 -ఇంచ్ భారీ కెమెరా సెన్సర్ కావడం విశేషం. ఈ కెమెరాతో తీసిన శాంపిల్ ను కూడా మోటోరోలా మనతో పంచుకుంది.

Motorola Launch ఈవెంట్

పైన టీజర్ లో చూపించిన విధంగా, మోటోరోలా ఆగస్టు 2 న చైనాలో ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఇదే కార్యక్రమంలో మోటోరోలా రేజర్ 2022, మోటో ఎక్స్30 ప్రో/మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్లను విడుదల చేయనుంది. ఈవెంట్ రాత్రి 7.30 నుంచి ప్రత్యక్షప్రసారం అవుతుంది. మోటోరోలా 2022 క్వార్ట్జ్ బ్లాక్, ట్రాన్క్విల్ బ్లూ అనే రెండు రంగుల ఆప్షన్స్ లో లభిస్తుందని రూమర్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ధర 1,150 యూరోలు (దాదాపు రూ.94,000) గా ఉంటుందని అంచనా. మోటో ఎక్స్ 30 ప్రో/మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ధర 899 యూరోలు (దాదాపు రూ.71,500) ఉంటుందని తెలుస్తోంది.

Motorola Razr 2022 స్పెసిఫికేషన్స్

 

Motorola Razr 2022 Specifications

  • 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ ఫోల్డబుల్ ప్యానెల్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా

గతంలో వచ్చిన సమాచారాన్ని బట్టి, మోటోరోలా రేజర్ 2022 6.7 అంగుళాల పీఓఎల్ఈడీ ఫోల్డబుల్ ప్యానెల్, 3 అంగుళాల కవర్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.

Moto X30 Pro/Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

 

Moto X30 Pro/Moto Edge 30 Ultra Specifications

  • 6.73 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 144 హెర్ట్జ్ ప్యానెల్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 200ఎంపి + 50ఎంపి + 12ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 60ఎంపి సెల్ఫీ షూటర్
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్

మోటో ఎక్స్30 ప్రో/ మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్లో 6.73 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లున్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. 60ఎంపి ఫ్రంట్ కెమెరా, 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి సెకండరీ కెమెరా, 12ఎంపి థర్డ్ కెమెరా ఉన్నాయి.

The post ఆగస్టు 2 న లాంచ్ అవుతోన్న Motorola Razr 2022, Moto X30 Pro first appeared on 91Mobiles Telugu.

]]>