Realme 10 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 25 Jan 2023 06:36:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన Coca Cola ఫోన్ డిజైన్ రెండర్, త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ కానున్న డివైజ్ https://www.91mobiles.com/telugu/coca-cola-smartphone-render-leaked-looks-like-realme-10/ Wed, 25 Jan 2023 06:36:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=4636 అమెరికాకు చెందిన దిగ్గజ పానీయాల సంస్థ Coca Cola త్వరలోనే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ప్రవేశించబోతోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. త్వరలోనే Coca Cola స్మార్ట్ ఫోన్ భారతగడ్డపై అడుగు పెట్టబోతోంది. తన నుంచి రాబోవు స్మార్ట్ ఫోన్ కోసం ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో Coca Cola జట్టుకట్టినట్లు సమాచారం. ముకుల్ శర్మ Coca Cola స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ […]

The post లీకైన Coca Cola ఫోన్ డిజైన్ రెండర్, త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తొలిసారిగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో జట్టుకడుతోన్న Coca Cola కంపెనీ
  • భారత మార్కెట్ లో మార్చి లోపు లాంచ్ కానున్న Coca Cola స్మార్ట్ ఫోన్
  • డిజైన్ రెండర్స్ ని బట్టి, Realme 10 మాదిరి కనిపిస్తోన్న Coca Cola ఫోన్

అమెరికాకు చెందిన దిగ్గజ పానీయాల సంస్థ Coca Cola త్వరలోనే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ప్రవేశించబోతోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. త్వరలోనే Coca Cola స్మార్ట్ ఫోన్ భారతగడ్డపై అడుగు పెట్టబోతోంది. తన నుంచి రాబోవు స్మార్ట్ ఫోన్ కోసం ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో Coca Cola జట్టుకట్టినట్లు సమాచారం.

ముకుల్ శర్మ Coca Cola స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ రెండర్ ని షేర్ చేశాడు. ఫోన్ చూడటానికి రెడ్ కలర్ లో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై భారీ సైజులో కోకాకోలా బ్రాండింగ్ కనిపిస్తోంది. మార్చి లోపు Coca Cola స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని టిప్ స్టర్ వెల్లడించాడు. ఓసారి Coca Cola ఫోన్ డిజైన్ రెండర్ ని పరికించి చూద్దాం పదండి.

టిప్ స్టర్ షేర్ చేసిన డిజైన్ రెండర్స్ ని బట్టి, Coca Cola ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. కెమెరా లెన్స్‌లు ఫోన్ కి టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉన్నాయి. ఫోన్ చూడటానికి, Realme 10, Realme C33, Oppo A78 ఫోన్ల మాదిరి కనిపిస్తోంది. వాల్యూమ్ రాకర్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నట్లు డిజైన్ రెండర్ ద్వారా స్ఫష్టమవుతోంది.

అయితే Coca Cola ఫోన్ డిజైన్ పవర్ బటన్ యొక్క పొజిషన్ ని రివీల్ చేయలేదు. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంబెడ్ అయి ఉంటుందని మనం అంచనా వేయవచ్చు. Coca Cola ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై కోకా కోలా బ్రాండింగ్ అచ్చం కోకా కోలా కూల్‌డ్రింక్ బాటిల్ పై ఉన్నట్లే కనిపిస్తోంది. చూస్తుంటే, ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్రేడియంట్ టెక్షర్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

Realme 10 స్పెసిఫికేషన్స్

ఇక Realme 10 విషాయానికి వస్తే, రీసెంట్ గా ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచైంది. రియల్మీ 10 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 గ్రాఫిక్స్, 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1000 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

Realme 10 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇందులో 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్, టైప్-సీ పోర్ట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ సెన్సర్ ఉన్నాయి. 16ఎంపి సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు. క్లాష్ వైట్, రష్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ బరువు 178 గ్రాములు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Coca Cola ఫోన్ డిజైన్ రెండర్, త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Helio G99 చిప్, 16GB ర్యామ్ తో లాంచ్ అయిన Realme 10 https://www.91mobiles.com/telugu/realme-10-globally-launched-price-specs/ Wed, 09 Nov 2022 07:17:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=3326 హైలైట్స్ Realme 10 4G స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసిన రియల్మీ సంస్థ మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన Realme 10 త్వరలోనే భారత మార్కెట్ లో అడుగు పెట్టనున్న Realme 10 గత కొన్ని రోజులుగా ఊరిస్తోన్న Realme 10 లాంచ్ సమయం వచ్చేసింది. నేడు ఈ ఫోన్ ని Realme 10 గ్లోబల్ గా లాంచ్ చేసింది. త్వరలోనే […]

