OnePlus 12R - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Sep 2024 14:08:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40 vs OnePlus 12R: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-performance-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-performance-comparison-which-is-better/#respond Tue, 13 Aug 2024 18:07:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=12984 భారతీయ మార్కెట్ లో Vivo V40 రూ.39,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ జీస్-ట్యూన్డ్ కెమెరాలు, అప్‌గ్రేడెడ్ బ్యాటరీ కెపాసిటీతో తన ముందుతరం ఫోన్ Vivo V30 కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చింది. దీని ధర శ్రేణిని బట్టి, OnePlus 12R కి ఈ ఫోన్‌ని పోటీగా భావించవచ్చు. మరి ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ మెరుగైన పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ అందిస్తుందో మేం టెస్ట్ చేశాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి […]

The post Vivo V40 vs OnePlus 12R: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

భారతీయ మార్కెట్ లో Vivo V40 రూ.39,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ జీస్-ట్యూన్డ్ కెమెరాలు, అప్‌గ్రేడెడ్ బ్యాటరీ కెపాసిటీతో తన ముందుతరం ఫోన్ Vivo V30 కంటే ఎక్కువ ఫీచర్లతో వచ్చింది. దీని ధర శ్రేణిని బట్టి, OnePlus 12R కి ఈ ఫోన్‌ని పోటీగా భావించవచ్చు. మరి ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ మెరుగైన పెర్ఫామెన్స్ ఔట్‌పుట్ అందిస్తుందో మేం టెస్ట్ చేశాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

నోట్: మేం ఈ టెస్టు కోసం Vivo V40 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్‌ను తీసుకున్నాం. కాబట్టి టాప్ వేరియంట్ తో పోల్చితే స్కోర్లు తక్కువగా ఉంటాయి.

గీక్‌బెంచ్

గీక్‌బెంచ్ టెస్టు వల్లన స్మార్ట్‌ఫోన్ చిప్సెట్ యొక్క సీపీయూ పెర్ఫామెన్స్‌ను అంచనా వేయవచ్చు. Vivo V40 స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1164 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3216 పాయింట్లు నమోదు చేసింది. మరోవైపు, OnePlus 12R సింగిల్-కోర్ టెస్ట్ లో 1066 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4311 పాయింట్లు నమోదు చేసింది. సింగిల్-కోర్ పెర్ఫామెన్స్ ప్రధానంగా వర్డ్ ప్రాసెసింగ్, వెబ్ బ్రౌజింగ్, యాప్ లోడింగ్ స్పీడ్స్ పై ప్రభావం చూపుతుంది.

మల్టీ-కోర్ పెర్ఫామెన్స్ ప్రధానంగా గేమింగ్, ఫోటో మరియు వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ తదితర వాటిపై ప్రభావం చూపుతుంది. బెంచ్‌మార్క్ స్కోర్లను బట్టి, వివో వీ40 సింగిల్-కోర్ బేస్డ్ టాస్క్‌లను వన్‌ప్లస్ 12ఆర్ కంటే బెటర్ గా చేస్తోంది. మరోవైపు, OnePlus 12R మల్టీ-కోర్ట్ బేస్డ్ టాస్కుల విషయంలో మెరుగ్గా పెర్ఫామ్ చేస్తోంది.

విజేత: OnePlus 12R

అంటుటు

అంటుటు బెంచ్‌మార్క్ అనేది కాంప్రెహెన్సివ్ టెస్టింగ్ స్టాండర్డ్. ఇది గీక్‌బెంచ్ టెస్ట్ కంటే లోతైనది. స్మార్ట్‌ఫోన్ యొక్క సీపీయూ పెర్ఫామెన్స్, జీపీయూ పెర్ఫామెన్స్, మెమొరీ పెర్ఫామెన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విషయాలను అంటుటు బెంచ్‌మార్క్ ఎవాల్యూయేట్ చేస్తుంది. Vivo V40 యొక్క అంటుటు స్కోర్ 8,10,653 గా ఉంది. మరోవైపు, OnePlus 12R అంటుటు స్కోర్ 12,40,474 గా ఉంది.

విజేత: OnePlus 12R

థ్రాట్లింగ్ టెస్ట్

ఒత్తిడి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ యొక్క చిప్సెట్ పనితీరును పరీక్షించడమే ఈ థ్రాట్లింగ్ టెస్ట్. ఈ టెస్ట్ కోసం మేం, బర్నవుట్ బెంచ్‌మార్క్ యాప్ ఉపయోగించాం. ఫోన్ యొక్క ప్రాసెసర్ పై ఈ యాప్ స్ట్రెస్ టెస్ట్ రన్ చేసి, పెర్ఫామెన్స్ ఔట్‌పుట్‌ను బట్టి స్కోర్ ఇస్తుంది.

