Realme GT Neo 5 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:46:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన Realme GT Neo 5 SE డిస్ప్లే, కెమెరా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-se-specifications-leaked-launch-imminent/ Thu, 23 Feb 2023 08:19:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=5066 Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా లాంచైంది. 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ కి లైట్ వర్షన్ Realme GT Neo 5 SE త్వరలో లాంచ్ కానుందని సమాచారం. Realme GT Neo 5 SE ని రియల్మీ లాంచ్ చేయనుందని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజెస్ తాజాగా టిప్‌స్టర్ డిజిటల్ […]

The post లీకైన Realme GT Neo 5 SE డిస్ప్లే, కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్
  • 1.5కే డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి కెమెరాతో రానున్న Realme GT Neo 5 SE
  • స్టాండర్డ్ వర్షన్ కి లైట్ వేరియంట్ గా వస్తోన్న Realme GT Neo 5 SE

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా లాంచైంది. 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ కి లైట్ వర్షన్ Realme GT Neo 5 SE త్వరలో లాంచ్ కానుందని సమాచారం. Realme GT Neo 5 SE ని రియల్మీ లాంచ్ చేయనుందని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజెస్ తాజాగా టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసింది.

Realme GT Neo 5 SE ఏప్రిల్ లో చైనాలో లాంచ్ అవుతుందని సమాచారం. దీనికి సంబంధించి అధికార ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మార్చిలో చైనాలో లాంచ్ కానున్న Redmi Note Turbo పోటీగా Realme GT Neo 5 SE మార్కెట్ లోకి వస్తోంది.

Realme GT Neo 5 SE డిజైన్ (లీక్డ్)

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ రెండర్ ద్వారా రియర్ డిజైన్ రివీల్ అయ్యింది. బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా, ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. బ్యాక్ ప్యానెల్ పై కుడివైపున సీ-షేప్డ్ యూనిట్ లో ఆర్జీబీ లైటింగ్ లేదా ట్రాన్స్‌పరెంట్ కవర్ ఉండవని టిప్‌స్టర్ చెబుతోంది. ఫోన్ వైట్ కలర్ లో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై Matrix porf 1.79f/efl 25mm అనే టెక్స్ట్ రాసి ఉంది.

Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Realme GT Neo 5 SE లో స్పెసిఫికేషన్స్ దాదాపుగా Realme GT Neo 5 ని పోలి ఉంటాయి. Realme GT Neo 5 SE లో 1.5 కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో Qualcomm SM7475 చిప్ ఉండనుంది. ఇది Snapdragon 7+ Gen 1 చిప్ అయ్యుండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది.

Realme GT Neo 5 SE లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్ కి బదులుగా, 64ఎంపి OV64M ప్రైమరీ కెమెరా సెన్సర్ ని ఈ ఫోన్ లో అందిస్తున్నారు. Realme GT Neo 5 SE హ్యాండ్సెట్ కి సంబంధించిన అధికార ప్రకటన, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Realme GT Neo 5 SE డిస్ప్లే, కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
240వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన Realme GT Neo 5 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-240w-150w-launched-china-price-specs/ Fri, 10 Feb 2023 05:55:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=4861 గత కొన్ని వారాలుగా నెట్టింట్లో Realme GT Neo 5 ఫోన్ హల్‌చల్ చేస్తోంది. కంపెనీ కూడా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు Realme GT Neo 5 ని రియల్మీ సంస్థ చైనాలో లాంచ్ చేసింది. ఈ డివైజ్ 150 వాట్ చార్జింగ్ స్పీడ్ మరియు 240 వాట్ చార్జింగ్ స్పీడ్ తో వచ్చింది. 240 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన మొదటి రియల్మీ ఫోన్ ఇదే. […]

The post 240వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్
  • రెండు వేరియంట్లలో వచ్చిన Realme GT Neo 5 హ్యాండ్సెట్
  • Realme GT 3 పేరుతో గ్లోబల్ గా లాంచ్ కానున్న Realme GT Neo 5

గత కొన్ని వారాలుగా నెట్టింట్లో Realme GT Neo 5 ఫోన్ హల్‌చల్ చేస్తోంది. కంపెనీ కూడా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు Realme GT Neo 5 ని రియల్మీ సంస్థ చైనాలో లాంచ్ చేసింది. ఈ డివైజ్ 150 వాట్ చార్జింగ్ స్పీడ్ మరియు 240 వాట్ చార్జింగ్ స్పీడ్ తో వచ్చింది.

