OnePlus Nord 4 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 23 Oct 2024 15:27:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-discount-offer-know-full-details/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-discount-offer-know-full-details/#respond Wed, 23 Oct 2024 15:18:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=14064 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కి భారత్‌లో మంచి పేరుంది. ఈ బ్రాండ్ ఫోన్లకు కొనేందుకు మొబైల్ లవర్స్ ఆసక్తి చూపుతారు. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఒక శుభవార్త వచ్చింది. కొన్ని రోజుల క్రితం లాంచైన OnePlus Nord 4 డిస్కౌంట్ పై లభిస్తోంది. రూ.5,000 వరకు కస్టమర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం. OnePlus Nord 4 ఆఫర్ వివరాలు OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 ఇన్‌స్టంట్ […]

The post OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OnePlus Nord 4 బ్యాంక్ డిస్కౌంట్
  • రూ.3,000 వరకు తాత్కాలిక తగ్గింపు
  • మొత్తం ప్రయోజనం రూ.5,000

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus కి భారత్‌లో మంచి పేరుంది. ఈ బ్రాండ్ ఫోన్లకు కొనేందుకు మొబైల్ లవర్స్ ఆసక్తి చూపుతారు. వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఒక శుభవార్త వచ్చింది. కొన్ని రోజుల క్రితం లాంచైన OnePlus Nord 4 డిస్కౌంట్ పై లభిస్తోంది. రూ.5,000 వరకు కస్టమర్లకు ప్రయోజనం లభించనుంది. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

OnePlus Nord 4 ఆఫర్ వివరాలు

  • OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, కొన్ని ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డులపై, 9 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.
  • ఇవే కాకుండా, రూ.3,000 వరకు తాత్కాలిక ధర తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. దీంతో ధర రూ.5,000 వరకు తగ్గుతుంది.
  • ప్రస్తుతం ఈ ఆఫర్లు వన్‌ప్లస్.ఇన్, అమెజాన్.ఇన్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ మరియు రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, క్రోమా, విజయ్ సేల్స్, పూర్వికా, సంగీతా మొబైల్స్, పై ఎలక్ట్రానిక్స్, బిగ్ సీ మొబైల్స్, లాట్ మొబైల్స్ తదితర స్టోర్స్ లలో అందుబాటులో ఉన్నాయి.

OnePlus Nord 4 ధర వివరాలు

  • OnePlus Nord 4 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా ఉంది.
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.
  • మెర్క్యూరియల్ సిల్వర్, ఒబ్సీడియన్ మిడ్నైట్ మరియు ఒయాసిస్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OnePlus Nord 4 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OnePlus Nord 4 5G లో 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, 6.74-ఇంచ్ డిస్ప్లే, అల్ట్రా హెచ్డీఆర్, 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించారు.

ప్రాసెసర్: ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord 4 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్‌తో లాంచ్ అయ్యింది.

మెమొరీ: OnePlus Nord 4 5G డివైజ్ 8జిబి/12జిబి యూఎఫ్ఎస్ 4.0 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1/256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

బ్యాటరీ: OnePlus Nord 4 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OnePlus Nord 4 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇంచ్చారు. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్+ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని అల్ట్రావైడ్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ: OnePlus Nord 4 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, అలర్ట్ స్లైడర్, యూఎస్బీ టైప్-సీ 2.0, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Nord 4 5G తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, నాయిస్ క్యాన్సలేషన్, ఇన్‌డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post OnePlus Nord 4 పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-discount-offer-know-full-details/feed/ 0
OnePlus Nord 4 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-vs-motorola-edge-50-pro-camera-comparison-which-is-better/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-vs-motorola-edge-50-pro-camera-comparison-which-is-better/#respond Sun, 11 Aug 2024 18:28:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=12934 స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను సదరు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు […]