Vivo V40 ఈ టెస్ట్ లో 68.8 పర్సెంట్ ఔట్‌పుట్ ఇచ్చింది. మరోవైపు OnePlus 12R 70 శాతం ఔట్‌పుట్ ఇచ్చింది. ఈ స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను బట్టి, వివో వీ40 మరియు వన్‌ప్లస్ 12ఆర్ రెండూ కూడా సమ ఉజ్జీలుగా నిలిచాయి.

విజేత: రెండూ సమానం

గేమింగ్ టెస్ట్

మేం బీజీఎంఐ, సీఓడీ: మొబైల్, రియల్ రేసింగ్ 3 గేమ్‌లను రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు ఆడాం. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ వంటి గేమ్స్‌ను రెండు ఫోన్లు కూడా బాగా హ్యాండిల్ చేశాయి. హై గ్రాఫిక్ రెజుల్యూషన్ సెట్టింగ్స్‌తో OnePlus 12R, Vivo V40 తో పోల్చితే బెటర్ యావరేజ్ ఎఫ్‌పీఎస్ డెలివరీ చేసింది. ఇందుకు వన్‌ప్లస్ 12ఆర్ లో ఉన్న శక్తివంతమైన జీపీయూకి థాంక్స్ చెప్పుకోవాలి.

థర్మల్స్ విషయంలో, Vivo V40 ప్రతీ గేమ్ లో కూడా 4.13 డిగ్రీ సెల్సియస్ యావరేజ్ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేసింది. మరోవైపు, OnePlus 12R యావరేజ్ టెంపరేచర్ 5.53 డిగ్రీ సెల్సియస్ కి పెరిగింది. వన్‌ప్లస్ 12ఆర్ కంటే వివో వీ40 కూల్ గా ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్ యొక్క జీవితకాలాన్ని పెంచుతుంది. అయినప్పటికీ, గేమింగ్ విషయంలో OnePlus 12R తన సుపీరియర్ పెర్ఫామెన్స్‌తో విన్నర్ గా నిలిచింది.

ఏది బెటర్?

టెస్ట్ ఫలితాలను బట్టి, OnePlus 12R స్మార్ట్‌ఫోన్ Vivo V40 కంటే మెరుగైన పెర్ఫామెన్స్ చేస్తోందని అర్థమవుతోంది. బెటర్ బెంచ్‌మార్క్ స్కోర్స్ కలిగి ఉండటంతోపాటు, ఉత్తమమైన గేమింగ్ పెర్ఫామెన్స్ ను వన్‌ప్లస్ 12ఆర్ చూపింది. థర్మల్ మేనేజ్మెంట్ విషయంలో OnePlus 12R తో పోల్చితే Vivo V40 బెటర్ గా ఉంది. మీరు గనుక, రూ.40,000 లోపు ధరలో గ్రేట్ పెర్ఫామెన్స్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, ఈ రెండింట్లో OnePlus 12R బెటర్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

The post Vivo V40 vs OnePlus 12R: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-performance-comparison-which-is-better/feed/ 0
Vivo V40 vs OnePlus 12R: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-which-is-best/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-which-is-best/#respond Thu, 08 Aug 2024 18:27:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=12901 వివో వీ30 కి సక్సెసర్‌గా ఇటీవలె భారతీయ మార్కెట్ లో Vivo V40 లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.34,999 గా పెట్టారు. గత మోడల్ తో పోల్చినప్పుడు ఈ ఫోన్ కొన్ని చెప్పుకోదగిన అప్‌గ్రేడ్స్ తో వచ్చింది. అయితే, ఈ ధర శ్రేణిలో OnePlus 12R కూడా మంచి ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, Vivo V40 మరియు OnePlus 12R ఫోన్లను అన్ని విభాగాల్లో పోల్చుతూ, ఏది సరైనదో తెలియజేసే […]

The post Vivo V40 vs OnePlus 12R: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>

వివో వీ30 కి సక్సెసర్‌గా ఇటీవలె భారతీయ మార్కెట్ లో Vivo V40 లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.34,999 గా పెట్టారు. గత మోడల్ తో పోల్చినప్పుడు ఈ ఫోన్ కొన్ని చెప్పుకోదగిన అప్‌గ్రేడ్స్ తో వచ్చింది. అయితే, ఈ ధర శ్రేణిలో OnePlus 12R కూడా మంచి ఆల్టర్నేటివ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ లో మేం, Vivo V40 మరియు OnePlus 12R ఫోన్లను అన్ని విభాగాల్లో పోల్చుతూ, ఏది సరైనదో తెలియజేసే ప్రయత్నం చేస్తాం.

