Xiaomi 14 Civi - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 13 Jun 2024 05:42:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Xiaomi 14 Civi: 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో భారత్‌లో లాంచైన షావోమి 14 సీవీ https://www.91mobiles.com/telugu/xiaomi-14-civi-launched-india-32mp-plus-32mp-selfie-cameras/ Wed, 12 Jun 2024 11:31:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=12027 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నేడు భారతీయ మార్కెట్ లో Xiaomi 14 Civi డివైజ్ ను లాంచ్ చేసింది. మిడ్-బడ్జెట్ లో ఉత్తమమైన ఫీచర్లతో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Xiaomi 14 Civi: 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో భారత్‌లో లాంచైన షావోమి 14 సీవీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Xiaomi 14 Civi లాంచ్
  • 32ఎంపి+32ఎంపి ఫ్రంట్ కెమెరా
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నేడు భారతీయ మార్కెట్ లో Xiaomi 14 Civi డివైజ్ ను లాంచ్ చేసింది. మిడ్-బడ్జెట్ లో ఉత్తమమైన ఫీచర్లతో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 14 Civi ధర, లభ్యత

Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 14 Civi యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.42,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.47,999 గా పెట్టారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కొనే వారికి ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, రూ.3,000 ఎక్స్‌చేంజ్ బోనస్ సౌకర్యం కూడా ఉంది.

Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ జూన్ 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్స్ మరియు కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా డివైజ్ ను కొనుగోలు చేయవచ్చు.

జూన్ 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి Xiaomi 14 Civi యొక్క ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయి. మొదటగా బుక్ చేసుకునే వారికి Redmi Watch 3 Active ఉచితంగా లభిస్తుంది.

Xiaomi 14 Civi స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Xiaomi 14 Civi లో 6.55-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫ్లోటింగ్ క్వాడ్-కర్వ్ ప్యానెల్, 1236*2750 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 3000 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Xiaomi 14 Civi లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. టీ1 సిగ్నల్ ఎన్హాన్స్‌మెంట్ చిప్ ను ఈ ఫోన్ లో అమర్చారు.

ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 Civi 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి స్టోరేజీతో వచ్చింది.

ఫ్రంట్ కెమెరా: Xiaomi 14 Civi లో 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. ఇది ఏఐ ఫీచర్ ను కలిగి ఉంది.

రియర్ కెమెరా: Xiaomi 14 Civi లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి 50ఎంఎం లైకా ప్రొఫెషనల్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

ఓఎస్: Xiaomi 14 Civi డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Xiaomi 14 Civi లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Xiaomi 14 Civi లో డ్యూయల్ సిమ్, 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, డాల్బీ అట్మాస్, హై-రెజ్ ఆడియో, స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ ఉన్నాయి.

The post Xiaomi 14 Civi: 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో భారత్‌లో లాంచైన షావోమి 14 సీవీ first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi 14 Civi నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం https://www.91mobiles.com/telugu/what-to-expect-from-xiaomi-14-civi/ Sun, 09 Jun 2024 18:18:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=11971 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో సీవీ-సిరీస్ భారత్ లో లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా, తొలుత Xiaomi 14 Civi మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ కోసం షావోమి ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ జూన్ 13వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, లైకా లెన్సెస్ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్స్ తో Xiaomi 14 Civi వస్తోంది. ఓసారి ఈ […]

The post Xiaomi 14 Civi నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 13 న షావోమి 14 సీవీ లాంచ్
  • లైకా లెన్సెస్ తో వస్తోన్న డివైజ్
  • 32ఎంపి+32ఎంపి సెల్ఫీ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో సీవీ-సిరీస్ భారత్ లో లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా, తొలుత Xiaomi 14 Civi మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ కోసం షావోమి ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ జూన్ 13వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, లైకా లెన్సెస్ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్స్ తో Xiaomi 14 Civi వస్తోంది. ఓసారి ఈ ఫోన్ నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం.

Xiaomi 14 Civi నుంచి ఏం ఆశించవచ్చు?

