Lava Yuva 5G లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • మే 30న భారత్ లో Lava Yuva 5G లాంచ్
  • 50ఎంపి ఏఐ మెయిన్ కెమెరా
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నుంచి త్వరలో ఒక కొత్త యువా సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. మే 30వ తేదీన భారతీయ మార్కెట్ లో Lava Yuva 5G లాంచ్ కానుంది. కంపెనీ ఒక టీజర్ వీడియో ద్వారా Lava Yuva 5G యొక్క డిజైన్ రివీల్ చేసింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Yuva 5G లాంచ్ తేదీ, డిజైన్

Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ కంపెనీ యొక్క అధికార X ఖాతా ద్వారా రివీల్ అయ్యింది.

Lava Yuva 5G డివైజ్ మే 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది.

టీజర్ వీడియోను గమనిస్తే, ముందువైపు పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లే కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 4 కెమెరా కటౌట్స్ ఉన్నాయి. వీటిలో మూడు కెమెరాలు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. 50ఎంపి బ్రాండింగ్ కెమెరా మాడ్యూల్ మధ్యలో ఉంది.

Lava Yuva 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Lava Yuva 5G లో పంచ్ హోల్ స్క్రీన్ ఉంటుంది. డిస్ప్లే సైజ్ వివరాలు ఇంకా తెలియదు.

ప్రాసెసర్: Lava Yuva 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో రానుందని తెలుస్తోంది. చిప్సెట్ పేరు డేటాబేస్‌లో పేర్కొనలేదు. డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6080 చిప్సెట్స్ లో ఏదో ఒకటి ఈ ఫోన్ లో ఉండవచ్చు.

ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 5G 6జిబి ర్యామ్ మరియు 8జిబి ర్యామ్ ఆప్షన్స్ లో రానుంది. 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ లో అందించే అవకాశం ఉంది.

కెమెరా: Lava Yuva 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు టీజర్ వీడియో ద్వారా అర్థమవుతోంది. ఇందులో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్: Lava Yuva 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Lava Yuva 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.