Vivo V27 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:31:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 66వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Vivo V27 https://www.91mobiles.com/telugu/vivo-v27-launched-india-price-specs-offers-availability/ Wed, 01 Mar 2023 09:46:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=5166 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo భారత్ లో Vivo V27 సిరీస్ ని లాంచ్ చేసింది. ప్రామిస్ చేసినట్లుగానే వివో సంస్థ భారత్ లో Vivo V27, Vivo V27 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో తన కలర్ చేంజింగ్ టెక్నాలజీని కంటిన్యూ చేసింది. ఈసారి బేస్ మోడల్ కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చింది. దీంతో ఫోన్ చూడటానికి ఎంతో ప్రీమియమ్ గా కనిపిస్తోంది. ఇక సెల్ఫీ స్నాపర్ కోసం ఫ్రంట్ లో […]

The post కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 66వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Vivo V27 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో అఫీషియల్ గా లాంచైన Vivo V27 స్మార్ట్ ఫోన్
  • కలర్-చేంజింగ్ బ్యాక్ ప్యానెల్, కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చిన Vivo V27
  • భారత్ లో Vivo V27 ధర రూ.32,999 తో ప్రారంభం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo భారత్ లో Vivo V27 సిరీస్ ని లాంచ్ చేసింది. ప్రామిస్ చేసినట్లుగానే వివో సంస్థ భారత్ లో Vivo V27, Vivo V27 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో తన కలర్ చేంజింగ్ టెక్నాలజీని కంటిన్యూ చేసింది. ఈసారి బేస్ మోడల్ కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చింది. దీంతో ఫోన్ చూడటానికి ఎంతో ప్రీమియమ్ గా కనిపిస్తోంది. ఇక సెల్ఫీ స్నాపర్ కోసం ఫ్రంట్ లో పంచ్-హోల్ కటౌట్ ఉంది. ఇంకా భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ 66వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

Vivo V27 సిరీస్ చైనాలో లాంచ్ అయిన వివో ఎస్16 కి రీబ్రాండ్ వర్షన్ అని చెబుతున్నారు. Vivo V27 ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ వాడారు. సరే, ఓసారి Vivo V27 డివైజ్ ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo V27 ధర, సేల్ తేదీ

Vivo V27 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 8జిబి+128జిబి మోడల్ ధర రూ.32,999 గా ఉంది. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.36,999 గా ఉంది. మార్చి 23 నుంచి ఈ హ్యాండ్సెట్ సేల్ మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Vivo సంస్థ ఐసీఐసీఐ, కొటక్, హెచ్డీబీ బ్యాంక్ కార్డ్స్ పై 3500 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ మేజర్ రిటైలర్స్ అయిన రిలయన్స్ డిజిటల్, జియో డిజిటల్ లైఫ్, క్రోమా, విజయ్ సేల్స్, పూర్వికా, సంగీత, బిగ్ సి, లాట్ తదితర ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఆన్‌లైన్ ఆఫర్స విషయానికి వస్తే, HDFC, ICICI, KOTAK బ్యాంక్ కార్డ్స్ ద్వారా పేమెంట్ చేస్తే, రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.2500 వరకు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ మరియు వివో అధికార వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

Vivo V27 5G స్పెసిఫికేషన్స్

Vivo V27 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు. 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు.

Vivo V27 లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్, కర్వ్డ్ ఎడ్జెస్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 66వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో లాంచైన Vivo V27 first appeared on 91Mobiles Telugu.

]]>
మార్చి 1 న గ్లోబల్‌గా లాంచ్ అవుతోన్న Vivo V27 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-v27-series-launching-march-1-globally-price-specs/ Mon, 20 Feb 2023 05:30:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=4996 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలోనే Vivo V27 సిరీస్ ని భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయబోతోంది. Vivo V27 సిరీస్ మార్చి 1 న లాంచ్ అవుతున్నట్లు ఖరారైంది. Vivo V27 సిరీస్ లాంచ్ కోసం వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. Vivo V-సిరీస్ కి ప్రత్యేకించి భారత్ లో ఆదరణ ఎక్కువే. Vivo V27 సిరీస్ 120 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, కలర్ చేంజింగ్ […]

The post మార్చి 1 న గ్లోబల్‌గా లాంచ్ అవుతోన్న Vivo V27 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా మార్చి 1 న లాంచ్ కానున్న Vivo V27 సిరీస్
  • 120 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, అమోలెడ్ డిస్ప్లే, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ తో వస్తోన్న Vivo V27 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న ఫోన్లు: Vivo V27, Vivo V27 Pro, Vivo V27e

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలోనే Vivo V27 సిరీస్ ని భారత్ తో పాటు, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయబోతోంది. Vivo V27 సిరీస్ మార్చి 1 న లాంచ్ అవుతున్నట్లు ఖరారైంది. Vivo V27 సిరీస్ లాంచ్ కోసం వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. Vivo V-సిరీస్ కి ప్రత్యేకించి భారత్ లో ఆదరణ ఎక్కువే.

