OnePlus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Apr 2024 14:55:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మే 1 నుంచి OnePlus ఆఫ్‌లైన్ అమ్మకాలు నిలిపివేత, ఎందుకో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/oneplus-offline-sales-might-discontinue-from-may-1/ Thu, 11 Apr 2024 14:55:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=11044 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీదారు OnePlus కి ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. స్మార్ట్‌ఫోన్ లవర్స్ కి OnePlus ఎంతగానో చేరువైంది. ఈ సంస్థ ఫోన్లకు చాలా గిరాకీ ఉంది. అయితే ఇప్పుడు వన్‌ప్లస్ ని కష్టాలు చుట్టుముట్టాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ లో ఇకపై OnePlus విక్రయాలు జరగబోవని తెలుస్తోంది. 2024 మే 1 నుంచి రిటైల్ స్టోర్స్ మరియు మొబైల్ షాపుల్లో OnePlus అమ్మకాలు నిలిచిపోనున్నాయి. కారణాలేంటో తెలుసుకుందాం పదండి. మే 1 నుంచి […]

The post మే 1 నుంచి OnePlus ఆఫ్‌లైన్ అమ్మకాలు నిలిపివేత, ఎందుకో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీదారు OnePlus కి ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. స్మార్ట్‌ఫోన్ లవర్స్ కి OnePlus ఎంతగానో చేరువైంది. ఈ సంస్థ ఫోన్లకు చాలా గిరాకీ ఉంది. అయితే ఇప్పుడు వన్‌ప్లస్ ని కష్టాలు చుట్టుముట్టాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ లో ఇకపై OnePlus విక్రయాలు జరగబోవని తెలుస్తోంది. 2024 మే 1 నుంచి రిటైల్ స్టోర్స్ మరియు మొబైల్ షాపుల్లో OnePlus అమ్మకాలు నిలిచిపోనున్నాయి. కారణాలేంటో తెలుసుకుందాం పదండి.

మే 1 నుంచి OnePlus అమ్మకాల నిలిపివేత

రిటైల్ స్టోర్స్ లో OnePlus అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ఇకపై OnePlus ఉత్పత్తులను విక్రయించబోమని సదరు సంఘం తెలిపింది. ఓఆర్ఏ అసోషియేషన్ దీనిపై, వన్‌ప్లస్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రజనీశ్ సింగ్ కి ఒక లేఖ రాశారు. మే 1 నుంచి వన్‌ప్లస్ ఫోన్లను విక్రయించమని లేఖలో పేర్కొన్నారు.

ఆఫ్‌లైన్ మార్కెట్ లో OnePlus అమ్మకాలు ఎందుకు నిలిచిపోనున్నాయి?

మీడియా రిపోర్ట్ ప్రకారం, రజనీశ్ సింగ్ కి రాసిన లేఖలో ఓఆర్ఏ అసోషియేషన్ తాము ఎదుర్కుంటోన్న సమస్యలను గురించి ప్రస్తావించింది. అవేంటో ఇక్కడ చూడండి.

లో-ప్రాఫిట్ మార్జిన్స్ వల్లన షాపు యజమానులు నష్టపోతున్నట్లు అసోసియేషన్ చెబుతోంది. వన్‌ప్లస్ ఉత్పత్తులపై తక్కువ లాభం ఉంటోందని రిటైలర్స్ సంఘం వాదిస్తోంది.

OnePlus పాలసీపై కూడా అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యారంటీ మరియు సేవల జాప్యంతో షాపు యజమానులు మరియు రిటైలర్స్ కస్టమర్ల నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తోందని తెలిపింది.

వన్‌ప్లస్ రవాణా నిర్వహణ విధానంపై కూడా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

OnePlus ఫోన్లు ఎక్కడ అమ్మబడవు?

దేశంలోని సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) పరిధిలో ఉన్న దాదాపు 4500 స్టోర్లలో OnePlus ఫోన్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి.

పూర్వికా మొబైల్స్, సంగీత మొబైల్స్, బిగ్ సీ మరియు పూజ వంటి దిగ్గజ రిటైల్ స్టోర్స్ లో వన్‌ప్లస్ సేల్స్ మే 1 నుంచి జరగబోవు.

అసోసియేషన్ విధించిన వన్‌ప్లస్ అమ్మకాల నిషేధం ప్రధానంగా.. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులతో పాటు మహారాష్ట్ర మరియు గుజరాత్ లపై ప్రభావం చూపనుంది. ఈ రాష్ట్రాల్లో OnePlus సేల్స్ నిలిచిపోనున్నాయి. ఆఫ్‌లైన్‌లో వన్‌ప్లస్ ఫోన్లను కొనాలని భావిస్తోన్న వినియోగదారులు నిరాశ చెందక తప్పదు.

సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఇప్పటివరకు OnePlus నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడం శోచనీయం. వన్‌ప్లస్ ఏ విధంగా స్పందించనుందో చూడాలి.

