Nothing Phone (2a) Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Sep 2024 16:47:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nothing Phone 2a Plus vs OPPO F27 Pro Plus: ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-oppo-f27-pro-plus-battery-comparison-which-one-gives-better-battery-life/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-oppo-f27-pro-plus-battery-comparison-which-one-gives-better-battery-life/#respond Tue, 10 Sep 2024 16:47:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=13425 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Nothing […]

The post Nothing Phone 2a Plus vs OPPO F27 Pro Plus: ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Nothing Phone 2a Plus మరియు OPPO F27 Pro Plus ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Nothing Phone 2a Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు OPPO F27 Pro Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ టెస్ట్

మేం జరిపిన పీసీమార్క్ టెస్టులో రెండు ఫోన్ల యొక్క బ్రైట్నెస్ 80 శాతం, వాల్యూమ్ 50 శాతం పెట్టడం జరిగింది. అలాగే నెట్వర్క్ కమ్యూనికేషన్ ను డిసేబుల్ చేశాం.

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ డివైజ్ 14 గంటల 34 నిమిషాల బ్యాటరీ లైఫ్ అందించింది. మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 10 గంటల 46 నిమిషాల బ్యాటరీ లైఫ్ ఇచ్చింది. దీన్ని బట్టి, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ కంటే ఎక్కువసేపు నడుస్తుందని స్పష్టమైంది.

విజేత: Nothing Phone 2a Plus

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ పెట్టి, యూట్యూబ్ లో 30 నిమిషాల పాటు హై-క్వాలిటీ వీడియోలను చూడటం జరిగింది. ఈ టెస్టులో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ బ్యాటరీ 4 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ బ్యాటరీ కూడా 4 శాతం ఖర్చయ్యింది. ఈ టెస్టులో రెండు ఫోన్లు కూడా సమఉజ్జీలుగా నిలిచాయి.

విజేత: సమానం

గేమింగ్ టెస్ట్

రెండు ఫోన్లలో ఒకే విధమైన సెట్టింగ్స్ తో, 30 నిమిషాల పాటు, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ వంటి గేమ్‌లు ఆడటం జరిగింది. టెస్టు తర్వాత, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ యొక్క బ్యాటరీ గేములను బట్టి, వరుసగా 7 శాతం, 6 శాతం, 6 శాతంగా ఖర్చయ్యింది. యావరేజీ తీస్తే, దీన్ని 6.3 శాతం గా చెప్పవచ్చు.

మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ బ్యాటరీ వరుసగా 7 శాతం, 8 శాతం మరియు 8 శాతం మేర ఖర్చయ్యింది. యావరేజీ చూస్తే, 7.6 శాతం గా ఉంది.

విజేత: Nothing Phone 2a Plus

చార్జింగ్ టెస్ట్

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్‌ని 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. అయితే బాక్స్ లో చార్జర్ అందించలేదు. దీంతో, మేం మోటోరోలా యొక్క 68 వాట్ పీడీ చార్జర్ ను వాడి, చార్జ్ చేసినప్పుటు 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పట్టింది.

మరోవైపు, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ ను 67 వాట్ సూపర్‌వూక్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు, 20 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ అయ్యేందుకు 48 నిమిషాల సమయం పట్టింది.

ఈ టెస్టు తర్వాత రెండు ఫోన్ల యొక్క స్కోరును గమనిస్తే, చాలా తక్కువ తేడా మాత్రమే ఉంది. బాక్స్ లో చార్జర్ తో రాకపోవడం నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కి ఒక పాయింట్‌ను కోల్పోయేలా చేసింది.

విజేత: OPPO F27 Pro Plus

ఏది బెటర్?

మేం చేసిన బ్యాటరీ పోలిక నివేదిక ప్రకారం, పీసీమార్క్ టెస్ట్ మరియు గేమింగ్ టెస్టులలో Nothing Phone 2a Plus బాగా పెర్ఫామ్ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్సెట్ వల్లనేనని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. కాబట్టి, ఎంతో శక్తివంతమైంది.