The post MediaTek Helio G99 చిప్, 16GB ర్యామ్ తో లాంచ్ అయిన Realme 10 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Realme 10 4G స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసిన రియల్మీ సంస్థ
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 8జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన Realme 10
  • త్వరలోనే భారత మార్కెట్ లో అడుగు పెట్టనున్న Realme 10

గత కొన్ని రోజులుగా ఊరిస్తోన్న Realme 10 లాంచ్ సమయం వచ్చేసింది. నేడు ఈ ఫోన్ ని Realme 10 గ్లోబల్ గా లాంచ్ చేసింది. త్వరలోనే భారత మార్కెట్ లోకి కూడా ఈ ఫోన్ అడుగు పెట్టబోతోంది. Realme 10 మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 8జిబి + 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. మరి Realme 10 యొక్క ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme 10 స్పెసిఫికేషన్స్

Realme 10 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో లాంచ్ అయ్యింది. ఇందులో పంచ్-హోల్ స్టైల్ కటౌట్ ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఇందులో ఉన్నాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే, మూడు వైపులా బెజెల్-లెస్ గా, బాటమ్ లో కాస్త చిన్ ఉన్నాయి. Realme 10 డిస్ప్లే 1000 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ని కలిగి ఉంది.

Realme 10 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత రియల్మీ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Realme 10 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ అమర్చారు. ఈ రియల్మీ డివైజ్ 8జిబి డైనమిక్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంతో ఆన్‌బోర్డ్ 8జిబి ర్యామ్ తో కలిపి మొత్తంగా 16జిబి ర్యామ్ లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ టెక్నాలజీని కలిగి ఉంది.

Realme 10 స్మార్ట్ ఫోన్ కెమెరా విభాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Realme 10 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ ఉన్నాయి. వీటికి తోడు 2 మెగా పిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సర్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Realme 10 లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం Realme 10 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Realme 10 ధర

Realme 10 స్మార్ట్ ఫోన్ మొత్తం 5 వేరియంట్లలో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర 229 డాలర్లు (సుమారు రూ. 18,500) గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 249 డాలర్లు (సుమారు రూ.20,200) గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర 269 డాలర్లు (సుమారు రూ.21,900) గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 279 డాలర్లు (సుమారు రూ.22,700), 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 299 డాలర్లు (సుమారు రూ.24,300) గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Helio G99 చిప్, 16GB ర్యామ్ తో లాంచ్ అయిన Realme 10 first appeared on 91Mobiles Telugu.

]]>
Realme 10 Pro 5G కర్వ్డ్ డిస్ప్లే ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/realme-10-pro-curved-display-teased-by-company/ Fri, 04 Nov 2022 08:02:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=3241 హైలైట్స్ త్వరలో లాంచ్ కానున్న Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈ లైనప్ లో రానున్న Realme 10, Realme 10 Pro, Realme 10 Pro+ 5G లాంచ్ కి ముందు కర్వ్డ్ డిస్ప్లేని టీజ్ చేసిన Realme Realme కంపెనీ త్వరలో Realme 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ లైనప్ లో Realme 10, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G […]

The post Realme 10 Pro 5G కర్వ్డ్ డిస్ప్లే ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో లాంచ్ కానున్న Realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్
  • ఈ లైనప్ లో రానున్న Realme 10, Realme 10 Pro, Realme 10 Pro+ 5G
  • లాంచ్ కి ముందు కర్వ్డ్ డిస్ప్లేని టీజ్ చేసిన Realme

Realme కంపెనీ త్వరలో Realme 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ లైనప్ లో Realme 10, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G అనే మోడల్స్ ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్ అయిన Realme 10 భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో 2022, నవంబర్ 9 న లాంచ్ అవుతోంది. ఇక ప్రో వేరియంట్స్ అదే సమయంలో లేదా తర్వాత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నేడు రియల్మీ కంపెనీ Realme 10 Pro 5G/Realme 10 Pro+ 5G యొక్క కర్వ్డ్ డిస్ప్లేని టీజ్ చేసింది. అయితే రెండు ప్రో వేరియంట్స్ లో ఏది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుందో తెలియదు. లేదంటే రెండు ప్రో మోడల్స్ కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నాయేమో చూడాలి.