240 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన మొదటి రియల్మీ ఫోన్ ఇదే. అలాగే మరే ఇతర కంపెనీ కూడా ఈ ఫీచర్ గత ఫోన్ ని ఇప్పటి వరకు తీసుకురాలేదు. భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో రియల్మీ కంపెనీ ఈ డివైజ్ ని Realme GT 3 పేరుతో తీసుకురానుందని సమాచారం. రీసెంట్ గా రియల్మీ GT 3 స్మార్ట్ ఫోన్ ని తన ట్విట్టర్ హ్యాండిల్ పై టీజ్ చేసింది.

చైనాలో Realme GT Neo 5 ధర, లభ్యత

రియల్మీ సంస్థ Realme GT Neo 5 యొక్క రెండు వేరియంట్స్ ని లాంచ్ చేసింది. అవి: 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్. 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ 8జిబి + 256జిబి మోడల్ ధర CNY (సుమారు రూ.30,500) గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర CNY 2699 (సుమారు రూ.32,900) గా ఉంది. 16జిబి + 256జిబి వేరియంట్ ధర CNY 2899 (సుమారు రూ.35,300) గా ఉంది.

240 వాట్ వేరియంట్ 16జిబి + 256జిబి మోడల్ ధర CNY 3199 (సుమారు రూ.39,000), 16జిబి + 1టిబి మోడల్ ధర CNY 3499 (సుమారు రూ.42,600) గా ఉంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. ఫిబ్రవరి 15 నుంచి చైనాలో అఫీషియల్ గా రియల్మీ సేల్ ని ప్రారంభించనుంది.

Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్

Realme GT Neo 5 లో 6.7-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ యూహెచ్‌ఎఫ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 5000000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. కొత్త తరం ఫ్లాగ్షిప్ లుమినిసెంట్ మెటీరియల్ ని ఈ ఫోన్ లో వాడారు.

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 16జిబి ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ అందించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Realme GT Neo 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా ఉంటుంది. 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియల్మీ హైపర్‌షాట్ 2.0, టర్బో ‘రా’ లాస్ లెస్ ఇమేజ్ ఆల్గారిథమ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme GT Neo 5 240W వేరియంట్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 8 నిమిషాల సమయం తీసుకుంటుంది. 150 వాట్ వేరియంట్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి 16 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ఫోన్ లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బి అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఇంకా ఆర్జీబీ బ్రీథింగ్ లైట్ బ్యాక్ ప్యానెల్ పై ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 240వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8+ Gen 1 చిప్, Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న Realme GT Neo 5 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-to-launch-with-snapdragon-8-plus-gen-1-chipset-and-sony-imx890-sensor/ Thu, 02 Feb 2023 08:38:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=4754 Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 9 న చైనాలో లాంచ్ అవుతోంది. ఈ డివైజ్ భారత్ లో ఇదే ఏడాది లాంచ్ అవ్వనుంది. అయితే కచ్చితమైన సమయం తెలియలేదు. రియల్మీ నుంచి దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోపే, కంపెనీ Realme GT Neo 5 యొక్క డిజైన్ ని రివీల్ చేసింది. Realme GT Neo 5 పర్పుల్ ఫ్యాంటసీ కలర్ ఆప్షన్ లో […]