The post మే 1 నుంచి OnePlus ఆఫ్‌లైన్ అమ్మకాలు నిలిపివేత, ఎందుకో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
OxygenOS 13 Beta అప్డేట్ పొందే OnePlus ఫోన్స్ ఇవే https://www.91mobiles.com/telugu/oneplus-rolling-out-oxygenos-13-beta-update/ Wed, 26 Oct 2022 15:14:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=3082 హైలైట్స్ 2023 H1 (ఏప్రిల్-సెప్టెంబర్) కల్లా OxygenOS 13 రోలౌట్ ని పూర్తి చేయనున్న OnePlus రివీల్ అయిన OxygenOS 13 Beta రోలౌట్ రోడ్ మ్యాప్ 16 డివైజెస్ కి OxygenOS 13 బీటా వర్షన్ అప్డేట్ పంపిస్తోన్న వన్‌ప్లస్ అర్హత గల డివైజెస్ కి వన్ ప్లస్ సంస్థ OxygenOS 13 అప్డేట్ ని పంపడం మొదలుపెట్టింది. రీసెంట్ గా వన్ ప్లస్ బ్రాండ్ వన్ ప్లస్ 8, 8టీ, 8 ప్రో ఫోన్లకు […]

The post OxygenOS 13 Beta అప్డేట్ పొందే OnePlus ఫోన్స్ ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 H1 (ఏప్రిల్-సెప్టెంబర్) కల్లా OxygenOS 13 రోలౌట్ ని పూర్తి చేయనున్న OnePlus
  • రివీల్ అయిన OxygenOS 13 Beta రోలౌట్ రోడ్ మ్యాప్
  • 16 డివైజెస్ కి OxygenOS 13 బీటా వర్షన్ అప్డేట్ పంపిస్తోన్న వన్‌ప్లస్

అర్హత గల డివైజెస్ కి వన్ ప్లస్ సంస్థ OxygenOS 13 అప్డేట్ ని పంపడం మొదలుపెట్టింది. రీసెంట్ గా వన్ ప్లస్ బ్రాండ్ వన్ ప్లస్ 8, 8టీ, 8 ప్రో ఫోన్లకు OxygenOS 13 ఓపెన్ బీటా అప్డేట్ ని పంపించింది. ఇప్పుడు, మిగిలిన డివైజెస్ కి OxygenOS 13 బీటా రోలౌట్ షెడ్యూల్ ని ప్రకటించింది. ఇదే విషయమై, వన్ ప్లస్ సంస్థ వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరమ్ ద్వారా అధికార ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం, అన్ని డివైజెస్ కి OxygenOS 13 బీటా రోలౌట్ పూర్తి కానుందని సమాచారం.

ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS 13 ని 16 డివైజెస్ కి అందించాలని వన్ ప్లస్ ప్లాన్ చేస్తోంది. వీటిలో 10 డివైజెస్ వన్ ప్లస్ బ్యాడ్జ్ తో వచ్చినవి కాగా, మిగిలిన 6 ఫోన్లు వన్‌ప్లస్ నార్డ్ కేటగిరీ లోనివి. 2023 ప్రథమార్థం కల్లా OxygenOS 13 రోలౌట్ ని పూర్తి చేయాలని వన్ ప్లస్ లక్ష్యంగా పెట్టుకుంది. OxygenOS 13 బీటా రోలౌట్ షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం పదండి.

OxygenOS 13 బీటా రోలౌట్ షెడ్యూల్

ఆగస్టు 2022 నుంచి

  • OnePlus 10 Pro 5G [స్టేబుల్ రిలీజ్డ్]

సెప్టెంబర్ 2022 నుంచి

  • OnePlus 10R 5G [ఓపెన్ బీటా రిలీజ్డ్]
  • OnePlus 9 Pro 5G [ఓపెన్ బీటా రిలీజ్డ్]
  • OnePlus 9 5G [ఓపెన్ బీటా రిలీజ్డ్]

2022 క్యూ4 నుంచి

  • OnePlus 10T 5G [క్లోజ్డ్ బీటా రిలీజ్డ్]
  • OnePlus 9RT 5G [ఓపెన్ బీటా రిలీజ్డ్]
  • OnePlus 9R 5G [ఓపెన్ బీటా రిలీజ్డ్]
  • OnePlus 8 5G [ఓపెన్ బీటా రిలీజ్డ్]
  • OnePlus 8T 5G [ఓపెన్ బీటా రిలీజ్డ్]
  • OnePlus 8 Pro 5G [ఓపెన్ బీటా రిలీజ్డ్]
  • OnePlus Nord 2T 5G
  • OnePlus Nord CE 2 Lite 5G

2023 H1 నుంచి

  • OnePlus Nord 2 5G
  • OnePlus Nord CE 2 5G
  • OnePlus Nord CE 5G

OnePlus Nord 2T 5G, OnePlus Nord CE 2 Lite 5G ఫోన్లకు ఈ త్రైమాసికంలోనే OxygenOS 13 Beta అప్డేట్ ని రోలౌట్ చేస్తామని వన్ ప్లస్ తెలిపింది. 2023 ఏప్రిల్ నుంచి OnePlus Nord 2 5G, OnePlus Nord CE 2 5G, OnePlus Nord CE 5G ఫోన్లకు అప్డేట్ అందనుంది. ఇవి OxygenOS 13 Beta రోలౌట్ అని గమనించాలి. స్టేబుల్ వర్షన్ రావడానికి ఇంకొన్ని నెలల సమయం పడుతుంది.

వన్ ప్లస్ కంపెనీ OnePlus Nord N20 SE డివైజ్ కి OxygenOS 13 అప్డేట్ ని ఇంకా ప్లాన్ చేయలేదు. దానికి బదులుగా నేరుగా OxygenOS 13 స్టేబుల్ అప్డేట్ ని 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో పంపించనుంది. ఇకపోతే OnePlus 7, OnePlus 7T, OnePlus 7 Pro, OnePlus 7T Pro, OnePlus Nord 5G జాబితాలో లేవు. వీటికి OxygenOS 13 అప్డేట్ అర్హత లేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post OxygenOS 13 Beta అప్డేట్ పొందే OnePlus ఫోన్స్ ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ అయిన OnePlus Nord 20 SE https://www.91mobiles.com/telugu/oneplus-nord-20-se-launched-price-specs/ Thu, 04 Aug 2022 14:59:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=1502 హైలైట్స్: లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ, ధర 199 యూఎస్ డాలర్లు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 6.56 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్ సెలెస్టియల్ బ్లాక్, బ్లూ ఒయాసిస్ రంగుల్లో లభ్యం కానున్న వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ వన్ ప్లస్ 10టీ లాంచ్ చేసిన వన్ ప్లస్ కంపెనీ, నార్డ్ సిరీస్ లో మరొక ఫోన్ ని సైలెంట్ గా లాంచ్ చేసింది. ఆ […]