Realme 10 Pro 5G/Realme 10 Pro+ 5G కర్వ్డ్ డిస్ప్లే ఫస్ట్ లుక్

పైన ప్రమోషనల్ పోస్టర్ లో కనిపిస్తోన్న విధంగా Realme 10 Pro డివైజ్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. Realme 10 Pro అమోలెడ్ ప్యానెల్ 90హెర్ట్జ్/120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు సమాచారం. అలాగే ప్యానెల్ రెజుల్యూషన్ ఫుల్ హెచ్డీ+ అయి ఉంటుందని అంచనా వేయవచ్చు.

Realme 10 స్పెసిఫికేషన్స్

Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్స్ ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. అయితే స్టాండర్డ్ వేరియంట్ Realme 10 లాంచ్ అవ్వడం ఖాయమైంది. అఫీషియల్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఓసారి ఆ స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Realme 10 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. Realme 10 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ని వినియోగించారు. ఈ డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కెమెరా విభాగం విషయానికి వస్తే, Realme 10 తో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి.

Realme 10 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ని అందించారు. Realme 10 లో డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ ఉంటుంది. 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ Realme 10 లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Realme 10 Pro 5G కర్వ్డ్ డిస్ప్లే ని అఫీషియల్ గా టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 చిప్సెట్, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-10-key-specs-revealed-by-vice-president-madhav-seth/ Thu, 03 Nov 2022 05:42:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=3208 హైలైట్స్ లాంచ్ కి ముందు ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసిన రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme 10 2022, నవంబర్ 9 న లాంచ్ అవుతోన్న Realme 10 స్మార్ట్ ఫోన్ Realme 10 లైనప్ ని లాంచ్ చేసేందుకు రియల్మీ సంస్థ సిద్దంగా ఉంది. భారత్ తో పాటు చైనా, యూరోప్ తదితర […]

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 చిప్సెట్, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లాంచ్ కి ముందు ప్రధాన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసిన రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme 10
  • 2022, నవంబర్ 9 న లాంచ్ అవుతోన్న Realme 10 స్మార్ట్ ఫోన్

Realme 10 లైనప్ ని లాంచ్ చేసేందుకు రియల్మీ సంస్థ సిద్దంగా ఉంది. భారత్ తో పాటు చైనా, యూరోప్ తదితర మార్కెట్స్ లో ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ ఉండనున్నాయి. అవి: Realme 10, Realme 10 Pro 5G, Realme 10 Pro+ 5G. గతంలో మాదిరి ఈ సిరీస్ ని కూడా ప్లాన్ చేస్తే గనుక, వీటికి తోడు మరిన్ని మోడల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ Realme 10 యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని వెల్లడించారు.

అధికారికంగా వెల్లడైన Realme 10 ముఖ్యమైన స్పెసిఫికేషన్స్

 

GSMArena కి ఇచ్చిన ఇంటర్వ్యూలో Realme 10 కి సంబంధించిన పలు వివరాలను మాధవ్ సేఠ్ వెల్లడించారు. Realme 10 మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 16జిబి డైనమిక్ ర్యామ్ (8జిబి ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్), 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోందని మాధవ్ సేఠ్ తెలిపారు.

గత మోడల్ అయిన Realme 9 లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంది. కానీ, Realme 10 లో ఉండే 50 మెగా పిక్సెల్ కెమెరా చక్కటి పనితనాన్ని ప్రదర్శిస్తుందని మాధవ్ అన్నారు. Realme 10 డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని మాధవ్ వెల్లడించారు. గేమింగ్ తో సహా, ఫోన్ ని హెవీ యూజ్ చేసినా బ్యాటరీ పూర్తిగా ఒక రోజు మొత్తం వస్తుందని తెలుస్తోంది. 28 నిమిషాల్లో Realme 10 ఫోన్ 0% నుండి 50% వరకు చార్జ్ అవుతుందని మాధవ్ చెప్పారు.

