OPPO Reno 10 Pro+ 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 01 Dec 2023 05:56:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50MP Sony IMX890 కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-10-pro-5g-launched-india-price-specs-availability/ Mon, 10 Jul 2023 11:06:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=7139 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారతీయ మార్కెట్ లో OPPO Reno 10 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ 20జిబి ర్యామ్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. ఓసారి, OPPO Reno 10 Pro 5G స్మార్ట్ ఫోన్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు […]

The post 50MP Sony IMX890 కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారతీయ మార్కెట్ లో లాంచైన OPPO Reno 10 సిరీస్
  • లైనప్ లో భాగంగా ఎంట్రీ ఇచ్చిన 3 స్మార్ట్ ఫోన్లు
  • స్నాప్ డ్రాగన్ 778జి 5జీ ప్రాసెసర్ తో వచ్చిన Reno 10 Pro 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారతీయ మార్కెట్ లో OPPO Reno 10 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ 20జిబి ర్యామ్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. ఓసారి, OPPO Reno 10 Pro 5G స్మార్ట్ ఫోన్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

OPPO Reno 10 Pro 5G డిజైన్

OPPO Reno 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 3డీ కర్వ్డ్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ ఎంతో స్లిమ్ గా, తేలికగా ఉంది. బ్యాక్ ప్యానెల్ మెటల్ తో తయారైంది. రియర్ ప్యానెల్ రెండు కలర్స్ లో కనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్ విషయానికి వస్తే, ఇందులో భారీ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 3 కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఇంకా వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు. OPPO Reno 10 Pro 5G ఫోన్ గ్లాసీ పర్పుల్, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

OPPO Reno 10 Pro 5G ధర

భారత్ లో OPPO Reno 10 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.39,999 గా నిర్ణయించారు. జులై 13 నుంచి ఈ ఫోన్ సేల్స్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ లో మొదలవుతుంది.

OPPO Reno 10 Pro 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 10 Pro 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 950 నిట్స్ బ్రైట్నెస్, 93 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • చిప్సెట్: OPPO Reno 10 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి 5జీ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఇంకా ఈ ఫోన్ లో వీసీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. దీని వల్లన ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
  • స్టోరేజీ: OPPO Reno 10 Pro 5G లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. ర్యామ్ ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: OPPO Reno 10 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్890 అల్ట్రా క్లియర్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో పొట్రెయిట్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఐఎంఎక్స్709 లెన్స్ ఉంది.
  • బ్యాటరీ: OPPO Reno 10 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 28 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
  • ఓఎస్: OPPO Reno 10 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post 50MP Sony IMX890 కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
100W చార్జింగ్, 20GB RAM పవర్‌తో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro+ 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-10-pro-plus-5g-launched-india-price-specs-availability/ Mon, 10 Jul 2023 08:22:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=7136 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నేడు భారత్ లో OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: OPPO Reno 10 Pro+ 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 5G. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 20జిబి ర్యామ్ పవర్ తో OPPO Reno 10 Pro+ 5G డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. […]

The post 100W చార్జింగ్, 20GB RAM పవర్‌తో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన OPPO Reno 10 సిరీస్
  • Reno 10 లైనప్ లో వచ్చిన 3 మోడల్స్
  • 14 5జీ బ్యాండ్స్ తో వచ్చిన OPPO Reno 10 Pro+ 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నేడు భారత్ లో OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: OPPO Reno 10 Pro+ 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 5G. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 20జిబి ర్యామ్ పవర్ తో OPPO Reno 10 Pro+ 5G డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఓసారి OPPO Reno 10 Pro+ 5G భారతీయ మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలను తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్ లో OPPO Reno 10 Pro+ 5G ధర

భారత్ లో OPPO Reno 10 Pro+ 5G సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ కలిగి ఈ మోడల్ ధరను రూ.54,999 గా నిర్ణయించారు. గ్లాసీ పర్పుల్, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OPPO Reno 10 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 10 Pro+ 5G లో6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2772*1240 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానో-మీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఇది 1.8 గిగాహెర్ట్జ్ నుంచి 3 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 730 జీపీయూ వాడారు.
  • ఓఎస్: OPPO Reno 10 Pro+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్: OPPO Reno 10 Pro+ 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్3.1 టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు. OPPO Reno 10 Pro+ 5G డివైజ్ 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా కలిగి ఉంది. దీంతో యూజర్ కి మొత్తం 20జిబి ర్యామ్ లభించనుంది.
  • కెమెరా: OPPO Reno 10 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. రియర్ కెమెరా ఓఐఎస్ టెక్నాలజీని కలిగి ఉంది. అలాగే 3ఎక్స్ ఆప్టికల్, 120ఎక్స్ డిజిటల్ జూమ్ కేపబులిటీస్ ఈ కెమెరా యూనిట్ కి ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: OPPO Reno 10 Pro+ 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Reno 10 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. 27 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 10 Pro+ 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ రిమోట్ కంట్రోల్, డ్యూయల్ ట్రాక్ స్టీరియో స్పీకర్స్, డైరాక్ ఆడియో ట్యూనర్ ఉన్నాయి.