Vivo V40 vs OnePlus 12R: రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్ వివో వీ40 వన్‌ప్లస్ 12ఆర్
డిస్ప్లే 6.78-ఇంచ్ 1.2కే అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్, 1260×2800 రెజుల్యూషన్ 6.78-ఇంచ్ 1.2కే ఎల్టీపీవో అమోలెడ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్నెస్, 1264×2780 రెజుల్యూషన్
చుట్టుకొలత 164.1 x 74.9 x 7.5 మి.మీ 163.3 x 75.3 x 8.8 మి.మీ
బరువు 190 గ్రాములు 207 గ్రాములు
సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ఓఎస్
రియర్ కెమెరా 50ఎంపి ఓఐఎస్ + 50ఎంపి అల్ట్రావైడ్ 50ఎంపి ఓఐఎస్ + 8ఎంపి అల్ట్రావైడ్ + 2ఎంపి మ్యాక్రో
ఫ్రంట్ కెమెరా 50ఎంపి కెమెరా 16ఎంపి కెమెరా
వీడియో 4కే/30ఎఫ్‌పీఎస్ 4కే/60ఎఫ్‌పీఎస్
చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2
బ్యాటరీ, చార్జింగ్ 5,500ఎంఏహెచ్, 80 వాట్ 5,500ఎంఏహెచ్, 100 వాట్
స్టోరేజీ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
కలర్స్ టైటానియమ్ గ్రే, లోటస్ పర్పుల్, గంగేస్ బ్లూ ఐరన్ గ్రే, కూల్ బ్లూ

 

Vivo V40 vs OnePlus 12R: భారత్ లో వీటి ధరలు

వివో వీ40 వన్‌ప్లస్ 12ఆర్
8జిబి+128జిబి ధర రూ.34,999 8జిబి+128జిబి ధర రూ.39,999
8జిబి+256జిబి ధర రూ.36,999 8జిబి+256జిబి ధర రూ.42,999
12జిబి+512జిబి ధర రూ.41,999 16జిబి+256జిబి ధర రూ.45,999

Vivo V40 vs OnePlus 12R: డిజైన్

వివో వీ40 లో గ్లాస్ బాడీ, మ్యాట్ ఫినిష్ ఉన్నాయి. రియర్ ప్యానెల్ పై బ్రాండ్ లోగో బాటమ్ లో ఎడమవైపున ఉంది. టాప్ లెఫ్ట్ లో పిల్-షేప్డ్ కెమెరా ఐల్యాండ్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్, ఆరా ఫ్లాష్‌లైట్ ఉన్నాయి. ఫ్రంట్ కర్వ్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఈ డివైజ్ ఐపీ68 సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఐపీ68 రేటింగ్ ఉండటం వల్లన ఈ ఫోన్‌కి దుమ్ము, నీరు నుంచి రక్షణ లభిస్తుంది.

OnePlus 12R లో ముందు, వెనుక కర్వ్డ్ గ్లాస్ ఉంది. ఇంకా మ్యాట్ మెట్ ఫ్రేమ్ ప్రీమియమ్ లుక్ అందిస్తోంది. రియర్ గ్లాస్, కెమెరా మాడ్యూల్ గ్లాసీ ఫినిష్ తో ఉన్నాయి. ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంది. ముందువైపు, కర్వ్డ్ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ64 రేటింగ్ తో వచ్చింది. డస్ట్ అండ్ వాటర్ స్ప్లాషెస్ నుంచి రక్షణ లభిస్తుంది.

Vivo V40 vs OnePlus 12R: డిస్ప్లే

OnePlus 12R లో Vivo V40 కంటే మెరుగైన ఎల్టీపీవో ప్యానెల్ ఉంది. ఎల్టీపీవో టెక్నాలజీ వల్లన పవర్ తక్కువ ఖర్చవుతుంది. స్క్రీన్ కంటెంట్ కు అనుగుణంగా రిఫ్రెష్ రేట్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ, స్టాండర్డ్ డిస్ప్లేలో ఇలా ఉండదు. OnePlus 12R లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. మరోవైపు, Vivo V40 లో స్కాట్ గ్లాస్ వాడారు.

Vivo V40 vs OnePlus 12R: పెర్ఫామెన్స్

OnePlus 12R లో Vivo V40 కంటే శక్తివంతమైన ప్రాసెసర్ ఉంది. అలాగే ఎక్కువ ర్యామ్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు బెంచ్‌మార్క్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంది. దీని అంటుటు స్కోర్ 8,10,653 గా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1165 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,216 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, OnePlus 12R అంటుటు స్కోర్ 14,73,559 గా ఉంది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1564 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 5097 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo V40 vs OnePlus 12R: కెమెరాలు

OnePlus 12R తో పోల్చితే Vivo V40 లో బెటర్ కెమెరా సెటప్ ఉంది. రెండు ఫోన్లలో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంది. అయితే వివో వీ40 లో 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, వన్‌ప్లస్ 12ఆర్ లో 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అయితే, వన్‌ప్లస్ 12ఆర్ లో 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంది. వివో వీ40 లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండగా, వన్‌ప్లస్ 12ఆర్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Vivo V40 vs OnePlus 12R: బ్యాటరీ, చార్జింగ్

వివో వీ40 మరియు వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్లలో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వన్‌ప్లస్ 12ఆర్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రాగా, వివో వీ40 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. వన్‌ప్లస్ 12ఆర్ 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 30 నిమిషాల సమయం తీసుకుంది. వివో వీ40 కి 45 నిమిషాల సమయం పట్టింది.

బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, వివో వీ40 పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో వన్‌ప్లస్ 12ఆర్ కంటే తక్కువ స్కోర్ చేసింది. మేం టెస్ట్ చేసిన సమయంలో, వివో వీ40 13 గంటలు పని చేయగా, వన్‌ప్లస్ 12ఆర్ 20 గంటల పాటు పని చేసింది.

Vivo V40 vs OnePlus 12R: సాఫ్ట్‌వేర్

రెండు ఫోన్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో వచ్చాయి. వివో వీ40 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో వచ్చింది. వన్‌ప్లస్ 12ఆర్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

వివో వీ40 కి రెండేళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి. మరోవైపు, వన్‌ప్లస్ 12ఆర్ కి 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ఏది బెస్ట్?

రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా మంచి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. కానీ, వన్‌ప్లస్ 12ఆర్ డిస్ప్లే, శక్తివంతమైన చిప్సెట్, బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ చార్జింగ్ వంటి విషయాల్లో మేటిగా ఉంది. మరోవైపు వివో వీ40 లో మంచి రియర్, ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. వన్‌ప్లస్ 12ఆర్ ధర కాస్త ఎక్కువే. మీ బడ్జెట్ టైట్ అయితే, వివో వీ40ని కన్సిడర్ చేయవచ్చు.

The post Vivo V40 vs OnePlus 12R: రెండు ఫోన్లలో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-oneplus-12r-which-is-best/feed/ 0
OnePlus 12R: సన్సెట్ డ్యూన్ కలర్‌‌లో లాంచైన వన్‌ప్లస్ 12ఆర్ https://www.91mobiles.com/telugu/oneplus-12r-sunset-dune-color-variant-launched-india/ https://www.91mobiles.com/telugu/oneplus-12r-sunset-dune-color-variant-launched-india/#respond Fri, 12 Jul 2024 15:45:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=12489 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus తాజాగా భారతీయ మార్కెట్ లో OnePlus 12R యొక్క కొత్త కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం సన్‌సెట్ డ్యూన్ కలర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న కూల్ బ్లూ మరియు ఐరన్ గ్రే కలర్స్ కి తోడు సన్‌సెట్ డ్యూన్ కలర్ వచ్చి చేరింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. OnePlus 12R ధర, సేల్ OnePlus 12R సన్‌సెట్ డ్యూన్ […]

The post OnePlus 12R: సన్సెట్ డ్యూన్ కలర్‌‌లో లాంచైన వన్‌ప్లస్ 12ఆర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus 12R కొత్త కలర్ వేరియంట్ లాంచ్
  • సన్‌సెట్ డ్యూన్ కలర్‌లో వచ్చిన డివైజ్
  • కొత్త కలర్ వేరియంట్ ధర రూ.42,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus తాజాగా భారతీయ మార్కెట్ లో OnePlus 12R యొక్క కొత్త కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం సన్‌సెట్ డ్యూన్ కలర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న కూల్ బ్లూ మరియు ఐరన్ గ్రే కలర్స్ కి తోడు సన్‌సెట్ డ్యూన్ కలర్ వచ్చి చేరింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus 12R ధర, సేల్

OnePlus 12R సన్‌సెట్ డ్యూన్ కలర్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.42,999 గా ఉంది. జులై 20వ తేదీ నుంచి అమెజాన్ మరియు వన్‌ప్లస్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.5,000 ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

OnePlus 12R సన్‌సెట్ డ్యూన్ కలర్ కొనుగోలు చేసే వారికి OnePlus Buds 3 ఇయర్ బడ్స్‌ని వన్‌ప్లస్ ఉచితంగా అందిస్తోంది. కస్టమర్లకు 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.

OnePlus 12R స్పెసిఫికేషన్స్

OnePlus 12R లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2780*1264 పిక్సెల్ రెజుల్యూషన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10+, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ ఉపయోగించారు. ఈ ఫోన్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వన్‌ప్లస్ 12ఆర్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OnePlus 12R స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, డాల్బీ అట్మాస్, ఎన్ఎఫ్‌సీ, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఎన్ఎఫ్‌సీ, ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.

