లీకైన Honor 200, Honor 200 Pro స్పెసిఫికేషన్స్, మే 27న చైనాలో లాంచ్

Highlights

  • త్వరలో Honor 200 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న Honor 200, 200 Pro
  • 1.5కే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో హానర్ 200 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Honor 200 మరియు Honor 200 Pro అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్లు మే 27న చైనాలో లాంచ్ అవ్వనున్నాయి. గ్లోబల్ గా జూన్ 12వ తేదీన లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Honor 200, Honor 200 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: లీక్ ప్రకారం, Honor 200 మరియు Honor 200 Pro లో 6.7-ఇంచ్ మరియు 6.78-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ 1.5కే స్క్రీన్స్ ఉంటాయి. ఇంకా ఈ ఫోన్లలో 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Honor 200 లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. Honor 200 Pro లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది.

బ్యాటరీ: Honor 200 మరియు Honor 200 Pro ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. ప్రో వేరియంట్ 66 వాట్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఫ్రంట్ కెమెరా: Honor 200 మరియు Honor 200 Pro ఫోన్లలో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ప్రో వేరియంట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది. మరొక లెన్స్ వివరాలు ఇంకా తెలియదు.

రియర్ కెమెరా: Honor 200 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. Honor 200 Pro లో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ఓఐఎస్ లెన్స్ ఉంటుందని సమాచారం. ఈ రెండు ఫోన్లలో 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్856 2.5x టెలీఫోటో కెమెరా ఉంటాయి.

ఓఎస్: Honor 200 మరియు Honor 200 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానున్నాయి.

ఇతర ఫీచర్లు: ఈ రెండు ఫోన్లలో ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్స్, ఐపీ55 రేటింగ్ ఉంటాయి.

కలర్స్: Honor 200 సిరీస్ లోని రెండు ఫోన్లు స్కై బ్లూ, కోరల్ పింక్, మూన్ షాడో వైట్ మరియు ఇంక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.