Vivo V30 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 02 Aug 2024 13:57:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌తో రూ.3,600 వరకు అదనపు డిస్కౌంట్, పూర్తి వివరాలివిగో! https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-price-cut-by-rs-2000-and-additional-bank-offer-discount-upto-rs-3600-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-price-cut-by-rs-2000-and-additional-bank-offer-discount-upto-rs-3600-full-details/#respond Fri, 02 Aug 2024 12:11:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=12812 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్టు 7వ తేదీన లాంచ్ సమయాన్ని కంపెనీ ఖరారు చేసింది. ఈ లైనప్ లో Vivo V40 5G, Vivo V40 Pro 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. దీంతో గత మోడల్ Vivo V30 5G ధరను వివో రూ.2,000 తగ్గించింది. అంతేకాదు, రూ.3,600 వరకు డిస్కౌంట్ కూడా యూజర్లకు లభించనుంది. అంటే Vivo V30 5G డివైజ్ ప్రస్తుతం రూ.5,600 […]

The post Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌తో రూ.3,600 వరకు అదనపు డిస్కౌంట్, పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో వీ40 లాంచ్‌కి ముందు వీ30 ధర తగ్గింపు
  • ఆగస్టు 7న లాంచ్ అవుతోన్న వివో వీ40 సిరీస్
  • Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్టు 7వ తేదీన లాంచ్ సమయాన్ని కంపెనీ ఖరారు చేసింది. ఈ లైనప్ లో Vivo V40 5G, Vivo V40 Pro 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. దీంతో గత మోడల్ Vivo V30 5G ధరను వివో రూ.2,000 తగ్గించింది. అంతేకాదు, రూ.3,600 వరకు డిస్కౌంట్ కూడా యూజర్లకు లభించనుంది. అంటే Vivo V30 5G డివైజ్ ప్రస్తుతం రూ.5,600 (రూ.2,000 + రూ.3600) తక్కువకే లభించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 5G ధర తగ్గింపు, ఆఫర్లు

Vivo V30 5G డివైజ్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లాంచ్ ధర రూ.33,999 గా ఉండగా, రూ.2,000 తగ్గింపుతో ఇది రూ.31,999 కి చేరింది.

Vivo V30 5G 8జిబి+256జిబి మోడల్ లాంచ్ ధర రూ.35,999 గా ఉండగా, రూ.2,000 తగ్గింపుతో ఇది రూ.33,999 కి చేరింది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ లాంచ్ ధర రూ.37,999 గా ఉండగా రూ.2,000 తగ్గింపుతో ఇది రూ.35,999 కి చేరింది.

మరోవైపు రూ.3,600 వరకు బ్యాంక్ ఆఫర్ ప్రయోజనం కూడా యూజర్లకు లభించనుంది.

Vivo V30 5G 8జిబి+128జిబి వేరియంట్ పై రూ.3,200 బ్యాంక్ డిస్కౌంట్, 8జిబి+256జిబి మోడల్ పై రూ.3,400 బ్యాంక్ డిస్కౌంట్, 12జిబి+256జిబి వేరియంట్ పై రూ.3,600 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఆగస్టు 1 వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ-స్టోర్స్ లో హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ మరియు ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుంది.

Vivo V30 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. అల్ట్రా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్‌ను ఈ ఫోన్‌లో అందించారు.

మెమొరీ: Vivo V30 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌‌ను ఈ ఫోన్ లో అందించారు. దీని ద్వారా 24జిబి వరకు ర్యామ్ పవర్ పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo V30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo V30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V30 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌తో రూ.3,600 వరకు అదనపు డిస్కౌంట్, పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-price-cut-by-rs-2000-and-additional-bank-offer-discount-upto-rs-3600-full-details/feed/ 0
Vivo: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo V30 https://www.91mobiles.com/telugu/vivo-v30-launched-india-snapdragon-7-gen-3-chipset/ Thu, 07 Mar 2024 08:45:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=10584 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V30 గురించి తెలుసుకుందాం. వివో వీ30 డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ని ఈ […]

The post Vivo: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన Vivo V30
  • 12జిబి ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • Vivo V30 ప్రారంభ ధర రూ.33,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Vivo V30 మరియు Vivo V30 Pro మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Vivo V30 గురించి తెలుసుకుందాం. వివో వీ30 డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. సరే, ఓసారి Vivo V30 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 ధర, లభ్యత

Vivo V30 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.33,999 గా నిర్ణయించారు.

Vivo V30 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది.

టాప్ మోడల్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.37,999 గా ఉంది.

