Samsung Galaxy F54 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 06 Jun 2023 16:39:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G; రెండింట్లో ఏది బెస్ట్ ఆప్షన్? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a54-5g-vs-samsung-galaxy-f54-5g-which-is-the-best-phone/ Tue, 06 Jun 2023 16:39:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=6647 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాంసంగ్ సంస్థ జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. చైనా బ్రాండ్స్ ఆదిపత్యం ఉన్నప్పుడు, లేనప్పుడు.. అది ఏ సమయమైనా సరే, శాంసంగ్ కి ఉన్న బ్రాండ్ విలువ పడిపోలేదు. జనాల్లో శాంసంగ్ పట్ల ఆదరణ తగ్గలేదు. మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్, లో-ఎండ్ సెగ్మెంట్స్ లో రకరకాల ఫోన్లను సమయానుగుణంగా లాంచ్ చేస్తూ, శాంసంగ్ సంస్థ ఇతర కంపెనీలకు గట్టి […]

The post Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G; రెండింట్లో ఏది బెస్ట్ ఆప్షన్? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తాజాగా లాంచైన Samsung Galaxy F54 5G
  • కొన్ని రోజుల క్రితం లాంచైన Galaxy A54 5G
  • రెండు ఫోన్లకు యూజర్లలో మాంచి డిమాండ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాంసంగ్ సంస్థ జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. చైనా బ్రాండ్స్ ఆదిపత్యం ఉన్నప్పుడు, లేనప్పుడు.. అది ఏ సమయమైనా సరే, శాంసంగ్ కి ఉన్న బ్రాండ్ విలువ పడిపోలేదు. జనాల్లో శాంసంగ్ పట్ల ఆదరణ తగ్గలేదు. మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్, లో-ఎండ్ సెగ్మెంట్స్ లో రకరకాల ఫోన్లను సమయానుగుణంగా లాంచ్ చేస్తూ, శాంసంగ్ సంస్థ ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది.

మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఈ సంస్థ నుంచి రీసెంట్ గా Samsung Galaxy A54 5G, Samsung Galaxy F54 5G ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లకు యూజర్లలో చక్కటి ఆదరణ లభిస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా శాంసంగ్ సొంత చిప్సెట్స్ Exynos 1380 తో లాంచ్ అయ్యాయి.

ఈ ఆర్టికల్ లో రెండు ఫోన్లను పోల్చి, ఏది ఉత్తమమైనదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G

  • డిస్ప్లే: Samsung Galaxy A54 5G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 403 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. మరోవైపు Samsung Galaxy F54 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి. పెద్ద డిస్ప్లే కావాలనుకునే వారికి Galaxy F54 5G ఉత్తమమైన ఎంపికని చెప్పవచ్చు. అయితే A54 5G లో పిక్సెల్ డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్లన పిక్చర్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. రెండు ఫోన్లు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి.
  • చిప్సెట్: Samsung Galaxy A54 5G మరియు Samsung Galaxy F54 5G ఫోన్లలో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ నే వాడారు. రెండు ఫోన్లు 8జిబి ర్యామ్ తో వస్తున్నాయి. పెర్ఫామెన్స్ విషయంలో రెండు ఫోన్లు ఒకే విధమైన ఔట్‌పుట్ ని ఇవ్వనున్నాయి.
  • కెమెరా విభాగం: Samsung Galaxy A54 5G లో 50ఎంపి + 12ఎంపి + 5ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మరోవైపు Samsung Galaxy F54 5G లో 108ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా విషయానికి వస్తే, F54 లో పెద్ద సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తుండటంతో ప్రాక్టికల్ గా దీని పెర్ఫామెన్స్ బాగుంటుందని అంచనా వేయవచ్చు. ఇక A54 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా పెర్ఫామెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇందులో 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. అదే F54 లో 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఇక్కడ దేని ప్రత్యేకత దానిదే అన్నట్లు ఉంది.
  • భారీ ప్రధాన కెమెరా కావాలనుకుంటే Galaxy F54 5G ని ఎంచుకోవడం ఉత్తమం. అన్నీ బ్యాలన్స్డ్ గా ఉండాలని భావిస్తే, Galaxy A54 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
  • ఫ్రంట్ కెమెరా: రెండు ఫోన్లలో కూడా 32ఎంపి ఫ్రంట్ కెమెరాని అందించారు. కాబట్టి ఇక్కడ పెద్దగా తేడాలు ఏమీ గమనించలేం.
  • బ్యాటరీ: Galaxy A54 5G డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. మరోవైపు Galaxy F54 5G లో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటే F54 కి వెళ్ళడం బెటర్. కానీ, 6.7-ఇంచ్ డిస్ప్లే కావడం వల్లన బ్యాటరీ వినియోగం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఇక చార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్నాయి.
  • స్టోరేజీ: Galaxy A54 డివైజ్ 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. మరోవైపు F54 5G డివైజ్ 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభ్యమవుతుంది. రెండు ఫోన్లలో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Galaxy A54 మరియు Galaxy F54 డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • డైమెన్షన్స్: Galaxy A54 158.2 మి.మీ పొడవు, 76.7 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 202 గ్రాముల ఉంటుంది. మరోవైపు, Galaxy F54 164.9 మి.మీ పొడవు, 77.3 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 199 గ్రాముల ఉంటుంది.
  • ఐపీ రేటింగ్: Galaxy A54 డివైజ్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. మరోవైపు Galaxy F54 వాటర్ ప్రూఫ్ కాదు.
  • Samsung Galaxy A54 5G డివైజ్ 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.38,999 గా ఉంది.
  • Samsung Galaxy F54 5G డివైజ్ 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.