ఇక, OPPO F27 Pro Plus లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ ఫోన్ చార్జింగ్ డిపార్ట్‌మెంట్ లో మేటిగా నిలిచింది. బాక్స్ లో ఫాస్ట్ చార్జర్ ను ప్రొవైడ్ చేయడం ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను టెస్ట్ చేసిన వారు: ఆదిత్యా పాండే మరియు ఉజ్వల్ శర్మ

The post Nothing Phone 2a Plus vs OPPO F27 Pro Plus: ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-oppo-f27-pro-plus-battery-comparison-which-one-gives-better-battery-life/feed/ 0
Nothing Phone 2a Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-which-phone-has-better-camera/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-which-phone-has-better-camera/#respond Thu, 05 Sep 2024 17:08:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=13365 స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు వారి […]

The post Nothing Phone 2a Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.

ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు వారి అవసరానికి అనుగుణంగా ఫోన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మనం ఈ ఆర్టికల్ లో Nothing Phone 2a Plus మరియు Realme 13 Pro స్మార్ట్‌ఫోన్లను పోల్చి, ఎందులో ఉత్తమమైన కెమెరా ఉందో తెలుసుకుందాం.

డే లైట్

రియల్మీ 13 ప్రో ఫోన్ డేలైట్ కండిషన్స్ లో బ్రైట్ మరియు పంచీ కలర్స్ ను ప్రొడ్యూస్ చేసింది. మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. ఓవరాల్ గా రెండు ఫోన్లలో తీసిన ఫోటోల్లో ఒకే విధమైన డైనమిక్ రేంజ్, బ్యాగ్రౌండ్ డీటెయిల్స్ ఉన్నాయి.

అయితే రియల్మీ 13 ప్రో మాత్రం నాయిస్ ను తగ్గించేందుకు కొన్ని డీటెయిల్స్ ను సాఫ్ట్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో దీనికి విరుద్ధంగా, ఎక్కువ షార్ప్‌నెస్ గల డీటెయిల్స్ ఉన్నాయి. పొదలు కూడా ఎంతో నేచురల్ గా కనిపించాయి.

2ఎక్స్ మోడ్ లో తీసిన ఫోటోలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. కలర్ ట్రీట్మెంట్ విషయంలో రియల్మీ 13 ప్రో తడబడినట్లు మా టెస్టులో స్పష్టమైంది.

విజేత: Nothing Phone 2a Plus

అల్ట్రావైడ్

50ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్ తో.. మెగాపిక్సెల్స్ విషయంలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, రియల్మీ 13 ప్రో కంటే ముందుంది. రియల్మీలో 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంది.

ఈ రెండు ఫోన్లలో తీసిన ఫోటోలను పోల్చి చూస్తే, ప్రైమరీ కెమెరా మాదిరి కలర్ సైన్స్‌ను, ఏ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా కలిగి లేదు. రియల్మీ 13 ప్రో ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉన్నప్పటికీ, డీటెయిల్స్ స్పష్టంగా లేవు.

మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మంచి డైనమిక్ రేంజ్ అందించింది. బ్యాగ్రౌండ్ లో కనిపించే డీటెయిల్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్, రియల్ లైఫ్ కలర్స్‌ను క్యాప్చర్ చేసే విషయంలో రియల్మీ 13 ప్రో కంటే బెటర్ గా ఉంది.

విజేత: Nothing Phone 2a Plus

పొట్రెయిట్

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మరియు రియల్మీ 13 ప్రో ఫోన్లు రెండూ కూడా పొట్రెయిట్ షాట్స్ కోసం తమ మెయిన్ కెమెరా పైనే ఆధారపడ్డాయి. రెగ్యులర్ ఫోటో మోడ్ లో నేచురల్ గా కనిపించే కొద్దిపాటి డెప్త్ ఏరియా సాధ్యమవుతుంది. కానీ, పొట్రెయిట్ మోడ్.. సోషల్ మీడియా-రెడీ ఔట్‌పుట్ అందిస్తుంది.

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ద్వారా తీసిన పొట్రెయిట్ పిక్స్ లో బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది. మరోవైపు, రియల్మీ 13 ప్రో తో తీసిన ఫోటోల్లో స్కిన్ టోన్ సరిగ్గా ఉంది.

ఎడ్జ్ డిటెక్షన్, బ్లర్ బ్యాగ్రౌండ్ విషయాల్లో రియల్మీ 13 ప్రో మెరుగ్గా ఉంది. అయితే రెండు ఫోన్లు కూడా ముఖంలోని డీటెయిల్స్ ను సాఫ్ట్ చేశాయి.