The post OnePlus Nord 4 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే కస్టమర్ల చూపు ప్రధానంగా ఉండే విభాగాల్లో కెమెరా డిపార్ట్మెంట్ ఒకటి. కొందరు గేమింగ్ కోసం ఫోన్ కొంటే, మరికొందరు కేవలం ఫోటోగ్రఫీ కోసమే స్మార్ట్‌ఫోన్ కొంటారు. మరి, మంచి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలంటే, అద్భుతమైన కెమెరా అవసరమే కదా. స్మార్ట్‌ఫోన్లలో రకరకాల కెమెరాలను సదరు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐ, ఓఐఎస్, పొట్రెయిట్, వైడ్-యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్, మ్యాక్రో, టెలీఫోటో, పెరిస్కోపిక్ టెలీఫోటో.. ఇలా వివిధ రకాల సెన్సర్స్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. యూజర్లు వారి అవసరానికి అనుగుణంగా ఫోన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మనం ఈ ఆర్టికల్ లో OnePlus Nord 4 మరియు Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్లలో ఎందులో ఉత్తమమైన కెమెరా ఉందో తెలుసుకుందాం.

OnePlus Nord 4 మరియు Motorola Edge 50 Pro కెమెరా స్పెసిఫికేషన్స్

సబ్జెక్ట్ పై డిఫాల్ట్ ఆటో‌ఫోకస్ తో రెండు ఫోన్ల యొక్క పాయింట్-అండ్-షూట్ సామర్థ్యాన్ని మేం టెస్ట్ చేశాం. OnePlus Nord 4 లో టెలీఫోటో లెన్స్ లేదు. అందుకోసమే మేం, జూమ్ కేపబులిటీస్‌ను పోల్చి చూడలేదు. సరే, ఓసారి Nord 4 మరియు Edge 50 Pro ఫోన్ల యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord 4

ప్రైమరీ సెన్సర్: 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ సెన్సర్, ఈఐఎస్ + ఓఐఎస్

సెకండరీ సెన్సర్: 8ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 112-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ

టెలీఫోటో సెన్సర్: ఇందులో లేదు

ఫ్రంట్ కెమెరా: 16ఎంపి సెన్సర్, ఎఫ్/2.4 అపర్చర్

Motorola Edge 50 Pro

ప్రైమరీ సెన్సర్: 50ఎంపి సెన్సర్, ఎఫ్/1.4 అపర్చర్, ఓఐఎస్

సెకండరీ సెన్సర్: 13ఎంపి అల్ట్రావైడ్ సెన్సర్, 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ

టెలీఫోటో సెన్సర్: 10ఎంపి 2ఎక్స్ సెన్సర్, ఓఐఎస్

ఫ్రంట్ కెమెరా: 50ఎంపి శాంసంగ్ సెన్సర్, ఎఫ్/1.9 అపర్చర్

OnePlus Nord 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇందులో క్వాల్కమ్ స్పెక్ట్రా 18-బిట్ ట్రిపుల్ కాగ్నిటివ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ఐఎస్‌పీ) ఉంది. Motorola Edge 50 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇందులో క్వాల్కమ్ స్పెక్ట్రా 12-బిట్ ట్రిపుల్ ఐఎస్‌పీ ఉంది. టెక్నికల్‌గా వన్‌ప్లస్ నార్డ్ 4 లో హయ్యర్ బిట్ రేట్ సపోర్ట్ ఉంది. దీన్ని బట్టి ఈ ఫోన్ బాగా పెర్ఫామ్ చేయాలి. మరింకెందుకు ఆలస్యం, రియల్ లైఫ్ యూసేజ్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకు పూర్తిస్థాయి కెమెరా కంపారిజన్ లోకి వెళదాం పదండి.

డేలైట్

ఈ రెండు ఫోన్లు కూడా 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చాయి. వన్‌ప్లస్ నార్డ్ 4 లోని అపర్చర్ ఫౌంటెయిన్ వెనకాల నేచురల్ డెప్త్ క్రియేట్ చేసింది. ఈ చిన్నదైన అపర్చర్ తక్కువ లైట్‌ను క్యాప్చర్ చేసింది. దీంతో మోటో‌ ఇమేజ్‌తో పోల్చితే, గ్రెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి.

