హైలైట్స్:
- బెంగళూరులో జరిపిన పరీక్షల్లో 1.2జీబీపీఎస్ 5జీ డౌన్లోడ్ స్పీడ్ నమోదు చేసిన వీఐ
- బెంగళూరు కాకుడా, న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోపాల్, కండ్లా పోర్ట్ ల వద్ద ట్రయల్స్ నిర్వహించిన వీఐ
- సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో భారతదేశంలో లాంచ్ కానున్న 5జీ సేవలు
5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రస్తుతం కొనసాగుతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో కనీసం ప్రధాన నగరాల్లోనైనా 5జీ సేవలు మొదలవుతాయని అంచనా వేస్తున్నారు. ఎయిర్టెల్, జియో, వీఐ, అదాని గ్రూప్స్ వేలంలో టాప్ బిడ్డర్స్ గా నిలిచారు. రూ.80,000 కోట్లతో జియో టాప్ బిడ్డర్ గా నిలిచింది. 700మెగాహెర్ట్జ్ బ్యాండ్ పై జియో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా టెలీకామ్ సంస్థలు గత కొన్ని నెలలుగా 5జీ ట్రయల్స్ ని నిర్వహిస్తున్నారు. తాజాగా, బెంగళూరులోని ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్ వద్ద వీఐ 5జీ ట్రయల్స్ నిర్వహించింది.
మొబైల్ హ్యాండ్సెట్ తో 1.2 జీబీపీఎస్ 5జీ డౌన్ లోడ్ స్పీడ్ ను నమోదు చేసినట్లు వీఐ ప్రకటించింది. బెంగళూరు కాకుండా, ఈ టెలీకామ్ సంస్థ న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్, భోపాల్, గుజరాత్ లోని కండ్లా పోర్ట్ ల వద్ద ట్రయల్స్ నిర్వహించింది.
Vodafone Idea 5G ట్రయల్స్
వొడాఫోన్ ఐడియా రీసెంట్ గా 5జీ ట్రయల్స్ ని నిర్వహించింది. ఎలక్ట్రిక్ పోల్స్, బస్ స్టాండ్స్, ట్రాఫిక్ లైట్స్ మొదలైనవి స్ట్రీట్ ఫర్నీచర్ గా విభజించడినవి. వీటిని 5జీ స్మాల్ సెల్స్ కోసం ఉపయోగిస్తారు. ఇక టెస్ట్ సందర్భంలో, స్మార్ట్ ఫోన్ ని 1.2 జీబీపీఎస్ 5జీ డౌన్ లోడ్ స్పీడ్ ని నమోదు చేసినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది.
2021, సెప్టెంబర్ లో, వొడాఫోన్ ఐడియా తాము 3.7 జీబీపీఎస్ 5జీ స్పీడ్ ని నమోదు చేసినట్లు ప్రకటించింది. మహారాష్ట్ర లోని పుణెలో ఈ టెస్టింగ్ నిర్వహించారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో వీఐ 1.5జీబీపీఎస్ పీక్ డౌన్ లోడ్ స్పీడ్ ని నమోదు చేసింది. గుజరాత్ లోని రూరల్ గాంధీనగర్ లో 100ఎంబీపీఎస్ యావరేజీ స్పీడ్ ని నమోదు చేసినట్లు వీఐ 2021 నవంబర్ లో ప్రకటించింది.
టెలీకామ్ జెయింట్ వీఐ, నోకియా యొక్క ఈ-బ్యాండ్ ఎండబ్ల్యూ (మైక్రోవేవ్) నెట్వర్క్ ని ఉపయోగించి ట్రయల్ ని నిర్వహించింది. ఇదే విధమైన ట్రయల్ లో ఎయిర్టెల్ 200ఎంబీపీఎస్ స్పీడ్ ని సైట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నమోదు చేసింది. గత కొన్ని నెలలుగా టెలీకామ్ ఆపరేటర్లు 5జీ ట్రయల్స్ ని నిర్వహిస్తున్నారు. రిలయన్స్ జియో 420ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ ని నమోదు చేయగలిగింది. ఇక ముంబైలో నిర్వహించిన ట్రయల్స్ లో 412ఎంబీపీఎస్ 5జీ అప్లోడ్ స్పీడ్ ని నమోదు చేసింది.
ఇక 5జీ వేలం నాలుగో రోజును పూర్తి చేసుకుంది. జులై, 30 శనివారం నాడు కూడా వేలం కొనసాగుతుందని టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం నాడు 23 రౌండ్స్ బిడ్డింగ్ జరిగిందని, ఈ బిడ్స్ విలువ రూ.1,49,855 కోట్లని ఆయన చెప్పారు. ఇకపోతే, ఎయిర్టెల్, వీఐ, జియో, అదానీ గ్రూప్ వేలంలో జోరుగా బిడ్స్ వేశారు. ముఖేశ్ అంబానీకి చెందిన జియో టాప్ బిడ్డర్ గా నిలిచింది.