విజేత: Realme 13 Pro

సెల్ఫీ (పొట్రెయిట్ మోడ్)

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ తన బ్రైట్నెస్ లెవెల్స్ ను ముఖం పైన బాగానే బ్యాలన్స్ చేసింది. అంతేకాదు, ఫేస్ పైన డీటెయిల్స్ ను కూడా చక్కగా క్యాప్చర్ చేసింది.

ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో రియల్మీ 13 ప్రో తడబడినట్లు సెల్ఫీస్ ను గమనిస్తే అర్థమైంది. సెల్ఫీస్ లో హై కాంట్రాస్ట్ ఉండటంతో, డీటెయిల్స్ కనిపించలేదు.

విజేత: Nothing Phone 2a Plus

లో-లైట్

రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా లో-లైట్ పరిస్థితుల్లో బ్రైట్నెస్ విషయంలో ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. అయితే లో-లైట్ పెర్ఫామెన్స్ కచ్చితంగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

యాంబియెంట్ లైట్స్ ‌ను బ్యాలన్స్ చేయడంలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మరియు రియల్మీ 13 ప్రో తడబడ్డాయి. ఓవరాల్ గా ఫోటోల యొక్క షార్ప్‌నెస్, స్టెబిలిటీ యావరేజీగా ఉన్నాయి.

బ్రైట్ ఔట్‌పుట్, డీటెయిల్స్ విషయంలో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మంచిగా పెర్ఫామ్ చేసింది. ఎక్స్‌పోజర్ బ్యాలన్సింగ్ విషయంలో రియల్మీ 13 ప్రో ఇబ్బంది పడింది.

విజేత: Nothing Phone 2a Plus

లో-లైట్ (నైట్ మోడ్)

నైట్ మోడ్ సాయంతో, కాస్త మెరుగైన ఫోటోలు వచ్చాయి. కానీ పెద్దగా మార్పు లేదు. హై కాంట్రాస్ట్ ఉన్నప్పటికీ, రియల్మీ 13 ప్రో ఇమేజెస్ చూసేందుకు బాగున్నాయి. కాకపోతే, బిల్డింగ్స్ పై ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ డీటెయిల్స్ స్పష్టంగా లేవు.

మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో ఈ సమస్యలు ఏమీ లేవు. అయితే, రెండు ఫోన్లు కూడా యాంబియెంట్ లైట్‌ను మ్యానేజ్ చేయడంలో ఇబ్బంది పడ్డాయి. రూ.30,000 లోపు ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఈ సమస్య తరచూ కనిపించేదే.

విజేత: Nothing Phone 2a Plus

ఏది బెటర్?

మేం జరిపిన కెమెరా టెస్టును బట్టి, Realme 13 Pro కంటే Nothing Phone 2a Plus ముందుంది. కొన్ని విషయాల్లో రెండూ కూడా సమానంగా ఉన్నాయి.

అయితే, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో 50ఎంపి కెమెరా సిస్టమ్ ఎక్కువ డీటెయిల్స్ ను క్యాప్చర్ చేస్తుంది. మీరు గనుక మీ సోషల్ మీడియా ప్రాజెక్ట్స్ కోసం ఇమేజెస్ ను క్రాప్ చేస్తే, ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నేచురల్ కలర్స్ కి దగ్గరగా ఉన్న ఫోటోలను ప్రొడ్యూస్ చేస్తున్న Nothing Phone 2a Plus సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

The post Nothing Phone 2a Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-which-phone-has-better-camera/feed/ 0
Nothing Phone (2a) Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-battery-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-battery-comparison-which-is-better/#respond Thu, 22 Aug 2024 18:14:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=13122 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. ఈ […]

The post Nothing Phone (2a) Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

ఈ ఆర్టికల్ లో Nothing Phone (2a) Plus మరియు Realme 13 Pro ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఓసారి ఆ వివరాలు తెలుసుకోండి.

Nothing Phone (2a) Plus లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. Realme 13 Pro లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. పెద్ద బ్యాటరీ ఉన్న రియల్మీ 13 ప్రో, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ కంటే బెటర్ రిజల్ట్స్ అందిస్తుందా? ఆ విషయం తెలుసుకుందాం పదండి.

