Xiaomi 12T Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 20 Feb 2023 07:05:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గ్లోబల్ గా లాంచ్ అయిన Xiaomi 12T, Xiaomi 12T Pro https://www.91mobiles.com/telugu/xiaomi-12t-12t-pro-launched-globally-price-specs/ Wed, 05 Oct 2022 04:35:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=2748 హైలైట్స్: గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చిన Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్ Xiaomi 11T లైనప్ కి సక్సెసర్స్ గా వచ్చిన 12T సిరీస్ 108ఎంపి, 200ఎంపి మెయిన్ కెమెరాలను కలిగి ఉన్న 12టీ, 12టీ ప్రో Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. షావోమీ 11టీ లైనప్ కి ఇవి సక్సెసర్స్ గా రంగంలోకి దిగాయి. 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వస్తున్న […]

The post గ్లోబల్ గా లాంచ్ అయిన Xiaomi 12T, Xiaomi 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చిన Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్
  • Xiaomi 11T లైనప్ కి సక్సెసర్స్ గా వచ్చిన 12T సిరీస్
  • 108ఎంపి, 200ఎంపి మెయిన్ కెమెరాలను కలిగి ఉన్న 12టీ, 12టీ ప్రో

Xiaomi 12T, Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. షావోమీ 11టీ లైనప్ కి ఇవి సక్సెసర్స్ గా రంగంలోకి దిగాయి. 200ఎంపి శాంసంగ్ సెన్సర్ తో వస్తున్న తొలి షావోమీ ఫోన్ 12టీ ప్రో కావడం విశేషం. ఇంతకు ముందు శాంసంగ్ 200ఎంపి సెన్సర్ తో Moto Edge 30 Pro మార్కెట్ లోకి వచ్చింది. Xiaomi 12T, Xiaomi 12T Pro ఫోన్లు 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తున్నాయి. 12టీ ప్రో లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉపయోగించగా, 12టీ లో డైమెన్సిటీ 8100 చిప్సెట్ వాడారు.

Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు

Xiaomi 12T 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 599 యూరోలు (దాదాపు రూ.48,463). ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

మరోవైపు, Xiaomi 12T Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 749 యూరోలు (దాదాపు రూ.60,583). ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 12T, Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 12T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్, మాలి-జీ610 6-కోర్ జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై Xiaomi 12T పని చేస్తుంది. Xiaomi 12T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

ఇప్పుడు Xiaomi 12T కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Xiaomi 12T లో 108ఎంపి ప్రైమరీ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20ఎంపి ఐఎంఎక్స్596 సెన్సర్ అమర్చారు.

Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బి విజన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

Xiaomi 12T Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్, 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. Xiaomi 12T Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, ఐఆర్ బ్లాస్టర్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్లో ఉన్నాయి.

Xiaomi 12T Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Xiaomi 12T Pro లో 20ఎంపి ఐఎంఎక్స్596 సెన్సర్ అమర్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post గ్లోబల్ గా లాంచ్ అయిన Xiaomi 12T, Xiaomi 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు https://www.91mobiles.com/telugu/xiaomi-12t-12t-pro-prices-leaked-before-launch/ Fri, 30 Sep 2022 08:03:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=2674 హైలైట్స్: లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ఫోన్ల ధరలు Xiaomi 12T ధర 580 యూరోలు (దాదాపు రూ.46,300), Xiaomi 12T Pro ధర 770 యూరోలు (దాదాపు రూ.61,400) అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, Xiaomi 12T Pro Xiaomi 12T సిరీస్ అక్టోబర్ 4 న గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. భారత్ లో కూడా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ […]

The post లాంచ్ కి ముందు లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ఫోన్ల ధరలు
  • Xiaomi 12T ధర 580 యూరోలు (దాదాపు రూ.46,300), Xiaomi 12T Pro ధర 770 యూరోలు (దాదాపు రూ.61,400)
  • అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, Xiaomi 12T Pro

Xiaomi 12T సిరీస్ అక్టోబర్ 4 న గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. భారత్ లో కూడా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో Xiaomi 12T, Xiaomi 12T Pro మోడల్స్ ఉన్నాయి. షావోమీ 12టీ ప్రో 200ఎంపి ప్రైమరీ కెమెరాతో వస్తోంది. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా తర్వాత 200ఎంపి కెమెరాతో వస్తున్న రెండో మోడల్ ఇదే కానుంది. ఇప్పుడు లాంచ్ అనౌన్స్మెంట్ కి ముందు, Xiaomi 12T సిరీస్ యొక్క ధరలు రివీల్ అయ్యాయి. వీటిని టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ రివీల్ చేశాడు.

Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు (లీక్డ్)

Xiaomi 12T సిరీస్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి. 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 580 యూరోలు (దాదాపు రూ.46,300), 256జిబి స్టోరేజీ యూనిట్ ధర 630 యూరోలు (దాదాపు రూ.50,300).

ఇప్పుడు Xiaomi 12T Pro ధర ఎలా ఉందో చూద్దాం. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 770 యూరోలు (దాదాపు రూ.61,400) కాగా, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 800 యూరోలు (దాదాపు రూ.63,800). ఈ రెండు ఫోన్లు లునార్ సిల్వర్, బ్లూ, బ్లాక్/గ్రే కలర్ ఆప్షన్స్ లో లభించనున్నాయి.

Xiaomi 12T, Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 12T లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 108ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 20ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5జీ కనెక్టివిటీ, వై-ఫై 6, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ ఉన్నాయి.

Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ని అందించారు. ఈ డిస్ప్లే 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్లో క్వాల్కమ్ కంపెనీ తయారు చేసిన స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ని వాడారు. 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఇందులో అందించారు. ఇకపోతే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. ఈ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. షావోమీ 12టీ ప్రో లో 200ఎంపి భారీ మెయిన్ సెన్సర్ అందించారు. ఈ ఫోన్ కి ఈ కెమెరానే హైలైట్ పాయింట్ అని చెప్పాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన Xiaomi 12T, Xiaomi 12T Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, 12T Pro https://www.91mobiles.com/telugu/xiaomi-12t-12t-pro-launch-date-specs/ Wed, 28 Sep 2022 14:07:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=2634 హైలైట్స్: అక్టోబర్ 4 న లాంచ్ కానున్న Xiaomi 12T సిరీస్ జర్మనీలోని మ్యునిచ్ నగరంలో జరగనున్న లాంచ్ ఈవెంట్; సమయం – రాత్రి 7.30 200ఎంపి కెమెరాతో వస్తోన్న Xiaomi 12T Pro ఎంఐ ఫ్యాన్స్ కి శుభవార్త. అక్టోబర్ 4 వ తారీఖున Xiaomi కంపెనీ షావోమీ 12 సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ లైనప్ లో Xiaomi 12T, 12T Pro ఫోన్లు ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. Xiaomi 12T Pro 200 […]

The post అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అక్టోబర్ 4 న లాంచ్ కానున్న Xiaomi 12T సిరీస్
  • జర్మనీలోని మ్యునిచ్ నగరంలో జరగనున్న లాంచ్ ఈవెంట్; సమయం – రాత్రి 7.30
  • 200ఎంపి కెమెరాతో వస్తోన్న Xiaomi 12T Pro

ఎంఐ ఫ్యాన్స్ కి శుభవార్త. అక్టోబర్ 4 వ తారీఖున Xiaomi కంపెనీ షావోమీ 12 సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ లైనప్ లో Xiaomi 12T, 12T Pro ఫోన్లు ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. Xiaomi 12T Pro 200 ఎంపి భారీ కెమెరాతో వస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Xiaomi 12T, 12T Pro ఫోన్ల లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇస్తున్నాం.

Xiaomi లాంచ్ ఈవెంట్

Xiaomi 12T, 12T Pro స్మార్ట్ ఫోన్స్ అక్టోబర్ 4 న లాంచ్ అవుతున్నాయి. మ్యూనిచ్ నగరంలో ఈ ఈవెంట్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈవెంట్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే రోజున రెడ్మీ బ్రాండ్ యొక్క మొదటి ట్యాబ్లెట్ Redmi Pad, Xiaomi Smart Band 7 Pro లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

Xiaomi 12T, 12T Pro స్పెసిఫికేషన్స్

ఇప్పుడు Xiaomi 12T, 12T Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. Xiaomi 12T Pro విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్న అత్యంత శక్తివంతమైన చిప్సెట్ ఇదే. ఇకపోతే Xiaomi 12T స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్ తో వస్తోంది.