The post లాంచ్ అయిన OnePlus Nord 20 SE first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ అయిన వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ, ధర 199 యూఎస్ డాలర్లు
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 6.56 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్
  • సెలెస్టియల్ బ్లాక్, బ్లూ ఒయాసిస్ రంగుల్లో లభ్యం కానున్న వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ

వన్ ప్లస్ 10టీ లాంచ్ చేసిన వన్ ప్లస్ కంపెనీ, నార్డ్ సిరీస్ లో మరొక ఫోన్ ని సైలెంట్ గా లాంచ్ చేసింది. ఆ ఫోన్ పేరే వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ. అలీ ఎక్స్‌ప్రెస్ లో నార్డ్ 20ఎస్ఈ యొక్క లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ధర రివీల్ అయ్యాయి. అయితే, వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ భారత మార్కెట్ ఎంట్రీ పట్ల వన్ ప్లస్ ఇంకా మౌనంగానే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నిన్న భారత్ లో లాంచ్ అయిన ఒప్పో ఏ77 4జీ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ గా వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ వచ్చిందని దాని స్పెసిఫికేషన్స్ ని బట్టి అర్థమవుతోంది. మరో విషయం ఏంటంటే, ఒప్పో ఏ77 4జీ మాదిరే నార్డ్ 20 ఎస్ఈ డిజైన్ కూడా ఉంది. మరి వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ ఏయే ఫీచర్లను ఆఫర్ చేస్తుందో చూద్దాం పదండి.

OnePlus Nord 20 SE స్పెసిఫికేషన్స్

వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ లో 6.56 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ను ఇందులో అమర్చారు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే ఆప్షన్ ఉంది. ఇక బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుకాల రెండు కెమెరాలను అమర్చారు. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా కాగా, రెండవది 2ఎంపి డెప్త్ సెన్సర్. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఈ ఫోన్లో ముందు వైపున 8ఎంపి కెమెరాను అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత, ఆక్సిజన్ ఓఎస్ 12.1 పై ఈ ఫోన్ పని చేస్తుంది.

OnePlus Nord 20 SE ధర

అలీ ఎక్స్‌ప్రెస్ లిస్టింగ్ ప్రకారం, వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ 4జిబి+64జిబి వేరియంట్ ధర 199 డాలర్లు (రూ.15,800) గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యమవుతుంది. అవి సెలస్టియల్ బ్లాక్ మరియు బ్లూ ఒయాసిస్. భారత్ లో ఒప్పో ఏ77 4జీ స్పెసిఫికేషన్స్ కూడా వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ మాదిరే ఉండగా ఫోన్ ధర రూ.15,499 గా ఉంది. అయితే భారత్ లో వన్ ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ లభ్యతపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

The post లాంచ్ అయిన OnePlus Nord 20 SE first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus 10T లాంచ్: స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్ https://www.91mobiles.com/telugu/oneplus-10t-launched-india-price-specs-availability/ Thu, 04 Aug 2022 05:38:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=1483 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన వన్ ప్లస్ 10టీ, ప్రారంభ ధర రూ.49,999 స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రత్యేకతలు ఆగస్టు 6 నుంచి వన్ ప్లస్ 10టీ సేల్స్ ప్రారంభం, అమెజాన్, వన్ ప్లస్ వెబ్ సైట్ ద్వారా లభ్యత మొట్టమొదటి 16జిబి ర్యామ్ కలిగిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ గా లాంచ్ అయిన వన్ […]

The post OnePlus 10T లాంచ్: స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన వన్ ప్లస్ 10టీ, ప్రారంభ ధర రూ.49,999
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • ఆగస్టు 6 నుంచి వన్ ప్లస్ 10టీ సేల్స్ ప్రారంభం, అమెజాన్, వన్ ప్లస్ వెబ్ సైట్ ద్వారా లభ్యత

మొట్టమొదటి 16జిబి ర్యామ్ కలిగిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ గా లాంచ్ అయిన వన్ ప్లస్ 10టీ. ఇదే ఫోన్ వన్ ప్లస్ ఏస్ ప్రో అనే పేరుతో చైనాలో లాంచ్ కావల్సి ఉండగా, కొన్ని కారణాల వల్లన లాంచ్ ఈవెంట్ ని వన్ ప్లస్ వాయిదా వేసింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నాన్-ప్రో మోడల్ అయిన వన్ ప్లస్ 10టీ, ఇంతకు ముందు లాంచ్ అయిన వన్ ప్లస్ 10 ప్రో ఫోన్ కి అప్ గ్రేడ్ గా వస్తోంది. మరో సంగతేంటంటే, ఈ ఏడాది వన్ ప్లస్ 10 సిరీస్ లో భాగంగా స్టాండర్డ్ వేరియంట్ వన్ ప్లస్ 10 రాలేదు. వన్ ప్లస్ 10 లైనప్ లో వన్ ప్లస్ 10 ప్రో, వన్ ప్లస్ 10ఆర్, ఇప్పుడు వన్ ప్లస్ 10టీ మాత్రమే ఉన్నాయి.