పీసీమార్క్ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా రెండు ఫోన్లలోని బ్యాటరీలు ఎలా పని చేస్తున్నాయో తెలిసింది. ఈ టెస్టును ఫ్లయిట్ మోడ్ ఆన్ చేసి చేయడం జరిగింది. అలాగే రెండు ఫోన్లను పూర్తిగా చార్జ్ చేసి, ఒకే విధమైన ఆడియో/బ్యాటరీ లెవెల్స్ సెట్ చేసి టెస్ట్ జరిపాం. ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Nothing Phone 2A Plus పీసీమార్క్ బ్యాటరీ టెస్టులో 14 గంటల 34 నిమిషాలు స్కోర్ చేసింది. మరోవైపు Realme 13 Pro 10 గంటల 48 నిమిషాలు స్కోర్ చేసింది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో చిన్న బ్యాటరీ ఉన్నప్పటికీ, పెద్ద బ్యాటరీ ఉన్న రియల్మీ 13 ప్రో కంటే బెటర్ గా పెర్ఫామ్ చేసింది.

విజేత: Nothing Phone (2a) Plus

యూట్యూబ్ వీడియో

రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు చూడగా, Nothing Phone (2a) Plus లో 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు, Realme 13 Pro లో కూడా 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.

అయితే రెండు ఫోన్లు 4 శాతం బ్యాటరీని తీసుకున్నాయి కానీ, కచ్చితమైన ఫలితాలు చూస్తే, Nothing Phone (2a) Plus 200mAh బ్యాటరీ, Realme 13 Pro 208mAh బ్యాటరీ వినియోగించాయి.

విజేత: Nothing Phone (2a) Plus

గేమింగ్ టెస్ట్

మేం గేమింగ్ టెస్ట్ కోసం మూడు ప్రధాన గేమ్స్ ఎంచుకున్నాం. అవి: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ), కాల్ ఆఫ్ డ్యూటీ (సీఓడీ), మరియు రియల్ రేసింగ్ 3. రెండు ఫోన్లలో ఈ గేమ్స్ ప్రతీ ఒక్కదాన్ని 30 నిమిషాల పాటు ఆడటం జరిగింది. యావరేజీ బ్యాటరీ డ్రాప్ రిజల్ట్స్ చూద్దాం.

Nothing Phone (2a) Plus లో యావరేజీ బ్యాటరీ డ్రాప్ 6.3 శాతంగా నమోదైంది. మరోవైపు, Realme 13 Pro లో 7 శాతం బ్యాటరీ డ్రాప్ అయ్యింది.

కచ్చితమైన ఫలితాలను గమనిస్తే, Nothing Phone (2a) Plus 315mAh బ్యాటరీ పవర్ ను వాడుకోగా, Realme 13 Pro 364mAh బ్యాటరీ పవర్‌ను వినియోగించుకుంది.

విజేత: Nothing Phone (2a) Plus

చార్జింగ్

Realme 13 Pro లో పెద్ద బ్యాటరీ ఉంది. Nothing Phone (2a) Plus 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అయితే ఈ నథింగ్ ఫోన్ తో పాటు బాక్స్ లో చార్జర్ రాదు. దీంతో మేం, మోటోరోలా పీడీ చార్జర్ వాడాం.

Nothing Phone (2a) Plus డివైజ్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాలు సమయం పట్టింది. Realme 13 Pro ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 52 నిమిషాలు సమయం పట్టింది.

విజేత: Nothing Phone (2a) Plus

ఏది బెటర్?

ఓవరాల్ గా చూస్తే, Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్ చిన్న బ్యాటరీ కలిగి ఉన్నప్పటికీ, Realme 13 Pro కంటే బెటర్ గా పెర్ఫామ్ చేసింది.

అయితే, Nothing Phone (2a) Plus ఫోన్ తో పాటు బాక్స్ లో చార్జర్‌ను కంపెనీ అందించడం లేదు. కేవలం టైప్-సీ టు టైప్-సీ కేబుల్ మాత్రమే అందిస్తోంది. కానీ, Realme 13 Pro తో పాటు బాక్స్ లో చార్జర్ వస్తుంది.

మేం అందించిన బ్యాటరీ టెస్టు ఫలితాలు, మీకు నచ్చిన ఫోన్ ఎంచుకునేందుకు సాయపడతాయని ఆశిస్తున్నాం.