The post OnePlus 12R: సన్సెట్ డ్యూన్ కలర్‌‌లో లాంచైన వన్‌ప్లస్ 12ఆర్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-12r-sunset-dune-color-variant-launched-india/feed/ 0
OnePlus: నేటి నుంచి మొదలైన OnePlus 12R సేల్; ధర, ఆఫర్ల వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-12r-india-sale-today-price-offers-details/ Tue, 06 Feb 2024 15:07:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=10108 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఇటీవలె OnePlus 12R డివైజ్ ని లాంచ్ చేసింది. నేటి నుంచి భారత్ లో OnePlus 12R సేల్ మొదలైంది. అమెజాన్ మరియు కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా OnePlus 12R ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కొనుగోలుపై కంపెనీ OnePlus Buds Z2 ఇయర్‌బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి OnePlus 12R ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్స్ […]

The post OnePlus: నేటి నుంచి మొదలైన OnePlus 12R సేల్; ధర, ఆఫర్ల వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి నుంచి OnePlus 12R సేల్ ప్రారంభం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్‌తో వచ్చిన డివైజ్
  • OnePlus 12R ప్రారంభ ధర రూ.39,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఇటీవలె OnePlus 12R డివైజ్ ని లాంచ్ చేసింది. నేటి నుంచి భారత్ లో OnePlus 12R సేల్ మొదలైంది. అమెజాన్ మరియు కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా OnePlus 12R ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కొనుగోలుపై కంపెనీ OnePlus Buds Z2 ఇయర్‌బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. సరే, ఓసారి OnePlus 12R ధర, ఆఫర్లు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus 12R ధర మరియు ఆఫర్లు

  • OnePlus 12R స్మార్ట్‌ఫోన్ నేడు భారతీయ మార్కెట్ లో విక్రయానికి వచ్చింది. అమెజాన్, వన్‌ప్లస్ స్టోర్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.
  • OnePlus 12R 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది.
  • OnePlus 12R 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.45,999 గా ఉంది.
  • OnePlus 12R తో పాటు రూ.4,999 విలువగల OnePlus Buds Z2 ఇయర్‌బడ్స్ ని ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఫిబ్రవరి 6 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • అలాగే, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ మరియు వన్‌కార్డ్ లావాదేవీలపై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
  • OnePlus 12R ఈఎఐ ఆఫర్ల విషయానికి వస్తే, 6 నెలల కాలపరిమితితో ఈఎంఐ సౌకర్యం ఉంది.
  • OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ని నో కాస్ట్ ఈఎంఐ పై పొందాలనుకుంటే, మీరు నెలకు రూ.2,927 ఇన్‌స్టాల్మెంట్ కడితే సరిపోతుంది.

OnePlus 12R స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12R లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12R డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12R లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OnePlus 12R లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • సాఫ్ట్‌వేర్: OnePlus 12R డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12R లో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐపీ64, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post OnePlus: నేటి నుంచి మొదలైన OnePlus 12R సేల్; ధర, ఆఫర్ల వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన OnePlus 12R https://www.91mobiles.com/telugu/oneplus-12r-launched-in-india-with-100w-fast-charging-support/ Tue, 23 Jan 2024 17:36:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=9885 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus 12 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో OnePlus 12 మరియు OnePlus 12R డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం OnePlus 12R గురించి తెలుసుకుందాం. OnePlus 12R స్మార్ట్‌ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, […]

The post OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన OnePlus 12R first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన OnePlus 12R
  • 4,500 నిట్స్ బ్రైట్నెస్‌తో వచ్చిన డివైజ్
  • OnePlus 12R ప్రారంభ ధర రూ.39,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus 12 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో OnePlus 12 మరియు OnePlus 12R డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం OnePlus 12R గురించి తెలుసుకుందాం. OnePlus 12R స్మార్ట్‌ఫోన్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, డాల్బీ విజన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి OnePlus 12R పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 12R ధర, లభ్యత

  • OnePlus 12R స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. ఓసారి వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
  • OnePlus 12R 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.39,999 గా నిర్ణయించారు.
  • OnePlus 12R 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.45,999 గా ఉంది.
  • భారత్ లో OnePlus 12R సేల్ ఫిబ్రవరి 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.
  • OnePlus 12R కొనుగోలుపై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ కస్టమర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2,250 విలువగల ప్రయోజనాలతో పాటు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి.
  • మొదటి 24 గంటల్లో OnePlus 12R ని ప్రీ-ఆర్డర్ చేసిన వారికి రూ.4,999 విలువగల Buds Z2 ని వన్‌ప్లస్ ఉచితంగా అందిస్తోంది.
  • అలాగే OnePlus Pad కొనుగోలుపై రూ.3,000 డిస్కౌంట్ తో పాటు ఆర్‌సీసీ మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది.
  • OnePlus 12R కస్టమర్లకు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ 6 నెలలు, యూట్యూబ్ ప్రీమియమ్ 3 నెలల కాలపరిమితితో లభించనుంది.
  • OnePlus 12R స్మార్ట్‌ఫోన్ కూల్ బ్లూ మరియు ఐరన్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus 12R స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12R లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్టీపీవో 4.0 ప్యానెల్, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12R డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: OnePlus 12R లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: OnePlus 12R లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • సాఫ్ట్‌వేర్: OnePlus 12R డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12R లో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐపీ64, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన OnePlus 12R first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 చిప్, 100W చార్జింగ్‌తో చైనాలో లాంచైన OnePlus Ace 3 https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-launched-china-with-snapdragon-8-gen-2-chip-100w-charging-support/ Thu, 04 Jan 2024 13:30:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=9563 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు చైనీస్ మార్కెట్ లో OnePlus Ace 3 డివైజ్ ని లాంచ్ చేసింది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus Ace 3 ఫోన్ లో 1.5కే 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్ […]