Realme 10 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 10 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ని ఇందులో అమర్చారు. పవర్ బ్యాకప్ కోసం Realme 10 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు Realme 10 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్ ఉంటాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. Realme 10 159.9 మిల్లీ మీటర్ల పొడవు, 73.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.95 మిల్లీ మీటర్ల మందం, 178 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన Realme 10 చిప్సెట్, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
డిజైన్, డిస్ప్లే, పెర్ఫామెన్స్ పరంగా మెరుగైన టెక్నాలజీతో వస్తోన్న Realme 10 సిరీస్ https://www.91mobiles.com/telugu/realme-10-launch-timeline-specs-tipped/ Thu, 27 Oct 2022 16:07:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=3110 హైలైట్స్ నవంబర్ లో లాంచ్ కానున్న Realme 10 సిరీస్ డిజైన్, డిస్ప్లే, పెర్ఫామెన్స్ పరంగా కొత్త టెక్నాలజీతో Realme 10 సిరీస్ వస్తున్నట్లు ప్రకటించిన వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో రానున్న Realme 10 Pro+ Realme కంపెనీ తన Realme 9 సిరీస్ లో ఇప్పటి వరకు 7 స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ Realme 10 సిరీస్ ని లాంచ్ […]

The post డిజైన్, డిస్ప్లే, పెర్ఫామెన్స్ పరంగా మెరుగైన టెక్నాలజీతో వస్తోన్న Realme 10 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ లో లాంచ్ కానున్న Realme 10 సిరీస్
  • డిజైన్, డిస్ప్లే, పెర్ఫామెన్స్ పరంగా కొత్త టెక్నాలజీతో Realme 10 సిరీస్ వస్తున్నట్లు ప్రకటించిన వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో రానున్న Realme 10 Pro+

Realme కంపెనీ తన Realme 9 సిరీస్ లో ఇప్పటి వరకు 7 స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ Realme 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఈ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో Realme 10, Realme 10 Pro, Realme 10 Pro+ అనే మోడల్స్ ఉండనున్నాయి.

Realme 10 సిరీస్ లాంచ్ కి సంబంధించిన సమాచారాన్ని రియల్మీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ ఇచ్చారు. Realme 10 సిరీస్ నవంబర్ లో లాంచ్ అవుతుందని ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. లాంచ్ సమాచారం ఇవ్వడంతో పాటు, Realme 10 సిరీస్ పెర్ఫామెన్స్, డిజైన్, డిస్ప్లే విషయంలో కొత్త టెక్నాలజీతో రాబోతుందని ఆయన చెప్పారు.

Realme 10 Pro+

ప్రస్తుతం ఇక్కడ చెప్పుకోబోయే సమాచారం రియల్మీ కంపెనీ నుంచి అధికారికంగా వచ్చింది కాదు. ఇది కొన్ని లీకుల ద్వారా బహిర్గతమైన సమాచారం. ఆ సమాచారం ప్రకారం, Realme 10 Pro+ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో రానుందని తెలుస్తోంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ని కూడా Realme 10 సిరీస్ లో వాడే అవకాశం ఉందని ఇదివరకు వార్తలు వచ్చాయి. లాంచ్ తర్వాతే ఈ విషయాలపై పూర్తి క్లారిటీ రానుంది.

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే, ఈ స్మార్ట్ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని తెలుస్తోంది. అలాగే ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుందని సమాచారం. ఇంకా Realme 10 స్టాండర్డ్ వేరియంట్ లో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ స్టాండర్డ్ మోడల్ లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనుంది. Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ ఉంటాయని లీకైన వార్తల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సమాచారమే కచ్చితమైనదని చెప్పలేం. రానున్న రోజుల్లో కంపెనీ నుంచి ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన టీజర్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు స్పెసిఫికేషన్స్ పై మరింత స్పష్టత వస్తుంది.