The post Nothing Phone (2a) Plus vs Realme 13 Pro: ఏ ఫోన్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-vs-realme-13-pro-battery-comparison-which-is-better/feed/ 0
Motorola Edge 50 vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్? https://www.91mobiles.com/telugu/motorola-edge-50-nothing-phone-2a-plus-battery-comparison-which-gives-best-backup/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-nothing-phone-2a-plus-battery-comparison-which-gives-best-backup/#respond Wed, 07 Aug 2024 18:24:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=12877 ఇటీవలె భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 మరియు Nothing Phone (2a) Plus ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు కూడా యూజర్లకు నచ్చే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇక ఈ డివైజెస్ 8జిబి ర్యామ్ వేరియంట్ యొక్క ధర రూ.27,999 గా ఉంది. అలాగే ఈ రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మరి రెండింట్లో ఏది ఉత్తమమైన పవర్ బ్యాకప్ ఇస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. మేం, […]

The post Motorola Edge 50 vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>

ఇటీవలె భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 మరియు Nothing Phone (2a) Plus ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు కూడా యూజర్లకు నచ్చే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇక ఈ డివైజెస్ 8జిబి ర్యామ్ వేరియంట్ యొక్క ధర రూ.27,999 గా ఉంది. అలాగే ఈ రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మరి రెండింట్లో ఏది ఉత్తమమైన పవర్ బ్యాకప్ ఇస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. మేం, ఈ రెండు ఫోన్లను పీసీమార్క్ బ్యాటరీ బెంచ్‌మార్క్ వినియోగించి పరీక్షలు జరిపాం. అలాగే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ టెస్ట్‌లు కూడా చేసి బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో పరిశీలించాం. ఆ వివరాలు మీకోసం అందిస్తున్నాం.

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ రెండు ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా 20 శాతానికి పడిపోయే దాకా చేయడం జరిగింది. మోటో ఎడ్జ్ 50 మరియు నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్లను 100 శాతం బ్యాటరీతో, 50 శాతం వాల్యూమ్ మరియు బ్రైట్నెస్ లెవెల్స్ తో టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ లో Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ 10 గంటల 50 నిమిషాల స్కోర్ చేయగా, Nothing Phone 2a Plus 14 గంటల 34 నిమిషాల స్కోర్ చేసింది.

విజేత: Nothing Phone (2a) Plus

వీడియో స్ట్రీమింగ్

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 యొక్క బ్యాటరీ 30 నిమిషాల తర్వాత 5 శాతం ఖర్చయ్యింది. టెస్టింగ్ సమయంలో మ్యాగ్జిమమ్ సపోర్టెడ్ రెజుల్యూషన్, 50 శాతం బ్రైట్నెస్, 50 శాతం వాల్యూమ్ లెవెల్స్ ఉన్నాయి. ఇవే సెట్టింగ్స్ తో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ చేయగా, 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. దీన్ని 200mAh అని చెప్పవచ్చు. మరోవైపు మోటో ఎడ్జ్ 50 లో ఇది 250mAh గా ఉంది.

విజేత: Nothing Phone (2a) Plus

గేమింగ్

గేమింగ్ టెస్ట్ లో కూడా Nothing Phone (2a) Plus, Moto Edge 50 కంటే ఉత్తమమైన బ్యాటరీ పనితీరును కనబర్చింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ మరియు రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను ప్రతీ ఒక్క దాన్ని 30 నిమిషాల చొప్పున ఆడితే నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో 19 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు మోటోరోలా ఎడ్జ్ 50 లో 26 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.

విజేత: Nothing Phone (2a) Plus

చార్జింగ్ స్పీడ్స్

చార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, Motorola Edge 50 తన 68W ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో మెరుగ్గా కనిపిస్తోంది. కంపెనీ బాక్స్ లో అందించిన చార్జర్ తో రెగ్యులర్ మోడ్‌లో చార్జ్ చేసినప్పుడు, 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 40 నిమిషాల సమయం పట్టింది. అదే, చార్జ్ బూస్ట్ మోడ్‌లో 30 నిమిషాల సమయం పట్టింది.

మరోవైపు, Nothing Phone (2a) Plus 50 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. కానీ, బాక్స్ లో చార్జర్ తో రావడంలేదు. కంపాటిబుల్ థర్డ్-పార్టీ పీడీ చార్జర్ తో జరిపిన టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Motorola Edge 50

ఏది బెస్ట్?