కెమెరా: Xiaomi 14 Civi లో అద్భుతమైన కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా విభాగం కోసం షావోమి సంస్థ లైకా తో కలిసి పని చేసింది. లైకాచే ట్యూన్ చేయబడిన 50ఎంపి సమ్మిలక్స్ లెన్స్ ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ సెన్సర్ 25ఎంఎం సినిమాటిక్ హెచ్డీఆర్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇంకా 50ఎంపి 50ఎంఎం పొట్రెయిట్ టెలీఫోటో 2ఎక్స్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.

ఈ ఫోన్ 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ తో వస్తుండటం విశేషం. ఈ సెన్సర్స్ ఏఐ ఫీచర్లను కలిగి ఉంటాయి. 4కే క్వాలిటీతో టెలీప్రాంప్టర్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందిస్తున్నారు. ఫోకస్ స్విచింగ్, డ్యూయల్ వీడియో మోడ్, జూమ్ స్మూథ్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.

డిస్ప్లే: Xiaomi 14 Civi లో క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 68 బిలియన్+ కలర్స్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంటాయి.

ప్రాసెసర్: Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది.

చార్జింగ్: Xiaomi 14 Civi డివైజ్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఐపీ రేటింగ్: Xiaomi 14 Civi డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. దీంతో ఈ ఫోన్ నీరు, దుమ్ముకి ఎదురు నిలిచి ఉండగలదు.

The post Xiaomi 14 Civi నుంచి ఏం ఆశించవచ్చో తెలుసుకుందాం first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi 14 CIVI: లీకైన షావోమి 14 సీవీ రిటైల్ బాక్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/xiaomi-14-civi-retail-box-leaked-know-the-specs/ Mon, 03 Jun 2024 13:34:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=11873 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో సీవీ సిరీస్ ను భారత్‌కి పరిచయం చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14 CIVI డివైజ్ ను తొలుత మార్కెట్ లోకి షావోమి విడుదల చేస్తోంది. జూన్ 12వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కి ముందు ఈ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో షావోమి 14 సీవీ స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి […]

The post Xiaomi 14 CIVI: లీకైన షావోమి 14 సీవీ రిటైల్ బాక్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 12న భారత్ లో Xiaomi 14 CIVI లాంచ్
  • తాజాగా లీకైన డివైజ్ రిటైల్ బాక్స్
  • రివీలైన షావోమి 14 సీవీ స్పెసిఫికేషన్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో సీవీ సిరీస్ ను భారత్‌కి పరిచయం చేయనుంది. ఈ లైనప్ లో Xiaomi 14 CIVI డివైజ్ ను తొలుత మార్కెట్ లోకి షావోమి విడుదల చేస్తోంది. జూన్ 12వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కి ముందు ఈ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో షావోమి 14 సీవీ స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Xiaomi 14 CIVI స్పెసిఫికేషన్స్ (లీకైన బాక్స్ నుంచి)

డిస్ప్లే: Xiaomi 14 CIVI లో క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. ఇది 1.5కే రెజుల్యూషన్ గల అమోలెడ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి. ఫ్రంట్ నాచ్ లో రెండు కెమెరాలు ఉంటాయి.

ప్రాసెసర్: Xiaomi 14 CIVI లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైన ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3 గిగాహెర్ట్జ్.

బ్యాటరీ: Xiaomi 14 CIVI లో బ్యాటరీ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. రిటైల్ బాక్స్ ప్రకారం, ఈ ఫోన్ డబుల్ బ్యాటరీ లైఫ్‌స్పాన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంటే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుందని అర్థం.

కలర్ ఆప్షన్స్: Xiaomi 14 CIVI మూడు రంగుల్లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. క్రూజ్ బ్లూ, మచ్చా గ్రీన్ మరియు షాడో బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Xiaomi 14 CIVI లో డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 32ఎంపి + 32ఎంపి సెన్సర్స్ ఉంటాయి. ప్రైమరీ సెన్సర్ f/2.0 అపర్చర్, 2x పొట్రెయిట్ సపోర్ట్ తో వస్తోంది. సెకండరీ సెన్సర్ 100 డిగ్రీస్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. ఇది f/2.4 అపర్చర్, యాంటీ-షేక్ ఏఐ, ఈఐఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

రియర్ కెమెరా: Xiaomi 14 CIVI లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, ఒక వైడ్ యాంగిల్ లెన్స్, ఒక మ్యాక్రో కెమెరా ఉంటాయి.

