Samsung Galaxy A04s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 03 Oct 2022 12:56:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Exynos 850 చిప్, 90Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Samsung Galaxy A04s https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a04s-launched-india-specs-price-availability/ Mon, 03 Oct 2022 12:56:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=2711 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A04s రూ.13,499 ధరతో లాంచ్ అయిన Samsung Galaxy A04s Exynos 850 చిప్ తో వస్తోన్న Samsung Galaxy A04s Samsung కంపెనీ తాజాగా ఓ బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A04s ఫోన్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Samsung Galaxy A04s ఆక్టాకోర్ ఎగ్జినోస్ చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా తో లాంచ్ అయ్యింది. […]

The post Exynos 850 చిప్, 90Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Samsung Galaxy A04s first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A04s
  • రూ.13,499 ధరతో లాంచ్ అయిన Samsung Galaxy A04s
  • Exynos 850 చిప్ తో వస్తోన్న Samsung Galaxy A04s

Samsung కంపెనీ తాజాగా ఓ బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy A04s ఫోన్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Samsung Galaxy A04s ఆక్టాకోర్ ఎగ్జినోస్ చిప్సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా తో లాంచ్ అయ్యింది. Samsung Galaxy A04s గతంలో ఎన్నో సర్టిఫికేషన్ లిస్టింగ్స్ లో కనిపించి వార్తల్లో నిలిచింది. ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ అయ్యింది.

భారత్ లో Samsung Galaxy A04s ధర, లభ్యత, బ్యాంక్ ఆఫర్లు

Samsung Galaxy A04s 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ రూ.13,499 ధరతో లాంచ్ అయ్యింది. బ్లాక్, కాపర్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. నేటి నుంచి రిటైల్ స్టోర్స్, శాంసంగ్.కామ్, లీడింగ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, వన్ కార్డ్, స్లైస్ ట్రాన్సాక్షన్స్ పై శాంసంగ్ రూ.1,000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఎన్బీఎఫ్‌సీ ద్వారా నెరిపే లావాదేవీలపై రూ.1,000 వరకు డిస్కౌంట్ రానుంది. ఈ ఆఫర్స్ తో Samsung Galaxy A04s ధర రూ.12,499 కి తగ్గనుంది.

Samsung Galaxy A04s స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A04s లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే ఉంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 చిప్ అమర్చారు. Samsung Galaxy A04s లో 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. Samsung Galaxy A04s పై ర్యామ్ ని 8జిబి వరకు పెంచుకోవచ్చు. అయితే ఇంటర్నల్ స్టోరేజీని వెచ్చించడం ద్వారా ర్యామ్ ని పెంచుకునే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు Samsung Galaxy A04s యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A04s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. Samsung Galaxy A04s లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.

Samsung Galaxy A04s లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ అడాప్టివ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ వర్షన్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Samsung Galaxy A04s లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Exynos 850 చిప్, 90Hz డిస్ప్లే తో లాంచ్ అయిన Samsung Galaxy A04s first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy A04s: ఫ్యాక్టరీ నుంచి లీకైన పిక్స్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a04s-images-leaked-from-factory-noida/ Thu, 28 Jul 2022 09:13:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=1321 హైలైట్స్: ఫ్యాక్టరీ నుంచి లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎ04ఎస్ లైవ్ ఇమేజెస్, రివీల్ అయిన పూర్తి డిజైన్ ఎస్ఎమ్-ఏ047 మోడల్ నంబర్ ను కలిగిన హ్యాండ్సెట్, కనిపిస్తోన్న ప్లాస్టిక్ బాడీ ఎగ్జినోస్ 850 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ త్వరలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ04ఎస్ తో వస్తోంది. […]