Nothing Phone (2a) Plus మెరుగైన బ్యాటరీ పనితీరుతో Motorola Edge 50 తో పోల్చితే.. బెంచ్‌మార్క్ టెస్ట్‌లు, గేమింగ్ మరియు స్ట్రీమింగ్ విషయాల్లో మేటిగా నిలిచింది. అయితే, Motorola Edge 50 ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్, బాక్స్ లో చార్జర్.. వంటి విషయాల్లో ముందు వరుసలో ఉంది. మీ అవసరానికి అనుగుణంగా రెండు ఫోన్లలో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

The post Motorola Edge 50 vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-nothing-phone-2a-plus-battery-comparison-which-gives-best-backup/feed/ 0
Nothing Phone (2a) Plus: భారత్‌లో లాంచైన నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-launched-india-know-price-specs/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-launched-india-know-price-specs/#respond Wed, 31 Jul 2024 11:29:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=12761 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing నేడు భారతీయ మార్కెట్ లో Nothing Phone (2a) Plus అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ సరికొత్త మెటాలిక్ ఫినిష్ తో వచ్చింది. సరే, ఓసారి Nothing Phone (2a) Plus యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Nothing Phone (2a) Plus ధర, లభ్యత Nothing Phone […]

The post Nothing Phone (2a) Plus: భారత్‌లో లాంచైన నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Nothing Phone (2a) Plus లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9350 ప్రో చిప్
  • 50ఎంపి శాంసంగ్ జెఎన్1 సెల్ఫీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing నేడు భారతీయ మార్కెట్ లో Nothing Phone (2a) Plus అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ సరికొత్త మెటాలిక్ ఫినిష్ తో వచ్చింది. సరే, ఓసారి Nothing Phone (2a) Plus యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) Plus ధర, లభ్యత

Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Nothing Phone (2a) Plus యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.27,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా నిర్ణయించారు.

Nothing Phone (2a) Plus డివైజ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి వస్తోంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ రూ.24,999 కే లభించనుంది.

Nothing Phone (2a) Plus స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nothing Phone (2a) Plus లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2412*1084 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ ఫ్రీక్వెన్సీ, 10-బిట్ కలర్ డెప్త్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone (2a) Plus లో మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో చిప్సెట్, మాలి-జీ610 ఎంసీ4 జీపీయూ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Nothing Phone (2a) Plus డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

మెమొరీ: Nothing Phone (2a) Plus డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: Nothing Phone (2a) Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి శాంసంగ్ జీఎన్9 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ జెఎన్1 సెన్సర్ అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Nothing Phone (2a) Plus లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 50 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Nothing Phone (2a) Plus లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Nothing Phone (2a) Plus లో ఐపీ54 ప్రొటెక్షన్, స్టీరియో స్పీకర్స్, గ్లైఫ్ లైట్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Nothing Phone (2a) Plus డివైజ్ 161.7 మి.మీ పొడవు, 76.3 మి.మీ వెడల్పు, 8.5 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.

The post Nothing Phone (2a) Plus: భారత్‌లో లాంచైన నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్.. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-launched-india-know-price-specs/feed/ 0
Nothing Phone (2a) Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-india-launch-date-confirmed/#respond Thu, 18 Jul 2024 17:57:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=12563 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone (2a) Plus డివైజ్‌ను లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ ఫోన్ టీడీఆర్ఏ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. నేడు నథింగ్ సంస్థ Nothing Phone (2a) Plus యొక్క ఇండియా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జులై 31న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని నథింగ్ తెలిపింది. ఓసారి నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లాంచ్ వివరాలు తెలుసుకుందాం. Nothing Phone (2a) Plus లాంచ్ తేదీ Nothing […]

The post Nothing Phone (2a) Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Nothing Phone (2a) Plus లాంచ్ తేదీ ఖరారు
  • జులై 31న నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ విడుదల
  • ఎక్స్‌ట్రార్డినరీ ఫోన్ గా చెబుతోన్న నథింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone (2a) Plus డివైజ్‌ను లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ ఫోన్ టీడీఆర్ఏ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. నేడు నథింగ్ సంస్థ Nothing Phone (2a) Plus యొక్క ఇండియా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జులై 31న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని నథింగ్ తెలిపింది. ఓసారి నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లాంచ్ వివరాలు తెలుసుకుందాం.