Realme 10 సిరీస్ యొక్క లాంచ్ తేదీకి సంబంధించిన అధికార ప్రకటన కంపెనీ నుంచి రావాల్సి ఉంది. ఇక Realme 10 సిరీస్ యొక్క ధరల స్థాయిని గురించి మాట్లాడితే, స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.13,000 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే హై-ఎండ్ వర్షన్ ధర రూ.25,000 గా ఉండే అవకాశం ఉంది. లాంచ్ తర్వాతే అసలైన ధరలు బయటకు వస్తాయి. ఇది కేవలం అంచనా మాత్రమే.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిజైన్, డిస్ప్లే, పెర్ఫామెన్స్ పరంగా మెరుగైన టెక్నాలజీతో వస్తోన్న Realme 10 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Realme 10 రెండర్స్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-10-renders-specs-leaked-before-launch/ Tue, 25 Oct 2022 14:59:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=3063 హైలైట్స్ రెండర్స్ ద్వారా లీకైన Realme 10 ఫీచర్లు, డ్యూయల్ కెమెరాస్, పింక్, గ్రే కలర్ ఆప్షన్స్ లో వస్తున్న హ్యాండ్సెట్ 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ Realme 10 లో ఉండే అవకాశం వచ్చే నెల చైనాలో Realme 10 లాంచ్ అవుతుందని అంచనా OnLeaks తో కలిసి 91mobiles మీ ముందుకు Realme 10 రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ని ఎక్స్‌క్లూజివ్ […]

The post లీకైన Realme 10 రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రెండర్స్ ద్వారా లీకైన Realme 10 ఫీచర్లు, డ్యూయల్ కెమెరాస్, పింక్, గ్రే కలర్ ఆప్షన్స్ లో వస్తున్న హ్యాండ్సెట్
  • 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ Realme 10 లో ఉండే అవకాశం
  • వచ్చే నెల చైనాలో Realme 10 లాంచ్ అవుతుందని అంచనా

OnLeaks తో కలిసి 91mobiles మీ ముందుకు Realme 10 రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ని ఎక్స్‌క్లూజివ్ గా తీసుకొచ్చింది. Realme 10 నవంబర్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో లాంచ్ కి ముందు కీలక స్పెసిఫికేషన్స్ మనకు తెలిసినట్లైంది. డ్యూయల్ కెమెరాలు, గ్లాసీ ఫినిషింగ్ తో కూడిన బ్యాక్ ప్యానెల్, రెండు కలర్ ఆప్షన్స్ తో Realme 10 వస్తోంది. కొత్త లైనప్ చైనాతో పాటు భారత్ లో నవంబర్ మొదటి వారంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. Realme 10 సిరీస్ లో Realme 10 5G, Realme 10 Pro మోడల్స్ ఉండనున్నాయి.

రెండర్స్ ని చూస్తే, Realme 10 పింక్, గ్రే కలర్ ఆప్షన్స్ లో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై రియల్మీ లోగోని కూడా గమనించవచ్చు. ఇకపోతే లీక్‌స్టర్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. Realme 10 అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Realme 10 డిజైన్

Realme 10 రెండర్స్ ఫోన్ యొక్క రియర్ ప్యానెల్ ని చూపిస్తున్నాయి. ఫ్లాట్ ఎడ్జెస్, రియల్మీ లోగో, గ్లాసీ ఫినిషింగ్, పాలి కార్బొనేట్ బాడీ మనకు కనిపిస్తోంది. అలాగే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెపరేట్ రింగ్స్ లో రెండు కెమెరాలు ఉన్నాయి. 50ఎంపి ఏఐ కెమెరా అని మాడ్యూల్ పై రాసి ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. Realme 10 బ్లాక్, పింక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని రెండర్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.

Realme 10 స్పెసిఫికేషన్స్

ఆన్‌లీక్స్ ప్రకారం, Realme 10 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. Realme 10 మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ని కలిగి ఉంటుందని సమాచారం. ఓ పోస్టర్ ఇమేజ్ ద్వారా ఈ చిప్సెట్ వివరాలు తెలిశాయి. ఇకపోతే Realme 10 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండనుంది. ఎక్స్‌పాండబుల్ మెమొరీ సౌకర్యం ఈ ఫోన్ లో ఉండనుంది.