The post Samsung Galaxy A04s: ఫ్యాక్టరీ నుంచి లీకైన పిక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఫ్యాక్టరీ నుంచి లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎ04ఎస్ లైవ్ ఇమేజెస్, రివీల్ అయిన పూర్తి డిజైన్
  • ఎస్ఎమ్-ఏ047 మోడల్ నంబర్ ను కలిగిన హ్యాండ్సెట్, కనిపిస్తోన్న ప్లాస్టిక్ బాడీ
  • ఎగ్జినోస్ 850 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ త్వరలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ04ఎస్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ కన్ఫర్మ్ కాలేదు. శాంసంగ్ ఏ03ఎస్ ఫోన్ కి సక్సెసర్ గా ఏ04ఎస్ వస్తోంది. గ్రేటర్ నొయిడా ఫ్యాక్టరీ లో ఈ ఫోన్ యొక్క ఉత్పత్తి మొదలైనట్లు సమాచారం. ఇప్పుడు, 91మొబైల్స్ హిందీ ఎక్స్ క్లూజివ్ గా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన లైవ్ ఇమేజెస్ ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ పిక్స్ ద్వారా మనకు ఫోన్ యొక్క ఫుల్ డిజైన్ ఏంటో తెలిసిపోయింది.

శాంసంగ్ ఏ04ఎస్ పూర్తి ప్లాస్టిక్ బాడీతో వస్తోంది. బడ్జెట్ ఫోన్ కాబట్టి, ప్లాస్టిక్ బాడీతో ఉండటం ఊహించదగిన విషయమే. ఇక ఈ ఫోన్ ధరను తగ్గించడానికి ఇందులో ఎగ్జినోస్ చిప్సెట్ ను వాడారు.

Samsung Galaxy A04s డిజైన్

 

శాంసంగ్ నుంచి వచ్చిన ఎన్నో బడ్జెట్ ఫోన్ మాదిరే గెలాక్సీ ఏ04ఎస్ కూడా ఉంది. సైడ్ ప్యానెల్స్ కాస్త కర్వ్డ్ గా ఉండి క్యాండీ బార్ డిజైన్ ను తలపిస్తోంది. పాలీకార్బొనేట్ బ్యాక్ బాడీపై టెక్చర్డ్ ప్యాటెర్న్ ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ కుడివైపున ఉన్నాయి. ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశముంది. ముందువైపున సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరాస్, ఎల్ఈడీ ఫ్లాష్ రెక్ట్యాంగులర్ మాడ్యూల్ లో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లో 3.5ఎంఎం జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, బాటమ్ లో స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.

Samsung Galaxy A04s లాంచ్ టైమ్ లైన్

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఉత్పత్తి తొలి దశలో ఉంది. మరో రెండు నెలల్లో ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది. లాంచ్ కి ముందు పలు విభిన్న పరీక్షలు జరపాల్సి ఉంటుంది. సెప్టెంబర్ చివరి వారంలో ఫోన్ లాంచ్ అవుతుందని మేం అంచనా వేస్తున్నాం. ఈ ఫోన్ 5జీ వేరియంట్ లో కూడా లభ్యం కానుందని సమాచారం. దేశంలో 5జీ సేవలు లాంచ్ అయ్యాక, ఈ మోడల్ ని లాంచ్ చేస్తే బెటర్. ఎందుకంటే అప్పటికి దేశంలో 5జీ సేవలు రన్ అవుతుంటాయి కాబట్టి, బడ్జెట్ లో వచ్చే 5జీ ఫోన్ కొనాలని చూసే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కనీసం ప్రధాన నగరాలకు 5జీ సేవలు విస్తరించాక, ఈ ఫోన్ లాంచ్ అయితే మంచిది.

Samsung Galaxy A04s స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ లో ఎగ్జినోస్ 850 చిప్సెట్ ను అమర్చారు. 3జిబి ర్యామ్ వేరియంట్ తో పాటు ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశముంది. ఆండ్రాయిడ్ 12, 13ఎంపి మెయిన్ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉంటాయి. 15 వాట్ అడాప్టర్ బాక్స్ లో ప్రొవైడ్ చేసే అవకాశముంది.