The post Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G; రెండింట్లో ఏది బెస్ట్ ఆప్షన్? first appeared on 91Mobiles Telugu.

]]>
108MP ఓఐఎస్ కెమెరా, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Samsung Galaxy F54 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f54-5g-launched-india-price-specs-availability/ Tue, 06 Jun 2023 10:59:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=6642 Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ హ్యాండ్సెట్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఆఫరింగ్ గా మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ లో పంచ్-హోల్ కటౌట్, సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. Samsung Galaxy F54 5G డివైజ్ 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, […]

The post 108MP ఓఐఎస్ కెమెరా, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Samsung Galaxy F54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 25 వాట్ చార్జింగ్, 6.7-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన Samsung Galaxy F54 5G
  • భారత్ లో Samsung Galaxy F54 5G ధర రూ.29,999
  • ఫ్లిప్ కార్ట్, శాంసంగ్.కామ్, రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్స్

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ హ్యాండ్సెట్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఆఫరింగ్ గా మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ లో పంచ్-హోల్ కటౌట్, సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Samsung Galaxy F54 5G డివైజ్ 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. 128జిబి, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

భారత్ లో Samsung Galaxy F54 5G ధర, లభ్యత

  • భారత్ లో Samsung Galaxy F54 5G ధరను రూ.29,999 గా నిర్ణయించారు.
  • మిటియోర్ బ్లూ, స్టార్‌డస్ట్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy F54 5G.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా, అన్ని డిస్కౌంట్స్ కలుపుకుని రూ.27,999 ధరకి లభించనున్న Samsung Galaxy F54 5G.
  • ఫ్లిప్ కార్ట్, శాంసంగ్.కామ్, ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో జూన్ 6 నుంచి ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F54 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F54 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Samsung Galaxy F54 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్ కి 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని హామీ ఇస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy F54 5G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy F54 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: ఈ డివైజ్ 164.9 మి.మీ పొడవు, 77.3 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

The post 108MP ఓఐఎస్ కెమెరా, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Samsung Galaxy F54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Galaxy F54, Realme 11 Pro, OnePlus Nord 3 లతో పాటు జూన్‌లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ల జాబితా! https://www.91mobiles.com/telugu/2023-june-lo-launch-ayye-smartphones-list/ Thu, 01 Jun 2023 15:51:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=6583 స్మార్ట్ ఫోన్ల లాంచ్ విషయానికి వస్తే, జూన్ నెల ఎంతో ముఖ్యమైందిగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ నెలలో చాలా ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. టాప్ బ్రాండ్ అయిన శాంసంగ్ జూన్ 6 న Galaxy F54 ని జూన్ 6 న లాంచ్ చేయబోతోంది. మరోవైపు రియల్మీ సంస్థ జూన్ 8 న Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా రియల్మీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ […]

The post Galaxy F54, Realme 11 Pro, OnePlus Nord 3 లతో పాటు జూన్‌లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ల జాబితా! first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్ ఫోన్ల లాంచ్ విషయానికి వస్తే, జూన్ నెల ఎంతో ముఖ్యమైందిగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ నెలలో చాలా ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. టాప్ బ్రాండ్ అయిన శాంసంగ్ జూన్ 6 న Galaxy F54 ని జూన్ 6 న లాంచ్ చేయబోతోంది. మరోవైపు రియల్మీ సంస్థ జూన్ 8 న Realme 11 Pro సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రీసెంట్ గా రియల్మీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా హిందీ నటుడు షారుఖ్ ఖాన్ ని నియమించుకుంది.