Vivo V27 సిరీస్ 120 హెర్ట్జ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ డిజైన్, సోని ఐఎంఎక్స్766వి సెన్సర్ తో వస్తోంది. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Vivo V27, Vivo V27 Pro, Vivo V27e. ఫ్లిప్ కార్ట్ అనుకోకుండా Vivo V27 సిరీస్ ఇండియా లాంచ్ తేదీని రివీల్ చేసింది. దీంతో మార్చి 1 న ఈ సిరీస్ లాంచ్ కానుందని స్పష్టత వచ్చింది.

వివో వి27 సిరీస్ కలర్ ఆప్షన్స్

Vivo V27 సిరీస్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో వస్తోంది. అతినీలలోహిత కాంతి పడిన వెంటనే ఫోన్ బ్యాక్ ప్యానెల్ డార్క్ షేడ్ లోకి మారిపోతుంది. ఈ కలర్ చేంజింగ్ ఫీచర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ తరహా ఫోన్లకు గిరాకీ బాగానే ఉంది. గత సిరీసుల్లో కూడా వివో ఈ కలర్ చేంజింగ్ టెక్నాలజీని వాడింది.

Vivo V27 సిరీస్ స్మార్ట్ ఫోన్ సోని ఐఎంఎక్స్ 776వి సెన్సర్, ఆరా లైటింగ్ తో వస్తున్నట్లు సమాచారం. అంటే ఈ ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరాను కలిగి ఉండనుంది. ఇంకా ఈ ఫోన్ పొట్రెయిట్ కేపబులిటీస్ ని వివో బాగా హైలైట్ చేస్తోంది.

రీసెంట్ లీక్ ద్వారా Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ తో వస్తున్నట్లు తెలిసింది. Vivo V27 Pro ధర రూ.41,999 గా ఉండనుందని సమాచారం. భారత్ లో దీని ధర రూ.40,000 గా ఉండనుంది. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ప్రకారం, Vivo V27 Pro ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 440 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తోంది.

Vivo V27 Pro డివైజ్ ఇటీవలె గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. ఆ లిస్టింగ్ ప్రకారం, Vivo V27 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, మాలి జీ610 జీపీయూ, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మార్చి 1 న గ్లోబల్‌గా లాంచ్ అవుతోన్న Vivo V27 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిస్తోన్న Vivo V27 సిరీస్ ల్యాండింగ్ పేజీ; రివీలైన డిజైన్ https://www.91mobiles.com/telugu/vivo-v27-series-flipkart-landing-page-official-look/ Tue, 14 Feb 2023 15:11:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4926 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో Vivo V27 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. వరుసబెట్టి లీక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేసిన తర్వాత, ఎట్టకేలకు వివో నుంచి Vivo V27 అఫీషియల్ డిజైన్ బయటకు వచ్చింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత్ లో Vivo V27 సేల్ కి రానుంది. తాజాగా ఇదే ఈ-కామర్స్ సైట్ లో Vivo V27 ల్యాండింగ్ పేజీ ప్రత్యక్షమైంది. దీంతో Vivo V27 యొక్క అఫీషియల్ అవతార్ […]

The post ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిస్తోన్న Vivo V27 సిరీస్ ల్యాండింగ్ పేజీ; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్
  • ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో దర్శనమిస్తోన్న Vivo V27 సిరీస్ ల్యాండింగ్ పేజీ
  • ల్యాండింగ్ పేజీ ద్వారా రివీల్ అయిన Vivo V27 అఫీషియల్ లుక్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో Vivo V27 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. వరుసబెట్టి లీక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేసిన తర్వాత, ఎట్టకేలకు వివో నుంచి Vivo V27 అఫీషియల్ డిజైన్ బయటకు వచ్చింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా భారత్ లో Vivo V27 సేల్ కి రానుంది. తాజాగా ఇదే ఈ-కామర్స్ సైట్ లో Vivo V27 ల్యాండింగ్ పేజీ ప్రత్యక్షమైంది. దీంతో Vivo V27 యొక్క అఫీషియల్ అవతార్ బయటకు వచ్చినట్లైంది. సరే, పదండి, Vivo V27 విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