Motorola Edge 50 Pro లో సోషల్ మీడియాలో షేర్ చేయదగిన క్వాలిటీ, వైబ్రన్సీతో కూడిన అవుట్‌పుట్ వస్తోంది. మరోవైపు, OnePlus Nord 4 కూల్ కలర్స్ తో డల్ ఇమేజెస్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. రెండు ఫోన్లలో తీసిన ఫోటోలు కలర్ విషయంలో తేడాగా ఉన్నాయి. కానీ, నార్డ్ 4 రిజల్ట్స్ రియాల్టీకి దగ్గరగా ఉన్నాయి. హెచ్డీఆర్ ప్రాసెసింగ్, డీటెయిల్స్ విషయాల్లో Motorola Edge 50 Pro బాగా పెర్ఫామ్ చేసింది. Nord 4 విషయానికి వస్తే, హైలైట్స్ ను సరిగ్గా మేనేజ్ చేసింది. డీటెయిల్స్ అనేవి ఎక్కు షార్ప్‌నెస్ తో చూపబడ్డాయి.

విజేత: Motorola Edge 50 Pro

అల్ట్రావైడ్

OnePlus Nord 4 లో 8ఎంపి సోని అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చారు. ఇది 112-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉంది. అంటే, ఇది ఇమేజ్ మధ్యలో ఎక్కువ డీటెయిల్స్‌ చూపిస్తుంది. ప్రైమరీ లెన్స్ మరియు అల్ట్రావైడ్ లెన్స్‌ల మధ్య కలర్ కన్సిస్టెన్సీ బాగుంది.

Motorola Edge 50 Pro లో 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఇచ్చారు. ఇది ఇమేజ్ లో అన్నిచోట్టా ఎక్కువ డీటెయిల్స్‌ను చూపిస్తుంది. ఈ సెన్సర్ తో తీసిన ఇమేజెస్ ఓవర్‌శాచురేటెడ్ గా ఉండి, నాయిస్ ను కలిగి ఉన్నాయి. ఇంకా ఈ ఇమేజెస్ లో విచిత్రంగా బ్లూ టింట్ కూడా కనిపిస్తోంది.

విజేత: సమానం

పొట్రెయిట్

Motorola Edge 50 Pro పొట్రెయిట్స్ విషయంలో కూడా మరోసారి ఓవర్‌శాచురేషన్ సమస్య వల్లన ఇబ్బంది పడింది. ఎక్కువ కాంట్రాస్ట్ అనేది ఇమేజెస్ లో మనం గమనించవచ్చు. అయితే బొకే ఎఫెక్ట్ నేచురల్ గా ప్రొడ్యూస్ చేసింది. సబ్జెక్ట్ లోని డీటెయిల్స్ చూపించడంలో మరియు ఎడ్జ్-కటౌట్ విషయంలో సెన్సర్ బాగా పని చేసింది.

పొట్రెయిట్స్ విషయంలో OnePlus Nord 4 బ్యాలన్స్డ్ గా ఉంది. శాచురేషన్ మరియు హెచ్డీఆర్ విషయాల్లో పెర్ఫామెన్స్ బాగుంది. కానీ, కాంట్రాస్ట్ మరియు డీపర్ బ్లాక్స్ లోపించాయి. అయితే వీటిని కొన్ని ఎడిట్స్ తో సెట్ చేసుకోవచ్చు. అయితే వన్‌ప్లస్ తన ఇమేజెస్ కు స్కిన్ స్మూథెనింగ్ ని అప్లై చేసినట్లు అనిపిస్తోంది.

విజేత: OnePlus Nord 4

సెల్ఫీ

వన్‌ప్లస్ నార్డ్ 4 లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. వైబ్రంట్ కలర్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేయదగిన ఇమేజెస్‌ను ఇది అందిస్తోంది. అయితే కొంచెం వార్మ్ కలర్ గుర్తించడం జరిగింది. స్కిన్ కలర్ మరియు కలర్ కన్సిస్టెన్సీ కాస్త మెరుగవ్వాలి.

