
Vivo సబ్-బ్రాండ్ iQOO భారతీయ మార్కెట్ లో iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ ని ఫిబ్రవరి 22న లాంచ్ చేయనుంది. నెల రోజుల నుంచి ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. ఐకూ బ్రాండ్ వరుసగా ఫోన్ టీజర్లను రిలీజ్ చేస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం iQOO Neo 9 Pro యొక్క స్టోరేజీ, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు కన్ఫర్మ్ అయ్యాయి. తాజాగా డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఖరారయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9 Pro డిస్ప్లే ఫీచర్స్ ఖరారు

- తాజాగా iQOO Neo 9 Pro డిస్ప్లే ఫీచర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఈ ఫోన్ అమోలెడ్ ఎల్టీపీవో ప్యానెల్, పంచ్-హోల్ డిజైన్ తో వస్తోంది.
- iQOO Neo 9 Pro ఫోన్ 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
- ఇంకా iQOO Neo 9 Pro డివైజ్ 3,000 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుండటం విశేషం.
- మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో వస్తోన్న ఈ ఫోన్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ చూస్తే, భారతీయ యూజర్లకు ఉత్తమమైన ఆప్షన్ గా నిలుస్తుందని భావించవచ్చు.
iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (ఖరారు)
- డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ ఎల్టీపీవో ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.
- బ్యాటరీ: iQOO Neo 9 Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- కెమెరా: iQOO Neo 9 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro డివైజ్ 256జిబి వరకు స్టోరేజీ, 8జిబి/12జిబి ర్యామ్ ఆప్షన్స్ తో రానుంది.
- కలర్ ఆప్షన్స్: iQOO Neo 9 Pro డివైజ్ ఫైరీ రెడ్ మరియు కాంక్వెరర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