ఫ్లిప్ కార్ట్ లో కనిపిస్తోన్న పోస్టర్స్ ని బట్టి Vivo V27 Pro డివైజ్ గోల్డ్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. డెడికేటెడ్ రింగ్ లైట్ ని బ్యాక్ ప్యానెల్ పై గమనించవచ్చు. ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, Vivo V27, Vivo V27 Pro డివైజెస్ కర్వ్డ్ డిస్ప్లేస్ తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. పోస్టర్స్ లో రియర్ పార్ట్ కర్వ్డ్ గా కనిపిస్తోంది.

Vivo V27 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V27 Pro డివైజ్ డిస్ప్లే విభాగం ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడినట్లు సమాచారం. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. మిగతా ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo V27 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo V27 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

లేటెస్ట్ లీక్స్ ని బట్టి గత మోడల్స్ కంటే లేటెస్ట్ సిరీస్ ఖరీదు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. Vivo V27 5G ధర రూ.35,000 గా ఉంటుందని అంచనా. Vivo V27 Pro 5G ధర రూ.40,000 ఉంటుందని సమాచారం. Vivo V27 5G డివైజ్ గతేడాది చైనాలో లాంచైన Vivo S16 మాదిరి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Vivo V27 Pro 5G ఫోన్ చైనాలో లాంచైన ఇంకో ఫోన్ Vivo S16 Pro 5G ని పోలి ఉంటుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిస్తోన్న Vivo V27 సిరీస్ ల్యాండింగ్ పేజీ; రివీలైన డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Vivo V27 5G, V27 Pro 5G ధరలు https://www.91mobiles.com/telugu/vivo-v27-vivo-v27-pro-india-prices-leaked-before-launch/ Fri, 10 Feb 2023 13:43:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=4878 త్వరలో భారత్ లో Vivo V27 సిరీస్ లాంచ్ కానుంది. వివో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్లను భారత్ లో వచ్చే నెల ఆరంభంలో లాంచ్ చేయనుంది. అయితే వివో ఇంకా అధికారికంగా లాంచ్ వివరాలను వెల్లడించలేదు. Vivo V27 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో రానుందని సమాచారం. మరోవైపు Vivo V27 Pro 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. చూస్తుంటే గత […]

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo V27 5G, V27 Pro 5G ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 మార్చిలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో లాంచ్ కానున్న Vivo V27 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానున్న Vivo V27 Pro 5G

త్వరలో భారత్ లో Vivo V27 సిరీస్ లాంచ్ కానుంది. వివో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్లను భారత్ లో వచ్చే నెల ఆరంభంలో లాంచ్ చేయనుంది. అయితే వివో ఇంకా అధికారికంగా లాంచ్ వివరాలను వెల్లడించలేదు. Vivo V27 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో రానుందని సమాచారం. మరోవైపు Vivo V27 Pro 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

చూస్తుంటే గత మోడల్ అయిన వివో వీ25 తో పోల్చితే భారత్ లో Vivo V27 5G ధర పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు Vivo V27 Pro 5G కాస్త అధిక ధరతో లాంచ్ కానుందని సమాచారం. ఓసారి Vivo V27 సిరీస్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo V27 సిరీస్ ధరలు (లీక్డ్)

Vivo V27 సిరీస్ భారత్ లో మార్చి ఆరంభంలో లాంచ్ కానుంది. లేటెస్ట్ లీక్స్ ని బట్టి గత మోడల్స్ కంటే లేటెస్ట్ సిరీస్ ఖరీదు ఎక్కువగా ఉండేట్లు కనిపిస్తోంది. Vivo V27 5G ధర రూ.35,000 గా ఉంటుందని అంచనా. Vivo V27 Pro 5G ధర రూ.40,000 ఉంటుందని సమాచారం.

Vivo V27 5G డివైజ్ గతేడాది చైనాలో లాంచైన Vivo S16 మాదిరి ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు Vivo V27 Pro 5G ఫోన్ చైనాలో లాంచైన ఇంకో ఫోన్ Vivo S16 Pro 5G ని పోలి ఉంటుందని సమాచారం. రీసెంట్ గా Vivo V27 5G హ్యాండ్సెట్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో ఇది మీడియాటెక్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడినట్లు తెలుస్తోంది.