Vivo V30 స్మార్ట్‌ఫోన్ అండమాన్ బ్లూ, పికాక్ గ్రీన్ మరియు క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

నేటి నుంచి Vivo V30 ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. మార్చి 14వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు వివో వెబ్‌సైట్ ద్వారా డివైజ్‌ని కొనుగోలు చేయవచ్చు.

Vivo V30 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. హీటింగ్ సమస్యలు లేకుండా అల్ట్రా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 12జిబి వర్చువల్ ర్యామ్ లభిస్తాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo V30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఏఎఫ్ మరియు ఏఐ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Vivo: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, V30 Pro భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/vivo-v30-v30-pro-india-prices-leaked-before-launch/ Fri, 01 Mar 2024 06:26:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=10510 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo V30 సిరీస్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు అందరూ భారత మార్కెట్ లో ఈ సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. భారత్ లో వివో వీ-సిరీస్ కి ఎంతోమంది అభిమానులున్నారు. మార్చి 7న ఇండియన్ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ఎంట్రీ ఇస్తోంది. ఈలోపు వివో వీ30 సిరీస్ భారత మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. […]

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, V30 Pro భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 7న Vivo V30 సిరీస్ లాంచ్
  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన సిరీస్
  • 8జిబి + 256జిబి బేస్ మోడల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గ్లోబల్ గా Vivo V30 సిరీస్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు అందరూ భారత మార్కెట్ లో ఈ సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని వేచి చూస్తున్నారు. భారత్ లో వివో వీ-సిరీస్ కి ఎంతోమంది అభిమానులున్నారు. మార్చి 7న ఇండియన్ మార్కెట్ లో Vivo V30 సిరీస్ ఎంట్రీ ఇస్తోంది. ఈలోపు వివో వీ30 సిరీస్ భారత మార్కెట్ ధరలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo V30, Vivo V30 Pro ధరలు (లీక్)

  • ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Vivo V30 సిరీస్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై రివీల్ చేశారు.
  • బేస్ మోడల్ వివో వీ30 ధర యొక్క 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.40,000 గా ఉండే అవకాశం ఉంది.
  • ఇక టాప్ మోడల్ Vivo V30 Pro 8జిబి + 256జిబి ధర రూ.45,000 ఉంటుందని సమాచారం.
  • ఇప్పటికే వివో వీ30 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ కూడా గ్లోబల్ వేరియంట్స్ మాదిరే ఉంటాయని అంచనా.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Vivo V30 Pro 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ బ్రైట్నెస్, 452 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro 5G లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Vivo V30 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ప్రాసెసర్: Vivo V30 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హై క్లాక్ స్పీడ్ 3.1 గిగాహెర్ట్జ్.
  • ఓఎస్: Vivo V30 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo: లాంచ్‌కి ముందు లీకైన Vivo V30, V30 Pro భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన V30, V30 Pro రిటైల్ పోస్టర్ https://www.91mobiles.com/telugu/vivo-v30-v30-pro-retail-poster-leaked-before-india-launch/ Fri, 16 Feb 2024 12:08:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=10301 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో V30, V30 Pro డివైజెస్ ని లాంచ్ చేయనుంది. భారత్ లో వివో వీ-సిరీస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా MySmartPrice వెబ్‌సైట్ Vivo V30 సిరీస్ ఇండియా రిటైల్ పోస్టర్ ని తన కథనం ద్వారా షేర్ చేసింది. పోస్టర్ ద్వారా కొన్ని కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి […]

The post Vivo: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన V30, V30 Pro రిటైల్ పోస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Vivo V30, V30 Pro
  • జీస్ ఆప్టిక్స్ తో వస్తోన్న Vivo V30 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో V30, V30 Pro డివైజెస్ ని లాంచ్ చేయనుంది. భారత్ లో వివో వీ-సిరీస్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా MySmartPrice వెబ్‌సైట్ Vivo V30 సిరీస్ ఇండియా రిటైల్ పోస్టర్ ని తన కథనం ద్వారా షేర్ చేసింది. పోస్టర్ ద్వారా కొన్ని కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo V30, V30 Pro రిటైల్ పోస్టర్ (లీక్)