The post Snapdragon 8 Gen 2 చిప్, 100W చార్జింగ్‌తో చైనాలో లాంచైన OnePlus Ace 3 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన OnePlus Ace 3
  • 1.5కే ఎల్టీపీవో డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • OnePlus Ace 3 ప్రారంభ ధర 2,599 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు చైనీస్ మార్కెట్ లో OnePlus Ace 3 డివైజ్ ని లాంచ్ చేసింది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OnePlus Ace 3 ఫోన్ లో 1.5కే 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. OnePlus ACE 3 జనవరి 23న OnePlus 12R పేరుతో భారత్‌లో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి OnePlus Ace 3 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3 ధర (చైనా)

  • OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ.30,271) గా ఉంది.
  • OnePlus Ace 3 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 2,999 యువాన్లు (సుమారు రూ.34,930) గా ఉంది.
  • OnePlus Ace 3 16జిబి+1టిబి టాప్ వేరియంట్ ధరను 3,499 యువాన్లు (సుమారు రూ.40,753) గా నిర్ణయించారు.
  • OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Ace 3 లో 6.78-ఇంచ్ 1.5కే 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. అడ్రెనో గ్రాఫిక్స్ వినియోగించారు.
  • మెమొరీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి.
  • కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Ace 3 లో 5జీ, వై-ఫై 7, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

The post Snapdragon 8 Gen 2 చిప్, 100W చార్జింగ్‌తో చైనాలో లాంచైన OnePlus Ace 3 first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus 12: అమెజాన్‌లో దర్శనమిస్తోన్న వన్‌ప్లస్ 12 మైక్రోసైట్, జనవరి 23న భారత్‌లో లాంచ్! https://www.91mobiles.com/telugu/oneplus-12-microsite-goes-live-on-amazon-ahead-of-india-launch-january-23rd-2024/ Wed, 03 Jan 2024 13:11:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=9541 OnePlus సంస్థ త్వరలోనే OnePlus 12 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 23న భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్ లో వన్‌ప్లస్ సంస్థ OnePlus 12 తో పాటు OnePlus 12R ని లాంచ్ చేయనుంది. అయితే లాంచ్ కి ముందు OnePlus 12 స్మార్ట్‌ఫోన్ యొక్క మైక్రోసైట్ అమెజాన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. టీజర్ ద్వారా OnePlus 12 డిజైన్, చార్జింగ్ […]

The post OnePlus 12: అమెజాన్‌లో దర్శనమిస్తోన్న వన్‌ప్లస్ 12 మైక్రోసైట్, జనవరి 23న భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 23న లాంచ్ కానున్న OnePlus 12
  • OnePlus 12 ని లిస్ట్ చేసిన అమెజాన్ స్పెషల్స్
  • హాజెల్‌బ్లడ్ కెమెరాలతో వస్తోన్న OnePlus 12

OnePlus సంస్థ త్వరలోనే OnePlus 12 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 23న భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్ లో వన్‌ప్లస్ సంస్థ OnePlus 12 తో పాటు OnePlus 12R ని లాంచ్ చేయనుంది. అయితే లాంచ్ కి ముందు OnePlus 12 స్మార్ట్‌ఫోన్ యొక్క మైక్రోసైట్ అమెజాన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. టీజర్ ద్వారా OnePlus 12 డిజైన్, చార్జింగ్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేశారు. చైనాలో ఇప్పటికే లాంచైన OnePlus 12 మాదిరే ఇండియా మోడల్ కూడా ఉంటుంది.

Amazon వెబ్‌సైట్ పై OnePlus 12 మైక్రోసైట్

జనవరి 23న భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోయే OnePlus 12 డివైజ్ తాజాగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో లిస్ట్ అయ్యింది. OnePlus 12 మైక్రోసైట్ ప్రస్తుతం అమెజాన్ ప్లాట్ఫామ్ పై దర్శనమిస్తోంది. అమెజాన్ ఎక్స్‌క్లూజివ్ ఈ డివైజ్ టీజర్ ని షేర్ చేసింది. టీజర్ ద్వారా పలు స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి.