Vivo V27 సిరీస్ 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ప్రైమరీ కెమెరా సోని ఐఎంఎక్స్766 సెన్సర్ ని కలిగి ఉండనుంది. ఓఐఎస్ + ఈఐఎస్ స్టెబిలైజేషన్ కూడా ఉండనుందని సమాచారం. వీ-సిరీస్ లైనప్ లో ప్రపంచ వ్యాప్తంగా Vivo V27 4G, Vivo V27 5G, Vivo V27e 5G, Vivo V27 Pro 5G మోడల్స్ లాంచ్ కానున్నాయి.

Vivo V27e 5G, Vivo V27 Pro 5G గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించాయి. దీంతో ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. గ్లోబల్ వేరియంట్స్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో రానున్నాయి. ఇకపోతే Vivo V27 Pro 5G 8జిబి ర్యామ్ తో లిస్టింగ్ పై కనిపించింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్‌కి ముందు లీకైన Vivo V27 5G, V27 Pro 5G ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
మీడియాటెక్ చిప్సెట్స్, సోని కెమెరా సెన్సర్స్‌తో లాంచ్ కానున్న Vivo V27, Vivo V27 Pro (లీక్డ్) https://www.91mobiles.com/telugu/vivo-v27-series-specs-and-launch-timeline-tipped/ Thu, 02 Feb 2023 15:58:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=4769 త్వరలో Vivo V27 సిరీస్ భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో మొత్తం రెండు ఫోన్లు ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro. Vivo V25 మోడల్స్ కి Vivo V27 సిరీస్ సక్సెసర్ గా రానుంది. లాంచ్ అనౌన్స్‌మెంట్ కి ముందు 91మొబైల్స్ కి ఈ ఫోన్స్ కి సంబంధించిన ప్రధాన వివరాలు తెలిసాయి. కెమెరా మరియు పెర్ఫామెన్స్ విభాగాల్లో మేజర్ అప్‌గ్రేడ్స్ తో ఈ ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. […]

The post మీడియాటెక్ చిప్సెట్స్, సోని కెమెరా సెన్సర్స్‌తో లాంచ్ కానున్న Vivo V27, Vivo V27 Pro (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన Vivo V27 సిరీస్ స్పెసిఫికేషన్స్, త్వరలో భారత్ లో లాంచ్ కానున్న డివైజెస్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వస్తోన్న Vivo V27 Pro
  • లైనప్ లో వస్తోన్న Vivo V27, Vivo V27 Pro డివైజెస్. Vivo V27e కూడా లాంచ్ అయ్యే అవకాశం

త్వరలో Vivo V27 సిరీస్ భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో మొత్తం రెండు ఫోన్లు ఉంటాయి. అవి: Vivo V27, Vivo V27 Pro. Vivo V25 మోడల్స్ కి Vivo V27 సిరీస్ సక్సెసర్ గా రానుంది. లాంచ్ అనౌన్స్‌మెంట్ కి ముందు 91మొబైల్స్ కి ఈ ఫోన్స్ కి సంబంధించిన ప్రధాన వివరాలు తెలిసాయి. కెమెరా మరియు పెర్ఫామెన్స్ విభాగాల్లో మేజర్ అప్‌గ్రేడ్స్ తో ఈ ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే, Vivo V25 ఫోన్లు, వివో వీ23 సిరీస్ తో పోల్చితే పెద్దగా మార్పులతో రాలేదు.

Vivo V27 కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు మాకు తెలిసింది. కేవలం ప్రో-మోడల్స్ మాత్రమే ఇప్పటి వరకు కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే, తొలిసారిగా స్టాండర్డ్ వేరియంట్ కూడా కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోందని చెప్పవచ్చు. Vivo V27 సిరీస్ ఫోన్లు హై-ఎండ్ సోని ప్రైమరీ కెమెరాలతో వస్తున్నట్లు సమాచారం. నైట్ ఫోటోగ్రఫీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి భారీ కెమెరా అప్‌గ్రేడ్స్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Vivo V27 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V27 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తోంది. అయితే, స్టాండర్డ్ వేరియంట్ కూడా ఇదే చిప్సెట్ తో వస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. రెండు ఫోన్లు కూడా కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్స్ తో వస్తున్నాయి. ఈ ఫీచర్ ఫోన్లను మరింత ఆకర్షణీయంగా చేయనుంది. ప్రస్తుతానికి ఈ సిరీస్ ఫోన్లకు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ రహస్యంగానే ఉన్నాయి.