ఇది 16జిబి ర్యామ్ కలిగిన మొదటి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, తొలిసారిగా ఐకానిక్ స్లైడర్ ని తీసివేయబడిన తొలి ఫ్లాగ్ షిప్ ఫోన్ కూడా వన్ ప్లస్ 10టీ కావడం గమనార్హం. ఇక ఈ ఫోన్ లో హాజెల్‌బ్లడ్ కెమెరాలు ఉండబోవు. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండదు. మరి వన్ ప్లస్ 10టీ ఆఫర్ చేస్తున్న ఫీచర్లేంటో చూద్దాం పదండి.

భారత్ లో OnePlus 10T ధర, లభ్యత

భారత్ లో వన్ ప్లస్ 10టీ బేస్ వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. ఆగస్టు 6 నుంచి అమెజాన్ మరియు వన్ ప్లస్ వెబ్ సైట్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. మూన్ స్టోన్ బ్యాక్, జేడ్ గ్రీన్ అనే రెండు రంగుల ఆప్షన్స్ లో ఫోన్ లభ్యమవుతుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తుంది: 8జిబి+128జిబి (రూ.49,999), 12జిబి+256జిబి (రూ.54,999), 16జిబి+256జిబి (రూ.55,999). ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా వన్ ప్లస్ 10టీ ని కొంటే, యూజర్లు రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

OnePlus 10T స్పెసిఫికేషన్స్

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ (పెంచడానికి వీలులేదు), ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ వంటి ఫీచర్లు వన్ ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీవో2 10-బిట్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, 394 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ (బాక్స్ లో 160 వాట్ ఛార్జర్ అందించబడుతుంది) వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. వన్ ప్లస్ చెబుతున్న దాన్ని బట్టి, వన్ ప్లస్ 10టీ పూర్తిగా చార్జ్ అవ్వడానికి పట్టే సమయం 19 నిమిషాలు.

వన్ ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్ లో వెనకాల 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరా (ఓఐఎస్), 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 16ఎంపి కెమెరాను ఇచ్చారు. వై-ఫై 6, బ్లూటూత్ 5.2, 5జీ, డ్యూయల్ స్టీరియో, ఆండ్రాయిడ్ 12 ఆధారిత, ఆక్సిజన్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post OnePlus 10T లాంచ్: స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్ పై కనిపించిన OnePlus 10RT https://www.91mobiles.com/telugu/oneplus-10rt-spotted-on-geekbench-specs-revealed/ Mon, 01 Aug 2022 13:36:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=1402 హైలైట్స్: సీపీహెచ్2413 అనే మోడల్ నంబర్ తో గీక్‌బెంచ్ వెబ్‌సైట్ లో కనిపించిన వన్‌ప్లస్ 10ఆర్‌టీ ఆక్టా-కోర్ క్వాల్కమ్ చిప్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 828 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,414 పాయింట్లు సాధించిన వన్‌ప్లస్ 10ఆర్‌టీ వన్ ప్లస్ నుంచి త్వరలో వన్ ప్లస్ 10టీ అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే దీంతో […]

The post గీక్‌బెంచ్ పై కనిపించిన OnePlus 10RT first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సీపీహెచ్2413 అనే మోడల్ నంబర్ తో గీక్‌బెంచ్ వెబ్‌సైట్ లో కనిపించిన వన్‌ప్లస్ 10ఆర్‌టీ
  • ఆక్టా-కోర్ క్వాల్కమ్ చిప్, 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 828 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,414 పాయింట్లు సాధించిన వన్‌ప్లస్ 10ఆర్‌టీ

వన్ ప్లస్ నుంచి త్వరలో వన్ ప్లస్ 10టీ అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే దీంతో పాటు వన్ ప్లస్ 10ఆర్‌టీ అనే మరొక ఫోన్ కూడా త్వరలోనే లాంచ్ అవ్వనున్నట్లు సమచారాం. గీక్‌బెంచ్ వెబ్‌సైట్ లో ఈ ఫోన్ సీపీహెచ్2413 అనే మోడల్ నంబర్ తో దర్శనమిచ్చింది. ఇది వరకు ఇదే ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్స్ లో కూడా కనిపించింది. భారత్ లో ఈ ఫోన్ ఇంటర్నల్ టెస్టింగ్ మొదలైనట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. వన్ ప్లస్ 10ఆర్‌టీ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అవ్వనున్నట్లు గీక్‌బెంచ్ వెబ్ సైట్ లిస్టింగ్ ద్వారా స్పష్టమవుతోంది. వన్ ప్లస్ 10టీ భారత గడ్డపై అడుగు పెట్టాక, వన్ ప్లస్ 10ఆర్‌టీ లాంచ్ అయ్యే అవకాశముంది. మరి వన్ ప్లస్ 10ఆర్‌టీ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

OnePlus 10RT గీక్‌బెంచ్ లిస్టింగ్

మై‌స్మార్ట్‌ప్రైస్ వన్‌ప్లస్ 10ఆర్‌టీ గీక్‌బెంచ్ లిస్టింగ్ ను బయటకు తీసుకొచ్చింది. గీక్‌బెంచ్ పై సీపీహెచ్2413 అనే కోడ్ నంబర్ తో ఉన్న వన్‌ప్లస్ 10ఆర్‌టీ సింగిల్-కోర్ టెస్ట్ లో 828 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3,414 పాయింట్లు సాధించింది. వన్ ప్లస్ 10ఆర్‌టీ 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ చిప్ ని ఈ ఫోన్లో వాడారు. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను ఈ ఫోన్లో అమర్చే అవకాశముంది.

