Lava Yuva 5G టీజర్ విడుదల, త్వరలో లాంచ్

Highlights

  • Lava Yuva 5G టీజర్ విడుదల
  • త్వరలో భారత్ లో లాంచ్
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న ఫోన్

భారతదేశానికి చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Lava త్వరలో యువా సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Yuva 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నేడు లావా తన సోషల్ మీడియా హ్యాండిల్ పై Lava Yuva 5G టీజర్ ని షేర్ చేసింది. దీంతో త్వరలో డివైజ్ లాంచ్ ఉండనుందని అధికారికంగా స్పష్టమైంది. అంతేకాదు, ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Lava Yuva 5G యొక్క గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు మరియు టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Lava Yuva 5G టీజర్ విడుదల

లావా విడుదల చేసిన Lava Yuva 5G యొక్క టీజర్ వీడియోను గమనిస్తే, డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయని అర్థమవుతోంది.

Lava Yuva 5G గీక్‌బెంచ్ వివరాలు

Lava Yuva 5G డివైజ్ ఇటీవలె గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ పై LXX513 అనే మోడల్ నంబర్ తో ఈ ఫోన్ కనిపించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ చిప్సెట్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ ద్వారా ఖరారైంది.

Lava Yuva 5G డివైజ్ గీక్‌బెంచ్ పై 6జిబి/8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

Lava Yuva 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ ఉండవచ్చు. అలాగే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇస్తారని అంచనా వేస్తున్నారు.