The post Snapdragon 8+ Gen 1 చిప్, Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో ఫిబ్రవరి 9 న లాంచ్ అవుతోన్న Realme GT Neo 5
  • భారత్ లో ఇదే ఏడాది లాంచ్ కానున్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్
  • ట్రిపుల్ కెమెరా సెటప్ కి పక్కన RGB లైట్స్ సెటప్ తో వస్తోన్న Realme GT Neo 5

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 9 న చైనాలో లాంచ్ అవుతోంది. ఈ డివైజ్ భారత్ లో ఇదే ఏడాది లాంచ్ అవ్వనుంది. అయితే కచ్చితమైన సమయం తెలియలేదు. రియల్మీ నుంచి దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోపే, కంపెనీ Realme GT Neo 5 యొక్క డిజైన్ ని రివీల్ చేసింది.

Realme GT Neo 5 పర్పుల్ ఫ్యాంటసీ కలర్ ఆప్షన్ లో లాంచ్ కానుంది. టీజర్స్ ద్వారా ఫోన్ కి సంబంధించిన కొన్ని ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme GT Neo 5 డిజైన్, స్పెసిఫికేషన్స్

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ ఎన్నో అప్‌గ్రేడ్స్ తో రానుంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్పెక్స్ తో ఈ ఫోన్ వస్తోంది. లేటెస్ట్ టీజర్ ప్రకారం, Realme GT Neo 5 ఫోన్ సరికొత్త పర్పుల్ కలర్ ఆప్షన్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. కర్వ్డ్ రియర్ ప్యానెల్ ఏజీ గ్లాస్ టెక్నాలజీతో వస్తోంది. అలాగే ఇది పర్పుల్ కలర్ ఆప్షన్ లో మ్యాట్ ఫినిష్ ని అందించనుంది.

Realme GT Neo 5 ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ క్రింద మనం నిలువుగా ఉన్న చారలను గమనించవచ్చు. కెమెరా సెన్సర్స్ మరియు ఆర్జీబీ లైట్స్ కోసం బ్యాక్ ప్యానెల్ పై భాగాన భారీ ఐల్యాండ్ ఉంది. రెండు సర్క్యులర్ కెమెరా కటౌట్స్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ ఉంటుంది.

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ వాడారు. త్వరలో లాంచ్ కానున్న OnePlus 11R 5G లో ఇదే చిప్సెట్ వాడటం జరిగింది. ఈ డివైజ్ Sony IMX890 50MP కెమెరాతో వస్తున్నట్లు రియల్మీ ఖరారు చేసింది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ తో వస్తోంది.

Realme GT Neo 5 హైలైట్ గా నిలవనున్న 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

Realme GT Neo 5 ఫోన్ లో హైలైట్ గా నిలుస్తున్న ఫీచర్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ. ఈ చార్జింగ్ టెక్నాలజీ అన్ని భద్రత ప్రమాణాలను పాటిస్తూ, ఉత్తమైన అనుభూతిని పంచుతుందని కంపెనీ చెబుతోంది. TUV Rheinland నుంచి సేఫ్ ఫాస్ట్ చార్జింగ్ సర్టిఫికేషన్ ని కూడా ఈ ఫోన్ పొందింది. సూపర్‌వూక్ చార్జింగ్ టెక్నాలజీ కేవలం 30 సెకన్ల చార్జ్ తో 2 గంటల కాలింగ్ టైమ్ ని అందిస్తుంది.

ఇతర వివరాలను చూస్తే, Realme GT Neo 5 లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme GT Neo 5 లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ అందించారు. మిగతా ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిప్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8+ Gen 1 చిప్, Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 9న లాంచ్ అవుతోన్న Realme GT Neo 5; 240W ఫాస్ట్ చార్జింగ్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-to-launch-with-240w-fast-charging/ Tue, 31 Jan 2023 10:57:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=4708 ఈ నెల ప్రారంభంలో రియల్మీ సంస్థ తన 240 వాట్ చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. అలాగే రాబోవు ఫ్లాగ్షిప్ డివైజెస్ లో ఈ టెక్నాలజీని వాడబోతున్నట్లు స్పష్టం చేసింది. త్వరలో రియల్మీ నుంచి రానున్న Realme GT Neo 5 ఫోన్ లో ఈ 240 వాట్ చార్జింగ్ టెక్నాలజీని వాడనున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు రియల్మీ స్వయంగా ఓ ప్రకటన చేసింది. త్వరలో తన నుంచి రాబోవు డివైజ్ లో 240 […]