2023 జూన్ లో షావోమి, ఒప్పో, వివో, మోటోరోలా, వన్‌ప్లస్ తదితర సంస్థలు తమ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సరే, ఓసారి జూన్ నెలలో లాంచ్ అవుతోన్న స్మార్ట్ ఫోన్ల జాబితాను ఇక్కడ చూద్దాం.

2023 జూన్ లో భారత్ లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్లు

Samsung Galaxy F54

  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ధర: రూ.30,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 6, 2023

జూన్ 6 న శాంసంగ్ సంస్థ Samsung Galaxy F54 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ Galaxy M54 కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ లో ఉండనున్నాయి.

Realme 11 Pro

  • డైమెన్సిటీ 7050 చిప్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • ధర: 23,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 8, 2023

Realme 11 Pro స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత్ లో జూన్ 8 న లాంచ్ అవ్వనుంది. గ్లోబల్ స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, డ్యూయల్ నానో సిమ్, 12జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 7050 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Realme 11 Pro+

  • 200ఎంపి ప్రైమరీ కెమెరా
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ధర: రూ.30,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 8, 2023

రియల్మీ కంపెనీ చైనాలో Realme 11 Pro+ డివైజ్ ని లాంచ్ చేసింది. జూన్ 8 న భారత్ లో Realme 11 Pro తో పాటు Realme 11 Pro+ డివైజ్ భారత్ లో లాంచ్ కానుంది. గ్లోబల్ స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్, 12జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ, 200 ఎంపి ప్రైమరీ కెమెరా, సూపర్ ఓఐఎస్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

OPPO Reno 10 సిరీస్

  • 120హెర్ట్జ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 100 వాట్ చార్జింగ్ సపోర్ట్
  • ధర: రూ.31,000-రూ.33,000 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్, 2023 (అంచనా)

OPPO Reno 10 సిరీస్ జూన్ లో భారత్ లో లాంచ్ అవుతోంది. OPPO Reno 10, OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ ఈ లైనప్ లో రానున్నాయి. 120 హెర్ట్జ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 778జి, మీడియాటెక్ డైమెన్సిటీ 8200, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 80 వాట్ చార్జింగ్, 100 వాట్ చార్జింగ్ ఈ ఫోన్లలో ఉన్నాయి.

OnePlus Nord 3

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్
  • 64ఎంపి ప్రైమరీ కెమెరా
  • ధర: రూ.27,999 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్, 2023 (అంచనా)

OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ భారత్ లో జూన్ నెలలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ OnePlus Ace 2V కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి.

2023 జూన్ లో గ్లోబల్ గా లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు

Motorola Razr 40

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ధర: 104,399 (అంచనా)
  • విడుదల తేదీ: జూన్ 1, 2023

Motorola Razr 40 సిరీస్ ఫోన్ 2023 జూన్ 1 న గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో 2 ఫోల్డబుల్ ఫోన్లు Motorola Razr 40, Motorola Razr 40 Ultra ఫోన్లు లాంచ్ అయ్యాయి. Motorola Razr 40 Ultra లో 6.9-ఇంచ్ పోల్డబుల్ డిస్ప్లే, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ + 13ఎంపి అల్ట్రావైడ్ డ్యూయల్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

  • Vivo V29 సిరీస్
  • Xiaomi 13 Ultra

The post Galaxy F54, Realme 11 Pro, OnePlus Nord 3 లతో పాటు జూన్‌లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్ల జాబితా! first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Samsung Galaxy F54 5G భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f54-5g-india-price-leak/ Wed, 31 May 2023 09:24:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=6559 శాంసంగ్ సంస్థ జూన్ 6 న Samsung Galaxy F54 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సంస్థ నుంచి Samsung Galaxy F54 5G డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ టీజ్ చేయబడ్డాయి. తాజాగా లాంచ్ కి ముందు ఫ్లిప్ కార్ట్ లో మైక్రోసైట్ ద్వారా Samsung Galaxy F54 5G డిజైన్, ఫీచర్స్ రివీల్ అయ్యాయి. అలాగే ధర వివరాలు కూడా బయటకు వచ్చాయి. సరే, ఓసారి Samsung […]

The post రివీలైన Samsung Galaxy F54 5G భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 6 న భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy F54 5G
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • రూ.30,000 లోపు ధర కలిగి ఉండనున్న హ్యాండ్సెట్

శాంసంగ్ సంస్థ జూన్ 6 న Samsung Galaxy F54 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సంస్థ నుంచి Samsung Galaxy F54 5G డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ టీజ్ చేయబడ్డాయి. తాజాగా లాంచ్ కి ముందు ఫ్లిప్ కార్ట్ లో మైక్రోసైట్ ద్వారా Samsung Galaxy F54 5G డిజైన్, ఫీచర్స్ రివీల్ అయ్యాయి. అలాగే ధర వివరాలు కూడా బయటకు వచ్చాయి. సరే, ఓసారి Samsung Galaxy F54 5G డివైజ్ భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందా పదండి.