గత రిపోర్ట్స్ ప్రకారం, భారత్ లో Vivo V27 సిరీస్ ఫోన్లు ఫిబ్రవరి లో లాంచ్ అవుతాయని తెలుస్తోంది. అంటే త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన రానుందన్నమాట. Vivo V27e అనే మరొక మోడల్ కూడా ఇదే ఏడాదిలో లాంచ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే Vivo V27 సిరీస్ ఆఫ్‌లైన్ స్టోర్స్ తో పాటు ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్స్ ద్వారా కూడా అమ్ముడు కానుంది.

త్వరలోనే Vivo V27 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. అలాగే Vivo V27e ఫోన్ కి సంబంధించి కూడా స్పష్టత రానుంది. ఒకేసారి మూడు మోడల్స్ లాంచ్ అవుతాయా? లేదంటే, తొలుత రెండు మోడల్స్ లాంచ్ అయ్యాక, మూడో మోడల్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తారా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మీడియాటెక్ చిప్సెట్స్, సోని కెమెరా సెన్సర్స్‌తో లాంచ్ కానున్న Vivo V27, Vivo V27 Pro (లీక్డ్) first appeared on 91Mobiles Telugu.

]]>
భారత మార్కెట్‌లో ఫిబ్రవరిలో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-v27-series-india-launch-february-vivo-s16-rebrand-version/ Tue, 31 Jan 2023 05:16:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=4699 Vivo సంస్థ 2022 డిసెంబర్ లో చైనాలో Vivo S16 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం మూడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవి: Vivo S16e, Vivo S16, Vivo S16 Pro. తాజాగా అందిన సమాచారం ఏంటంటే, Vivo S16 సిరీస్ భారత్ లో Vivo V27 సిరీస్ గా లాంచ్ అవుతోంది. Vivo V27 సిరీస్ భారత్ లో ఫిబ్రవరి రెండో వారంలో లేదా చివరి వారంలో లాంచ్ […]

The post భారత మార్కెట్‌లో ఫిబ్రవరిలో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరిలో భారత్ లో లాంచ్ అవుతోన్న Vivo V27 సిరీస్
  • Vivo S16 సిరీస్ ఆధారంగా వస్తోన్న Vivo V27 సిరీస్ ఫోన్లు
  • Vivo S16 సిరీస్ లో ఉన్న 3 డివైజ్‌లు ఇవే: Vivo S16e, Vivo S16, Vivo S16 Pro

Vivo సంస్థ 2022 డిసెంబర్ లో చైనాలో Vivo S16 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం మూడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవి: Vivo S16e, Vivo S16, Vivo S16 Pro. తాజాగా అందిన సమాచారం ఏంటంటే, Vivo S16 సిరీస్ భారత్ లో Vivo V27 సిరీస్ గా లాంచ్ అవుతోంది. Vivo V27 సిరీస్ భారత్ లో ఫిబ్రవరి రెండో వారంలో లేదా చివరి వారంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

గతంలో వచ్చిన కథనాలను బట్టి, Vivo V27 సిరీస్ భారతీయ మార్కెట్ లో 2023 మొదట్లోనే లాంచ్ అవ్వనుందని తెలిసింది. ఇక తాజాగా లాంచ్ టైమ్ లైన్ ని ట్వీట్ చేసిన టిప్‌స్టర్, Vivo S16 సిరీస్ డివైజెస్ పలు మార్పులు చేర్పులతో Vivo V27 సిరీస్ గా వస్తోందని తెలిపాడు. సరే, ఓసారి Vivo V27 సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

గతేడాది, వివో సంస్థ Vivo S15 సిరీస్ ని భారతీయ మార్కెట్ లో Vivo V25 పేరుతో లాంచ్ చేసింది. దీంతో రానున్న Vivo V27 సిరీస్ విషయంలో కూడా ఇదే జరగనుంది. అయితే, Vivo V27 సిరీస్ లో భాగంగా ఎన్ని డివైజెస్ ని కంపెనీ లాంచ్ చేస్తుందన్న విషయం ఇంకా తెలియలేదు. సరే, మరొకసారి Vivo S16 స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.

Vivo S16 సిరీస్ స్పెసిఫికేషన్స్

Vivo S16, Vivo S16 Pro ఫోన్స్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, హెచ్డీఆర్10+ తో వచ్చాయి. మరోవైపు Vivo S16e స్మార్ట్ ఫోన్ 6.62-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది.