OnePlus 12 ఇండియా అంచనా ధర

  • OnePlus 12 12జిబి+256జిబి వేరియంట్ ధర చైనాలో CNY 4,299 (సుమారు రూ.50,600) గా ఉంది. భారత్ లో ఈ వేరియంట్ ధర రూ.60,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • OnePlus 12R స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. దీని ధర భారత్ లో రూ.50,000 లోపు ఉండే అవకాశం ఉంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post OnePlus 12: అమెజాన్‌లో దర్శనమిస్తోన్న వన్‌ప్లస్ 12 మైక్రోసైట్, జనవరి 23న భారత్‌లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus 12R భారత్ మరియు గ్లోబల్ లాంచ్ తేదీ, కలర్ ఆప్షన్స్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-12r-india-and-global-launch-date-color-options-confirmed-know-the-full-details/ Wed, 27 Dec 2023 17:20:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=9467 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus డిసెంబర్ ఆరంభంలో OnePlus 12 డివైజ్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు OnePlus 12R యొక్క లాంచ్ తేదీ కూడా ఖరారైంది. OnePlus 12 తో పాటే ఈ ఫోన్ భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. నేడు OnePlus కంపెనీ కొత్త టీజర్ ద్వారా OnePlus 12R డివైజ్ యొక్క […]

The post OnePlus 12R భారత్ మరియు గ్లోబల్ లాంచ్ తేదీ, కలర్ ఆప్షన్స్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus 12R గ్లోబల్, ఇండియా లాంచ్ తేదీ ఖరారు
  • జనవరి 23న లాంచ్ అవుతోన్న OnePlus 12R
  • భారత మార్కెట్‌కి ‘మింగ్‌షా గోల్డ్’ కలర్ ఆప్షన్‌

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus డిసెంబర్ ఆరంభంలో OnePlus 12 డివైజ్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్ లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు OnePlus 12R యొక్క లాంచ్ తేదీ కూడా ఖరారైంది. OnePlus 12 తో పాటే ఈ ఫోన్ భారత్ మరియు గ్లోబల్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. నేడు OnePlus కంపెనీ కొత్త టీజర్ ద్వారా OnePlus 12R డివైజ్ యొక్క కలర్ ఆప్షన్ మరియు లాంచ్ తేదీని వెల్లడించింది. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 12R లాంచ్ మరియు కలర్ ఆప్షన్స్ ఖరారు

  • OnePlus 12R స్మార్ట్‌ఫోన్ యొక్క కలర్ ఆప్షన్ మరియు లాంచ్ తేదీని X ప్లాట్ఫామ్ మరియు అధికార వెబ్‌సైట్ ద్వారా కంపెనీ ఖరారు చేసింది.
  • OnePlus 12R డివైజ్ గ్లోబల్ గా బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
  • OnePlus 12R డివైజ్ భారతీయ మార్కెట్ లో మింగ్‌షా గోల్డ్ కలర్ ఆప్షన్ లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.
  • OnePlus 12 మరియు OnePlus 12R స్మార్ట్‌ఫోన్లు భారతీయ మార్కెట్ లో జనవరి 23 వ తేదీన రాత్రి 7.30 గంటలకు లాంచ్ అవుతాయి.

OnePlus 12R స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus 12R లో 6.78-ఇంచ్ ఎక్స్‌డీఆర్ ఎల్టీపీవో 7.0 అమోలెడ్ డిస్ప్లే, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12R లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OnePlus 12R లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus 12R లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OnePlus 12R డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus 12R లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, అలర్ట్ స్లైడర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post OnePlus 12R భారత్ మరియు గ్లోబల్ లాంచ్ తేదీ, కలర్ ఆప్షన్స్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
జనవరి 4న చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/oneplus-ace-3-china-launch-date-january-4th-confirmed-by-company/ Wed, 27 Dec 2023 11:49:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=9457 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో Ace 3 ఫోన్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ OnePlus Ace 3 లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జనవరి 4న OnePlus Ace 3 చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ తో పాటు, గ్లోబల్ గా OnePlus Ace 3 డివైజ్ OnePlus 12R పేరుతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇదివరకు వచ్చిన OnePlus Ace 2 కూడా OnePlus 11R పేరుతో ఇతర […]

The post జనవరి 4న చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Ace 3 లాంచ్ తేదీ ప్రకటన
  • గ్లోబల్‌గా OnePlus 12R పేరుతో రానున్న Ace 3
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Ace 3

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో Ace 3 ఫోన్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ సంస్థ OnePlus Ace 3 లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జనవరి 4న OnePlus Ace 3 చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ తో పాటు, గ్లోబల్ గా OnePlus Ace 3 డివైజ్ OnePlus 12R పేరుతో లాంచ్ అవుతుందని సమాచారం. ఇదివరకు వచ్చిన OnePlus Ace 2 కూడా OnePlus 11R పేరుతో ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి OnePlus Ace 3 లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Ace 3 చైనా లాంచ్ తేదీ