The post ఫిబ్రవరి 9న లాంచ్ అవుతోన్న Realme GT Neo 5; 240W ఫాస్ట్ చార్జింగ్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Realme GT Neo 5 లాంచ్ తేదీని ప్రకటించిన రియల్మీ సంస్థ
  • భారత్ లో ఫిబ్రవరి 9 న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతోన్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్
  • Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు టీజర్ ద్వారా ఖరారు

ఈ నెల ప్రారంభంలో రియల్మీ సంస్థ తన 240 వాట్ చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. అలాగే రాబోవు ఫ్లాగ్షిప్ డివైజెస్ లో ఈ టెక్నాలజీని వాడబోతున్నట్లు స్పష్టం చేసింది. త్వరలో రియల్మీ నుంచి రానున్న Realme GT Neo 5 ఫోన్ లో ఈ 240 వాట్ చార్జింగ్ టెక్నాలజీని వాడనున్నట్లు రూమర్ల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడు రియల్మీ స్వయంగా ఓ ప్రకటన చేసింది. త్వరలో తన నుంచి రాబోవు డివైజ్ లో 240 వాట్ చార్జింగ్ టెక్నాలజీ ఉండనున్నట్లు తెలిసింది.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో రియల్మీ సంస్థ Realme GT Neo 5 ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు రీసెంట్ గా Pricebaba ఒక కథనాన్ని వెలువరించింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 మధ్య బార్సిలోనా లో జరగనుంది. అయితే, Realme GT Neo 5 కోసం రియల్మీ వద్ద వేరొక ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Realme GT Neo 5 నుంచి ఏమి ఆశించవచ్చో తెలుసుకుందా పదండి.

Realme GT Neo 5 లాంచ్ తేదీ ఖరారు

చైనీస్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో ద్వారా రియల్మీ సంస్థ Realme GT Neo 5 యొక్క అఫీషియల్ టీజర్ ని షేర్ చేసింది. ఫిబ్రవరి 9 న మధ్యాహ్నం 2 గంటలకు చైనాలో Realme GT Neo 5 లాంచ్ అవుతోంది. ఇంకా టీజర్ ద్వారా Realme GT Neo 5 ఫోన్ 240 వాట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలసింది. అయితే టీజర్ నిడివి తక్కువగా ఉండటం వల్లన మరే ఇతర వివరాలు బయటకు రాలేదు. కానీ, గతంలో TENAA లిస్టింగ్ ద్వారా Realme GT Neo 5 యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

లిస్టింగ్ ప్రకారం, Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్ లో లభించనుంది. అవి: 200 వాట్ మరియు 150 వాట్ మోడల్స్.

TENAA లిస్టింగ్ తో పాటు Realme GT Neo 5 డివైజ్ GEEKBENCH డేటాబేస్ పై కూడా కనిపించింది. దీంతో హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్, బెంచ్ మార్క్ స్కోర్స్ రివీల్ అయ్యాయి. Realme GT Neo 5 ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1279 పాయంట్లు, మల్టీకోర్ టెస్టులో 3902 పాయింట్లు సాధించింది. Realme GT Neo 5 డివైజ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. Realme GT Neo 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 9న లాంచ్ అవుతోన్న Realme GT Neo 5; 240W ఫాస్ట్ చార్జింగ్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
MWC 2023 ఈవెంట్‌లో లాంచ్ కానున్న Realme GT Neo 5 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-240w-global-launch-mwc-2023-barcelona/ Tue, 10 Jan 2023 13:20:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=4420 హైలైట్స్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో లాంచ్ కానున్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు బార్సిలోనా లో జరగనున్న MWC 2023 సదస్సు 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme రీసెంట్ గా తన 240 వాట్ సూపర్ వూక్ చార్జింగ్ టెక్నాలజీని ప్రకటించింది. ఈ […]