  • లీక్ ప్రకారం, Vivo V30 Pro లో 6 విభిన్నమైన జీస్ స్టైల్ పోట్రెయిట్ మోడ్స్ రివీల్ అయ్యాయి. ఈ మోడ్స్ ద్వారా పగలు, రాత్రి మెరుగైన కెమెరా అనుభూతిని పొందవచ్చు.
  • జీస్ సినీ-ఫ్లేర్ పొట్రెయిట్, సినీమాటిక్, బయోటార్, ప్లేనార్, డిస్టాగన్ మరియు సోనార్ వంటి మోడ్స్ ఉంటాయని సమాచారం.
  • పొట్రెయిట్ మోడ్ ఫోటోస్ తో పాటు వీడియోలలో కూడా ఉంటుంది. జీస్ సినీమాటిక్ వీడియో బొకే మరియు జీస్ నేచురల్ కలర్ మోడల్ వంటివి Vivo V30 Pro లో లభిస్తాయి.
  • క్రింద ఇవ్వబడిన ఇమేజ్ ని గమనిస్తే, Vivo V30 సిరీస్ ‘త్వరలో వస్తోంది’ అని తెలియజేస్తోంది. అంటే అతి త్వరలో భారత్ లో ఈ సిరీస్ లాంచ్ ఉండనుందని అర్థమవుతోంది.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo V30 Pro లో జీస్ లెన్స్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి.

The post Vivo: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన V30, V30 Pro రిటైల్ పోస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: ఫిబ్రవరి 28న థాయిలాండ్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-v30-series-thailand-launch-february-28th-2024/ Thu, 15 Feb 2024 09:24:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=10278 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వచ్చే నెల భారతీయ మార్కెట్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. తాజాగా వివో సంస్థ Vivo V30 సిరీస్ థాయిలాండ్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 28న Vivo V30 సిరీస్ థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. జీస్ ఆప్టిక్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ […]

The post Vivo: ఫిబ్రవరి 28న థాయిలాండ్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo V30 సిరీస్ థాయిలాండ్ లాంచ్ ఖరారు
  • ఫిబ్రవరి 28న లాంచ్ అవుతోన్న సిరీస్
  • జీస్ ఆప్టిక్స్ తో వస్తోన్న వీ30 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 సిరీస్ ని లాంచ్ చేయనుంది. వచ్చే నెల భారతీయ మార్కెట్ లో ఈ సిరీస్ లాంచ్ అవుతోంది. తాజాగా వివో సంస్థ Vivo V30 సిరీస్ థాయిలాండ్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఫిబ్రవరి 28న Vivo V30 సిరీస్ థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. ఈ సిరీస్ లో Vivo V30 మరియు Vivo V30 Pro డివైజెస్ రానున్నాయి. జీస్ ఆప్టిక్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వీ30 సిరీస్ లాంచ్ కానుంది. సరే, ఓసారి థాయిలాండ్ లాంచ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V30 సిరీస్ లాంచ్ తేదీ

  • కంపెనీ అధికార వెబ్‌సైట్ లో లిస్టైన ల్యాండింగ్ పేజీ ప్రకారం, Vivo V30 మరియు Vivo V30 Pro థాయిలాండ్ లో ఫిబ్రవరి 28న లాంచ్ అవుతోంది.
  • ఎర్లీ బర్డ్ ప్రోగ్రామ్ లో భాగంగా థాయిలాండ్ కస్టమర్లు వీ30 సిరీస్ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
  • సైట్ ప్రకారం, Vivo V30 సిరీస్ సీ గ్రీన్, నైట్ స్కై బ్లాక్ మరియు పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయని తెలుస్తోంది.

కంపెనీ ప్రకటించిన స్పెసిఫికేషన్స్

  • Vivo V30 సిరీస్ డివైజెస్ యొక్క స్పెసిఫికేషన్స్ ని వివో తన వెబ్‌సైట్ లో ల్యాండింగ్ పేజీ ద్వారా రివీల్ చేసింది. అవేంటో తెలుసుకుందాం.
  • Vivo V30 సిరీస్ 50ఎంపి ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. మూడు కెమెరాలు కూడా జీస్ లెన్సెస్ కలిగి ఉంటాయి.
  • మెయిన్ కెమెరా మాడ్యూల్ క్రింద ఆరా లైట్ ఉంటుంది. ఈ ఆరా లైట్ ద్వారా యూజర్లు కలర్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది.
  • Vivo V30 సిరీస్ ఫోన్లు 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నాయని కంపెనీ తెలిపింది.

