Redmi A3x: 90Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన రెడ్మీ కొత్త ఫోన్

Highlights

  • త్వరలో భారత్ లో Redmi A3x లాంచ్
  • తాజాగా పాకిస్తాన్ లోకి ఎంట్రీ
  • యూనిఎస్ఓసీ చిప్సెట్, 90 హెర్ట్జ్ స్క్రీన్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. Redmi A3x పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్తాన్ మార్కెట్ లో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవెల్ కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

Redmi A3x ధర, లభ్యత

Redmi A3x స్మార్ట్‌ఫోన్ యొక్క 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర పాకిస్తాన్ మార్కెట్ లో రూ.18,999 గా ఉంది. అంటే భారత కరెన్సీలో దీన్ని సుమారు రూ.5,676 అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. దీంతో త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Redmi A3x స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ వైట్, అరోరా గ్రీన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi A3x స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే: Redmi A3x లో 6.71-ఇంచ్ భారీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐకేర్ డీసీ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi A3x ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి జీ57 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Redmi A3x లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Redmi A3x డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi A3x డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.

భద్రత: Redmi A3x డివైజ్ లో భద్రత కోసం, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి.

ఆడియో: Redmi A3x డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది.

బరువు, చుట్టుకొలత: Redmi A3x స్మార్ట్‌ఫోన్ 168.4 మి.మీ పొడవు, 76.3 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం, 193 గ్రాముల బరువు ఉంటుంది.