Moto X40 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Dec 2022 03:49:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 16GB ర్యామ్, 165Hz డిస్ప్లే, 125W చార్జింగ్ తో లాంచైన Moto X40 https://www.91mobiles.com/telugu/motorola-x40-launched-china-price-specs/ Fri, 16 Dec 2022 03:49:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=4015 హైలైట్స్ చైనాలో లాంచైన Moto X40 స్మార్ట్ ఫోన్ Moto X30 కి సక్సెసర్ గా వచ్చిన Moto X40 డివైజ్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో వచ్చిన Moto X40 మోటోరోలా కంపెనీ తాజాగా తన ఫ్లాగ్షిప్ డివైజ్ Moto X40 ని చైనాలో లాంచ్ చేసింది. Moto X30 కి సక్సెసర్ గా Moto X40 మార్కెట్ లోకి వచ్చింది. టాప్ స్పెసిఫికేషన్స్ తో Moto X40 […]

The post 16GB ర్యామ్, 165Hz డిస్ప్లే, 125W చార్జింగ్ తో లాంచైన Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన Moto X40 స్మార్ట్ ఫోన్
  • Moto X30 కి సక్సెసర్ గా వచ్చిన Moto X40 డివైజ్
  • 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో వచ్చిన Moto X40

మోటోరోలా కంపెనీ తాజాగా తన ఫ్లాగ్షిప్ డివైజ్ Moto X40 ని చైనాలో లాంచ్ చేసింది. Moto X30 కి సక్సెసర్ గా Moto X40 మార్కెట్ లోకి వచ్చింది. టాప్ స్పెసిఫికేషన్స్ తో Moto X40 ని తీసుకొచ్చింది మోటోరోలా కంపెనీ. ఈ డివైజ్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా కంపెనీ వెల్లడించలేదు. చైనాలో లాంచ్ అయ్యింది కాబట్టి, నెక్ట్స్ ఇండియా మరియు గ్లోబల్ మార్కెట్స్ లోకి Moto X40 ప్రవేశించడం ఖాయం. లాంచ్ తేదీని మోటోరోలా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Moto X40 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని అందించారు. త్రీ-డైమెన్షనల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 6.7-ఇంచ్ డిస్ప్లే, 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. పదండి, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం.

Moto X40 స్పెసిఫికేషన్స్

Moto X40 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కెమెరా కటౌట్, కర్వ్డ్ ఎడ్జెస్, 10-బిట్ కలర్స్, హెచ్డీఆర్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. Moto X40 లో చిన్నపాటి రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

Moto X40 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto X40 లో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50 ఎంపి ఓఐఎస్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4కే హెచ్డీఆర్ వీడియో రికార్డింగ్, హారిజంటల్ లాక్ ఫీచర్ ఉంటాయి. యాక్షన్ సీన్స్ షూట్ చేసేప్పుడు ఈ హారిజంటల్ లాక్ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Moto X40 లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉంటాయి. త్రీ-డైమెన్షనల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ని ఈ ఫోన్ లో అందించారు. పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Moto X40 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డివైజ్ లో డాల్బి అట్మాస్ స్టీరియో స్పీకర్స్ అందించారు.

Moto X40 స్మోకీ బ్లాక్, టూర్మరైన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto X40 ధర

Moto X40 8జిబి + 128జిబి వేరియంట్ ధర RMB 3399 (సుమారు రూ.40,300), 8జిబి+256జిబి మోడల్ ధర RMB 3699 (సుమారు రూ.44,900), 12జిబి+256జిబి యూనిట్ ధర RMB 3999 (సుమారు రూ.47,500), 12జిబి+512జిబి యూనిట్ ధర RMB 4299 (సుమారు రూ.51,000)

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 16GB ర్యామ్, 165Hz డిస్ప్లే, 125W చార్జింగ్ తో లాంచైన Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 15 న లాంచ్ కానున్న Motorola Moto X40 https://www.91mobiles.com/telugu/motorola-moto-x40-launch-timeline-china/ Thu, 08 Dec 2022 13:22:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=3892 హైలైట్స్ 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న Motorola Moto X40 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానున్న Motorola Moto X40 డిసెంబర్ 15 న Motorola Moto X40 లాంచ్ కి ముహూర్తం ఖరారు Motorola Moto X40 లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. Motorola Moto X40 డిసెంబర్ 15 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా కన్ఫర్మ్ చేసింది. Motorola Moto X40 […]