The post MWC 2023 ఈవెంట్‌లో లాంచ్ కానున్న Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో లాంచ్ కానున్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్
  • ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు బార్సిలోనా లో జరగనున్న MWC 2023 సదస్సు
  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme రీసెంట్ గా తన 240 వాట్ సూపర్ వూక్ చార్జింగ్ టెక్నాలజీని ప్రకటించింది. ఈ టెక్నాలజీ Realme GT Neo 5 ఫోన్ ద్వారా పరిచయం కానుంది. ఇప్పుడు ప్రైస్ బాబా రిపోర్ట్స్ ప్రకారం, Realme GT Neo 5 గ్లోబల్ గా Mobile World Congress 2023 లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

తన యొక్క 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయడానికి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 సదస్సు సరైన చోటని రియల్మీ కంపెనీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక అదే సదస్సులో Realme GT Neo 5 గ్రాండ్ గా లాంచ్ కానుంది. సరే, ఓసారి Realme GT Neo 5 యొక్క లాంచ్ టైమ్ లైన్ తో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. పదండి.

Realme GT Neo 5 లాంచ్ టైమ్‌లైన్

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో లాంచ్ కానుందని గతంలో పలు రిపోర్ట్స్ వచ్చాయి. అయితే, ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి Pricebaba తాజాగా Realme GT Neo 5 ఫోన్ MWC 2023 లో గ్లోబల్ గా లాంచ్ అవుతుందని తెలిపింది. అంటే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు బార్సిలోనా లో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.

Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఈ ఫోన్ రెండు బ్యాటరీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 4600 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.

Realme GT Neo 5 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Realme GT Neo 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. Realme GT Neo 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MWC 2023 ఈవెంట్‌లో లాంచ్ కానున్న Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Realme GT Neo 5 సిరీస్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-series-specs-leaked/ Wed, 28 Dec 2022 10:48:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=4214 హైలైట్స్ జనవరి 5 న లాంచ్ అవుతోన్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme GT Neo 5 సిరీస్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Realme GT Neo 5 ఫోన్స్ Realme సంస్థ జనవరి 5 న చైనాలో ఒక ఈవెంట్ ని నిర్వహించనుంది. తన నుంచి రాబోవు నెక్ట్స్ జనరేషన్ చార్జింగ్ టెక్నాలజీని కంపెనీ టీజ్ చేసింది. 2023 లో […]

The post లాంచ్ కి ముందు లీకైన Realme GT Neo 5 సిరీస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జనవరి 5 న లాంచ్ అవుతోన్న Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme GT Neo 5 సిరీస్
  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Realme GT Neo 5 ఫోన్స్

Realme సంస్థ జనవరి 5 న చైనాలో ఒక ఈవెంట్ ని నిర్వహించనుంది. తన నుంచి రాబోవు నెక్ట్స్ జనరేషన్ చార్జింగ్ టెక్నాలజీని కంపెనీ టీజ్ చేసింది. 2023 లో ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లను రియల్మీ లాంచ్ చేయనుంది. 240 వాట్ సూపర్‌డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని రియల్మీ ఇంట్రడ్యూస్ చేయనుంది.

రియల్మీ సంస్థ Realme GT Neo 5 లైనప్ లో రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. Realme GT Neo 5 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ రూమర్ రాయుళ్ళ ద్వారా బయటకు వచ్చాయి. ఓసారి Realme GT Neo 5 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Realme GT Neo 5 గురించి మాకు తెలిసిన వివరాలు (లీక్డ్)

Realme GT Neo 5 డివైజ్ Realme GT Neo 3 ఫోన్ కి సక్సెసర్ గా వస్తోంది. లాంచ్ కి ముందు ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. ఈ లైనప్ లో రెండు ఫోన్లను లాంచ్ చేయాలని రియల్మీ సంస్థ భావిస్తోంది. అవి: Realme GT Neo 5, Realme GT Neo 5 Pro.

చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై షేర్ కాబడిన వివరాలను తొలుత ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ గుర్తించాడు. దాని ప్రకారం, Realme GT Neo 5 డివైజ్ సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం. ఇదే సెన్సర్ ని ఒప్పో రెనో 9 సిరీస్, ఫైండ్ ఎన్2 సిరీస్ లో కూడా వాడారు. త్వరలో రానున్న వన్ ప్లస్ 11 లో కూడా ఈ సెన్సర్ ని వినియోగించినట్లు సమాచారం.

ఇంతేకాకుండా, రివీల్ అయిన పోస్టర్ ద్వారా Realme GT Neo 5 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ సిరీస్ తో రియల్మీ పరిచయం చేయనున్నట్లు సమాచారం. అయితే ప్రో-మోడల్ ఈ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది.

అయితే స్టాండర్డ్ మోడల్ మాత్రం 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చే అవకాశం ఉంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మరోవైపు 240 వాట్ చార్జింగ్ వేరియంట్ 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

లీకైన డిజైన్ రెండర్ ద్వారా ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో మెయిన్ కెమెరాతో పాటు ఒక అల్ట్రావైడ్ కెమెరా, ఒక మ్యాక్రో సెన్సర్ ఉండే అవకాశం ఉంది.

Realme GT Neo 5 ఫోన్ 6.7-ఇంచ్ అమోలెడ్ 2కే డిస్ప్లే, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డివైజ్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఇందులో పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉంటుంది.

Realme GT Neo 5 లో ఆర్జీబీ లైటింగ్ మెకానిజమ్, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటాయి. రియల్మీ ఈ ఫోన్ ని ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై లాంచ్ చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు లీకైన Realme GT Neo 5 సిరీస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
240W ఫాస్ట్ చార్జింగ్, Sony IMX890 కెమెరాతో వస్తోన్న Realme GT Neo 5 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-specs-leaked-before-launch/ Tue, 20 Dec 2022 04:30:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=4073 హైలైట్స్ ప్రస్తుతం Realme GT Neo 5 పై పని చేస్తున్న రియల్మీ కంపెనీ లాంచ్ కి ముందు లీకైన Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కల్గిన ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్ గా వస్తోన్న Realme GT Neo 5 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో Realme GT Neo 5 డివైజ్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈలోపు ఫోన్ యొక్క […]

The post 240W ఫాస్ట్ చార్జింగ్, Sony IMX890 కెమెరాతో వస్తోన్న Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రస్తుతం Realme GT Neo 5 పై పని చేస్తున్న రియల్మీ కంపెనీ
  • లాంచ్ కి ముందు లీకైన Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్
  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కల్గిన ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్ గా వస్తోన్న Realme GT Neo 5
IC: @OnLeaks @Smartprix

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలో Realme GT Neo 5 డివైజ్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈలోపు ఫోన్ యొక్క రెండర్స్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫోన్ ఎలా ఉండనుందోనన్న దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. మరోవైపు రియల్మీ కంపెనీ అప్పుడే Realme GT Neo 5 లాంచ్ ని టీజ్ చేస్తుండటం విశేషం.

నేడు Realme GT Neo 5 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. బాగా తెలిసిన సోర్స్ నుంచి ఈ వివరాలు బయటకు వచ్చాయి. వాటిలో డిస్ప్లే, కెమెరా, చిప్సెట్ మరియు బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.

Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ప్రకారం, Realme GT Neo 5 6.7-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ లో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని వినియోగించినట్లు సమాచారం. దీనికి తోడు 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్4.0 స్టోరేజీని అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Realme GT Neo 5 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. పవర్ బ్యాకప్ కోసం Realme GT Neo 5 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది. అలాగే మరొక వేరియంట్ 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తోంది. Realme GT Neo 5 డివైజ్ ఆర్బీజీ లైట్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రియల్మీ ఈ తరహా లైటింగ్ ఫోన్ ని తీసుకురాలేదు.

