Vivo V30e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 02 May 2024 09:32:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V30e: అల్ట్రా-స్లిమ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-v30e-launched-india-ultra-slim-3d-curved-display/ Thu, 02 May 2024 09:32:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=11321 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ గత మోడల్ వివో వీ29ఈ కి సక్సెసర్‌గా ఎంట్రీ ఇచ్చింది. Vivo V30e లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అమోలెడ్ ప్యానెల్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Vivo V30e యొక్క పూర్తి […]

The post Vivo V30e: అల్ట్రా-స్లిమ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో Vivo V30e లాంచ్
  • 50ఎంపి సెల్ఫీ కెమెరా
  • ప్రారంభ ధర రూ.27,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో వీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ గత మోడల్ వివో వీ29ఈ కి సక్సెసర్‌గా ఎంట్రీ ఇచ్చింది. Vivo V30e లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అమోలెడ్ ప్యానెల్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Vivo V30e యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo V30e ధర, సేల్ వివరాలు

Vivo V30e ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V30e 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.29,999 గా పెట్టారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ కార్డులపై రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ, రూ.2500 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఆఫ్‌లైన్ స్టోర్స్ లో 10 శాతం క్యాష్‌బ్యాక్, 12 నెలల జీ-డౌన్ పేమెంట్ ఆప్షన్, వివో షీల్డ్ పై 40 శాతం డిస్కౌంట్ వంటి బెనిఫిట్స్ లభించనున్నాయి.

Vivo V30e స్మార్ట్‌ఫోన్ వెల్వెట్ రెడ్ మరియు సిల్వర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo V30e డివైజ్ ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ మరియు వివో వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్‌కి అందుబాటులో ఉంది.

Vivo V30e స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V30e లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30e లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30e డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo V30e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఫీచర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V30e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo V30e స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V30e లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo V30e: అల్ట్రా-స్లిమ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: మే 2న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30e https://www.91mobiles.com/telugu/vivo-v30e-india-launch-may-2nd/ Fri, 19 Apr 2024 18:12:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=11188 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు ఫోన్లు V30, V30 Pro ఉన్నాయి. ఇప్పుడు Vivo V30e కూడా వీటితో చేరనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. మే 2వ తేదీన Vivo V30e భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి రానుంది. సరే, ఓసారి […]

The post Vivo: మే 2న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30e first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo V30e ఇండియా లాంచ్ తేదీ ఖరారు
  • మే 2న భారత్ లో లాంచ్ అవుతోన్న డివైజ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వీ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు ఫోన్లు V30, V30 Pro ఉన్నాయి. ఇప్పుడు Vivo V30e కూడా వీటితో చేరనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. మే 2వ తేదీన Vivo V30e భారత్ లో లాంచ్ అవుతోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి రానుంది. సరే, ఓసారి Vivo V30e యొక్క ఇండియా లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo V30e ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Vivo V30e స్మార్ట్‌ఫోన్ భారత్ లో మే 2న లాంచ్ కానుంది. ఈ విషయాన్ని వివో సంస్థ అధికారికంగా ఒక టీజర్ ద్వారా వెల్లడించింది.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Vivo V30e భారత్ లో సేల్‌కి వస్తోంది. 3డీ కర్వ్డ్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది.

Vivo V30e స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo V30e లో కర్వ్డ్ డిస్ప్లే, అల్ట్రా స్లిమ్ 3డీ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V30e లో ఏ ప్రాసెసర్ ఉంటుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

కెమెరా: Vivo V30e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పొట్రెయిట్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo V30e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.

The post Vivo: మే 2న భారత్‌లో లాంచ్ అవుతోన్న Vivo V30e first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V30e ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-v30e-india-launch-confirmed/ Thu, 18 Apr 2024 18:28:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=11170 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వీ30 సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే వీ-సిరీస్ లో Vivo V30, V30 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటి ధరలు వరుసగా రూ.33,999 మరియు రూ.41,999 గా ఉన్నాయి. తాజాగా Vivo V30e ఇండియా లాంచ్‌ని కంపెనీ ఖరారు చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo V30e ఇండియా లాంచ్ […]

The post Vivo V30e ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V30e
  • ఏప్రిల్ ఆఖర్లో లేదా మే ఆరంభంలో లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వీ30 సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే వీ-సిరీస్ లో Vivo V30, V30 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటి ధరలు వరుసగా రూ.33,999 మరియు రూ.41,999 గా ఉన్నాయి. తాజాగా Vivo V30e ఇండియా లాంచ్‌ని కంపెనీ ఖరారు చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30e ఇండియా లాంచ్

Vivo బ్రాండ్ త్వరలో V30e స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ లో ఈ ఫోన్ యొక్క ప్రొడక్ట్ పేజీ కనిపిస్తోంది. దీంతో ఫోన్ ఇమేజ్, ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అయితే లాంచ్ తేదీ మాత్రం వెల్లడికాలేదు. ఏప్రిల్ ఆఖర్లో లేదా మే ఆరంభంలో వివో వీ30ఈ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Vivo V30e స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo V30e లో కర్వ్డ్ డిస్ప్లే, అల్ట్రా స్లిమ్ 3డీ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V30e లో ఏ ప్రాసెసర్ ఉంటుందో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.