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది పెద్ద సెన్సర్ కాబట్టి, నార్డ్ 4 లో ఇచ్చిన 16ఎంపి కంటే బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది. డీటెయిలింగ్ మరియు కాంట్రాస్ట్, స్కిన్ టోన్ విషయాల్లో ఎడ్జ్ 50 ప్రో ద్వారా తీసిన సెల్ఫీలు బెటర్ గా ఉన్నాయి.

విజేత: Motorola Edge 50 Pro

లో లైట్

నైట్ మోడ్ లేకుండా లో-లైట్ కండీషన్స్ లో, వన్‌ప్లస్ నార్డ్ 4 బెటర్ గా పెర్ఫామ్ చేసింది. హెచ్డీఆర్, ఎక్స్‌పోజర్, కలర్ ఆక్యురెసీ వంటి విషయాల్లో మెరుగ్గా ఉంది. లైట్ సోర్సెస్ ను కూడా బాగా వాడుకుంది.

మరోవైపు, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీటెయిల్డ్ ఇమేజెస్ ను అందించింది. అలాగే ఇమేజెస్ లోని టెక్స్ట్ పార్ట్స్ షార్ప్ గా ఉన్నాయి. అయితే కాంట్రాస్ట్ ఎక్కువ కావడం, ప్రాసెసింగ్ నాసీరకంగా ఉండటంతో నాణ్యమైన ఇమేజ్ రాలేదు. నార్డ్ 4 తో పోల్చితే, ఈ విషయంలో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ప్రభావం చూపలేకపోయింది.

విజేత: OnePlus Nord 4

నైట్ మోడ్

నైట్ మోడ్ లో వన్‌ప్లస్ నార్డ్ 4 తో తీసిన ఇమేజ్ చూడటానికి సాధారణ ఫోటో మాదిరే ఉంది. కానీ, కాస్త బ్రైట్నెస్ పెరిగింది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డివైజ్ లో నైట్ మోడ్ ఇమేజ్ ని గమనిస్తే, కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంది. రెడ్ నియాన్ సైన్స్, బ్యాక్‌లిట్ మెను బోర్డ్స్ వంటివి బాగానే కనిపిస్తున్నాయి. ఎక్స్‌పోజర్ బాగానే బ్యాలన్స్ అయ్యింది. లైట్ సోర్సెస్ చుట్టూ ఉన్న బ్లూమ్ నార్డ్ 4 కంటే బెటర్ గా ఉంది. అలాగే బిల్డింగ్ ప్యానెల్ పైన గ్రేడియంట్ కూడా సమతూకంతో ఉంది.

విజేత: Motorola Edge 50 Pro

సెల్ఫీ లో-లైట్ (ఫ్లాష్ తో)

రెండు ఫోన్లు కూడా సబ్జెక్ట్‌ పైన లైట్‌ని బాగానే ప్రసరింపజేస్తున్నాయి. చాలా తక్కువ కాంతి ఉన్న సమయాల్లో స్క్రీన్ ఫ్లాష్ తో తీసే ఫోటోలను రెండు ఫోన్లు కూడా బాగానే హ్యాండిల్ చేశాయి. కలర్ విషయానికి వస్తే, టీ-షర్ట్ కలర్ మోటో ఎడ్జ్ 50 ప్రో లో రియాల్టీకి దగ్గరగా ఉంది. టీ-షర్ట్ మరియు షెల్ఫ్ పైన బాక్స్‌ లోని రెడ్ కలర్ ని నార్డ్ 4 బూస్ట్ చేసింది.

వన్‌ప్లస్ నార్డ్ 4 తో తీసిన ఇమేజ్‌ను గమనిస్తే, స్కిన్ టోన్ బ్రైట్ గా ఉంది. మోటో ఎడ్జ్ 50 ప్రో తో తీసిన ఫోటోలు వైడ్ గా ఉండి, సాఫ్ట్ గా ఉన్నాయి. అలాగే కాస్త నాయిస్ కూడా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ ను మోటో ఎడ్జ్ 50 ప్రో బాగా హ్యాండిల్ చేసింది.

