కొత్త ఫోన్ టీజర్‌ని షేర్ చేసిన లావా; Lava Storm 5G అయ్యుంటుందని అంచనా!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Lava Storm 5G
  • డైమెన్సిటీ 6100+ చిప్‌తో వస్తోన్న డివైజ్
  • Lava Storm 5G ధర రూ.15,000 ఉండే అవకాశం

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava ఇటీవలె Yuva 3 Pro డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు మరొక ఫోన్ టీజర్ ని సోషల్ మీడియాతో షేర్ చేసింది. అయితే కచ్చితమైన మోడల్ పేరు రివీల్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ Lava Storm 5G అయ్యుంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇకపోతే ఈ అప్‌కమింగ్ ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే లావా అధికార వెబ్‌సైట్ లో దర్శనమిస్తోంది.

లావా షేర్ చేసిన ఫోన్ Lava Storm 5G అని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ చెబుతున్నారు. Lava Storm 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తుందని టిప్‌స్టర్ అంచనా వేశారు. అలాగే లాంచ్ కి ముందు Lava Storm 5G యొక్క మైక్రో-సైట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ లో కనిపించింది. దీంతో డివైజ్ యొక్క కెమెరా మాడ్యూల్ డిజైన్ రివీల్ అయ్యింది.

Lava Storm 5G ధర

  • టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం, Lava Storm 5G డివైజ్ ధర భారత్ లో రూ.15,000 లోపు ఉండవచ్చని తెలుస్తోంది.
  • ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో ఈ డివైజ్ వస్తోందని టిప్‌స్టర్ అంటున్నారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • Lava Storm 5G డివైజ్ మైక్రో-సైట్ అమెజాన్ పై కనిపించడంతో ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్లిమ్స్ రివీల్ అయ్యింది.
  • అమెజాన్ లో కనిపించిన టీజర్ ఇమేజ్ ని గమనిస్తే, ఈ డివైజ్ డ్యూయల్ లేదా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
  • Lava Storm 5G బ్యాక్ ప్యానెల్ పై మూడు సర్క్యులర్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో ఒక దానిలో ఎల్ఈడీ ఫ్లాష్ ఉండే అవకాశం ఉంది.
  • రానున్న రోజుల్లో టీజర్ల ద్వారా లావా సంస్థ Lava Storm 5G డివైజ్ విశేషాలను పంచుకునే అవకాశం ఉంది. ఈలోపు ఇటీవలె లాంచైన Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Lava Yuva 3 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava Yuva 3 Pro లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Lava Yuva 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్యూర్ ఎడిషన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 3 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం.
  • కెమెరా: Lava Yuva 3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Lava Yuva 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Yuva 3 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Previous articleజనవరి 4న లాంచ్ అవుతోన్న Redmi Note 13 Pro+ 5G
Next articleMediaTek Helio G85 చిప్‌తో భారత్‌లో లాంచైన POCO C65; ధర రూ.8,499 మాత్రమే!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.