The post Samsung Galaxy A04s: ఫ్యాక్టరీ నుంచి లీకైన పిక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో మొదలైన Samsung Galaxy A04s ప్రొడక్షన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a04s-production-begins-in-noida-plant/ Tue, 26 Jul 2022 11:42:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=1258 హైలైట్స్: భారత్ లో గెలాక్సీ ఏ04ఎస్ ఉత్పాదనను మొదలుపెట్టిన శాంసంగ్ 4జీ మరియు 5జీ వర్షన్స్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ లాంచ్ అయ్యే అవకాశం ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్, త్వరలోనే గెలాక్సీ ఏ04ఎస్ బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను ఇదివరకు మేం ప్రచురించడం జరిగింది. తాజాగా తెలియవస్తున్నదేంటంటే, 91మొబైల్స్ హిందీ కథనం […]

The post భారత్ లో మొదలైన Samsung Galaxy A04s ప్రొడక్షన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో గెలాక్సీ ఏ04ఎస్ ఉత్పాదనను మొదలుపెట్టిన శాంసంగ్
  • 4జీ మరియు 5జీ వర్షన్స్ లో లాంచ్ కానున్న హ్యాండ్సెట్
  • సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్, త్వరలోనే గెలాక్సీ ఏ04ఎస్ బడ్జెట్ ఫోన్ ని లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను ఇదివరకు మేం ప్రచురించడం జరిగింది. తాజాగా తెలియవస్తున్నదేంటంటే, 91మొబైల్స్ హిందీ కథనం ప్రకారం, ఈ ఫోన్ ఉత్పాదన శాంసంగ్ యొక్క నొయిడా ప్లాంట్ లో మొదలైనట్లు సమాచారం. 4జీ, 5జీ వర్షన్స్ లో లభించనున్న ఈ ఫోన్ రాబోవు రెండు నెలల్లో లాంచ్ కానుంది. బహుశా సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. పండుగ సీజన్ కు ముందే లాంచ్ ఉండనుందని అంచనా.

Samsung Galaxy A04s డిజైన్

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ డిజైన్ విషయానికి వస్తే, కొన్ని రోజుల క్రితం ఫోన్ యొక్క రెండర్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో మనకు కొంత సమాచారం దొరికినట్లైంది. ఫోన్ వెనకాల మూడు కెమెరాలను అమర్చినట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, 3.5ఎంఎం ఆడియో జాక్, లౌడ్ స్పీకర్ గ్రిల్ బాటమ్ ప్యానెల్ లో ఉన్నాయి. ఇక పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ సైడ్ ప్యానెల్ పై ఉన్నాయి. ఇక పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ లా కూడా పని చేయనుంది.

Samsung Galaxy A04s స్పెసిఫికేషన్స్

ఇప్పటి వరకు మనకు ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కి సంబంధించి వివరాలు ఏమీ తెలియలేదు. అయితే ఫోన్ పలు సర్టిఫికేషన్స్ సైట్స్ పై కనిపించింది. దీంతో ఆ లిస్టింగ్స్ ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ గురించి కొంత సమాచారం తెలిసింది. ఈ డివైజ్ లో ఎగ్జినోస్ 850 చిప్సెట్ ను అమర్చినట్లు మనకు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా గతంలోనే స్పష్టమైంది. ఇది కాకుండా, మరో విషయం ఏంటంటే, కనీసం ఒక 3జిబి ర్యామ్ వేరియంట్ వస్తుందని అంచనా. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. తాజాగా బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి, ఫోన్లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం.

ఎఫ్సీసీ ఫైలింగ్ అనే యూఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ ద్వారా ఫోన్ యొక్క ఛార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఎఫ్సీసీ డేటా ఆధారంగా ఫోన్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తుందని తెలుస్తున్నప్పటికీ, భారత వేరియంట్ మాత్రం బాక్స్ లో 15 వాట్ ఛార్జర్ నే కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఎమ్ మరియ ఏ సిరీస్ ఫోన్లకు కూడా ఇదే విధంగా 15 వాట్ ఛార్జర్ వస్తోంది. గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మాకు తెలియగానే, మిమ్మల్ని అప్డేట్ చేస్తాం. అంతవరకు తాజా టెక్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి 91మొబైల్స్ తెలుగు.

The post భారత్ లో మొదలైన Samsung Galaxy A04s ప్రొడక్షన్ first appeared on 91Mobiles Telugu.

]]>