రెండింట్లో దేన్ని ఎంచుకోవాలనేది, మీరు ప్రిఫర్ చేసే ఇమేజ్ ను బట్టి ఉంటుంది. బ్రైట్ గా, డీటెయిల్డ్ గా ఉండాలంటే, నార్డ్ 4 బెటర్. సెల్ఫీలో ఎక్కువ మెంబర్స్ తో పాటు, కలర్ యాక్యురెసీ, లైట్ కంట్రోల్ వంటివి మీకు ముఖ్యమైతే, మోటో ఎడ్జ్ 50 ఫ్రో బెటర్.

విజేత: సమానం

ఏది బెటర్?

రెండు ఫోన్లు కూడా ఫోటోగ్రఫీ విషయంలో సమానమైన పనితీరును కనబరిచాయి. అయితే, కొంచెం తేడాతో Motorola Edge 50 Pro విజయం సాధించింది. డే-లైట్ షాట్స్, సెల్ఫీ, నైట్ మోడ్ వంటి విషయాల్లో మోటో ఎడ్జ్ 50 ప్రో బాగా పెర్ఫామ్ చేసింది. దీన్ని బట్టి, ఈ సెగ్మెంట్ లో ఎడ్జ్ 50 ప్రో బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పలేం. ఎందుకంటే, ఓవర్-శాచ్యురేషన్ సమస్య, లో-లైట్ పెర్ఫామెన్స్ వంటి వాటిని మోటోరోలా మెరుగుపరచాల్సి ఉంది. ఇక కాంట్రాస్ట్, డీపర్ బ్లాక్స్ ఏరియాల్లో వన్‌ప్లస్ నార్డ్ 4 ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది.

The post OnePlus Nord 4 vs Motorola Edge 50 Pro: ఏ ఫోన్ కెమెరా బెటర్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-vs-motorola-edge-50-pro-camera-comparison-which-is-better/feed/ 0
OnePlus Nord 4: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన నార్డ్ 4 https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-5g-launched-india-100w-fast-charging/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-5g-launched-india-100w-fast-charging/#respond Tue, 16 Jul 2024 16:37:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=12537 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్ లో ఇదే అత్యంత శక్తివంతమైన ఫోన్. వన్‌ప్లస్ నార్డ్ 4 లో 12జిబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఎల్‌వైటీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు […]

The post OnePlus Nord 4: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన నార్డ్ 4 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో OnePlus Nord 4 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • 50ఎంపి సోని ఎల్‌వైటీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు భారతీయ మార్కెట్ లో OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్ లో ఇదే అత్యంత శక్తివంతమైన ఫోన్. వన్‌ప్లస్ నార్డ్ 4 లో 12జిబి ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఎల్‌వైటీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OnePlus Nord 4 ధర

OnePlus Nord 4 5G మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.29,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.32,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.

OnePlus Nord 4 5G స్మార్ట్‌ఫోన్‌ని కొనేవారికి బ్యాంక్ కార్డ్స్ పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్స్ మొదలవుతాయి.

OnePlus Nord 4 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: OnePlus Nord 4 5G లో 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, 6.74-ఇంచ్ డిస్ప్లే, అల్ట్రా హెచ్డీఆర్, 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OnePlus Nord 4 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: OnePlus Nord 4 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: OnePlus Nord 4 5G డివైజ్ 8జిబి/12జిబి యూఎఫ్ఎస్ 4.0 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1/256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు.