Samsung Galaxy F54 5G లభ్యత

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో జూన్ 6 న లాంచ్ అవుతోంది. కస్టమర్లు ఈ ఫోన్ ని ప్రీ-రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే లాంచ్ ధరపై రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.

ఈలోపు ఫ్లిప్ కార్ట్ మైక్రోసైట్ ద్వారా Samsung Galaxy F54 5G డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా కర్వ్డ్ ప్యానెల్, ఫ్రేమ్ కనిపిస్తున్నాయి. ఈ ఫఓన్ లో మూడు సర్క్యులర్ కటౌట్స్ రియర్ ప్యానెల్ పై ఉన్నాయి. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్ ఉంది. మైక్రోసైట్ కెమెరా ఫీచర్లను కూడా టీజ్ చేసింది. నైటోగ్రఫీ, ఓఐఎస్ వంటి ఫీచర్ల వివరాలు బయటకు వచ్చాయి.

Samsung Galaxy F54 5G ఇండియా ధర

Samsung Galaxy F54 5G ధర భారత్ లో రూ.30,000 గా ఉంటుందని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని చెబుతున్నారు. టిప్‌స్టర్ ప్రకారం, ఈ అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ధర రూ.28,499 గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ధరకు యూజర్లు 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ పొందనున్నారు.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Samsung Galaxy F54 5G డివైజ్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. అవేంటో చూద్దాం.

డిస్ప్లే

  • అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్

  • 6000 ఎంఏహెచ్
  • 25 వాట్

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

చిప్సెట్, ఓఎస్

  • ఎగ్జినోస్ 1380
  • ఆండ్రాయిడ్ 13

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌ యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

డైమెన్షన్స్, వెయిట్

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ 164.9 మిల్లీ మీటర్ల పొడవు, 77.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.4 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

కెమెరా విభాగం

  • 108ఎంపి రియర్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy F54 5G హ్యాండ్స్-ఆన్ వీడియో లీక్ విశేషాలు

గ్యాడ్జెట్స్ ఇన్ నేపాల్ అనే యూట్యూబ్ చానల్ ద్వారా Samsung Galaxy F54 5G డివైజ్ రివీల్ అయ్యింది. వీడియోలో ఫోన్ యొక్క సిల్వర్ మరియు డార్క్ బ్లూ కలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ డివైజ్ పాలికార్బొనేట్ బ్యాక్ ప్యానెల్, ఫ్రేమ్ తో వస్తోంది.

The post రివీలైన Samsung Galaxy F54 5G భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
రివీలైన Samsung Galaxy F54 5G లాంచ్ తేదీ, మొదలైన ప్రీ-రిజర్వేషన్స్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f54-5g-india-launch-date-pre-reservations/ Tue, 30 May 2023 13:37:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=6548 శాంసంగ్ ఇండియా ఎట్టకేలకు Samsung Galaxy F54 5G డివైజ్ లాంచ్ తేదీని ప్రకటించింది. 2023 జూన్ 6 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు శాంసంగ్ అధికార వెబ్ సైట్ ద్వారా ఈ హ్యాండ్సెట్ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy F54 5G ప్రీ-రిజర్వేషన్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Samsung Galaxy F54 5G ప్రీ-రిజర్వేషన్ […]

The post రివీలైన Samsung Galaxy F54 5G లాంచ్ తేదీ, మొదలైన ప్రీ-రిజర్వేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 6న భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy F54 5G
  • రూ.999 టోకెన్ అమౌంట్ తో మొదలైన ప్రీ-రిజర్వేషన్స్
  • 108ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy F54 5G

శాంసంగ్ ఇండియా ఎట్టకేలకు Samsung Galaxy F54 5G డివైజ్ లాంచ్ తేదీని ప్రకటించింది. 2023 జూన్ 6 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు శాంసంగ్ అధికార వెబ్ సైట్ ద్వారా ఈ హ్యాండ్సెట్ సేల్ కి వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy F54 5G ప్రీ-రిజర్వేషన్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F54 5G ప్రీ-రిజర్వేషన్

  • ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి Samsung Galaxy F54 5G ప్రీ-ఆర్డర్స్
  • ప్రీ-రిజర్వేషన్ కోసం కస్టమర్లు చెల్లించాల్సిన అడ్వాన్స్ అమౌంట్ రూ.999. లాంచ్ తర్వాత ఫైనల్ అమౌంట్ నుంచి తగ్గించబడనున్న రూ.999.
  • రూ.2,000 విలువజేసే బెనిఫిట్స్ ని ఆఫర్ చేస్తోన్న కంపెనీ

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • అమోలెడ్ డిస్ప్లే

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో అమోలెడ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ ఎమ్54 5జీ యొక్క రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని అంటున్నారు. ఈ తరుణంలో, స్పెసిఫికేషన్స్ కూడా ఒకే విధంగా ఉంటాయని భావించవచ్చు.

చిప్సెట్, ఓఎస్

  • ఎగ్జినోస్ 1380
  • ఆండ్రాయిడ్ 13

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

కెమెరా విభాగం

  • 108ఎంపి రియర్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, కనెక్టివిటీ

  • 6000 ఎంఏహెచ్
  • 5జీ

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఇవ్వనున్నారు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై, 5జీ, 4జీ, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

The post రివీలైన Samsung Galaxy F54 5G లాంచ్ తేదీ, మొదలైన ప్రీ-రిజర్వేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy F54 5G ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f54-5g-price-key-specs-leaked/ Mon, 22 May 2023 13:04:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=6427 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే గెలాక్సీ-ఎఫ్ సిరీస్ లో ఓ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F54 5G పేరుతో రానున్న ఈ అప్పర్-మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని శాంసంగ్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఓ లీక్ ద్వారా Samsung Galaxy F54 5G డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ […]

The post లీకైన Samsung Galaxy F54 5G ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొన్ని రోజుల్లో భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy F54 5G
  • 108ఎంపి మెయిన్ కెమెరాతో వస్తోన్న డివైజ్
  • స్పెక్స్, ధర వివరాలను లీక్ చేసిన టిప్‌స్టర్ ముకుల్ శర్మ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే గెలాక్సీ-ఎఫ్ సిరీస్ లో ఓ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F54 5G పేరుతో రానున్న ఈ అప్పర్-మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని శాంసంగ్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఓ లీక్ ద్వారా Samsung Galaxy F54 5G డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ రివీల్ అయ్యాయి.

టిప్‌స్టర్స్ ముకుల్ శర్మ (స్టఫ్‌లిస్టింగ్స్) Samsung Galaxy F54 5G డివైజ్ ధరను కూడా రివీల్ చేశారు. సరే, ఓసారి ఈ డివైజ్ భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

లీకైన Samsung Galaxy F54 5G ధర

కొత్త లీక్ ప్రకారం, Samsung Galaxy F54 5G డివైజ్ భారత్ లో రూ.35,000 లోపు ధరతో లాంచ్ కానుందని సమాచారం. భారత్ లో ఈ ఫోన్ ప్రీమియమ్ గెలాక్సీ-ఎఫ్ సిరీస్ హ్యాండ్సెట్ గా నిలవనుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.33,000 గా ఉంటుందని టిప్‌స్టర్ ముకుల్ అంటున్నారు. అయితే ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ని అతను రివీల్ చేయలేదు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ (రూమర్స్)

డిస్ప్లే

  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • అమోలెడ్ డిస్ప్లే

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో అమోలెడ్ డిస్ప్లే, 6.7-ఇంచ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ ఎమ్54 5జీ యొక్క రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని అంటున్నారు. ఈ తరుణంలో, స్పెసిఫికేషన్స్ కూడా ఒకే విధంగా ఉంటాయని భావించవచ్చు.

