OPPO K12x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 23 Sep 2024 14:17:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO K12x 5G: భారత్‌లో లాంచైన కే12ఎక్స్ 5జీ ఫెదర్ పింక్ కలర్ వేరియంట్, ఆఫర్ ధర రూ.10,999 https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-feather-pink-variant-launched-india-offer-price-rs-10999/ https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-feather-pink-variant-launched-india-offer-price-rs-10999/#respond Mon, 23 Sep 2024 13:20:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=13694 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO జులైలో K12x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అప్పుడు బ్రీజ్ బ్లూ మరియు మిడ్నైట్ వయొలెట్ కలర్స్ లో ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పుడు, ఫెదర్ పింక్ అనే కొత్త కలర్ లో OPPO K12x 5G లాంచ్ అయ్యింది. అంతేకాదు, లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ.10,999 కే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అందుబాటులోకి రానుంది. మరి పూర్తి […]

The post OPPO K12x 5G: భారత్‌లో లాంచైన కే12ఎక్స్ 5జీ ఫెదర్ పింక్ కలర్ వేరియంట్, ఆఫర్ ధర రూ.10,999 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో OPPO K12x 5G ఫెదర్ పింక్ విడుదల
  • ఫ్లిప్‌‌కార్ట్ ద్వారా కే12ఎక్స్ 5జీ సేల్
  • ఆఫర్ ధర రూ.10,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO జులైలో K12x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అప్పుడు బ్రీజ్ బ్లూ మరియు మిడ్నైట్ వయొలెట్ కలర్స్ లో ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పుడు, ఫెదర్ పింక్ అనే కొత్త కలర్ లో OPPO K12x 5G లాంచ్ అయ్యింది. అంతేకాదు, లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ.10,999 కే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అందుబాటులోకి రానుంది. మరి పూర్తి వివరాలు తెలుసుకుందామా?

OPPO K12x 5G ఫెదర్ పింక్ కలర్ ధర

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ ఫెదర్ పింక్ కలర్ వేరియంట్ ధరను ఇతర కలర్ వేరియంట్స్ మాదిరే పెట్టారు.

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.12,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

OPPO K12x 5G ఫెదర్ పింక్ కలర్ వేరియంట్ సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ లో జరగబోవు బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

సేల్ సమయంలో OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ ని కేవలం రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు.

OPPO K12x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO K12x 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO K12x 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO K12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి అల్ట్రా-క్లియర్ ఏఎఫ్ మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: OPPO K12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: OPPO K12x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO K12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO K12x 5G లో ఐపీ54 రేటింగ్, ఏఐ లింక్ బూస్ట్ టెక్నాలజీ, ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. ఏఐ లింక్ బూస్ట్ ఫీచర్ ద్వారా తక్కువ నెట్వర్క్ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో కూడా మంచి నెట్వర్క్ అందుతుంది.

The post OPPO K12x 5G: భారత్‌లో లాంచైన కే12ఎక్స్ 5జీ ఫెదర్ పింక్ కలర్ వేరియంట్, ఆఫర్ ధర రూ.10,999 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-feather-pink-variant-launched-india-offer-price-rs-10999/feed/ 0
OPPO K12x 5G: 45W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో కే12ఎక్స్ 5జీ https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-launched-in-india-with-45w-supervooc-fast-charging/ https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-launched-in-india-with-45w-supervooc-fast-charging/#respond Mon, 29 Jul 2024 17:31:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=12726 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. OPPO K12x 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ డివైజ్ లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ54 రేటింగ్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. OPPO K12x 5G ధర, లభ్యత […]

The post OPPO K12x 5G: 45W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో కే12ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో OPPO K12x 5G లాంచ్
  • 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ54 రేటింగ్
  • OPPO K12x 5G ప్రారంభ ధర రూ.12,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారత్ లో ఒక కొత్త కే-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. OPPO K12x 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ డివైజ్ లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ54 రేటింగ్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

OPPO K12x 5G ధర, లభ్యత

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో భారత్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

OPPO K12x 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.12,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు.