Realme 10 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉండనుంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం. Realme 10 లో 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Realme 10 లాంచ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హ్యాండ్సెట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Realme 10 రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
పోస్టర్స్ ద్వారా రివీల్ అయిన Realme 10 లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ https://www.91mobiles.com/telugu/realme-10-series-specs-design-leaked-via-poster/ Thu, 20 Oct 2022 12:33:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=2994 హైలైట్స్ ఆన్‌లైన్ లో ప్రత్యక్షమైన Realme 10 పోస్టర్, రివీల్ అయిన డిజైన్, కలర్స్, స్పెసిఫికేషన్స్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Realme 10 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ చిప్సెట్స్ తో రానున్న Realme 10 సిరీస్ Realme 10 సిరీస్ లాంచ్ సమయం సమీపిస్తోంది. అయితే మనం అంతవరకు వేచి చూడక్కర్లేకుండా ఈలోపే ఈ సిరీస్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ […]

The post పోస్టర్స్ ద్వారా రివీల్ అయిన Realme 10 లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఆన్‌లైన్ లో ప్రత్యక్షమైన Realme 10 పోస్టర్, రివీల్ అయిన డిజైన్, కలర్స్, స్పెసిఫికేషన్స్
  • బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Realme 10
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ చిప్సెట్స్ తో రానున్న Realme 10 సిరీస్

Realme 10 సిరీస్ లాంచ్ సమయం సమీపిస్తోంది. అయితే మనం అంతవరకు వేచి చూడక్కర్లేకుండా ఈలోపే ఈ సిరీస్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ బయటకు వచ్చాయి. ఈ లైనప్ లో Realme 10 మరియు Realme 10 Pro+ 5G మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలె Realme 10 Pro+ డివైజ్ సీక్యూసీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ లో దర్శనమిచ్చింది. Realme 10 సిరీస్ లో ఓఐఎస్ తో కూడిన 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుందని తెలుస్తోంది.

లీక్స్ ద్వారా Realme 10 నుంచి ఏమి ఆశించవచ్చో తెలిసిపోయింది. అయితే లేటెస్ట్ లీక్ ద్వారా హ్యాండ్సెట్స్ కి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme 10 డిజైన్ లీక్

లీకైన టీజర్ ని బట్టి, Realme 10 సిరీస్ ఫోన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. అవి: నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్. బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో రియల్మీ బ్రాండింగ్ ఉంది. చూడటానికి ఈ రియల్మీ ఫోన్లు ఐకూ జెడ్6, ఐకూ జెడ్6 ప్రో మాదిరి కనిపిస్తున్నాయి.

మరొక టీజర్ లో Realme 10 యొక్క చైనా లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. నవంబర్ 3 న జరిగే 10 వ చైనా మొబైల్ గ్లోబల్ పార్ట్నర్ కాన్ఫరెన్స్ లో Realme 10 సిరీస్ లాంచ్ కానుంది.

ఈ లైనప్ లో Realme 10 మరియు Realme 10 Pro+ 5G మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలె Realme 10 Pro+ డివైజ్ సీక్యూసీ మరియు బీఐఎస్ సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ లో దర్శనమిచ్చింది.

Realme 10 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 10 సిరీస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్స్ కలిగి ఉండనున్నాయి. Realme 10 సిరీస్ మోడల్ ని బట్టి, మీడియాటెక్ హీలియో జీ92 చిప్సెట్ లేదా డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme 10 సిరీస్ లో ఓఐఎస్ తో కూడిన 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. Realme 10 సిరీస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి రహస్యంగానే ఉన్నాయి. చిప్సెట్స్ ని బట్టి చూస్తే, రియల్మీ 10 సిరీస్ ధరలు తక్కువ బడ్జెట్ లోనే ఉంటాయని అర్థమవుతోంది. అయితే లీక్స్ ద్వారా మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post పోస్టర్స్ ద్వారా రివీల్ అయిన Realme 10 లాంచ్ తేదీ, ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Realme 10 సిరీస్ కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వివరాలు https://www.91mobiles.com/telugu/realme-10-series-storage-color-options-tipped-before-launch/ Mon, 17 Oct 2022 15:19:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2932 హైలైట్స్ 2022 చివరి కల్లా భారత్ లో లాంచ్ కానున్న Realme 10 సిరీస్ 128జిబి స్టోరేజీతో వస్తున్న Realme 10, 256జిబి స్టోరేజీతో వస్తున్న Realme 10 Pro+ నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్, హైపర్‌స్పేస్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Realme 10 సిరీస్ ఈ ఏడాది ఆరంభంలో, రియల్మీ సీఈవో మాధవ్ సేఠ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2022 చివరి కల్లా Realme 10 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేస్తామని […]

