Honor: లీకైన Magic 6 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్

Highlights

  • త్వరలో Honor Magic 6 Pro భారత్‌లో లాంచ్
  • లాంచ్ పై హింట్ ఇచ్చిన హానర్ సీఈవో
  • తక్కువ బడ్జెట్‌లో రానున్న మ్యాజిక్ 6 ప్రో

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో మ్యాజిక్ సిరీస్ లో ఓ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Honor Magic 6 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని దేశాల్లో అందుబాటులో లాంచ్ అయ్యింది. రానున్న కొన్ని నెలల్లో ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, హానర్ కంపెనీ అధికారి షేర్ చేసిన ఓ వీడియోలో ఇండియా లాంచ్ ఉండవచ్చని అన్నారు. మరోవైపు, ఒక టిప్‌స్టర్ Honor Magic 6 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్ షేర్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Honor Magic 6 Pro ఇండియా లాంచ్ వివరాలు

ఎంతోమంది యూజర్లు Honor Magic 6 Pro లాంచ్ గురించి అడిగిన అభ్యర్థనలకు సంబంధించిన వీడియోను కంపెనీకి చెందిన ఒక అధికారి X పై షేర్ చేశారు.

త్వరలో భారత్ లోకి Honor Magic 6 Pro ప్రవేశిస్తుందని హానర్‌టెక్ సీఈవో మాధవ్ సేత్ X పై ఒక పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చారు.

Honor Magic సిరీస్ భారతీయ వినియోదారుల అంచనాలను అందుకుంటుందని సేత్ చెప్పారు. జూన్ 6న లాంచ్ అవుతోన్న సన్ననైన Vivo X Fold 3 Pro లాంచ్ టీజర్ కి స్పందనగా సేత్ పై విధంగా మాట్లాడారు.

ఇప్పటివరకు Honor Magic 6 Pro కి సంబంధించిన ఇండియా లాంచ్ వివరాలు తెలియలేదు. త్వరలోనే హానర్ నుంచి అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ప్రకారం, Honor Magic 6 Pro డివైజ్ జులైలో భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే భారత్ లో ఈ ఫోన్ చవకగా ఏమీ ఉండదని గుగ్లాని చెప్పారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.

Honor Magic 6 Pro ధర, ముఖ్యమైన వివరాలు

Honor Magic 6 Pro డివైజ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో 1299 యూరోల (సుమారు రూ.1,16,800) ధరతో లాంచ్ అయ్యింది. ఇది 12జిబి+512జిబి మోడల్ ధర. డివైజ్ ఎపి గ్రీన్, క్లౌడ్ పర్పుల్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని అధికార వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యింది.

Honor Magic 6 Pro డివైజ్ 162.5 మి.మీ పొడవు, 75.8 మి.మీ వెడల్పు, 8.9 మి.మీ మందం ఉంటుంది. వీగన్ లెదర్ వేరియంట్ బరువు 225 గ్రాములు. గ్లాస్ వేరియంట్ బరువు 229 గ్రాములు.

Honor Magic 6 Pro డివైజ్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.