
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO A60 పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది. ఈ ఫోన్ ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.
OPPO A60 ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ, కెమెరా ఎఫ్‌వీ5 లిస్టింగ్
OPPO బ్రాండ్ కి చెందిన కొత్త ఫోన్ ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పై CPH2361 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
సర్టిఫికేషన్స్ ద్వారా డివైజ్ పేరు OPPO A60 అని ఖరారైంది. ఎన్బీటీసీ డేటాబేస్ పై OPPO A60 డివైజ్ GSM/WCDMA/LTE కనెక్టివిటీ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.
Camera FV5 లిస్టింగ్ ద్వారా OPPO A60 కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
రివీలైన వివరాల ప్రకారం, OPPO A60 f/1.9 అపర్చర్, ఈఐఎస్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత మోడల్ OPPO A59 5G కి OPPO A60 సక్సెసర్ గా మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి OPPO A59 5G స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
OPPO A59 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO A59 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్నెస్, 96 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO A59 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టాకోర్ చిప్ 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ అందించారు.
- ర్యామ్, స్టోరేజీ: OPPO A59 5G లో 4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: OPPO A59 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: OPPO A59 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఇది ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO A59 5G డివైజ్ 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.