ఇప్పడు Realme GT Neo 5 కెమెరా విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. Realme GT Neo 5 లో 50 ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి లేదా 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ తేదీ వెలువడనుంది. చైనాలో లాంచ్ అయ్యాక, ఈ ఫోన్ భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ కానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 240W ఫాస్ట్ చార్జింగ్, Sony IMX890 కెమెరాతో వస్తోన్న Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>
240W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme GT Neo 5 https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-design-leaked-before-launch/ Thu, 15 Dec 2022 14:30:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=4009 హైలైట్స్ లీకైన Realme GT Neo 5 రెండర్స్, రివీల్ అయిన బ్యాక్ ప్యానెల్ డిజైన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, భారీ కెమెరా మాడ్యూల్, కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తోన్న డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Realme GT Neo 5 రియల్మీ సంస్థ కొత్త జీటీ నియో-సిరీస్ ఫోన్ పై పని చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ డివైజ్ […]

The post 240W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లీకైన Realme GT Neo 5 రెండర్స్, రివీల్ అయిన బ్యాక్ ప్యానెల్ డిజైన్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, భారీ కెమెరా మాడ్యూల్, కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తోన్న డివైజ్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న Realme GT Neo 5

రియల్మీ సంస్థ కొత్త జీటీ నియో-సిరీస్ ఫోన్ పై పని చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ డివైజ్ పేరు Realme GT Neo 5. ఈ డివైజ్ ఫాస్ట్ చార్జింగ్ విషయంలో రికార్డ్స్ బ్రేక్ చేయనుంది. ఎందుకంటే Realme GT Neo 5 డివైజ్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇకపోతే తాజాగా Realme GT Neo 5 యొక్క హైక్వాలిటీ రెండర్స్ ఆన్ లైన్లో ప్రత్యక్షమయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ OnLeaks సౌజన్యంతో స్మార్ట్‌ప్రిక్స్ వెబ్ సైట్ Realme GT Neo 5 యొక్క రెండర్స్ ని రివీల్ చేసింది. దీంతో ఫోన్ యొక్క డిజైన్ బయటకు వచ్చింది. ఫోన్ సన్నని బెజెల్స్, పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Realme GT Neo 5 తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత ఈ డివైజ్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

Realme GT Neo 5 డిజైన్

Realme GT Neo 5 డిజైన్ చూస్తుంటే, పోకో ఫోన్ కెమెరా మాడ్యూల్ మాదిరి లుక్ ని అడాప్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నియో 5 లో వెనకాల రెండు సర్క్యులర్ రింగ్స్ ఉంటాయి. వీటిలో పైదానిలో ఒక కెమెరా, క్రింద దానిలో రెండు లెన్స్ లు ఉంటాయి. వీటికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు మ్యాట్రిక్స్ ఏఐ కెమెరా అనే టెక్ట్స్ దర్శనమిస్తోంది. పిక్స్ లో ఫోన్ తెలుపు వర్ణంలో కనిపిస్తోంది. అయితే ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Realme GT Neo 5 డివైజ్ కాస్త కర్వ్డ్ ఎడ్జెస్, మెటల్ ఫ్రేమ్ తో వస్తోంది. అయితే ఫ్రంట్ డిజైన్ మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది. ఇకపోతే ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, ఎడమవైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

Realme GT Neo 5 ఫోన్ రెండు వేరియంట్స్ లో లభించనున్నట్లు సమాచారం. ఒకటి స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 మరియు 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ కాగా, రెండోది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 మరియు 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మోడల్.

Realme GT Neo 5 యొక్క కెమెరా విభాగం విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 240W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న Realme GT Neo 5 first appeared on 91Mobiles Telugu.

]]>