చిప్సెట్, ఓఎస్

  • ఎగ్జినోస్ 1380
  • ఆండ్రాయిడ్ 13

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

కెమెరా విభాగం

  • 108ఎంపి రియర్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, కనెక్టివిటీ

  • 6000 ఎంఏహెచ్
  • 5జీ

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఇవ్వనున్నారు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై, 5జీ, 4జీ, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

The post లీకైన Samsung Galaxy F54 5G ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy F54 5G భారత మార్కెట్ ధర; మే నెలలో లాంచ్ కానున్న హ్యాండ్సెట్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f54-5g-key-specs-price-expected-launch-timeline-details-leaks/ Mon, 08 May 2023 13:03:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=6214 శాంసంగ్ సంస్థ త్వరలో గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ కొరియన్ టెక్నాలజీ దిగ్గజం ప్రస్తుతం Samsung Galaxy F54 5G డివైజ్ పై పని చేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. అయితే శాంసంగ్ ఇంకా వివరాలను స్పష్టం చేయాల్సి ఉంది. టిప్‌స్టర్ GadgetsData Samsung Galaxy F54 5G అంచనా లాంచ్ టైమ్ లైన్ ని రివీల్ చేసింది. […]

The post లీకైన Samsung Galaxy F54 5G భారత మార్కెట్ ధర; మే నెలలో లాంచ్ కానున్న హ్యాండ్సెట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy F54 5G
  • మే నెలలో డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్న Samsung Galaxy F54 5G

శాంసంగ్ సంస్థ త్వరలో గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ కొరియన్ టెక్నాలజీ దిగ్గజం ప్రస్తుతం Samsung Galaxy F54 5G డివైజ్ పై పని చేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. అయితే శాంసంగ్ ఇంకా వివరాలను స్పష్టం చేయాల్సి ఉంది. టిప్‌స్టర్ GadgetsData Samsung Galaxy F54 5G అంచనా లాంచ్ టైమ్ లైన్ ని రివీల్ చేసింది. అలాగే ఈ ఫోన్ ధరను కూడా రివీల్ చేసింది.

సరే, ఓసారి Samsung Galaxy F54 5G డివైజ్ భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్ లైన్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F54 5G ధర, లభ్యత (అంచనా)

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో మిడ్ రేంజ్ డివైజ్ గా వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఫ్లిప్ కార్ట్ ద్వారా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఎఫ్-సిరీస్ డివైజెస్ ఫ్లిప్ కార్ట్ ద్వారానే సేల్ కి వస్తాయి. Samsung Galaxy F54 5G విషయంలో కూడా ఇదే జరగనుందని భావిస్తున్నారు.

టిప్‌స్టర్ దేబయాన్ రాయ్ (గ్యాడ్జెట్స్ డేటా), Samsung Galaxy F54 5G డివైజ్ భారత్ లో రానున్న రెండు లేదా మూడు వారాల్లో లాంచ్ కానుందని తెలిపింది. అయితే టిప్‌స్టర్ లాంచ్ తేదీని రివీల్ చేయలేదు. కానీ, భారత్ లో ధర మాత్రం రూ.30,000 లోపు ఉంటుందని తెలిపింది. ఫోన్ బేస్ మోడల్ రూ.26,000 నుంచి రూ.27,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ర్యామ్, స్టోరేజీ వివరాలు బయటకు రాలేదు.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

  • అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయని టిప్ స్టార్ ద్వారా తెలుస్తోంది.

ప్రాసెసర్

  • ఎగ్జినోస్

Samsung Galaxy F54 5G డివైజ్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని సమాచారం.

బ్యాటరీ, చార్జింగ్

  • 6000mAh
  • 25W

Samsung Galaxy F54 5G డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయని సమాచారం.

కెమెరా విభాగం

  • 108ఎంపి మెయిన్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుందని సమాచారం. దీనికి తోడు 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

కనెక్టివిటీ

  • వై-ఫై 6

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో హైబ్రిడ్ సిమ్ స్లాట్, వై-ఫై 6, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, జీపీఎస్, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

ఓఎస్

  • ఆండ్రాయిడ్ 13

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ ఉంటుందని సమాచారం.

The post లీకైన Samsung Galaxy F54 5G భారత మార్కెట్ ధర; మే నెలలో లాంచ్ కానున్న హ్యాండ్సెట్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్, డిజైన్; ఈ నెలలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f54-5g-specs-leaked-before-launch/ Sun, 16 Apr 2023 18:27:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=5905 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఎఫ్-సిరీస్ పోర్ట్‌ఫోలియో లో భారత్ లో Samsung Galaxy F54 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా పొందింది. కొన్ని రోజుల క్రితం శాంసంగ్ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ డివైజ్ లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Samsung Galaxy F54 […]