Vivo S16 స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, Vivo S16 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, Vivo S16e ఎగ్జినోస్ 1080 ప్రాసెసర్స్ తో వచ్చాయి. Vivo S16 Pro డివైజ్ లో వివో 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ అందించింది. మరోవైపు Vivo S16, Vivo S16e ఫోన్లు 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ తో వచ్చాయి. ఈ మూడు ఫోన్లు కూడా యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వచ్చాయి.

Vivo S16 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్నాయి. Vivo S16 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 సెన్సర్ ఉంది. ఇక Vivo S16 లో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. Vivo S16e లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. Vivo S16, Vivo S16 Pro ఫోన్లు 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చాయి. ఇక Vivo S16e 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత మార్కెట్‌లో ఫిబ్రవరిలో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V27 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-v27-series-launch-timeline-expected-specs/ Sun, 06 Nov 2022 04:35:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=3261 హైలైట్స్ 2023 ఆరంభంలో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్ Vivo V25 కి సక్సెసర్ గా వస్తోన్న Vivo V27 సిరీస్ కొత్త తరం మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్స్ తో లాంచ్ కానున్న Vivo V27 స్మార్ట్ ఫోన్స్ Vivo కంపెనీ రీసెంట్ గా Vivo V25 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Vivo V25 5G, Vivo V25 Pro 5G మోడల్స్ ఉన్నాయి. అలాగే Vivo […]

The post Vivo V27 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 ఆరంభంలో లాంచ్ కానున్న Vivo V27 సిరీస్
  • Vivo V25 కి సక్సెసర్ గా వస్తోన్న Vivo V27 సిరీస్
  • కొత్త తరం మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్స్ తో లాంచ్ కానున్న Vivo V27 స్మార్ట్ ఫోన్స్

Vivo కంపెనీ రీసెంట్ గా Vivo V25 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Vivo V25 5G, Vivo V25 Pro 5G మోడల్స్ ఉన్నాయి. అలాగే Vivo V25 4G ఫోన్ కూడా ఈ లైనప్ లో ఉంది. ఈ 4జీ మోడల్ రానున్న రోజుల్లో భారత్ లో లాంచ్ అవుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈలోపు తదుపరి వీ-సిరీస్ ఫోన్స్ లాంచ్ కి సిద్ధమయ్యాయి. Vivo V27 సిరీస్ వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ అవుతుందని సమాచారం.

2023 మొదటి త్రైమాసికంలో Vivo V27 సిరీస్ లాంచ్ కానుందని 91Mobiles ఓ రిపోర్ట్ ని వెలువరించింది. Vivo V27 సిరీస్ క్రింద భారత్ లో లాంచ్ కాబోవు ఫోన్స్ ఏంటనే వివరాలను కూడా వెల్లడయ్యాయి. Vivo V27 సిరీస్ యొక్క టైమ్ లైన్, ఇతర వివరాల గురించి తెలుసుకుందాం పదండి.

Vivo V27 సిరీస్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతోంది?

Vivo V27 సిరీస్, V25 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోంది. Vivo V27 లైనప్ లో కనీసం రెండు ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 91Mobiles కథనం ప్రకారం, వివో వీ27 సిరీస్ 2023 ఫిబ్రవరిలో లాంచ్ కానుందని సమాచారం. ఇది ఇండియా లాంచ్ టైమ్ లైన్ అని గమనించాలి. వివో ఇతర మార్కెట్స్ లో Vivo V27 సిరీస్ ని లాంచ్ చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు.

Vivo V27 సిరీస్ న్యూ-జనరేషన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న Vivo V25 సిరీస్ లో డైమెన్సిటీ 1300 చిప్సెట్ వాడారు.

ఇప్పుడు త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Vivo V25 4G ఫోన్ గురించి తెలుసుకుందాం. ఇటీవలె థాయిలాండ్ లో లాంచ్ అయిన Vivo V25e 4G కి రీబ్యాండ్జ్డ్ వర్షన్ అని సమాచారం. స్పెసిఫికేషన్స్ కూడా దాని లాగే ఉండనున్నాయి. Vivo V25 4G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఈ బ్యాటరీ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo V25 4G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64 ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Vivo V25 4G స్మార్ట్ ఫోన్ లో 6.44-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి. అయితే Vivo V25 4G ఫోన్ లాంచ్ తేదీని వివో ఇంకా ప్రకటించాల్సి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Vivo V27 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>