బ్యాటరీ: OnePlus Nord 4 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. కేవలం 28 నిమిషాల్లో 1 శాతం నుంచి 100 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

కెమెరా: OnePlus Nord 4 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్+ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని అల్ట్రావైడ్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ: OnePlus Nord 4 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, అలర్ట్ స్లైడర్, యూఎస్బీ టైప్-సీ 2.0, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OnePlus Nord 4 5G తో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, నాయిస్ క్యాన్సలేషన్, ఇన్‌డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post OnePlus Nord 4: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన నార్డ్ 4 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-5g-launched-india-100w-fast-charging/feed/ 0
OnePlus Nord 4: వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌ ద్వారా విడుదలవుతోన్న నార్డ్ 4 https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-to-launch-in-oneplus-summer-launch-event/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-to-launch-in-oneplus-summer-launch-event/#respond Thu, 04 Jul 2024 05:40:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=12365 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus సమ్మర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. జులై 16న ఈవెంట్ జరగనుంది. ఈవెంట్ లో అందరూ చాలా రోజులుగా ఎదురు చూస్తోన్న OnePlus Nord 4 డివైజ్ ను వన్‌ప్లస్ లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 యొక్క లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ మరియు ఈవెంట్ విశేషాలను తెలుసుకుందాం. OnePlus సమ్మర్ లాంచ్ ఈవెంట్ OnePlus తన సమ్మర్ లాంచ్ ఈవెంట్‌ను జులై 16వ తేదీన నిర్వహించనుంది. ఈ గ్లోబల్ ఈవెంట్ […]

The post OnePlus Nord 4: వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌ ద్వారా విడుదలవుతోన్న నార్డ్ 4 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 16న OnePlus Nord 4 లాంచ్
  • మెటల్ ఫ్రేమ్ తో వస్తోన్న డివైజ్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.31,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus సమ్మర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. జులై 16న ఈవెంట్ జరగనుంది. ఈవెంట్ లో అందరూ చాలా రోజులుగా ఎదురు చూస్తోన్న OnePlus Nord 4 డివైజ్ ను వన్‌ప్లస్ లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 యొక్క లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ మరియు ఈవెంట్ విశేషాలను తెలుసుకుందాం.

OnePlus సమ్మర్ లాంచ్ ఈవెంట్

OnePlus తన సమ్మర్ లాంచ్ ఈవెంట్‌ను జులై 16వ తేదీన నిర్వహించనుంది. ఈ గ్లోబల్ ఈవెంట్ ఇటలీ లోని మిలన్ నగరంలో జరుగుతుంది. ఇదే ఈవెంట్ నుంచి వన్‌ప్లస్ సంస్థ OnePlus Nord 4 డివైజ్‌ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. జులై 16న సాయంత్రం 6.30 గంటల నుంచి ఈవెంట్ ను వన్‌ప్లస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు.

OnePlus Nord 4 ధర

OnePlus Nord 4 డివైజ్ ప్రారంభ ధర రూ.31,999 ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. టాప్ మోడల్ ధర రూ.35,999 వరకు ఉండవచ్చని సమాచారం. ధరపై త్వరలోనే స్పష్టత రానుంది.

OnePlus Nord 4 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OnePlus Nord 4 లో 6.74-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2150 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.8 గిగాహెర్ట్జ్.

మెమొరీ: OnePlus Nord 4 డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: OnePlus Nord 4 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి శాంసంగ్ S5K3P9 సెన్సర్ ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord 4 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

కనెక్టివిటీ: OnePlus Nord 4 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post OnePlus Nord 4: వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌ ద్వారా విడుదలవుతోన్న నార్డ్ 4 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-to-launch-in-oneplus-summer-launch-event/feed/ 0
OnePlus Nord 4: లీకైన వన్‌ప్లస్ నార్డ్ 4 లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/oppo-nord-4-launch-timeline-leaked/ Fri, 31 May 2024 09:10:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=11829 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ ఓ ఒక ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ డివైజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు […]

The post OnePlus Nord 4: లీకైన వన్‌ప్లస్ నార్డ్ 4 లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord 4 లాంచ్
  • జులై మూడో వారంలో లాంచ్?
  • 1.5కే 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ ఓ ఒక ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ డివైజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 4 లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కోసం వన్‌ప్లస్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ జులైలో లాంచ్ అవుతుందని Smartprix అనే వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలిపింది. కచ్చితమైన తేదీ వివరాలు ఇంకా తెలియదు. కానీ, జులై మూడోవారంలో, 15వ తేదీన లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. త్వరలోనే వన్‌ప్లస్ నుంచి అధికార ప్రకటన రావొచ్చు.