The post 100W చార్జింగ్, 20GB RAM పవర్‌తో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన OPPO Reno 10 సిరీస్ డిజైన్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-10-series-indian-variant-design-leaked/ Thu, 15 Jun 2023 11:50:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=6788 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO, త్వరలో భారత్ లో OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేయనుంది. లైనప్ లో భాగంగా OPPO Reno 10, OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ రానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన సమాచారం మన దగ్గర ఉంది. కానీ, ఇండియన్ వేరియంట్స్ కొన్ని మార్పులతో వస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా OPPO Reno 10 సిరీస్ లైవ్ ఇమేజెస్ […]

The post భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన OPPO Reno 10 సిరీస్ డిజైన్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 10 సిరీస్
  • లైనప్ లో రానున్న 3 మోడల్స్, ఇప్పటికే చైనాలో లాంచైన సిరీస్
  • తాజాగా లీకైన OPPO Reno 10 సిరీస్ ఇండియన్ వేరియంట్ డిజైన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO, త్వరలో భారత్ లో OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేయనుంది. లైనప్ లో భాగంగా OPPO Reno 10, OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ రానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన సమాచారం మన దగ్గర ఉంది. కానీ, ఇండియన్ వేరియంట్స్ కొన్ని మార్పులతో వస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా OPPO Reno 10 సిరీస్ లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చాయి.

భారత్ లో OPPO Reno 10 సిరీస్ డిజైన్

 

రెనో 10 ప్రో+ మాత్రమే చైనా మోడల్ మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని మేము ఇంతకు ముందు నివేదించాము. మేము ట్విలైట్ పర్పుల్ మరియు మూన్ సీ బ్లాక్‌లో మరియు అదే కెమెరా మాడ్యూల్‌తో Reno10 Pro+ని చూడగలము కాబట్టి ప్రత్యక్ష చిత్రాలు ఈ అవకాశాన్ని సూచిస్తాయి. స్మార్ట్‌ఫోన్ 3D కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కూడా ధృవీకరించబడింది. రెనో 10 మరియు రెనో 10 ప్రో విషయానికొస్తే, ఈ రెండు ఫోన్‌లు వేర్వేరు కెమెరా డిజైన్‌లతో వస్తాయని చెప్పబడింది, అయితే దానిని ధృవీకరించడానికి మా వద్ద చిత్రాలు లేవు.

డిజైన్‌తో పాటు, భారతదేశంలో ప్రారంభించబడుతున్న OPPO Reno10 సిరీస్‌లో మరిన్ని మార్పులు ఆశించబడ్డాయి.

OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • OPPO Reno10 సిరీస్ కెమెరా మరియు చిప్‌సెట్ విభాగాలలో కూడా కొన్ని తేడాలతో వస్తుందని చెప్పబడింది.
  • OPPO Reno10 Snapdragon 778G SoCకి బదులుగా MediaTek డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ద్వారా అందించబడుతుంది. రెనో 10 ప్రో కూడా రెనో 10 చిప్‌సెట్‌తో వస్తుంది. చైనాలో, Reno 10 Pro MediaTek Dimensity 8200 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
  • టాప్-ఎండ్ Reno10 Pro+ Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా అందించబడుతుంది. చైనీస్ మోడల్‌లో కూడా అదే ప్రాసెసర్ ఉన్నందున ఇక్కడ ఎటువంటి మార్పు లేదు.
  • నలుపు, నీలం మరియు ఊదా రంగు ఆప్షన్స్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి; గోల్డ్ కలర్ చైనాకు ప్రత్యేకంగా ఉంటుంది.
  • మూడు ఫోన్‌లు కూడా టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది.
  • Reno10 Pro+ చైనా వేరియంట్ లాగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని చెప్పబడినందున ఫాస్ట్ ఛార్జింగ్ పవర్‌లో ఎటువంటి మార్పు లేదు. రెనో 10 మరియు రెనో 10 ప్రో యొక్క చైనీస్ మోడల్‌లు రెండూ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ని కలిగి ఉన్నాయి మరియు భారతదేశంలో కూడా అదే తీరున ఉండే అవకాశం ఉంది.
  • మిగిలిన స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఇది రెనో 10 సిరీస్ యొక్క చైనీస్ మరియు గ్లోబల్ మోడళ్లు చాలావరకు ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తోన్న Vivo X90s; అఫీషియల్‌గా రివీలైన డిజైన్!