  • OnePlus Ace 3 స్మార్ట్‌ఫోన్ చైనాలో జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతోంది. టీజర్ ద్వారా కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.
  • గ్రే, గోల్డ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.
  • “OnePlus Ace 3, Ace 2 కి అప్‌గ్రేడ్ గా వస్తోంది. ఇది ఫ్లాగ్షిప్ అనుభూతిని మరోస్థాయికి తీసుకెళ్తుంది.” అని OnePlus చైనా హెడ్ లూయీస్ జీ చెప్పారు.

OnePlus Ace 3 డిజైన్

  • OnePlus Ace 3 ని వన్‌ప్లస్ సంస్థ చాలా రోజుల నుంచి సోషల్ మీడియా వేదికలపై టీజ్ చేస్తూ వస్తోంది. దీంతో డివైజ్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది.
  • OnePlus Ace 3 డివైజ్ శాండ్ గోల్డ్, బ్లాక్ మరియు బ్లూ కలర్ వేరియంట్స్ లో కనిపించింది.
  • OnePlus Ace 3 లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని టీజర్స్ ద్వారా తెలుస్తోంది.
  • OnePlus Ace 3 లో కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉంటాయి. ఎడమవైపున అలర్ట్ స్లైడర్ ఉంటుంది.
  • OnePlus Ace 3 డివైజ్ కి టాప్ లో మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్, స్పీకర్ గ్రిల్ ఉంటాయి.

OnePlus Ace 3 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: లీక్స్ ప్రకారం, OnePlus Ace 3 డివైజ్ 6.78-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ తో రానుందని తెలుస్తోంది.
  • ప్రాసెసర్: OnePlus Ace 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ చిప్ క్లాక్ స్పీడ్ 3.19గిగాహెర్ట్జ్.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3 డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది.
  • కెమెరా: OnePlus Ace 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OnePlus Ace 3 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Ace 3 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post జనవరి 4న చైనాలో లాంచ్ కానున్న OnePlus Ace 3; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12, OnePlus 12R ఇండియా ధరలు https://www.91mobiles.com/telugu/oneplus-12-oneplus-12r-india-market-prices-leaked-before-launch/ Wed, 27 Dec 2023 06:13:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=9450 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్స్ లో OnePlus 12 ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. జనవరి 23న భారత్ తో పాటు గ్లోబల్ గా OnePlus 12 ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ తో పాటు OnePlus 12R కూడా లాంచ్ కానుందని సమాచారం. తాజాగా ఈ రెండు ఫోన్ల యొక్క ధర లీక్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో […]

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12, OnePlus 12R ఇండియా ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 23న లాంచ్ కానున్న OnePlus 12, 12R
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న OnePlus 12
  • OnePlus 12 ప్రారంభ ధర రూ.58,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్స్ లో OnePlus 12 ఫ్లాగ్షిప్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. జనవరి 23న భారత్ తో పాటు గ్లోబల్ గా OnePlus 12 ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ తో పాటు OnePlus 12R కూడా లాంచ్ కానుందని సమాచారం. తాజాగా ఈ రెండు ఫోన్ల యొక్క ధర లీక్ అయ్యింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

OnePlus 12, OnePlus 12R ధరలు (లీక్)

  • టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ OnePlus 12 ధర రూ.58,000 నుంచి రూ.60,000 మధ్య ఉంటుందని చెబుతున్నారు.
  • OnePlus 12 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.
  • OnePlus 12 స్మార్ట్‌ఫోన్ భారత్ లో 16జిబి వరకు ర్యామ్ + 512జిబి వరకు స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • OnePlus 12 డివైజ్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని టిప్‌స్టర్ తెలిపారు.
  • మరోవైపు, OnePlus 12R ధర రూ.40,000 నుంచి రూ.42,000 మధ్య ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • OnePlus 12R లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
  • OnePlus 12R డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • OnePlus 12R ఫోన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది.
  • OnePlus 12 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి బేస్ మోడల్ ధర చైనాలో CNY 4,299 (సుమారు రూ.50,600) గా ఉంది.
  • OnePlus 12 డివైజ్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,799 (సుమారు రూ.56,500) గా ఉంది.
  • OnePlus 12 16జిబి +1టిబి టాప్ వేరియంట్ ధర CNY 5,299 (సుమారు రూ.62,400) గా ఉంది.
  • OnePlus 12 24జిబి + 1టిబి వేరియంట్ ధర CNY 5,799 (సుమారు రూ.68,200) గా ఉంది.

OnePlus 12 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus 12 లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2,160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus 12 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus 12, OnePlus 12R ఇండియా ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>