The post లీకైన Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్, డిజైన్; ఈ నెలలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ నెలాఖరులో Samsung Galaxy F54 5G లాంచ్ అయ్యే చాన్స్
  • 6.7-ఇంచ్ 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో రానున్న డివైజ్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తున్నట్లు వెల్లడించిన గత లీక్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఎఫ్-సిరీస్ పోర్ట్‌ఫోలియో లో భారత్ లో Samsung Galaxy F54 5G డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా పొందింది. కొన్ని రోజుల క్రితం శాంసంగ్ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ డివైజ్ లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Samsung Galaxy F54 5G పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు లాంచ్ టైమ్‌లైన్ వివరాలను ట్వీట్ చేశాడు. చూస్తుంటే, ఈ డివైజ్ Samsung Galaxy M54 5G కి రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది. సరే పదండి, Samsung Galaxy F54 5G విశేషాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F54 5G ఇండియా లాంచ్ టైమ్ లైన్, డిజైన్, ధర

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో ఏప్రిల్ చివరి వారంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. అంటే ఇంకో రెండు వారాలు మాత్రమే సమయం మిగిలి ఉంది. చూస్తుంటే, ఈ ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, చిన్ తో కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై మూడు సర్క్యులర్ కెమెరా రింగ్స్ చూడటానికి ఫ్లాగ్షిప్ ఎస్23 సిరీస్ మాదిరి ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy F54 5G డివైజ్ ధర భారత్ లో రూ.23,000 పైనే ఉండనుందని టిప్‌స్టర్ వెల్లడించాడు.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 స్క్రీన్ ప్రొటెక్షన్ తో వచ్చే అవకాశం ఉంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

ఈ హ్యాండ్సెట్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం. గత లీక్స్ ద్వారా ఈ డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో రానున్నట్లు తెలిసింది. శాంసంగ్ ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్2.2 స్టోరేజీ టెక్నాలజీని వాడే అవకాశం ఉంది.

కెమెరా

Samsung Galaxy F54 5G లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. ఇందులో 108ఎంపి మెయిన్ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే చాన్స్ ఉంది.

బ్యాటరీ, ఓఎస్

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ కస్టమ్ స్కిన్ తో రానుంది. ఈ డివైజ్ 8.4 ఎంఎం మందం, 199 గ్రాముల బరువు ఉండనుంది. వై-ఫై 6, బ్లూటూత్ 5, జీపీఎస్ తదితర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్, డిజైన్; ఈ నెలలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు కంపెనీ వెబ్‌సైట్ లో లిస్టైన Samsung Galaxy F54 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f54-5g-spotted-official-website-launch-imminent/ Tue, 11 Apr 2023 06:17:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=5818 త్వరలోనే శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఈ ఫోన్ గురించి అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా ఇవ్వలేదు. కానీ, కంపెనీ వెబ్ సైట్ లో Samsung Galaxy F54 5G డివైజ్ లిస్టై కనిపించింది. దీంతో అతి త్వరలో ఈ డివైజ్ భారత మార్కెట్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈమధ్యలో TheTechOutlook వెబ్ సైట్ భారత వెబ్ సైట్ తో పాటు, బంగ్లాదేశ్ శాంసంగ్ వెబ్ […]

The post లాంచ్‌కి ముందు కంపెనీ వెబ్‌సైట్ లో లిస్టైన Samsung Galaxy F54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • SM-E546B/DS అనే మోడల్ నంబర్ తో వెబ్ సైట్ పై కనిపించిన డివైజ్
  • Galaxy F54 5G డివైజ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తుందని అంచనా
  • భారత్ లో 5జీ సపోర్ట్ తో లాంచ్ కానున్న Samsung Galaxy F54 5G

త్వరలోనే శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఈ ఫోన్ గురించి అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా ఇవ్వలేదు. కానీ, కంపెనీ వెబ్ సైట్ లో Samsung Galaxy F54 5G డివైజ్ లిస్టై కనిపించింది. దీంతో అతి త్వరలో ఈ డివైజ్ భారత మార్కెట్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈమధ్యలో TheTechOutlook వెబ్ సైట్ భారత వెబ్ సైట్ తో పాటు, బంగ్లాదేశ్ శాంసంగ్ వెబ్ సైట్ లో కూడా ఈ డివైజ్ ని గుర్తించింది. దీన్ని బట్టి ఈ ఫోన్ వివిధ మార్కెట్స్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Samsung Galaxy F54 5G సర్టిఫికేషన్ వివరాలు

Samsung Galaxy F54 5G డివైజ్ SM-E546B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. మోడల్ నంబర్ కాకుండా ఇంకా ఫోన్ కి సంబంధించిన మరే ఇతర స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది.