The post Xiaomi 14 CIVI: లీకైన షావోమి 14 సీవీ రిటైల్ బాక్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi 14 CIVI ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/xiaomi-14-civi-india-launch-date-confirmed-know-full-details/ Tue, 28 May 2024 05:40:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=11758 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వలో తన సీవీ సిరీస్ ను భారత్‌కి పరిచయం చేయనుంది. Xiaomi 14 CIVI పేరుతో మొదటి సీవీ సిరీస్ ఫోన్ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీని షావోమి ఖరారు చేసింది. జూన్ 12వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదల అవుతోంది. ఈ ఫోన్ కెమెరా సిస్టమ్ కోసం షావోమి, లైకాతో కలిసి పని చేసింది. ఓసారి […]

The post Xiaomi 14 CIVI ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ లో Xiaomi 14 CIVI లాంచ్
  • 50ఎంపి లైకా కెమెరా సెటప్
  • 1.5కే క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వలో తన సీవీ సిరీస్ ను భారత్‌కి పరిచయం చేయనుంది. Xiaomi 14 CIVI పేరుతో మొదటి సీవీ సిరీస్ ఫోన్ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ తేదీని షావోమి ఖరారు చేసింది. జూన్ 12వ తేదీన ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో విడుదల అవుతోంది. ఈ ఫోన్ కెమెరా సిస్టమ్ కోసం షావోమి, లైకాతో కలిసి పని చేసింది. ఓసారి లాంచ్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

Xiaomi 14 CIVI ఇండియా లాంచ్ తేదీ

Xiaomi 14 CIVI స్మార్ట్‌ఫోన్ భారత్ లో జూన్ 12న లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ డివైజ్ యొక్క మైక్రో-సైట్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు ఎంఐ.కామ్ లపై కనిపిస్తోంది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలెలా ఉన్నాయో చూద్దాం.

Xiaomi 14 CIVI స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Xiaomi 14 CIVI లో 1.5కే రెజుల్యూషన్ గల క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటాయి.

ప్రాసెసర్: Xiaomi 14 CIVI లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

రియర్ కెమెరా: Xiaomi 14 CIVI లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సమైలక్స్ 25ఎంఎం సినిమాటిక్ హెచ్డీఆర్ లెన్స్, 50ఎంపి పోట్రెయిట్ టెలీఫోటో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ సెన్సర్, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.

ఫ్రంట్ కెమెరా: Xiaomi 14 CIVI లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి + 32ఎంపి డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది డ్యూయల్ వీడియో మోడ్‌కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Xiaomi 14 CIVI డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14 CIVI లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Xiaomi 14 CIVI లో డాల్బీ అట్మాస్ ఆడియో, స్టీరియో స్పీకర్ సెటప్, మెటర్ ఫ్రేమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 5జీ, 4జీ వంటి ఫీచర్లు ఉంటాయి.

కలర్ ఆప్షన్స్: Xiaomi 14 CIVI డివైజ్ క్రూజ్ బ్లూ (డ్యూయల్-స్లైస్ ఎడిషన్), మచ్చా గ్రీన్ (వీగన్ లెదర్ ఎడిషన్) మరియు షాడో బ్లాక్ (మ్యాట్ షినిష్) కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post Xiaomi 14 CIVI ఇండియా లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: కొత్త టీజర్ షేర్ చేసిన షావోమి, CiVi సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/xiaomi-shared-a-new-teaser-civi-series-phone-might-launch-india/ Wed, 22 May 2024 18:08:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=11675 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో భారతీయ మార్కెట్ లో ఒక కొత్త సిరీస్ ను లాంచ్ చేయనుందని అర్థమవుతోంది. తాజాగా ఈ సంస్థ CIVI సిరీస్ టీజర్ ని సోషల్ మీడియాలోకి వదిలింది. దీంతో త్వరలోనే భారత్ లో సీవీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే షావోమి నుంచి కేవలం హింట్ మాత్రమే వచ్చింది. ఏ ఫోన్ లాంచ్ అవ్వనుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఆ విషయం వెల్లడయ్యే అవకాశం ఉంది. […]

