Moto G04s: వచ్చే వారం భారత్‌లో లాంచ్ అవుతోన్న మోటోరోలా కొత్త ఫోన్

Highlights

  • గత నెలలో యూరప్‌లో లాంచైన Moto G04s
  • మే 30న భారత్ లో Moto G04s లాంచ్
  • భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో ఒక కొత్త జీ-సిరీస్ ఫోన్‌ని భారత్ లో లాంచ్ చేయనుంది. Moto G04s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ భారత్ లో విక్రయానికి రానుంది. ఇప్పటికే ఈ ఫోన్ మైక్రో-సైట్ ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోంది. ఓసారి Moto G04s యొక్క లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G04s లాంచ్ తేదీ

Moto G04s స్మార్ట్‌ఫోన్ భారత్ లో మే 30వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ 4జీ హ్యాండ్సెట్ ఎంట్రీ-లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. ఓసారి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Moto G04s స్పెసిఫికేషన్స్

Moto G04s డివైజ్ 6.6-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, పంచ్ హోల్ కటౌట్ తో వస్తోంది.

Moto G04s డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం దీనికి మాలి జీ57 జీపీయూ జత చేశారు.

Moto G04s స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది పొట్రెయిట్ మోడల్ మరియు నైట్ విజన్ సపోర్ట్ తో వస్తోంది.

మోటో జీ04ఎస్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.

మోటో జీ04ఎస్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజీ ఆప్షన్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇంకా ఈ ఫోన్ లో డాల్బీ అట్మాస్ ఆడియో, మోటో జెశ్చర్స్ ఉంటాయి.

Moto G04s ధర (అంచనా)

Moto G04s స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.8000 వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Moto G04s స్మార్ట్‌ఫోన్ ఆరెంజ్, గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G04s డివైజ్ 178.8 గ్రాముల బరువు, 7.99 మి.మీ మందం ఉంటుందని సమాచారం.