Nothing Phone (2a) Plus లాంచ్ తేదీ

Nothing Phone (2a) Plus జులై 31వ తేదీన ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈమేరకు నథింగ్ సంస్థ ప్రకటన చేసింది. ఈ ఈవెంట్‌లోనే Nothing Phone (2a) Plus లాంచ్ కానుంది. జులై 31న మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదలవుతుంది. కంపెనీ విడుదల చేసిన ప్రొడక్ట్ పేజీలో ఈ ఫోన్‌ని ‘ఎక్స్‌ట్రార్డినరీ స్మార్ట్‌ఫోన్’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఫోన్‌కి సంబంధించిన ఇతర వివరాలు రహస్యంగానే ఉన్నాయి. త్వరలోనే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది.

Nothing Phone 2a స్పెసిఫికేషన్స్

Nothing Phone 2a లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.

ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది. 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది.

Nothing Phone 2a లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఈ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

నథింగ్ ఫోన్ 2ఏ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Nothing Phone (2a) Plus ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-india-launch-date-confirmed/feed/ 0
Nothing Phone (2a) Plus: టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పొందిన నథింగ్ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-received-tdra-certification/ https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-received-tdra-certification/#respond Thu, 18 Jul 2024 12:34:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=12553 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing త్వరలో కొత్త ఫోన్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఇటీవలె నథింగ్ సబ్-బ్రాండ్ CMF నుంచి CMF Phone 1 లాంచ్ అయ్యింది. ఇప్పుడు Nothing Phone (2a) Plus మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం నథింగ్ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై ప్లస్ అని పోస్ట్ […]

The post Nothing Phone (2a) Plus: టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పొందిన నథింగ్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Nothing Phone (2a) Plus లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ A142P
  • ప్లస్ అనే సింబల్ పోస్ట్ చేసిన నథింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing త్వరలో కొత్త ఫోన్‌తో యూజర్ల ముందుకు రానుంది. ఇటీవలె నథింగ్ సబ్-బ్రాండ్ CMF నుంచి CMF Phone 1 లాంచ్ అయ్యింది. ఇప్పుడు Nothing Phone (2a) Plus మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీడీఆర్ఏ పై లిస్ట్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం నథింగ్ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై ప్లస్ అని పోస్ట్ చేసింది. దీంతో కొత్త ఫోన్ లాంచ్ ఉంటుందని స్పష్టమైంది. సరే, ఓసారి Nothing Phone (2a) Plus కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Nothing Phone (2a) Plus టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు

Nothing Phone (2a) Plus స్మార్ట్‌ఫోన్ టీడీఆర్ఏ వెబ్‌సైట్ పై A142P అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. గత మోడల్ Nothing Phone (2a) కంటే మెరుగైన ఫీచర్లతో Nothing Phone (2a) Plus వస్తోందని అంతా భావిస్తున్నారు.

డివైజ్ పేరు, మోడల్ నంబర్ తప్పా.. టీడీఆర్ఏ లిస్టింగ్ ద్వారా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు. కానీ, త్వరలోనే లాంచ్ ఉంటుందని చెప్పవచ్చు.

Nothing Phone (2a) Plus లాంచ్

Nothing Phone (2a) Plus లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ప్లస్ అనే సింబల్ మనం గమనించవచ్చు. దీన్ని బట్టి, త్వరలో లాంచ్ కాబోయే ఫోన్ Nothing Phone (2a) Plus కావొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచ్ టైమ్‌లైన్ విషయానికి వస్తే, రాబోయే కొన్ని వారాల్లో ఈ ఫోన్ టీజర్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత లాంచ్ ఉంటుంది.

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Nothing Phone 2a లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2412 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone 2a లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ మొబైల్ 7,41,999 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Nothing Phone 2a డివైజ్ 12జిబి ర్యామ్ సపోర్ట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Nothing Phone 2a లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Nothing Phone 2a లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone 2a డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Nothing Phone (2a) Plus: టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పొందిన నథింగ్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/nothing-phone-2a-plus-received-tdra-certification/feed/ 0