OPPO Reno10 సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్

OPPO Reno10 Pro సిరీస్ జూలైలో భారతదేశంలో లాంచ్ అవుతుందని మేం ముందే చెప్పడం జరిగింది. తాజా అప్డేట్ ప్రకారం, జూలై మధ్యలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కంపెనీ నుంచి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. అతి త్వరలో కంపెనీ నుంచి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన OPPO Reno 10 సిరీస్ డిజైన్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/oppo-reno-10-pro-plus-5g-specs-live-image-leaked/ Fri, 12 May 2023 08:41:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=6274 గతేడాది లాంచైన OPPO Reno 9 సిరీస్ కి సక్సెసర్ గా OPPO Reno 10 సిరీస్ త్వరలోనే చైనాలో లాంచ్ కానుంది. OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ రీసెంట్ గా బీఐఎస్ సర్టిఫికేషన్ పై కనిపించాయి. తాజాగా OPPO Reno 10 Pro+ ఫోన్ స్పెసిఫికేషన్స్, రియర్ డిజైన్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. గతంలో లీకైన 5కే రెండర్స్ తో తాజాగా బయటకు వచ్చిన పిక్స్ మ్యాచ్ అవుతున్నాయి. […]

The post లీకైన OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO Reno 10 Pro+ లైవ్ ఇమేజ్, కలర్ ఆప్షన్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వస్తోన్న OPPO Reno 10 Pro+
  • త్వరలోనే లాంచ్ కానున్న OPPO Reno 10 సిరీస్

గతేడాది లాంచైన OPPO Reno 9 సిరీస్ కి సక్సెసర్ గా OPPO Reno 10 సిరీస్ త్వరలోనే చైనాలో లాంచ్ కానుంది. OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ రీసెంట్ గా బీఐఎస్ సర్టిఫికేషన్ పై కనిపించాయి. తాజాగా OPPO Reno 10 Pro+ ఫోన్ స్పెసిఫికేషన్స్, రియర్ డిజైన్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. గతంలో లీకైన 5కే రెండర్స్ తో తాజాగా బయటకు వచ్చిన పిక్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఫోన్ వెనకాల ఓవల్-షేప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఈ ఫోన్ క్రీమ్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తుంది.

OPPO Reno 10 Pro+ లైవ్ ఇమేజ్

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లైవ్ ఇమేజ్ ని చూస్తే, ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్ లో కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ ఫోన్ టెలీఫోటో లెన్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ డివైజ్ మెటల్ ఫ్రేమ్ ని కలిగి ఉండనుంది. బాటమ్ లో స్పీకర్ గ్రిల్ ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. అయితే ఫోన్ యొక్క ముందు భాగం కనిపించలేదు. కానీ, పంచ్-హోల్ కటౌట్ ఉంటుందని భావిస్తున్నాం. అలాగే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

  • 1.5కే అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా.

ప్రాసెసర్, స్టోరేజీ, ర్యామ్

  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1
  • 16జిబి ర్యామ్
  • 256/512జిబి స్టోరేజీ

OPPO Reno 10 Pro+ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. ఇక 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభించనుంది.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 4700 ఎంఏహెచ్

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి సోని ఐఎంఎక్స్890
  • 32ఎంపి ఐఎంఎక్స్709

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 సెకండరీ లెన్స్, 64ఎంపి ఓవీ64బి సెన్సర్ ఉంటాయని సమాచారం. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఐఎంఎక్స్709 కెమెరా ఉండే అవకాశం ఉంది.

ఇక స్టాండర్డ్ వేరియంట్ అయిన OPPO Reno 10 5G డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. ఇది CPH2531 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇక ఈ లైనప్ లో వస్తోన్న 3 ఫోన్లు కూడా ఇప్పటికే సింగపూర్ ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందాయి. ఈ విషయాన్ని టిప్‌స్టర్ ముకుల్ శర్మ వెల్లడించారు.