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 2వ తేదీ నుంచి మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ బ్రీజ్ బ్లూ మరియు మిడ్నైట్ వాలెట్ కలర్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, OPPO K12x 5G డివైజ్ కొనుగోలుపై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యాక్సిస్ బ్యాంక్ ద్వారా జరిపే లావాదేవీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

OPPO K12x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO K12x 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO K12x 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO K12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి అల్ట్రా-క్లియర్ ఏఎఫ్ మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: OPPO K12x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: OPPO K12x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO K12x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO K12x 5G లో ఐపీ54 రేటింగ్, ఏఐ లింక్ బూస్ట్ టెక్నాలజీ, ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. ఏఐ లింక్ బూస్ట్ ఫీచర్ ద్వారా తక్కువ నెట్వర్క్ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో కూడా మంచి నెట్వర్క్ అందుతుంది.

The post OPPO K12x 5G: 45W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన ఒప్పో కే12ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-launched-in-india-with-45w-supervooc-fast-charging/feed/ 0
OPPO K12x 5G: జులై 29న లాంచ్ అవుతోన్న ఒప్పో కే12ఎక్స్ 5జీ https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-india-launch-date-july-29/ https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-india-launch-date-july-29/#respond Mon, 22 Jul 2024 16:18:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12620 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO K12x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి విడుదలవుతోంది. నేడు ఒప్పో కంపెనీ ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. జులై 29న OPPO K12x 5G భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. లాంచ్ తేదీతో పాటు, డివైజ్ యొక్క ఇమేజ్‌, మరియు ప్రధాన ఫీచర్లను కంపెనీ తెలియజేసింది. OPPO K12x 5G ఫీచర్లు OPPO […]

The post OPPO K12x 5G: జులై 29న లాంచ్ అవుతోన్న ఒప్పో కే12ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • OPPO K12x 5G ఇండియా లాంచ్ ఖరారు
  • జులై 29న లాంచ్ చేయనున్నట్లు ప్రకటన
  • ఫోన్ ఫోటోను విడుదల చేసిన ఒప్పో

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO K12x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి విడుదలవుతోంది. నేడు ఒప్పో కంపెనీ ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. జులై 29న OPPO K12x 5G భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. లాంచ్ తేదీతో పాటు, డివైజ్ యొక్క ఇమేజ్‌, మరియు ప్రధాన ఫీచర్లను కంపెనీ తెలియజేసింది.

OPPO K12x 5G ఫీచర్లు

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ అల్ట్రా-స్లిమ్ ప్రీమియమ్ గ్లీమింగ్ డిజైన్, 7.68 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది. బ్రీజ్ బ్లూ మరియు మిడ్నైట్ వయొలెట్ కలర్స్ లో లాంచ్ కానుంది.

OPPO K12x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది వర్టికల్ షేప్ లో ఉంటుంది. ముందువైపు ఫ్లాట్ పంచ్-హోల్ కటౌట్ ఉంటుంది. సిమ్ ట్రే ఫోన్‌కి ఎడమవైపున ఉంటుంది. వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ కుడివైపున ఉంటాయి. 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ మరియు యూఎస్బీ టైప్-సీ స్పీకర్ బాటమ్ లో ఉంటాయి.

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో వస్తోంది. 360-డిగ్రీ డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. డబుల్ పాండా గ్లాస్‌ని ఈ ఫోన్ లో అందించారు. ఐపీ54 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తోంది.

OPPO K12x 5G లో 6.67-ఇంచ్ పంచ్-హోల్ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, ఫ్లాట్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, ఎల్1 వైడ్‌వైన్ సర్టిఫికేషన్ ఉంటాయి.

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. ఈ ఫోన్ లో ఏఐ లింక్‌బూస్ట్ టెక్నాలజీ అందిస్తున్నారు.

OPPO K12x 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: OPPO K12x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి. చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: OPPO K12x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. మైక్రోఎస్డీ కార్డు సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించే అవకాశం ఉంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

కెమెరా: OPPO K12x 5G చైనా వేరియంట్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OPPO K12x 5G ఇండియా లాంచ్ వివరాలు

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో జులై 29న లాంచ్ అవుతోంది. ఇదే రోజున డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయించబడుతుంది. ఆగస్టు 2 నుంచి ఈ ఫోన్ యొక్క సేల్ మొదలవుతుంది.

OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.15,000 లోపు ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.20,000 లోపు ఉండవచ్చు.

Source

The post OPPO K12x 5G: జులై 29న లాంచ్ అవుతోన్న ఒప్పో కే12ఎక్స్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-k12x-5g-india-launch-date-july-29/feed/ 0