Samsung Galaxy F54 5G బీఐఎస్ లిస్టింగ్ ని ఎక్స్‌క్లూజివ్ గా 91మొబైల్స్ గుర్తించింది. అయితే ఇప్పటి వరకు డివైజ్ మార్కెటింగ్ పేరు బయటకు రాలేదు. కానీ, ఎఫ్-సిరీస్ లో Samsung Galaxy F54 5G డివైజ్ రానుందని తెలుస్తోంది. ఈ డివైజ్ Galaxy F42 కి సక్సెసర్ గా వస్తోంది.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy F54 5G డివైజ్ Galaxy M54 5G డివైజ్ కి రీబ్రాండ్ వర్షన్ గా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి, స్పెసిఫికేషన్స్ కూడా దాదాపు అదే ఫోన్ ని పోలి ఉండేందుకు చాన్స్ ఉంది. సరే, ఓసారి Samsung Galaxy F54 5G అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు కంపెనీ వెబ్‌సైట్ లో లిస్టైన Samsung Galaxy F54 5G first appeared on 91Mobiles Telugu.

]]>
బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన కొత్త శాంసంగ్ ఫోన్ https://www.91mobiles.com/telugu/samsung-new-phone-spotted-bis-website-could-be-galaxy-f54/ Thu, 16 Mar 2023 06:03:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=5526 ఒక కొత్త శాంసంగ్ స్మార్ట్ ఫోన్ తాజాగా బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ SM-E546B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ లిస్టింగ్ ని 91మొబైల్స్ తొలుత గుర్తించింది. అయితే ఈ ఫోన్ యొక్క మార్కెటింగ్ పేరు ఇంకా తెలియలేదు. కానీ, ఈ ఫోన్ ఎఫ్-సిరీస్ డివైజ్ Samsung Galaxy F54 5G అయి ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న Galaxy F42 […]

The post బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన కొత్త శాంసంగ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • SM-E546B/DS అనే మోడల్ నంబర్ తో కనిపించిన శాంసంగ్ ఫోన్
  • త్వరలో 5జీ సపోర్ట్ తో భారత్ లో లాంచ్ కానున్న ఫోన్
  • ఈ ఫోన్ Galaxy F54 అయ్యుంటుందని అంచనా, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వచ్చే అవకాశం

ఒక కొత్త శాంసంగ్ స్మార్ట్ ఫోన్ తాజాగా బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ SM-E546B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ లిస్టింగ్ ని 91మొబైల్స్ తొలుత గుర్తించింది. అయితే ఈ ఫోన్ యొక్క మార్కెటింగ్ పేరు ఇంకా తెలియలేదు. కానీ, ఈ ఫోన్ ఎఫ్-సిరీస్ డివైజ్ Samsung Galaxy F54 5G అయి ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న Galaxy F42 డివైజ్ కి Samsung Galaxy F54 5G సక్సెసర్ గా వస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అయితే ఈ శాంసంగ్ కొత్త ఫోన్ కి సంబంధించి ఇంకా ఏమీ తెలియదు. 5జీ కనెక్టివిటీతో వస్తోన్న ఈ ఫోన్ మిడ్-రేంజ్ కేటగిరీని టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి రానుంది. ఇతర ఎఫ్-సిరీస్ ఫోన్ల లాగే, Samsung Galaxy F54 5G కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ డివైజ్ నెట్టింట్లో ప్రత్యక్షమైన తరుణంలో మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ నుంచి ఈ డివైజ్ కి సంబంధించిన అధికార ప్రకటన అతి త్వరలో వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.

Samsung Galaxy F54 5G కంటే ముందే రానున్న Galaxy F14

రీసెంట్ గా 91మొబైల్స్ Samsung Galaxy F14 కి సంబంధించిన వివరాలను ఎక్స్‌క్లూజివ్ గా అందించింది. ఈ హ్యాండ్సెట్ భారత్ లో వచ్చే వారం లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 5జీ కనెక్టివిటీతో వస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ ధర సుమారు రూ.15,000 ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ డిజైన్ రెండర్స్ ద్వారా కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. వాటి ప్రకారం, ఈ హ్యాండ్సెట్ గ్రీన్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. పాలికార్బొనేట్ బాడీతో ఈ ఫోన్ వచ్చే చాన్స్ ఉంది.

ఇటీవలె లీకైన డివైజ్ రెండర్స్ ద్వారా డ్యూయల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాస్ రివీల్ అయ్యాయి. అలాగే ఎడ్జెస్ కర్వ్డ్ గా కనిపించాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని అంచనా. ఈ ఫోన్ ఐపీఎస్ హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు సమాచారం. ఫోన్ కి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వెల్లడి కానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించిన కొత్త శాంసంగ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>