The post Xiaomi: కొత్త టీజర్ షేర్ చేసిన షావోమి, CiVi సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi CiVi సిరీస్ ఫోన్ లాంచ్
  • షావోమి నుంచి కొత్త టీజర్ విడుదల
  • Xiaomi 14 CIVI లాంచ్ అవుతుందని అంచనా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో భారతీయ మార్కెట్ లో ఒక కొత్త సిరీస్ ను లాంచ్ చేయనుందని అర్థమవుతోంది. తాజాగా ఈ సంస్థ CIVI సిరీస్ టీజర్ ని సోషల్ మీడియాలోకి వదిలింది. దీంతో త్వరలోనే భారత్ లో సీవీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే షావోమి నుంచి కేవలం హింట్ మాత్రమే వచ్చింది. ఏ ఫోన్ లాంచ్ అవ్వనుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఆ విషయం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Xiaomi CIVI ఫోన్ ఇండియా లాంచ్ టీజర్

షావోమి తన X ఖాతాపై ఒక కొత్త వీడియోని షేర్ చేసింది. సినిమాటిక్ విజన్ అని ఆ వీడియోలో ఉంది.

ఇందులో Ci అంటే సినిమాటిక్ (‘Ci’nematic) అని, Vi అంటే విజన్ (‘Vi’sion) అని తన వీడియో ద్వారా షావోమి తెలిపింది.

Xiaomi 14 CIVI అనే కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఇది ఇప్పటికే చైనాలో లాంచైన CIVI 4 Pro కి రీబ్రాండ్ వర్షన్ అని చెప్పవచ్చు.

ఇంకా ఫోన్ పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ రావొచ్చు.

Xiaomi Civi 4 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Xiaomi Civi 4 Pro లో 6.55-ఇంచ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Xiaomi Civi 4 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Xiaomi Civi 4 Pro డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Xiaomi Civi 4 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి లైకా సమ్మైలక్స్ మెయిన్ సెన్సర్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Xiaomi Civi 4 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Xiaomi Civi 4 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Xiaomi: కొత్త టీజర్ షేర్ చేసిన షావోమి, CiVi సిరీస్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: భారత్‌లో లాంచ్ కానున్న Xiaomi 14 Civi https://www.91mobiles.com/telugu/xiaomi-14-civi-to-launch-india-soon/ Sun, 24 Mar 2024 18:28:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=10797 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఇటీవలె తన సొంత మార్కెట్ లో Xiaomi Civi 4 Pro అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వచ్చింది. అయితే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కాదనే అంతా భావించారు. కానీ, త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే భారత్ లో Xiaomi 14 Civi అనే పేరుతో Civi 4 […]

The post Xiaomi: భారత్‌లో లాంచ్ కానున్న Xiaomi 14 Civi first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇండియాకి వస్తోన్న Xiaomi 14 Civi
  • Xiaomi Civi 4 Pro కి రీబ్రాండ్ వర్షన్
  • ఇప్పటికే చైనాలో లాంచైన Civi 4 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఇటీవలె తన సొంత మార్కెట్ లో Xiaomi Civi 4 Pro అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వచ్చింది. అయితే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కాదనే అంతా భావించారు. కానీ, త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే భారత్ లో Xiaomi 14 Civi అనే పేరుతో Civi 4 Pro లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Xiaomi 14 Civi ఇండియా లాంచ్

Xiaomi 14 Civi స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని Gizmochina వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలిపింది. త్వరలోనే Xiaomi 14 Civi డివైజ్ యొక్క ఇండియా లాంచ్ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చైనాలో లాంచైన Xiaomi Civi 4 Pro డివైజ్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Xiaomi Civi 4 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi Civi 4 Pro లో 6.55-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2750*1236 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi Civi 4 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • కెమెరా: Xiaomi Civi 4 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి + 32ఎంపి కెమెరాలు ఉన్నాయి.
  • బ్యాటరీ: Xiaomi Civi 4 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi Civi 4 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi Civi 4 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Xiaomi: భారత్‌లో లాంచ్ కానున్న Xiaomi 14 Civi first appeared on 91Mobiles Telugu.

]]>