కెమెరా: Vivo V30e లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పొట్రెయిట్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo V30e లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.

The post Vivo V30e ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ సైట్‌పై లిస్టైన V30e https://www.91mobiles.com/telugu/vivo-v30e-listed-on-bluetooth-sig-website/ Fri, 12 Apr 2024 16:08:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=11065 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo, వీ30 సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. ఇంతకు ముందే గీక్‌బెంచ్, బీఐఎస్ వంటి సైట్స్ లో కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలతో పాటు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి. Vivo V30e బ్లూటూత్ […]

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ సైట్‌పై లిస్టైన V30e first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V30e లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo, వీ30 సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo V30e పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. ఇంతకు ముందే గీక్‌బెంచ్, బీఐఎస్ వంటి సైట్స్ లో కూడా లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలతో పాటు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V30e బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Vivo V30e స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2340, V2339 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది.

V2339 మోడల్ నంబర్ ఇండియన్ వేరియంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే మోడల్ నంబర్ తో భారత్ కి చెందిన బీఐఎస్ సైట్ పై Vivo V30e లిస్ట్ అయ్యింది.

ఇక V2340 మోడల్ నంబర్ గ్లోబల్ వేరియంట్ ని సూచిస్తుందని చెప్పవచ్చు.

బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ వెల్లడి కాలేదు. అయితే త్వరలోనే Vivo V30e లాంచ్ ఉంటుందని స్పష్టమవుతోంది.

Vivo V30e స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo V30e స్మార్ట్‌ఫోన్ గతంలో గీక్‌బెంచ్ మరియు ఇతర సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి అవెలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: Vivo V30e లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo V30e లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని సమాచారం.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30e డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ, వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వస్తుందని తెలుస్తోంది.

కెమెరా: Vivo V30e లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోంది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo V30e లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Vivo V30e స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Vivo V30e లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ సైట్‌పై లిస్టైన V30e first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30e https://www.91mobiles.com/telugu/vivo-v30e-listed-on-bis-website/ Sun, 07 Apr 2024 17:39:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=10967 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారత్ తో సహా వివిధ మార్కెట్లలో V30 సిరీస్‌ని లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో వచ్చిన Vivo V30, V30 Pro స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వివో నుంచి ఇదే సిరీస్ లో మరో ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. Vivo V30e పేరుతో రానున్న ఈ డివైజ్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలు, […]

The post Vivo: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30e first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V30e లాంచ్
  • మోడల్ నంబర్ V2339
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారత్ తో సహా వివిధ మార్కెట్లలో V30 సిరీస్‌ని లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో వచ్చిన Vivo V30, V30 Pro స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వివో నుంచి ఇదే సిరీస్ లో మరో ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. Vivo V30e పేరుతో రానున్న ఈ డివైజ్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo V30e బీఐఎస్ లిస్టింగ్

Vivo V30e డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై V2339 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. MySmartPrice తొలుత ఈ విషయాన్ని గుర్తించింది.

గతంలో Vivo V30e డివైజ్ ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ-5, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్ పై కనిపించింది.

ఇటీవలె బ్లూటూత్ ఎస్ఐజీ డేటాబేస్ లిస్టింగ్ ద్వారా Vivo V30e పేరు ఖరారైంది.

Vivo V30e స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Vivo V30e లో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. అయితే స్క్రీన్ సైజ్ ఎంతో ఇంకా రివీల్ కాలేదు.
  • ప్రాసెసర్: Vivo V30e లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo V30e డివైజ్ 8జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. అయితే ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • కెమెరా: Vivo V30e డివైజ్ కెమెరా ఎఫ్‌వీ-5 డేటాబేస్ పై కనిపించింది. ఈ ఫోన్ లో 50ఎంపి రియర్ కెమెరా, ఈఐఎస్ సపోర్ట్, ఎఫ్/1.8 అపర్చర్, 35ఎంఎం ఫోకల్ లెంగ్త్, 4096*3072 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ఆపరేటింగ్ సిస్టమ్: Vivo V30e డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post Vivo: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Vivo V30e first appeared on 91Mobiles Telugu.

]]>