The post లాంచ్ కి ముందు లీకైన Realme 10 సిరీస్ కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2022 చివరి కల్లా భారత్ లో లాంచ్ కానున్న Realme 10 సిరీస్
  • 128జిబి స్టోరేజీతో వస్తున్న Realme 10, 256జిబి స్టోరేజీతో వస్తున్న Realme 10 Pro+
  • నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్, హైపర్‌స్పేస్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Realme 10 సిరీస్

ఈ ఏడాది ఆరంభంలో, రియల్మీ సీఈవో మాధవ్ సేఠ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2022 చివరి కల్లా Realme 10 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేస్తామని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ తర్వాత వరుసగా పలు లీక్స్ నెట్టింట్లో హడావుడి చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా Realme 10 సిరీస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్ పై కనిపించింది. తాజాగా ప్రముఖ టిప్ స్టర్ సుదాన్శు అంబోరే Realme 10 సిరీస్ యొక్క ర్యామ్, స్టోరేజీ వివరాలను లీక్ చేశాడు. అలాగే కలర్ ఆప్షన్స్ ని కూడా బహిర్గతం చేశాడు.

Realme 10 సిరీస్ నుంచి ఏం ఆశించవచ్చు?

లీకైన సమాచారాన్ని బట్టి, Realme 10 సిరీస్ రియల్మీ స్టాండర్డ్ వర్షన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఇక హైఎండ్ ఫోన్ Realme 10 Pro+ 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్లలో లభ్యమవుతుంది.

కలర్స్ విషయానికి వస్తే, Realme 10 రష్ బ్లాక్, క్లాష్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. మరోవైపు Realme 10 Pro+ 5G నెబులా బ్లూ, డార్క్ మ్యాటర్, హైపర్ స్పేస్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Realme 10 ఒక 4జి స్మార్ట్ ఫోన్. ఎంట్రీ లెవెల్ 5జీ స్మార్ట్ ఫోన్ తో పోల్చితే ఈ ఫోన్ విభిన్నంగా ఉండనుంది. Realme 10 మీడియాటెక్ హీలియో జీ99 4జీ చిప్ తో వస్తోంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ తో వస్తోంది. దీంతో పాటు ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ డిస్ప్లే ని ఈ ఫోన్ కలిగి ఉండనుంది. అలాగే హై-రెజుల్యూషన్ కెమెరా సెన్సర్ ని ఇందులో వాడనున్నట్లు సమాచారం. ఆప్టికల్ ఇమేజ్ స్టబిలైజేషన్ ఫీచర్ కూడా ఈ కెమెరాలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రో వర్షన్ 60 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

రూ.10,000 ఆపై ధరతో 5జీ ఫోన్లనే తీసుకు రావాలని భారత ప్రభుత్వం ఇటీవలె మొబైల్ ఫోన్ సంస్థలకు సూచించింది. సదరు సంస్థలు కూడా అదే పని చేస్తామని మాటిచ్చాయి. మరి ఇలాంటి తరుణంలో రియల్మీ 10 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.10,000 లోపు ధరతో వస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇదొక 4జీ ఫోన్. దీని ధర కచ్చితంగా రూ.10,000 లోపు ఉండాల్సిందే. ఇప్పుడు మొబైల్ ఫోన్ యూజర్లు 5జీ ఫోన్లను కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో 4జీ ఫోన్లను ఇకపై తీసుకు రాకపోవడమే మంచిది. కానీ, ఇంకా కొన్ని సంస్థలు వరుసబెట్టి 4జీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇలా అయితే భారతదేశంలో 5జీ యూజర్లు పెరగడం కష్టమే.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన Realme 10 సిరీస్ కలర్ ఆప్షన్స్, స్టోరేజీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>