Nothing Phone (3): యాక్షన్ బటన్‌తో వస్తోన్న నథింగ్ ఫోన్ 3?

Highlights

  • త్వరలో Nothing Phone (3) లాంచ్
  • డివైజ్‌ని షేర్ చేసిన కార్ల్ పే
  • యాక్షన్ బటన్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Nothing తక్కువ సమయంలోనే జనాదరణ పొందింది. వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. ఇప్పుడు ఈ సంస్థ తన తదుపరి ఫ్లాగ్షిప్ Nothing Phone (3) ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా నథింగ్ అధినేత కార్ల్ పే తన X ఖాతా ద్వారా Nothing Phone (3) డివైజ్‌ని షేర్ చేశారు. దీంతో నథింగ్ ఫోన్ 3 అప్డేట్ అఫీషియల్ గా బయటకు వచ్చినట్లైంది. ఈ ఫోన్ యాక్షన్ బటన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి విశేషాలు తెలుసుకుందాం పదండి.

యాక్షన్ బటన్ తో రానున్న Nothing Phone (3)

కార్ల్ పే షేర్ చేసిన ఇమేజెస్‌ని బట్టి, ఫోన్‌కి కుడివైపున పవర్ బటన్, ఎడమవైపున వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

Nothing Phone (2), (2a) డివైజెస్ లో ఇదే విధంగా ఉన్నాయి. కానీ, Nothing Phone (3) లో పవర్ బటన్ కి క్రింద ఒక యాడ్-ఆన్ బటన్ కనిపిస్తోంది.

Nothing Phone (3) లో కనిపిస్తోన్న ఈ కొత్త బటన్‌ని యాక్షన్ బటన్‌గా భావిస్తున్నారు. iPhone 15 సిరీస్ లో ఈ యాక్షన్ బటన్ ఉంది. Realme 12 లో కూడా డైనమిక్ బటన్ పేరుతో ఒక బటన్ ఉంది.

ఇవి షార్ట్ కట్ బటన్స్. వీటి ద్వారా స్పెషల్ యాక్షన్స్ ని కస్టమైజ్ చేయవచ్చు.

అయితే Nothing Phone (3) నుంచి ఏం ఆశించవచ్చనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Nothing Phone (2) కి సక్సెసర్ గా Nothing Phone (3) మార్కెట్ లోకి రానుంది.

కార్ల్ పే షేర్ చేసిన డిజైన్ ప్రకారం, క్విక్ సెట్టింగ్స్ డిజైన్ పెద్దగా ఏం మారలేదు. వై-ఫై టాగుల్ సైజ్ తగ్గింది. కొత్తగా మొబైల్ డేటా టాగుల్ ని అందించారు. బ్రైట్నెస్ స్లైడర్‌ని క్రిందకు దించారు. ఇది ఇప్పుడు మరింత మందంగా కనిపిస్తోంది. రింగ్ మరియు వైబ్రేషన్ మోడ్స్ కి మారేందుకు స్లైడర్ కూడా ఉంది.

Nothing Phone (3) గురించి ప్రస్తుతానికి మరే ఇతర వివరాలు బయటకు రాలేదు. త్వరలోనే నథింగ్ సంస్థ ఈ ఫోన్‌ని టీజ్ చేసే అవకాశం ఉంది.

Nothing Phone (2) స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Nothing Phone (2) లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ఎల్టీపీవో డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 10 బిట్ కలర్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Nothing Phone (2) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Nothing Phone (2) డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Nothing Phone (2) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Nothing Phone (2) లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Nothing Phone (2) డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.