The post డిసెంబర్ 15 న లాంచ్ కానున్న Motorola Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న Motorola Moto X40
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానున్న Motorola Moto X40
  • డిసెంబర్ 15 న Motorola Moto X40 లాంచ్ కి ముహూర్తం ఖరారు

Motorola Moto X40 లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. Motorola Moto X40 డిసెంబర్ 15 న లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా కన్ఫర్మ్ చేసింది. Motorola Moto X40 డివైజ్ డిసెంబర్ 15 న చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. మోటోరోలా నుంచి వస్తున్న ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నారు. ఓసారి Motorola Moto X40 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Motorola Moto X40 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Motorola Moto X40 స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. హెచ్డీఆర్10+ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇది 4 నానో మీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైన, 3.2 గిగాహెర్ట్జ్ స్పీడ్ కలిగిన ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ వాడనున్నారు. ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ని ప్రొవైడ్ చేయనున్నారు.

భద్రత కోసం Motorola Moto X40 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనుంది. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి ఇతర అన్ని ముఖ్యమైన కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉండనున్నాయి. Motorola Moto X40 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Motorola Moto X40 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 60ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వ్లాగింగ్ చేసే వారికి ఈ 60ఎంపి కెమెరా ఎంతగానో ఉపయోగపడనుంది.

Motorola Moto X40 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేయనున్నారు. ఓ లీక్ ప్రకారం, ఈ ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ రేటింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే Motorola Moto X40 లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అందించిన స్పెసిఫికేషన్స్ లీక్స్ ఆధారంగా వేయబడిన అంచనా మాత్రమే. డిసెంబర్ 15 న స్పెసిఫికేషన్స్ పై కచ్చితమైన సమాచారం తెలుస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 15 న లాంచ్ కానున్న Motorola Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>
18GB ర్యామ్, 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న Moto X40 https://www.91mobiles.com/telugu/moto-x40-ip-68-rating-snapdragon-8-gen-2-processor/ Tue, 29 Nov 2022 12:18:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=3745 హైలైట్స్ Moto X40 ఐపీ68 రేటింగ్ తో వస్తున్నట్లు ప్రకటించిన లెనొవో ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం డిసెంబర్ లో లాంచ్ కానున్న మోటోరోలా Moto X40 స్మార్ట్ ఫోన్ Motorola Moto X40 లాంచ్ తేదీ త్వరలోనే ప్రకటించబడనుంది. తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ రాకకు సంబంధించిన ప్రకటనను మోటోరోలా త్వరలో అనౌన్స్ చేయనుంది. లెనొవొ ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ […]

The post 18GB ర్యామ్, 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Moto X40 ఐపీ68 రేటింగ్ తో వస్తున్నట్లు ప్రకటించిన లెనొవో ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్
  • ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం
  • డిసెంబర్ లో లాంచ్ కానున్న మోటోరోలా Moto X40 స్మార్ట్ ఫోన్

Motorola Moto X40 లాంచ్ తేదీ త్వరలోనే ప్రకటించబడనుంది. తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ రాకకు సంబంధించిన ప్రకటనను మోటోరోలా త్వరలో అనౌన్స్ చేయనుంది. లెనొవొ ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ చైనీస్ సామాజిక మాధ్యమం వీబో ద్వారా Motorola Moto X40 కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. Moto X40 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, ఐపీ68 రేటింగ్ తో రానుందని ఆయన చెప్పారు. ఈ నెల మొదట్లో TENAA లిస్టింగ్ ద్వారా ఈ డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

ITHome ప్రచురించిన కథనాన్ని బట్టి, జిన్ తన వీబో పోస్ట్ పై ఈ విధంగా స్పందించారు. “Motorola Moto X40 ఐపీ68 రేటింగ్ వాటర్ ప్రూఫింగ్ తో వస్తోంది. ఈ డివైజ్ ని మొబైల్ ఫోన్స్ లో ఎస్‌యూవీ అని మేం పిలుస్తున్నాం. డిసెంబర్, గెట్ రెడీ టు గో!”

Motorola Moto X40 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Motorola Moto X40 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1080*2400 రెజుల్యూషన్, 10-బిట్ కలర్, అండర్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఈ ఫోన్ 161.3 మిల్లీ మీటర్ల పొడవు, 73.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.5 మిల్లీ మీటర్ల మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది. Moto X40 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది.

Motorola Moto X40 కెమెరా విభాగం చూస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి + 50ఎంపి + 12ఎంపి సెన్సర్స్ ఉంటాయి. 4X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది.