OnePlus 10RT స్పెసిఫికేషన్స్

  • 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
  • 16ఎంపి సెల్ఫీ షూటర్
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 12 కస్టమ్ స్కిన్

ఇంతకు ముందు అనుకున్నట్లుగా, వన్ ప్లస్ 10ఆర్‌టీ అమోలెడ్ ప్యానెల్ తో రానుంది. అలాగే ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉండనుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి. ఇక ఈ ఫోన్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. వన్ ప్లస్ 10ఆర్‌టీ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సెకండరీ షూటర్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉండే అవకాశముంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16ఎంపి కెమెరా ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేయనుంది.

వన్ ప్లస్ 10టీ భారత గడ్డపై అడుగు పెట్టాక, వన్ ప్లస్ 10ఆర్‌టీ లాంచ్ అయ్యే అవకాశముంది.

The post గీక్‌బెంచ్ పై కనిపించిన OnePlus 10RT first appeared on 91Mobiles Telugu.

]]>
హయ్యస్ట్ AnTuTu స్కోర్ నమోదు చేసిన OnePlus 10T https://www.91mobiles.com/telugu/oneplus-10t-registered-highest-score-on-antutu-platform/ Tue, 26 Jul 2022 15:33:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=1272 హైలైట్స్: అన్ టు టు బెంచ్ మార్క్ పై అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆండ్రాయిడ్ డివైజ్ గా నిలిచిన వన్ ప్లస్ 10టీ ఆగస్టు 3 న గ్లోబల్ గా లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్ భారత్ లో 10టీ కోసం ఒక ఫిజికల్ ఈవెంట్ ను నిర్వహిస్తోన్న వన్ ప్లస్ వన్ ప్లస్ సంస్థ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10టీ. ఆగస్టు 3 న ప్రపంచ […]

The post హయ్యస్ట్ AnTuTu స్కోర్ నమోదు చేసిన OnePlus 10T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అన్ టు టు బెంచ్ మార్క్ పై అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆండ్రాయిడ్ డివైజ్ గా నిలిచిన వన్ ప్లస్ 10టీ
  • ఆగస్టు 3 న గ్లోబల్ గా లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్
  • భారత్ లో 10టీ కోసం ఒక ఫిజికల్ ఈవెంట్ ను నిర్వహిస్తోన్న వన్ ప్లస్

వన్ ప్లస్ సంస్థ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10టీ. ఆగస్టు 3 న ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు కంపెనీ చేస్తున్న టీజర్లను బట్టి, 10టీ బెంచ్ మార్క్ ప్లాట్ఫామ్ అన్ టు టు పై అత్యధిక స్కోర్ ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి వన్ ప్లస్ 10టీ టాప్ పెర్ఫామింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గా నిలిచినట్లైంది. మరి ఇతర వివరాలేంటో చూద్దాం పదండి.

OnePlus 10T అన్ టు టు ర్యాంక్

ఇప్పటి వరకు అన్ టు టు ప్రచురించిన ర్యాంకింగ్స్ జాబితాలో నుబియా రెడ్ మ్యాజిక్ 7 స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గా ఉంది. దీంట్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. దీని స్కోర్ 1,046,552. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కలిగిన వివో ఎక్స్80 స్మార్ట్ ఫోన్ 1,000,443 స్కోరుతో రెండో స్థానంలో ఉంది.

ఇప్పుడు వీటన్నింటినీ వన్ ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్ వెనక్కి నెట్టేయగలదని తెలుస్తోంది. ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ పోస్ట్ చేసిన స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ని బట్టి తెలుస్తున్నదేంటంటే, వన్ ప్లస్ 10టీ 1,141,383 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్ళింది. ఇదే కనుక నిజమైతే, ఇకపై మార్కెట్ లో వన్ ప్లస్ 10టీ శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది.

అయితే, ఓవరాల్ గా మోస్ట్ పవర్ఫుల్ మొబైల్ డివైజ్ విషయానికి వస్తే, అన్ టు టు ప్రకారం, ఆపిల్ యొక్క ఎమ్1 చిప్ కలిగిన, ఐప్యాడ్ ప్రో 5th జనరేషన్, 1,203,916 పాయింట్లతో టాప్ పొజిషన్ లో ఉంది.

OnePlus 10T స్పెసిఫికేషన్స్ (అంచనా)

వన్ ప్లస్ 10టీ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. ఇందులో 16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. వన్ ప్లస్ 10టీ లో 50ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇప్పుడు బ్యాటరీ విభాగం ఫీచర్లు చూద్దాం. ఈ ఫోన్లో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. వన్ ప్లస్ 10టీ కి సంబంధించిన వివరాలు ఆగస్టు 3 న జరగబోవు లాంచ్ ఈవెంట్ లో తెలియనున్నాయి. అదే రోజున భారత్ లో కూడా వన్ ప్లస్ 10టీ లాంచ్ అవుతోంది.

The post హయ్యస్ట్ AnTuTu స్కోర్ నమోదు చేసిన OnePlus 10T first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus Ace Pro (OnePlus 10T) ఫస్ట్ లుక్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-pro-first-look-revealed/ Tue, 26 Jul 2022 08:21:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=1244 హైలైట్స్: ఆగస్టు 3 న చైనాలో లాంచ్ అవుతోన్న వన్ ప్లస్ ఏస్ ప్రో భారత్ లో వన్ ప్లస్ 10టీ 5జీ గా లాంచ్ అవుతోన్న అదే ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న తొలి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఏస్ ప్రో/10టీ 5జీ త్వరలో ఏస్ సిరీస్ ఫోన్ రాబోతున్నట్లు వన్ ప్లస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఇది వరకే ఏస్ ప్రో/10టీ కి సంబంధించిన […]