OnePlus Nord 4 స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: OnePlus Nord 4 లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: OnePlus Nord 4 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

బ్యాటరీ: OnePlus Nord 4 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus Nord 4 ధర (అంచనా)

OnePlus Nord 4 డివైజ్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్‌ని ఉద్దేశించి తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ధర భారత్ లో రూ.28,999 లోపు ఉంటుందని అంచనా వేయడమైంది. టాప్ మెమొరీ వేరియంట్ ధర రూ.34,999 వరకు ఉండవచ్చు. వన్‌ప్లస్ కంపెనీ ఈ ఫోన్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందించే అవకాశం ఉంది. దీంతో ఫోన్ రూ.25,000 కే లభిస్తుంది.

The post OnePlus Nord 4: లీకైన వన్‌ప్లస్ నార్డ్ 4 లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-listed-on-geekbench-eurofins-camera-fv-5-websites/ Mon, 29 Apr 2024 10:29:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=11236 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్, యూరోఫిన్స్ మరియు కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ లపై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. OnePlus Nord 4 గీక్‌బెంచ్ లిస్టింగ్ OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ […]

The post OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord 4 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • మోడల్ నంబర్ CPH2621

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్, యూరోఫిన్స్ మరియు కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ లపై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 4 గీక్‌బెంచ్ లిస్టింగ్

OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1875 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4934 పాయింట్లు స్కోర్ చేసింది.

పైనాపిల్ అనే కోడ్ పేరుతో ఓ చిప్సెట్ లిస్టింగ్ పై కనిపించింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ చిప్సెట్ మరియు అడ్రెనో 732 జీపీయూ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

కోడ్ నేమ్ మరియు జీపీయూ ప్రకారం, ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది.

OnePlus Nord 4 డివైజ్ 12జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

OnePlus Nord 4 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ 14 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

OnePlus Nord 4 యూరోఫిన్స్ లిస్టింగ్

OnePlus Nord 4 డివైజ్ యూరోఫిన్స్ సర్టిఫికేషన్ పొందింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్యాటరీ వివరాలు రివీల్ అయ్యాయి.

OnePlus Nord 4 డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా ఖరారైంది.

OnePlus Nord 4 డివైజ్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Nord 4 కెమెరా ఎఫ్‌వీ 5 లిస్టింగ్

OnePlus Nord 4 డివైజ్ Camera FV 5 సర్టిఫికేషన్ పొందింది. ఈ లిస్టింగ్ ద్వారా కెమెరా వివరాలు రివీల్ అయ్యాయి.

OnePlus Nord 4 డివైజ్ ఓఐఎస్, f/1.9 అపర్చర్, 26.4ఎంఎం ఫోకల్ లెంగ్త్ గల ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

OnePlus Nord 4 డివైజ్ f/2.4 అపర్చర్, ఈఐఎస్, 25.2 ఎంఎం ఫోకల్ లెంగ్త్ గల సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

చైనాలో లాంచైన OnePlus Ace 3V కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Nord 4 ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా OnePlus Nord 4 లాంచ్ కానుంది. త్వరలోనే కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3V చిప్సెట్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3v-display-chipset-specs-leaked/ Sun, 24 Dec 2023 18:07:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=9421 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus మార్చి నెలలో చైనాలో OnePlus Ace 2V ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OnePlus Ace 3V కి సంబంధించి లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్స్ ద్వారా […]

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3V చిప్సెట్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 3V
  • OnePlus Ace 2V కి సక్సెసర్‌గా వస్తోన్న Ace 3V
  • గ్లోబల్ గా Nord 4 పేరుతో లాంచ్ కానున్న Ace 3V

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus మార్చి నెలలో చైనాలో OnePlus Ace 2V ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OnePlus Ace 3V కి సంబంధించి లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్స్ ద్వారా చిప్సెట్, డిస్ప్లే, లాంచ్ టైమ్‌లైన్ వంటి వివరాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3V ప్రధాన స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చైనీస్ సామాజిక మాధ్యమం Weibo పై టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OnePlus Ace 3V యొక్క చిప్సెట్ మరియు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు.
  • టిప్‌స్టర్ ప్రకారం, OnePlus సంస్థ Ace బ్రాండ్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో ఓ స్మార్ట్‌ఫోన్ ని తీసుకురానుందని సమాచారం.

