
స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.
Vivo T3 Pro మరియు Infinix GT 20 Pro ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
Vivo T3 Pro లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Infinix GT 20 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
Vivo T3 Pro vs Infinix GT 20 Pro: ప్రస్తుతం వీటి ధరలు
| వివో టీ3 ప్రో | ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో |
| 8జిబి+128జిబి: రూ.24,999 | 8జిబి+256జిబి: రూ.22,999 |
| 8జిబి+256జిబి: రూ.26,999 | 12జిబి+256జిబి: రూ.24,999 |
PCMark బ్యాటరీ టెస్ట్
పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతానికి డ్రాప్ అయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం తెలుస్తుంది. ఈ రెండు ఫోన్లలో మేం స్క్రీన్ బ్రైట్నెస్ 80 శాతం పెట్టాం. ఇప్పుడు టెస్టు ఫలితాలను చూద్దాం.

ఈ టెస్టులో వివో టీ3 ప్రో 15 గంటల 52 నిమిషాలు స్కోర్ చేసింది. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో 9 గంటల 13 నిమిషాలు స్కోర్ చేసింది. దీంతో వివో ఫోన్‌ది పైచేయి అని అర్థమవుతోంది.
| వివో టీ3 ప్రో (పీసీమార్క్) | ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (పీసీమార్క్) |
| 15 గంటల 52 నిమిషాలు | 9 గంటల 13 నిమిషాలు |
విజేత: Vivo T3 Pro
వీడియో స్ట్రీమింగ్
వివో టీ3 ప్రో మరియు ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను ప్లే చేశాం. ఈ టెస్టు కోసం రెండు ఫోన్లలో 50 శాతం బ్రైట్నెస్, వాల్యూమ్ పెట్టాం. వీడియో రెజుల్యూషన్‌ను 1080పి గా సెట్ చేశాం. ఈ టెస్టులో వివో టీ3 ప్రో యొక్క బ్యాటరీ 2 శాతం డ్రాప్ కాగా, ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో బ్యాటరీ 5 శాతం డ్రాప్ అయ్యింది.
| వివో టీ3 ప్రో (30 నిమిషాల యూట్యూబ్) | ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (30 నిమిషాల యూట్యూబ్) |
| 2 శాతం బ్యాటరీ డ్రాప్ | 5 శాతం బ్యాటరీ డ్రాప్ |
మీరు గనుక నాన్-స్టాప్‌గా వినోద కార్యక్రమాలు, సినిమాలు చూడటం లేదా యూట్యూబ్ ఎక్కువగా వినియోగించడం చేస్తుంటే, మీకు వివో టీ3 ప్రో బాగా సరిపోతుంది. ఇది ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో కంటే ఎక్కువ సేపు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
విజేత: Vivo T3 Pro
గేమింగ్ టెస్ట్
ఈ టెస్టు కోసం, మేం వివో టీ3 ప్రో మరియు ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్మీ రేసింగ్ 3 గేమ్‌లను ఒక్కోదానిలో 30 నిమిషాల చొప్పున ఆడటం జరిగింది. ఈ టెస్టుకి ముందు రెండు ఫోన్లలో గ్రాఫిక్స్ సెట్టింగ్స్, ఫ్రేమ్ రేట్, బ్రైట్నెస్, వాల్యూమ్ లెవెల్స్ ఒకే విధంగా ఉంచడం జరిగింది.
టెస్టు ఫలితాలను గమనిస్తే, వివో టీ3 ప్రో మరోసారి సత్తా చాటింది. ఒకటిన్నర గంటలు గేమ్ టైమ్ ముగిశాక, వివో టీ3 ప్రో బ్యాటరీ 16 శాతం మాత్రమే ఖర్చయ్యింది. మరోవైపు, ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో బ్యాటరీ 21 శాతం ఖర్చయ్యింది. ఈ టెస్టు ద్వారా వివో టీ3 ప్రో బెటర్ బ్యాటరీ లైఫ్ అందిస్తుందని అర్థమవుతోంది.
| వివో టీ3 ప్రో (30 నిమిషాల గేమింగ్) | ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో (30 నిమిషాల గేమింగ్) |
| 5.3 శాతం బ్యాటరీ డ్రాప్ | 7 శాతం బ్యాటరీ డ్రాప్ |
విజేత: Vivo T3 Pro
చార్జింగ్ స్పీడ్
వివో టీ3 ప్రో మరియు ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫోన్లు రెండు కూడా కంపాటిబుల్ చార్జర్ తో వస్తున్నాయి. వివో టీ3 ప్రో 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
మేం జరిపిన టెస్టులో, వివో టీ3 ప్రో 52 నిమిషాల్లో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యింది. మరోవైపు, ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో కి 48 నిమిషాల సమయం పట్టింది.
ఈ టెస్టులో ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో విజయం సాధించింది. మీరు గనుక త్వరగా చార్జ్ అయ్యే ఫోన్ కోసం చూస్తుంటే, ఈ రెండు ఫోన్లలో ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ప్రయత్నించవచ్చు.
విజేత: Infinix GT 20 Pro
ఏది బెటర్?
ఈ టెస్టు ఫలితాలను బట్టి చూస్తే, Vivo T3 Pro పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. బెంచ్‌మార్క్ ఫలితాలే కాకుండా రియల్-వరల్డ్ టెస్టుల్లో కూడా Infinix GT 20 Pro కంటే వివో టీ3 ప్రో బెటర్ గా పెర్ఫామ్ చేసింది. చార్జింగ్ స్పీడ్ మాత్రం ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో కంటే తక్కువగానే ఉంది. కానీ, బ్యాటరీ సైజ్ ని పరిగణలోకి తీసుకుంటే వివో టీ3 ప్రో చార్జింగ్ స్పీడ్ బాగానే ఉందని చెప్పవచ్చు. సాలిడ్ బ్యాటరీ లైఫ్ కావాలంటే మీకు Vivo T3 Pro బెస్ట్ ఆప్షన్.