The post OnePlus Ace Pro (OnePlus 10T) ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఆగస్టు 3 న చైనాలో లాంచ్ అవుతోన్న వన్ ప్లస్ ఏస్ ప్రో
  • భారత్ లో వన్ ప్లస్ 10టీ 5జీ గా లాంచ్ అవుతోన్న అదే ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న తొలి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఏస్ ప్రో/10టీ 5జీ

త్వరలో ఏస్ సిరీస్ ఫోన్ రాబోతున్నట్లు వన్ ప్లస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఇది వరకే ఏస్ ప్రో/10టీ కి సంబంధించిన పలు రూమర్లు, లీక్స్ బయటకు వచ్చాయి. ఇక వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్ ని రీబ్రాండ్ చేసి వన్ ప్లస్ ఏస్ ప్రో గా చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఏస్ ప్రో చైనాలో ఆగస్టు 3 న లాంచ్ అవుతోంది. ఇక గ్లోబల్ బయ్యర్లు ఈ ఫోన్ కోసం వేచి చూడాల్సి అవసరం లేదు. ఎందుకంటే అదే రోజున వన్ ప్లస్ 10టీ 5జీ కూడా లాంచ్ అవుతోంది. ఇటీవలె వన్ ప్లస్ ఏస్ ప్రో ఫోన్ ఫస్ట్ లుక్ ని కంపెనీ బయటకు వదిలింది. దీంతో వన్ ప్లస్ ఏస్ ప్రో యొక్క పలు కీలక ఫీచర్లు కన్ఫర్మ్ అయ్యాయి.

OnePlus Ace Pro ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ

 

పైన పిక్స్ లో చూస్తున్న విధంగా వన్ ప్లస్ ఏస్ ప్రో ఉండనుంది. వన్ ప్లస్ 10 ప్రో డిజైన్ లాగానే ఈ డివైజ్ కూడా కనిపిస్తోంది. ఫోన్ వెనకాల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. ఈసారి హాజెల్ బ్లడ్ అని మెన్షన్ చేయలేదు. నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. పవర్ బటన్ డివైజ్ కి కుడివైపున ఉంది. ఇక వాల్యూమ్ రాకర్స్ ఎడమ వైపున ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే, వన్ ప్లస్ ఏస్ ప్రో లో ఐకానిక్ అలర్ట్ స్లైడర్ లేదు.

ద వర్జ్ కథనం ప్రకారం, హై వాటేజ్ ఛార్జింగ్ కొరకు భారీ బ్యాటరీని సర్దుబాటు చేయడం, మెరుగైన యాంటినా సిగ్నల్ అందించేందుకు గాను అలర్ట్ స్లైడర్ ను వన్ ప్లస్ తొలగించినట్లు సమాచారం. అలాగే అలర్ట్ స్లైడర్ ను ఉంచడం వల్లన, ఫోన్ బరువు, వెడల్పు కూడా పెరిగే అవకాశముందని ద వర్జ్ పేర్కొంది. అన్ని యాంగిల్స్ లోనూ ఉత్తమమైన సిగ్నల్ ను అందించేందుకు గాను, వన్ ప్లస్ ఏస్ ప్రో లో మొత్తం 15 సెపరేట్ యాంటినాలను అమర్చడం విశేషం. అందుబాటు ధరలో పెర్ఫామెన్స్ బేస్డ్ ఫోన్ అందించాలనే ఉద్దేశ్యంతో హాజెల్ బ్లడ్ బ్రాండింగ్ కూడా ఇవ్వడం లేదని, వన్ ప్లస్ చీఫ్ డిజైనర్ హోప్ లియూ చెప్పారు. ఇక వన్ ప్లస్ 10టీ (ఏస్ ప్రో) యొక్క కెమెరా వివరాలను కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేయడం జరిగింది.

ఇక ఫోన్ ముందు వైపు చూస్తే, వన్ ప్లస్ ఏస్ ప్రో లో ఫ్రంట్ కెమెరా కోసం సెంటర్ పంచ్ హోల్ ఉంది. మరో విషయం ఏంటంటే, వన్ ప్లస్ ఏస్ ప్రో లో 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ని కూడా తొలగించారు.

OnePlus 10T 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

వన్ ప్లస్ ఏస్ ప్రో లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post OnePlus Ace Pro (OnePlus 10T) ఫస్ట్ లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూపాయి చెల్లించి OnePlus 10T ఈవెంట్ కు హాజరవ్వొచ్చు..!! https://www.91mobiles.com/telugu/oneplus-10t-launch-event-one-rupee-entry-ticket/ Mon, 25 Jul 2022 15:06:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=1227 హైలైట్స్: బెంగళూరులో జరగనున్న వన్ ప్లస్ 10టీ ఈవెంట్ ఫోన్ ని కొనాలనుకునే వారు రూ.1 టిక్కెట్టు కొని ఈవెంట్ కి హాజరయ్యే అవకాశం ఈవెంట్లో యూజర్లు వన్ ప్లస్ 10టీ ని గెలిచే అవకాశం వచ్చే నెల మొదటి వారంలో వన్ ప్లస్ 10టీ భారత్ లో లాంచ్ అవుతోంది. ఆగస్టు 3, బుధవారం నాడు బెంగళూరులో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇక గ్లోబల్ గా ఫోన్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విడుదల కానుంది. ఇక […]

The post రూపాయి చెల్లించి OnePlus 10T ఈవెంట్ కు హాజరవ్వొచ్చు..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • బెంగళూరులో జరగనున్న వన్ ప్లస్ 10టీ ఈవెంట్
  • ఫోన్ ని కొనాలనుకునే వారు రూ.1 టిక్కెట్టు కొని ఈవెంట్ కి హాజరయ్యే అవకాశం
  • ఈవెంట్లో యూజర్లు వన్ ప్లస్ 10టీ ని గెలిచే అవకాశం