Moto X40 ఐపీ68 రేటింగ్ తో వస్తోంది. అంటే వాటర్ మరియు డస్ట్ నుంచి ఫోన్ కి ప్రొటెక్షన్ ఉంటుంది. స్వచ్ఛమైన వాటర్ లో 1.5 మీటర్ల లోతు వద్ద 30 నిమిషాల వరకు ఉన్నప్పటికీ ఈ ఫోన్ కి ఏమీ కాదు. ఇక డస్ట్ రెసిస్టన్స్ కూడా ఉండటం వల్లన ఫోన్ కి అదనంగా కేసెస్, కవర్స్ అక్కర్లేదు.

Moto X40 స్మార్ట్ ఫోన్ 4950 ఎంఏహెచ్ బ్యాటరీ లేదా 4450 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇక ర్యామ్, స్టోరేజీ విషయానికి వస్తే, ఈ డివైజ్ 8జిబి, 12జిబి మరియు 18జిబి ర్యామ్.. 128జిబి, 256జిబి మరియు 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో రానున్నట్లు సమాచారం.

Moto X40 AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్

ఇటీవలె జిన్ Moto X40 యొక్క AnTuTu బెంచ్ మార్క్ ని షేర్ చేశారు. దాని ద్వారా క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ నుంచి ఏం ఆశించవచ్చో తెలిసింది. 1,312,901 స్కోర్ ని నమోదు చేసి వారెవా అనిపించింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 18GB ర్యామ్, 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 చిప్, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్న Moto X40; రివీల్ అయిన డిజైన్ https://www.91mobiles.com/telugu/moto-x40-design-revealed-before-launch/ Fri, 28 Oct 2022 12:15:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=3129 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Moto X40 TENAA లిస్టింగ్ పై కనిపించిన Moto X40, రివీల్ అయిన డిజైన్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోన్న Moto X40 స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా త్వరలోనే Moto X40 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Moto X30 కి ఈ ఫోన్ సక్సెసర్ గా వస్తోంది. గ్లోబల్ గా మోటో ఎక్స్30, మోటో ఎడ్జ్ 30 పేరుతో లాంచ్ […]

The post Snapdragon 8 Gen 2 చిప్, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్న Moto X40; రివీల్ అయిన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Moto X40
  • TENAA లిస్టింగ్ పై కనిపించిన Moto X40, రివీల్ అయిన డిజైన్
  • కర్వ్డ్ డిస్ప్లే తో వస్తోన్న Moto X40 స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా త్వరలోనే Moto X40 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Moto X30 కి ఈ ఫోన్ సక్సెసర్ గా వస్తోంది. గ్లోబల్ గా మోటో ఎక్స్30, మోటో ఎడ్జ్ 30 పేరుతో లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు Moto X40 కూడా గ్లోబల్ గా మోటో ఎడ్జ్ 40 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Moto X40 ఫోన్ TENAA లిస్టింగ్ పై కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా లీకైన డిజైన్ ని బట్టి, Moto X40 కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్నట్లు స్పష్టమైంది.

లెనొవొ చైనా మొబైల్ మేనేజర్ చెన్ జిన్ రీసెంట్ గా చైనా సామాజిక మాధ్యమం వీబో పై Moto X40 కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని షేర్ చేశారు. ఆయన ప్రకారం, Moto X40 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో రానున్నట్లు స్పష్టమైంది.

త్వరలో లాంచ్ కానున్న Moto X40 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం. వన్ ప్లస్ 11, ఐకూ 11 సిరీస్, షావోమీ 13 సిరీస్, వివో ఎక్స్90 సిరీస్ తదితర వాటితో Moto X40 పోటీ పడనుంది. ఈ ఏడాది ఆఖర్లో Moto X40 చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

రీసెంట్ గా Moto X40 డివైజ్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఇప్పుడు TENAA టెలీకామ్ ఆథారిటీ సైట్ ద్వారా Moto X40 యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto X40 గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు

TENAA లిస్టింగ్ ప్రకారం, త్వరలో రానున్న Moto X40 కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది. డిస్ప్లే ఫీచర్లను పక్కనబెడితే, రెండర్ ఇమేజెస్ ద్వారా Moto X40 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని స్పష్టమవుతోంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో స్క్వేర్ షేప్ లో కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది.