Vivo V30 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Vivo V30 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50ఈ ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, ఒక పొట్రెయిట్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo V30 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • కెమెరా: Vivo V30 Pro లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 Pro లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Vivo V30 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉంటాయి.
  • బరువు, చుట్టుకొలత: Vivo V30 Pro డివైజ్ 164.4 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 7.5 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 Pro డివైజ్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

The post Vivo: ఫిబ్రవరి 28న థాయిలాండ్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: 50MP కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo V30 https://www.91mobiles.com/telugu/vivo-v30-globally-launched-with-50mp-camera-5000mah-battery/ Mon, 05 Feb 2024 05:51:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=10073 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు గ్లోబల్ గా Vivo V30 డివైజ్ ని లాంచ్ చేసింది. చూడటానికి ఈ ఫోన్ గత డిసెంబర్ లో చైనాలో లాంచైన Vivo S18 మాదిరి ఉంది. Vivo V30 డివైజ్ త్వరలోనే భారత్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ మరియు యూఏఈ దేశాల్లో విడుదల కానుంది. Vivo V30 డివైజ్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ […]

The post Vivo: 50MP కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు గ్లోబల్‌గా లాంచైన Vivo V30
  • ఇంకా వెల్లడికాని డివైజ్ ధర
  • 3డీ పెటల్ ప్యాటర్న్ తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు గ్లోబల్ గా Vivo V30 డివైజ్ ని లాంచ్ చేసింది. చూడటానికి ఈ ఫోన్ గత డిసెంబర్ లో చైనాలో లాంచైన Vivo S18 మాదిరి ఉంది. Vivo V30 డివైజ్ త్వరలోనే భారత్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ మరియు యూఏఈ దేశాల్లో విడుదల కానుంది. Vivo V30 డివైజ్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది.

Vivo V30 లభ్యత, ధర

  • Vivo V30 స్మార్ట్‌ఫోన్ భారత్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, హాంగ్ కాంగ్, సింగపూర్, పాకిస్తాన్, ఈజిప్ట్ మరియు యూఏఈ లతో కలిపి మొత్తం 30 మార్కెట్స్ లో విడుదలవుతుందని కంపెనీ తెలిపింది.
  • మరోవైపు, మెక్సికో లో ఫిబ్రవరి 8న లాంచ్ అవుతుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
  • అయితే, Vivo V30 ధరను కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Vivo V30 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V30 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్సో కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Vivo V30 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ డ్యూయల్ సాఫ్ట్ ఎల్ఈడీ ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo V30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo V30 5G లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్ (ఎల్1+ఎల్5), యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo V30 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ సర్టిఫికేషన్ ఉన్నాయి.

The post Vivo: 50MP కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచైన Vivo V30 first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: లీకైన Vivo V30 5G గ్లోబల్ వేరియంట్ డిజైన్, స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-global-variant-design-specs-leaked/ Wed, 31 Jan 2024 06:05:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=9995 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 5G సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 5G మరియు Vivo V30 Pro 5G డివైజెస్ లాంచ్ కానున్నాయి. తొలుత ఫిలిప్పైన్స్ లో గ్లోబల్ లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలె వివో ఫిలిప్పైన్స్ వెబ్‌సైట్ అఫీషియల్ గా Vivo V30 5G ని టీజ్ చేసింది. దీంతో ఆ దేశంలో త్వరలో లాంచ్ ఉంటుందని స్పష్టమైంది. తాజాగా పారస్ గుగ్లాని Vivo […]

The post Vivo: లీకైన Vivo V30 5G గ్లోబల్ వేరియంట్ డిజైన్, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30 5G
  • తొలుత ఫిలిప్పైన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • తాజాగా రివీలైన Vivo V30 5G డిజైన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V30 5G సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V30 5G మరియు Vivo V30 Pro 5G డివైజెస్ లాంచ్ కానున్నాయి. తొలుత ఫిలిప్పైన్స్ లో గ్లోబల్ లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలె వివో ఫిలిప్పైన్స్ వెబ్‌సైట్ అఫీషియల్ గా Vivo V30 5G ని టీజ్ చేసింది. దీంతో ఆ దేశంలో త్వరలో లాంచ్ ఉంటుందని స్పష్టమైంది. తాజాగా పారస్ గుగ్లాని Vivo V30 5G యొక్క డిజైన్ రివీల్ చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 5G డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలు (లీక్)

  • Vivo V30 5G డిజైన్ గురించి మాట్లాడితే గత నెలలో చైనాలో లాంచైన Vivo S18 మాదిరి ఉంటుంది.
  • Vivo V30 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. వీటి క్రింద ట్విన్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఉన్నాయి.
  • Vivo V30 5G లో కర్వ్డ్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి. ఈ వివరాలు అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ అయ్యాయి.

Vivo V30 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • Vivo V30 5G స్మార్ట్‌ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం.
  • Vivo V30 5G డివైజ్ 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటాయి.
  • గుగ్లాని ప్రకారం, Vivo V30 5G డివైజ్ ఓషన్ బ్లూ మరియు ఎలిగంట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo V30 5G డివైజ్ 185 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo: లీకైన Vivo V30 5G గ్లోబల్ వేరియంట్ డిజైన్, స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>