The post లీకైన OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
3C సర్టిఫికేషన్ పై లిస్టైన OPPO Reno 10 Pro+, 100W ఫాస్ట్ చార్జింగ్‌‌తో వస్తోన్న డివైజ్! https://www.91mobiles.com/telugu/oppo-reno-10-pro-plus-5g-spotted-3c-certification-website-key-specs/ Tue, 25 Apr 2023 12:35:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=6027 ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. త్వరలో ఈ సంస్థ OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. తాజాగా ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు 3సీ సర్టిఫికేషన్ […]

The post 3C సర్టిఫికేషన్ పై లిస్టైన OPPO Reno 10 Pro+, 100W ఫాస్ట్ చార్జింగ్‌‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 10 Pro+
  • లైనప్ లో రానున్న OPPO Reno 10, OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+
  • తాజాగా 3సీ సర్టిఫికేషన్ డేటాబేస్ పై కనిపించిన OPPO Reno 10 Pro+

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. త్వరలో ఈ సంస్థ OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. తాజాగా ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి OPPO Reno 10 Pro+ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 10 Pro+ 3సీ సర్టిఫికేషన్

3సీ సర్టిఫికేషన్ అథారిటీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ని అవి మార్కెట్ లోకి రాకముందే టెస్ట్ చేసే సంస్థ. ఇది చైనాలో అధికారిక రెగ్యులేటరీ బాడీ గా ఉంది. ఇకపోతే OPPO Reno 10 Pro+ డివైజ్ PHU110 అనే మోడల్ నంబర్ తో 3సీ లిస్టింగ్ పై కనిపించింది. లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ 5జీ కనెక్టివిటీని కలిగి ఉండనుంది.

OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే:

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉండనున్నాయి.

ప్రాసెసర్:

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 10 Pro+ ఫోన్ ని కంపెనీ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ చేసే చాన్స్ ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: ఈ ఫోన్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనున్నాయి.

కెమెరా: ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 3C సర్టిఫికేషన్ పై లిస్టైన OPPO Reno 10 Pro+, 100W ఫాస్ట్ చార్జింగ్‌‌తో వస్తోన్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్; Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న Reno 10 Pro+ https://www.91mobiles.com/telugu/oppo-reno-10-series-key-specs-design-render/ Fri, 17 Feb 2023 13:38:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=4985 OPPO సంస్థ రీసెంట్ గా చైనాలో OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మూడు ఫోన్లను లాంచ్ చేసింది ఒప్పో. వీటిలో రెండు ఈ ఏడాదిలోనే లాంచ్ అవుతాయని రూమర్లు వినిపించాయి. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏంటంటే, ఒప్పో సంస్థ భారత్ లో OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేయడం లేదంట. దాని స్థానంలో 2023 లోనే OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ […]

The post లీకైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్; Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న Reno 10 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్
  • పెరిస్కోప్ కెమెరా సెన్సర్ తో వస్తోన్న OPPO Reno 10 Pro+ 5G
  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోన్న OPPO Reno 10 5G

OPPO సంస్థ రీసెంట్ గా చైనాలో OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మూడు ఫోన్లను లాంచ్ చేసింది ఒప్పో. వీటిలో రెండు ఈ ఏడాదిలోనే లాంచ్ అవుతాయని రూమర్లు వినిపించాయి. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏంటంటే, ఒప్పో సంస్థ భారత్ లో OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేయడం లేదంట. దాని స్థానంలో 2023 లోనే OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేయాలని ఒప్పో భావిస్తున్నట్లు సమాచారం.

OPPO Reno 10 సిరీస్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అవుతుంది. ఈ లైనప్ లో OPPO Reno 10, OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ 5G డివైజెస్ లాంచ్ కానున్నాయి.

2023 ద్వితీయార్థంలో OPPO Reno 10 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈలోపు OPPO Reno 10 సిరీస్ కి సంబంధించిన ఒక కొత్త నివేదిక బయటకు వచ్చింది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Reno 10 సిరీస్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. పదండి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

లీకైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్

OPPO 10 Pro+ 5G

స్టాండర్డ్ వేరియంట్ OPPO Reno 10 డివైజ్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2x పొట్రెయిట్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా సెన్సర్, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుందని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.

OPPO Reno 10 Pro+ 5G డివైజ్ 1.5కే డిస్ప్లే, 1220*2712 పిక్సెల్స్ రెజుల్యూషన్, 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా సెన్సర్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపింది. ఇదే కెమెరా సెన్సర్ ని రెనో 9 ప్రో+ 5జీ, వన్‌ప్లస్ 11 మరియు రియల్మీ జీటీ నియో 5 5జీ డివైజెస్ లో వాడారు. OPPO Reno 10 Pro+ 5G డివైజ్ పెరిస్కోప్ కెమెరా తో వస్తున్నట్లు సమాచారం.

OPPO Reno 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 4600 ఎంఏహెచ్ డ్యూయల్-సెల్ బ్యాటరీ యూనిట్ ఉంటుంది. ఈ ఫోన్ లో 80 వాట్ లేదా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OPPO Reno 10 Pro+ 5G యొక్క డిజైన్ రెండర్ కూడా రివీల్ అయ్యింది. దాన్ని చూస్తుంటే, కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ పిల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. త్వరలోనే OPPO Reno 10 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్; Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న Reno 10 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>