Moto X40 ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ కనిపిస్తున్నాయి. డిస్ప్లేని చూస్తుంటే అందులోనే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎంబెడ్ కాబడి ఉందని తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ తో కనిపిస్తోంది. అలాగే బ్యాక్ ప్యానెల్ పై మోటోరోలా అని టెక్ట్స్ తో పాటు లోగో కూడా ఉంది. ఇవి కాకుండా TENAA ద్వారా ఇంకా ఏ కూడా స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు.

Moto X40 స్పెసిఫికేషన్స్ (అంచనా)

లీకైన రూమర్ల ద్వారా Moto X40 యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఒక అవగాహన వచ్చింది. అవేంటో ఓసారి చూద్దాం పదండి. Moto X40 లేటెస్ట్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో రానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. Moto X40 12జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ తో పాటు 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుందని తెలుస్తోంది.

Moto X40 భారత్ లో వచ్చ ఏడాది లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ల ధరలు ఈసారి భారీగానే ఉంటాయని సమాచారం. డాలర్ పై రూపాయి విలువ పడిపోవడం, సెమీకండక్టర్స్ కొరత వంటివి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. మరి మోటోరోలా భారత్ లో Moto X40 ని ఏ ధరతో లాంచ్ చేస్తుందోననే విషయం ఆసక్తికరంగా మారింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 చిప్, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్న Moto X40; రివీల్ అయిన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో రానున్న Moto X40 https://www.91mobiles.com/telugu/moto-x40-snapdragon-8-gen-2-chip-launch-soon/ Thu, 27 Oct 2022 10:54:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=3097 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Moto X40, టీజ్ చేసిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్న Moto X40 స్మార్ట్ ఫోన్ Moto X30 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న Moto X40 సిరీస్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా, ఎడ్జ్ 30 సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేసింది. భారత్ లో మోటో ఎడ్జ్ 30, ఎడ్జ్ 30 ఫ్యూజన్, ఎడ్జ్ 30 […]

The post Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో రానున్న Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Moto X40, టీజ్ చేసిన కంపెనీ ఎగ్జిక్యూటివ్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో వస్తున్న Moto X40 స్మార్ట్ ఫోన్
  • Moto X30 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న Moto X40 సిరీస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా, ఎడ్జ్ 30 సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేసింది. భారత్ లో మోటో ఎడ్జ్ 30, ఎడ్జ్ 30 ఫ్యూజన్, ఎడ్జ్ 30 ప్రో, ఎడ్జ్ 30 అల్ట్రా మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఇక తక్కువ ధరలో ఎడ్జ్ 30 నియో అనే ఫోన్ కూడా లాంచ్ అయ్యింది. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం భారత్ లో అందుబాటులో లేదు. మోటోరోలా తన యొక్క ఎడ్జ్ సిరీస్ ఫోన్లను చైనాలో ఎక్స్-సిరీస్ గా లాంచ్ చేస్తుంది. ఇక మోటోరోలా నుంచి రాబోవు ఎక్స్-సిరీస్ ఫోన్ Moto X40 త్వరలోనే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ ఏడాది చైనాలో మోటోరోలా తన ప్రీమియమ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. లెనోవో చైనా మొబైల్ జనరల్ మేనేజర్ చెన్ జిన్ తాజాగా Moto X40 యొక్క లాంచ్ ని టీజ్ చేశారు. దీంతో అతి త్వరలో Moto X40 ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైంది.

Moto X40 లాంచ్ ని టీజ్ చేసిన చెన్ జిన్

త్వరలోనే చైనా మార్కెట్ లో Moto X40 లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో Moto Edge 40 Pro అనే పేరుతో లాంచ్ అవ్వనుంది. Lenovo కి చెందిన చెన్ జిన్ Moto X40 లాంచ్ గురించి టీజ్ చేస్తూ,ఫోన్ పై యూజర్ల అంచనాలు ఏంటని అడిగారు. దీంతో త్వరలో Moto X40 లాంచ్ ఉంటుందని స్పష్టమైంది.