  • త్వరలో రాబోవు ఈ స్మార్ట్‌ఫోన్ 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లేని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
  • అయితే లీక్‌స్టర్ ఫోన్ పేరుని తెలపలేదు. కానీ, ఇది OnePlus Ace 3V కావచ్చని అందరూ అంచనా వేస్తున్నారు.

OnePlus Ace 3V లాంచ్ టైమ్‌లైన్, ఇతర వివరాలు

  • OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ 2024 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మార్కెట్ లో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
  • OnePlus Ace 2V భారత్ తో పాటు గ్లోబల్ గా OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ ధర రూ.33,999 గా ఉంది.
  • OnePlus Ace 3V గ్లోబల్ గా OnePlus Nord 4 పేరుతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే కంపెనీ దీని గురించి ఇంకా ఏ ప్రకటన చేయలేదు.

OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Ace 2V లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1440 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: OnePlus Ace 2V లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, మాలి-జీ710 10-కోర్ జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 2V లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus Ace 2V ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OnePlus Ace 2V లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ సోని ఐఎంఎక్స్355 సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Ace 2V లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
  • కనెక్టివిటీ: OnePlus Ace 2V లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ ఉన్నాయి.
  • కలర్స్: OnePlus Ace 2V డివైజ్ మిస్టీ గ్రీన్ మరియు టెంపెస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3V చిప్సెట్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4 https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-5g-specs-leaked-before-launch-rebrand-oneplus-ace-3v/ Tue, 17 Oct 2023 11:55:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=8438 ఫ్లాగ్షిప్ కిల్లర్ గా OnePlus కి పేరుంది. వన్‌ప్లస్ నుంచి వచ్చే ఫోన్లకు మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. త్వరలో ఈ సంస్థ చైనాలో OnePlus Ace 3V డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. OnePlus Ace 3V ని తీసుకొచ్చే పనిలో వన్‌ప్లస్ నిమగ్నమైందని ఒక విదేశీ టిప్‌స్టర్ సమాచారాన్ని లీక్ చేశారు. ఇదే ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 4 పేరుతో లాంచ్ కానుందని […]

The post 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord 4
  • OnePlus Ace 3V కి రీబ్రాండ్‌గా రానున్న Nord 4
  • Snapdragon 7 Gen 3 చిప్‌తో వస్తోన్న Nord 4

ఫ్లాగ్షిప్ కిల్లర్ గా OnePlus కి పేరుంది. వన్‌ప్లస్ నుంచి వచ్చే ఫోన్లకు మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. త్వరలో ఈ సంస్థ చైనాలో OnePlus Ace 3V డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. OnePlus Ace 3V ని తీసుకొచ్చే పనిలో వన్‌ప్లస్ నిమగ్నమైందని ఒక విదేశీ టిప్‌స్టర్ సమాచారాన్ని లీక్ చేశారు. ఇదే ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 4 పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఓసారి OnePlus Nord 4 యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord 4 (OnePlus Ace 3V) స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OnePlus Nord 4 లో 1.5కే అమోలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • చిప్సెట్: OnePlus Nord 4 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.
  • కెమెరా: OnePlus Nord 4 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: OnePlus Nord 4 డివైజ్ 8జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు OnePlus Nord 4 గురించి తెలిసిన స్పెసిఫికేషన్స్ ఇవే. ఓసారి గత మోడల్ OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

OnePlus Nord 3 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి.
  • మెమొరీ: OnePlus Nord 3 5G లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
  • ప్రాసెసర్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ఓఎస్: OnePlus Nord 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OnePlus Nord 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4 first appeared on 91Mobiles Telugu.

]]>