వచ్చే నెల మొదటి వారంలో వన్ ప్లస్ 10టీ భారత్ లో లాంచ్ అవుతోంది. ఆగస్టు 3, బుధవారం నాడు బెంగళూరులో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇక గ్లోబల్ గా ఫోన్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విడుదల కానుంది. ఇక భారత్ లో ఒక కమ్యూనిటీ ఈవెంట్ ద్వారా భౌతిక అనుభూతిని కల్పించాలని వన్ ప్లస్ భావిస్తోంది. ఇక ఈవెంట్ వద్ద, ఆసక్తి గల వన్ ప్లస్ యూజర్లు, ఫాలోవర్లు స్మార్ట్ ఫోన్ ని తరచి చూసే అవకాశాన్ని పొందుతారు. అలాగే వన్ ప్లస్ యాక్ససరీలతో పాటు వన్ ప్లస్ 10టీ ఫోన్ ని కూడా గెలుచుకునే అవకాశముంది.

OnePlus 10T స్మార్ట్ ఫోన్ ని ఎలా గెలవాలి

వన్ ప్లస్ అనౌన్స్ చేసిన విధంగా, ఎంపిక కాబడిన యూజర్లు వన్ ప్లస్ 10టీ ఫోన్ ని గెలుచుకునే అవకాశముంది. ఈవెంట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. అయితే, యూజర్లు టిక్కెట్టుకి ఒక్క రూపాయి చెల్లించి ప్రీ-రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రీ-రిజిస్టర్ చేసుకునేందుకు యూజర్లు వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ పై ఈ పేజీని యాక్సెస్ చేయగలరు. నేడు జరుగుతోన్న 24 గంటల స్పెషల్ సేల్ లో భాగంగా, ప్రీ-రిజిస్ట్రేషన్ ను చేసుకునే వీలుంది. ఇందుకోసం మీరు ఈమెయిల్ ను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్స్ సైన్ అప్ అయ్యాక, యూజర్లు రూ.1 చెల్లించేందుకై ఇన్వైట్ లింక్ పొందుతారు. అప్పుడు టిక్కెట్టు పొంది లాంచ్ ఈవెంట్ ను ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. పేమెంట్ అయ్యాక, ఈవెంట్ కు వచ్చేందుకై యూజర్లకు కన్ఫర్మేషన్ అందుతుంది.

ఫిజికల్ ఈవెంట్ కు హాజరయ్యే యూజర్లు ఈవెంట్ వద్ద నుంచే వన్ ప్లస్ 10టీ ఫోన్ ని ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశముంటుందని , వన్ ప్లస్ తెలిపింది. అలాగే ఈవెంట్ వద్ద స్మార్ట్ ఫోన్ ని ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం కూడా లభించనుంది. ఇంకా 10టీ ఫోన్ తో పాటు, వన్ ప్లస్ యాక్ససరీలను గెలుచుకునే చాన్స్ ఉంది.

OnePlus 10T స్పెసిపికేషన్స్ (అంచనా)

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను అమర్చారు. అలాగే ఈ ఫోన్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వస్తుందని అంచనా. ఇక ఈ ఫోన్ లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి. ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. వన్ ప్లస్ 10టీ లో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది.

The post రూపాయి చెల్లించి OnePlus 10T ఈవెంట్ కు హాజరవ్వొచ్చు..!! first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace Pro https://www.91mobiles.com/telugu/oneplus-ace-pro-launch-tipped-specs-out/ Fri, 22 Jul 2022 12:40:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=1175 హైలైట్స్: వన్ ప్లస్ 10టీ కి వన్ ప్లస్ ఏస్ ప్రో ట్వీక్డ్ వర్షన్ అని అంచనా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు వన్ ప్లస్ 10టీ లాంచ్ కానున్న సమయానికే వన్ ప్లస్ ఏస్ ప్రో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వరుసబెట్టి స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేస్తూ పోతున్న వన్ ప్లస్ కంపెనీ, ఈ ఏడాది బిజీగా మారిపోయింది. […]

The post త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • వన్ ప్లస్ 10టీ కి వన్ ప్లస్ ఏస్ ప్రో ట్వీక్డ్ వర్షన్ అని అంచనా
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • వన్ ప్లస్ 10టీ లాంచ్ కానున్న సమయానికే వన్ ప్లస్ ఏస్ ప్రో కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్

వరుసబెట్టి స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేస్తూ పోతున్న వన్ ప్లస్ కంపెనీ, ఈ ఏడాది బిజీగా మారిపోయింది. వన్ ప్లస్ లాంచ్ చేసిన ఫోన్స్ లో మిడ్-రేంజ్, ఫ్లాగ్ షిప్స్, నార్డ్ సిరీస్ ఫోన్స్ ఉన్నాయి. ఆగస్టు 3 న వన్ ప్లస్ 10టీ లాంచ్ కానుందని కన్ఫర్మ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్న వన్ ప్లస్ తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. అయితే, ఈ ఫ్లాగ్ షిప్ కేవలం ఇండియా మరియు గ్లోబల్ మార్కెట్స్ కే పరిమితం కానుందని సమాచారం. చైనాలో మాత్రం వన్ ప్లస్ ఏస్ ప్రో అనే పేరుతో ట్వీక్డ్ వర్షన్ లాంచ్ అవుతుందని డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతోంది.

టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్ల గురించి తెలిపింది. వన్ ప్లస్ ఏస్ మోడల్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 16జిబి ర్యామ్ ఉంటాయని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. ఇవి తప్ప మరే ఇతర స్పెసిఫికేషన్స్ ను డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించలేదు.

OnePlus Ace Pro ధర (అంచనా)

వన్ ప్లస్ ఏస్ ప్రో ధర ఆర్ఎంబి 3,000 (దాదాపు రూ.35,500) నుంచి ఆర్ఎంబి 4000 (దాదాపు రూ.47,500) మధ్య ఉంటుందని సమాచారం.

OnePlus Ace Pro స్పెసిఫికేషన్స్

  • 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1
  • 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా
  • 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్

వన్ ప్లస్ 10టీ (వన్ ప్లస్ ఏస్ ప్రో) లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీవో 2.0 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10+, ఆర్జీబీ, డిస్ప్లే పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.

వన్ ప్లస్ 10టీ (వన్ ప్లస్ ఏస్ ప్రో) లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 2*2 ఎంఐఎంఐ, వై-ఫై 802.11ఏ/బి/జి/ఎన్/ఏసి/ఏఎక్స్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, ఎస్బీసీ & ఏపీటీ హెచ్డీ & ఎల్డీఏసీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లున్నాయి.

వన్ ప్లస్ 10టీ (వన్ ప్లస్ ఏస్ ప్రో) లో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరా ఉండే అవకాశముంది. గ్లోబల్ వేరియంట్స్ లో కెమెరా స్పెసిఫికేషన్స్ మారే అవకాశముంది.

The post త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన OnePlus 10T 5G https://www.91mobiles.com/telugu/oneplus-10t-5g-appeared-on-geekbench-specs-and-score-details/ Wed, 20 Jul 2022 14:20:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=1113 హైలైట్స్: త్వరలో వన్ ప్లస్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనున్న వన్ ప్లస్ 2022, ఆగస్టు 3 న వన్ ప్లస్ 10టీ 5జీ లాంచ్ అవ్వనుందని సమాచారం లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై దర్శనమిచ్చిన డివైజ్, 16జిబి వేరియంట్ రావడం కన్ఫర్మ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో కూడిన తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10టీ 5జీ ని […]

The post లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన OnePlus 10T 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో వన్ ప్లస్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనున్న వన్ ప్లస్
  • 2022, ఆగస్టు 3 న వన్ ప్లస్ 10టీ 5జీ లాంచ్ అవ్వనుందని సమాచారం
  • లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై దర్శనమిచ్చిన డివైజ్, 16జిబి వేరియంట్ రావడం కన్ఫర్మ్

స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో కూడిన తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10టీ 5జీ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ సిద్దమవుతోంది. 2022, ఆగస్టు 3 న వన్ ప్లస్ 10టీ 5జీ భారత్ లో లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్ కి సంబంధించిన ఇమేజెస్, ముఖ్య ఫీచర్లతో సహా ఎన్నో రిపోర్ట్స్ ని మనం చూశాం. వన్ ప్లస్ 10టీ 5జీ ఇప్పుడు గీక్ బెంచ్ డేటా బేస్ వెబ్ సైట్ ను విజిట్ చేసింది. దీంతో ఇప్పటికే బయటకు వచ్చిన ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ నిజమేనని స్పష్టమైంది.

గీక్ బెంచ్ కు చేరిన OnePlus 10T 5G

గీక్ బెంచ్ డేటాబేస్ ఇమేజ్ లో కనిపిస్తున్నట్లుగా, వన్ ప్లస్ 10టీ 5జీ (మోడల్ నంబర్ వన్ ప్లస్ పీజీపీ110) సింగిల్ కోర్ టెస్ట్ లో 1,049 స్కోర్ ని సాధించింది. ఇక మల్టీ స్కోర్ టెస్ట్ లో 3,495 స్కోర్ సాధించింది. ఇంకా గీక్ బెంచ్ లిస్టింగ్ రుజువు చేస్తున్నదేంటంటే, వన్ ప్లస్ 10టీ 5జీ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ కెపాసిటీతో వస్తోంది. ఖరారైన మరో విషయం ఏంటంటే, వన్ ప్లస్ 10టీ 5జీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తోంది. ఎలాగూ ఈ విషయం తెలిసిన విషయమే అనుకోండి.

OnePlus 10T 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను ఈ ఫోన్ కలిగి ఉంటుందని సమాచారం. ఇంకా ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. దీంట్లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వన్ ప్లస్ 10టీ 5జీ లో ముందు భాగాన 16ఎంపి కెమెరా ఉండనుంది.

ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. వన్ ప్లస్ 10టీ 5జీ 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ఫోన్లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉంది. చివరగా, వన్ ప్లస్ 10టీ 5జీ జేడ్ గ్రీన్, మూన్ స్టోన్ బ్లాక్ రంగుల్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్లో 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు ఉండటం గమనించాల్సిన విషయం. ఈ రెండు తప్పితే, మిగతా అన్ని విభాగాల్లో ఈ ఫోన్ ఫీచర్లు చాలా బాగున్నాయనే చెప్పాలి. ఈ ఫోన్ ధర కూడా అందుబాటు శ్రేణిలో ఉంటే కచ్చితంగా మార్కెట్ లో విజయం సాధించే అవకాశముంది. మరి రానున్న రోజుల్లో ఈ ఫోన్ కి సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ టీజ్ చేస్తుందేమో వేచి చూద్దాం. అప్పటి వరకు మీకోసం ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం 91మొబైల్స్ తెలుగు ని తప్పకుండా ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన OnePlus 10T 5G first appeared on 91Mobiles Telugu.

]]>