Xiaomi 12T Pro స్మార్ట్ ఫోన్ 200ఎంపి కెమెరాతో లాంచ్ కానుందని అంచనా. రిపోర్ట్స్ ని బట్టి, ఇందులో శాంసంగ్ హెచ్పీ1 సెన్సర్ ని వాడినట్లు సమాచారం. Xiaomi 12T లో 108ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉండనుంది. అలాగే రెండు డివైజెస్ లోనూ 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉండనున్నాయి.

Xiaomi 12T లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ ఉండనుంది. రెండు ఫోన్ల స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. షావోమీ 12టీ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుండగా, షావోమీ 12టీ ప్రో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

Xiaomi 12T స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో వస్తోంది. Xiaomi 12T Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. లాంచ్ రోజున ఈ రెండు ఫోన్ల యొక్క ధరల వివరాలు తెలుస్తాయి. కాంపిటీటివ్ ప్రైస్ తోనే షావోమీ ఈ ఫోన్లను తీసుకొస్తుందని అందరూ భావిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Xiaomi 12T, 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8+ Gen 1 చిప్, 200MP కెమెరాతో రానున్న Xiaomi 12T Pro https://www.91mobiles.com/telugu/xiaomi-12t-pro-spotted-geekbench-specs/ Wed, 21 Sep 2022 07:57:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=2478 హైలైట్స్: Geekbench పై కనిపించిన Xiaomi 12T Pro, లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్న Xiaomi 12T Pro అతి త్వరలో Xiaomi 12 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా Xiaomi 12T సిరీస్ కొన్ని వారాల్లో గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Xiaomi 12T, Xiaomi 12T Pro మోడల్స్ ఉంటాయి. ఇటీవలి […]

The post Snapdragon 8+ Gen 1 చిప్, 200MP కెమెరాతో రానున్న Xiaomi 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Geekbench పై కనిపించిన Xiaomi 12T Pro, లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్న Xiaomi 12T Pro
  • అతి త్వరలో Xiaomi 12 సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా

Xiaomi 12T సిరీస్ కొన్ని వారాల్లో గ్లోబల్ గా లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Xiaomi 12T, Xiaomi 12T Pro మోడల్స్ ఉంటాయి. ఇటీవలి కాలంలో, ఈ ఫోన్లు పలు సర్టిఫికేషన్స్ సైట్స్ లో కనిపించాయి. దీంతో ఫోన్ల యొక్క హార్డ్ వేర్ కి సంబంధించి పలు వివరాలు తెలిసాయి. ఇప్పుడు Xiaomi 12T Pro బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఈ విషయాన్ని మైస్మార్ట్‌ప్రైస్ గుర్తించింది. ర్యామ్, ప్రాసెసర్, ఓఎస్ వర్షన్, తదితర ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ లిస్టింగ్ ద్వారా తెలిసాయి. 22081212UG అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

సింగిల్ స్కోర్ టెస్ట్ లో Xiaomi 12T Pro 1300 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 4061 పాయింట్లు సాధించింది. 200ఎంపి భారీ సెన్సర్ తో వస్తున్న తొలి షావోమీ ఫోన్ ఇదేనని చెబుతున్నారు.

గీక్‌బెంచ్ పై కనిపించిన Xiaomi 12T Pro

గీక్ బెంచ్ పై 22081212UG అనే మోడల్ నంబర్ తో Xiaomi 12T Pro కనిపించింది. మోడల్ నంబర్ చివర్లో ఉన్న G అనే అక్షరం, ఇది గ్లోబల్ వేరియంట్ అని సూచిస్తోంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో Xiaomi 12T Pro రానుందని సమాచారం. అలాగే ఈ చిప్ గ్రాఫిక్స్ కోసం Adreno 730 GPU ని వాడుకోనుంది.

Xiaomi 12T Pro ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ వేరియంట్స్ లో Xiaomi 12T Pro లభించనుంది.

Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్

Xiaomi 12T Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2712*1220 పిక్సెల్ రెజుల్యూషన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉండనున్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Xiaomi 12T Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సర్స్ తో రానుంది. ఇందులో 200ఎంపి మెయిన్ సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇక Xiaomi 12T Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

త్వరలోనే ఇండియా లాంచ్ కి సంబంధించిన వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో షావోమీ నుంచి టీజర్ ఇమేజెస్ వచ్చే చాన్సెస్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, ఆటోమొబైల్, టెలీకామ్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Snapdragon 8+ Gen 1 చిప్, 200MP కెమెరాతో రానున్న Xiaomi 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi 12T, Xiaomi 12T Pro లాంచ్ టైమ్ లైన్, కలర్స్, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-12t-xiaomi-12t-pro-price-specs-leaked-before-launch/ Tue, 06 Sep 2022 09:43:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=2129 హైలైట్స్: సెప్టెంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రానున్న హ్యాండ్సెట్స్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న షావోమీ 12టీ సిరీస్ షావోమీ 12 మరియు షావోమీ 12ఎస్ సిరీస్ ని లాంచ్ చేశాక, సదరు కంపెనీ షావోమీ 12టీ లైనప్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ […]

The post Xiaomi 12T, Xiaomi 12T Pro లాంచ్ టైమ్ లైన్, కలర్స్, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ లో లాంచ్ కానున్న షావోమీ 12టీ, షావోమీ 12టీ ప్రో
  • కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రానున్న హ్యాండ్సెట్స్
  • భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న షావోమీ 12టీ సిరీస్

షావోమీ 12 మరియు షావోమీ 12ఎస్ సిరీస్ ని లాంచ్ చేశాక, సదరు కంపెనీ షావోమీ 12టీ లైనప్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ కి సంబంధించి షావోమీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అనౌన్స్మెంట్ కి ముందు రూమర్ల ద్వారా పలు విషయాలు తెలిశాయి. టిప్ స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో ప్రైస్‌బాబా వెబ్ సైట్ 12టీ సిరీస్ టైమ్ లైన్ ని రివీల్ చేసింది. షావోమీ 12టీ సిరీస్ లో రెండు మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. అవి: షావోమీ 12టీ మరియు షావోమీ 12టీ ప్రో.

షావోమీ 12ఎస్ సిరీస్ మాదిరి కాకుండా, షావోమీ 12టీ ఫోన్లు గ్లోబల్ గా, అలాగే భారత్ లో కూడా లాంచ్ అవ్వనున్నాయి. షావోమీ 13 ప్రకటనకు ముందే షావోమీ 12టీ సిరీస్ లాంచ్ అవుతుందని అంచనా. ఇక షావోమీ 13 నవంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం. సాధారణ షెడ్యూల్ కంటే ఒక నెల ముందే షావోమీ 13 మార్కెట్ లోకి రానుంది.

Xiaomi 12T సిరీస్ లాంచ్ టైమ్ లైన్

ప్రైస్ బాబా కథనం ప్రకారం, షావోమీ 12టీ సిరీస్ సెప్టెంబర్ లో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే, ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

Xiaomi 12T సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్స్

షావోమీ 12టీ ప్రో రెండు స్టోరేజీ వేరియంట్లో లభ్యం కానుంది. అవి: 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి. షావోమీ 12టీ ప్రో కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

మరోవైపు, షావోమీ 12టీ 8జిబి + 128జిబి మోడల్ తో పాటు, 8జిబి + 256జిబి స్టోరేజీ వేరియంట్లో లభించనుంది. ఈ ఫోన్ కూడా కాస్మిక్ బ్లాక్, లునార్ సిల్వర్, క్లియర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Xiaomi 12T సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

షావోమీ 12టీ ప్రో 5జీ, రెడ్మీ కే50 అల్ట్రా గా రీబ్రాండ్ చేయబడిందనే పుకారు వినిపిస్తోంది. అయితే ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరాను వినియోగించారు. మోటో ఎక్స్30 ప్రో లో వాడబడిన శాంసంగ్ హెచ్పీ1 200ఎంపి సెన్సర్ ని ఇందులో వాడినట్లు సమాచారం. ఇక దీంతో పాటు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో యూనిట్ ఉండనున్నాయి.

మరోవైపు 12టీ 5జీ లో 108ఎంపి కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయని సమాచారం. షావోమీ 12టీ మరియు షావోమీ 12టీ ప్రో లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే షావోమీ 12టీ ప్రో 5జీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని సమాచారం. మరోవైపు 12టీ 5జీ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంటుందట.

షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ అమర్చనున్నట్లు సమాచారం. మరోవైపు షావోమీ 12టీ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 అల్ట్రా చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. అయితే, రెండు డివైజెస్ కూడా 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 1220*2712 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉండనున్నాయి.

Xiaomi 12T, Xiaomi 12T Pro ధర (అంచనా)

షావోమీ 12టీ 5జీ ధర 600 – 620 యూరోలు (దాదాపు రూ.48,700 నుంచి రూ.50,400) గా ఉంటుందని అంచనా. మరోవైపు, షావోమీ 12టీ ప్రో 5జీ ధర 800 – 820 యూరోలు (దాదాపు రూ.65,000-రూ.66,700) ఉంటుందని తెలుస్తోంది. భారత్ లో ఈ ఫోన్ల ధరలు చౌకగా ఉంటాయని అంచనా వేయవచ్చు.

The post Xiaomi 12T, Xiaomi 12T Pro లాంచ్ టైమ్ లైన్, కలర్స్, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-12t-pro-specs-google-play-cosole/ Wed, 24 Aug 2022 05:32:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=1855 హైలైట్స్: లాంచ్ కి ముందు గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ పై కనిపించిన షావోమీ 12టీ ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 1220*2712 పిక్సెల్స్ స్క్రీన్ రెజుల్యూషన్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు రెడ్మీ కే50 అల్ట్రా యొక్క రీబ్రాండెడ్ వర్షన్ ఈ షావోమీ 12టీ ప్రో గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ ద్వారా షావోమీ 12టీ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. కొన్ని […]

The post గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ పై కనిపించిన షావోమీ 12టీ ప్రో
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 1220*2712 పిక్సెల్స్ స్క్రీన్ రెజుల్యూషన్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • రెడ్మీ కే50 అల్ట్రా యొక్క రీబ్రాండెడ్ వర్షన్ ఈ షావోమీ 12టీ ప్రో

గూగుల్ ప్లే కన్సోల్ వెబ్ సైట్ ద్వారా షావోమీ 12టీ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై ఈ షావోమీ ఫోన్ కనిపించింది. ఇక లీక్ అయిన లైవ్ ఇమేజ్ ద్వారా షావోమీ 12టీ ప్రో యొక్క డిజైన్, కెమెరా వివరాలు తెలిశాయి. గతంలో బయటకు వచ్చిన మరొక లీక్ ద్వారా షావోమీ 12టీ ప్రో కి సంబంధించిన హార్డ్‌వేర్ డీటెయిల్స్ తెలిశాయి.

ఈ లీకైన మొత్తం వివరాలను బట్టి ఈ నెల మొదట్లో లాంచ్ అయిన రెడ్మీ కే50 అల్ట్రా ఫోన్ కి షావోమీ 12టీ ప్రో రీబ్రాండెడ్ వర్షన్ అని అర్థమవుతోంది. షావోమీ 12టీ ప్రో గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ లో కనిపించడం ద్వారా త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఉండనుందని స్పష్టమవుతోంది. మరి షావోమీ 12టీ ప్రో నుంచి మనం ఏం ఆశించవచ్చో ఇక్కడ చూద్దాం. పదండి.

Xiaomi 12T Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

షావోమీ 12టీ ప్రో ని గూగుల్ ప్లే కన్సోల్ పై తొలుత మైస్మార్ట్‌ప్రైస్ గమనించింది. డైటింగ్ అనే కోడ్ నేమ్ ని షావోమీ 12టీ ప్రో కలిగి ఉంది. అంతకు ముందు ఇదే కోడ్ నేమ్ రెడ్మీ కే50 అల్ట్రా కూడా కలిగి ఉండటం మనం చూశాం. షావోమీ 12టీ ప్రో 12జిబి వరకు ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది. షావోమీ 12టీ ప్రో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనుంది. ఈ ఫోన్ 1220*2712 పిక్సెల్స్ స్క్రీన్ రెజుల్యూషన్, 480 స్క్రీన్ డెన్సిటీని కలిగి ఉండనుంది.

Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

షావోమీ 12టీ ప్రో, రెడ్మీ కే50 అల్ట్రా యొక్క రీబ్యాడ్జ్డ్ వర్షన్ కావున స్పెసిఫికేషన్స్ కూడా ఆ ఫోన్ మాదిరే ఉంటాయని ఊహించవచ్చు. షావోమీ 12టీ ప్రో లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. షావోమీ 12టీ ప్రో లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 20 ఎంపి కెమెరాను అమర్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
FCC సర్టిఫికేషన్ క్లియర్ చేసిన Xiaomi 12T Pro https://www.91mobiles.com/telugu/xiaomi-12t-pro-spotted-on-fcc-listing-usa-200mp-camera/ Wed, 17 Aug 2022 05:27:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=1715 హైలైట్స్: షావోమీ 12టీ ప్రో స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్స్ ని ఆఫర్ చేస్తుందని అంచనా 200ఎంపి కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం ఇప్పటివరకు కంపెనీ నుంచి వెల్లడి కాని అధికార ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను అమ్మే సంస్థ అయిన షావోమీ, ఇటీవలి కాలంలో వరుసగా ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ రెగ్యులేటర్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) డేటాబేస్ లో షావోమీ 12టీ ప్రో […]

The post FCC సర్టిఫికేషన్ క్లియర్ చేసిన Xiaomi 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • షావోమీ 12టీ ప్రో స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్స్ ని ఆఫర్ చేస్తుందని అంచనా
  • 200ఎంపి కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం
  • ఇప్పటివరకు కంపెనీ నుంచి వెల్లడి కాని అధికార ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను అమ్మే సంస్థ అయిన షావోమీ, ఇటీవలి కాలంలో వరుసగా ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ రెగ్యులేటర్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) డేటాబేస్ లో షావోమీ 12టీ ప్రో కనిపించింది. గ్లోబల్ డేటాబేస్ పై ఈ స్మార్ట్‌ఫోన్ కనిపించడంతో, తొలుత గ్లోబల్ గా ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అలాగే ఇది చైనా-సెంట్రిక్ డివైజ్ కాదని స్పష్టమవుతోంది.

Xiaomi 12T Pro నుంచి ఏమి ఆశించవచ్చు

యూఎస్ ఎఫ్‌సీ‌సీ లిస్టింగ్ ప్రకారం, షావోమీ 12టీ ప్రో డ్యూయల్ సిమ్ సపోర్ట్, డ్యూయల్ 4జీ ఎల్టీఈ, 5జీ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. అలాగే ఇందులో నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) కూడా ఉంటుందని సమాచారం. దీని ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ జరిపేందుకు వీలుంటుంది.

ఎఫ్‌సీసీ లిస్టింగ్ ని బట్టి, షావోమీ 12టీ ప్రో మూడు వేరియంట్లలో రానున్నట్లు తెలుస్తోంది. వీటిలో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ఉండనున్నాయి.

ఫోన్స్ కి సంబంధించి నమ్మదగిన ప్రీ-లాంచ్ సమాచారం ఇచ్చే ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్, షావోమీ 12టీ ప్రో యొక్క లైవ్ ఇమేజ్ ని షేర్ చేశాడు. ఈ ఇమేజ్ ద్వారా 200ఎంపి బ్రాండింగ్ ని రియర్ కెమెరా మాడ్యూల్ పై ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి ఈ భారీ కెమెరా 200ఎంపి లెన్స్ అని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.

గత నివేదికలను బట్టి, షావోమీ 12టీ ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను కలిగి ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఇందులో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ అందిస్తున్నారు. షావోమీ 12టీ ప్రో లో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కు సంపోర్ట్ చేయనుంది. ఇక ఈ ఫోన్లో ప్రత్యేకాకర్షనగా 200ఎంపి రియర్ కెమెరా నిలవనుంది. మిగతా కెమెరాల సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా చూస్తే 200ఎంపి కెమెరా, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ మెయిన్ సెల్లింగ్ పాయింట్స్ కానున్నాయి.

Xiaomi 12T Pro Specifications

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్
  • 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
  • 200ఎంపి మెయిన్ కెమెరా
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

షావోమీ ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 12టీ సిరీస్ ని రివీల్ చేశాక, ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.

The post FCC సర్టిఫికేషన్ క్లియర్ చేసిన Xiaomi 12T Pro first appeared on 91Mobiles Telugu.

]]>