మోటోరోలా నుంచి రాబోవు ఫ్లాగ్షిప్ డివైజ్ లాంచ్ తేదీని చెన్ జిన్ వెల్లడించలేదు. అయితే Moto X40 నవంబర్ నెలలో ఎంట్రీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. క్వాల్కమ్ తన ఫ్లాగ్షిప్ చిప్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ని నవంబర్ నెలలోనే లాంచ్ చేయనుంది. ఈ చిప్ లాంచ్ తర్వాత Moto X40 లాంచ్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 3.36 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. ఈసారి ఈ ప్రాసెసర్ విభిన్నమైన క్లస్టర్ సెటప్ తో వస్తోంది. నవంబర్ 15 వ తేదీన 8 జెన్ 2 చిప్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Moto X40 ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ లో ఉన్న కెమెరా మాడ్యూల్ మాదిరిగా Moto X40 లో కెమెరా డిజైన్ ఉండనుంది. 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 68వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని సమాచారం. అయితే ఎడ్జ్ 30 అల్ట్రా మాత్రం 125వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉండటం గమనార్హం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో రానున్న Moto X40 first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 తో వస్తున్న Moto X40; ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/moto-x40-launch-timeline-specs-tipped-before-launch/ Mon, 17 Oct 2022 12:51:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2926 హైలైట్స్ 2022 చివరి కల్లా చైనాలో లాంచ్ కానున్న Moto X40 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తున్న Moto X40 Moto Edge 30 Pro అనే పేరుతో భారత్ లో లాంచ్ అయిన ఎక్స్40 ప్రీడెససర్ Moto X30 Moto Edge 30 సిరీస్ తో ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో Motorola బాగానే బజ్ క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా లాంచ్ […]

The post Snapdragon 8 Gen 2 తో వస్తున్న Moto X40; ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2022 చివరి కల్లా చైనాలో లాంచ్ కానున్న Moto X40
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తున్న Moto X40
  • Moto Edge 30 Pro అనే పేరుతో భారత్ లో లాంచ్ అయిన ఎక్స్40 ప్రీడెససర్ Moto X30

Moto Edge 30 సిరీస్ తో ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో Motorola బాగానే బజ్ క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా లాంచ్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఈ ఫోన్ 200 మెగాపిక్సెల్ సెన్సర్ తో రావడం విశేషం. అయితే, రానున్న ఒకట్రెండు నెలల్లో ఈ 30 సిరీస్ కి అప్‌గ్రేడ్ వర్షన్ మోటో ఎడ్జ్ 40 సిరీస్ ఎంట్రీ ఇవ్వనుందని తాజా సమాచారం. త్వరలోనే మోటోరోలా కంపెనీ Moto X40 సిరీస్ ని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Moto X40 (Moto Edge 40 Pro) స్పెసిఫికేషన్స్

చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబో ద్వారా Moto X40 కి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతున్న దాన్ని బట్టి, Moto X40 ఒకట్రెండు నెలల్లో చైనాలో లాంచ్ అవ్వబోతోంది. చిప్ తయారీ సంస్థ క్వాల్కమ్ తన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ చిప్ Snapdragon 8 Gen 2 ని లాంచ్ చేసిన తర్వాత Moto X40 ఇదే చిప్సెట్ తో మార్కెట్ లోకి ప్రవేశించనుంది.

క్వాల్కమ్ తీసుకొస్తున్న నెక్ట్స్ జనరేషన్ చిప్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో రానున్న తొలి ఫోన్ గా Moto X40 నిలవనుంది. అయితే, ఇదొక్కటే కాదండోయ్, ఇంకా ఐకూ 11, వన్‌ప్లస్ 11 ప్రో, శాంసంగ్ గెలాక్సీ 23 సిరీస్ ఫోన్లు కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఇక శాంసంగ్ గెలాక్సీ 23 సిరీస్ 2023 ఆరంభంలో లాంచ్ అవుతోంది.

రిపోర్ట్ ప్రకారం, Moto X40 స్మార్ట్ ఫోన్ హయ్యర్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50 మెగా పిక్సెల్ కెమెరా, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది. అయితే ఇవి బేస్ వర్షన్ యొక్క స్పెసిఫికేషన్స్ అని గమనించాలి. ఇంకా అల్ట్రా వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ వేరేలా ఉండనున్నాయి. గ్లోబల్ గా Moto X40 స్మార్ట్ ఫోన్, Moto Edge 40 Pro అనే పేరుతో లాంచ్ అవ్వనుంది. మోటో ఎక్స్30 కూడా ఇదే విధంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

రానున్న వారాల్లో Moto X40 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.

ఓసారి Moto X30 స్పెసిఫికేషన్స్ పై లుక్ వేద్దాం పదండి. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 576హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఇందులో 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మోటో ఎక్స్30 లో 60 మెగా పిక్సెల్ ఫ్రంట్ షూటర్ ఉండటం విశేషం. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 తో వస్తున్న Moto X40; ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>