
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని చైనాలో లాంచ్ అయ్యింది. Vivo Y200i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Vivo Y200i యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Vivo Y200i స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo Y200i లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo Y200i డివైజ్ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Vivo Y200i లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు 512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
బ్యాటరీ: Vivo Y200i లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: Vivo Y200i లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.
ఓఎస్: Vivo Y200i స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Vivo Y200i ధర
Vivo Y200i 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను CNY 1599 (సుమారు రూ.20,700) గా ఉంది.
Vivo Y200i 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ CNY 1,799 (సుమారు రూ.20,700) గా ఉంది.











