Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్

Highlights

  • త్వరలో Vivo V40 లాంచ్
  • జీసీఎఫ్ సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2348

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో V40 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో ఉన్న వీ30 సిరీస్ కి సక్సెసర్ గా Vivo V40 సిరీస్ రానుంది. ఇంకా ఈ సిరీస్ లాంచ్ వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఈలోపు Vivo V40 డివైజ్ జీసీఎఫ్ సర్టిఫికేషన్ పై కనిపించింది. తొలుత MySmartPrice ఈ విషయాన్ని గుర్తించింది. ఓసారి జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo V40 జీసీఎఫ్ సర్టిఫికేషన్ వివరాలు

త్వరలో వివో నుంచి Vivo V40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, Vivo V40 Pro మరియు Vivo V40e ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 డివైజ్ V2348 అనే మోడల్ నంబర్ తో జీసీఎఫ్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

ఇప్పటికే ఈ ఫోన్ ఐఎంఈఐ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ప్రో వేరియంట్ కూడా కొన్ని రోజుల క్రితం యూకే క్యారియర్ ఈఈ యొక్క వెబ్‌సైట్ లో కనిపించింది. దీని ద్వారా ఎన్‌ఎఫ్‌సీ తప్పా ఇతర డివైజ్ వివరాలు రివీల్ కాలేదు.

91mobiles Hindi కథనం ప్రకారం, వివో సంస్థ Vivo V40 లైనప్‌ని ఆగస్టు మరియు సెప్టెంబర్ 2024 మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. మరొక వేరియంట్ Vivo V40 Lite పై కూడా రూమర్లు వచ్చాయి. ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

ఈ ఏడాది మార్చి నెలలో లాంచైన Vivo V30 సిరీస్‌కు సక్సెసర్ గా Vivo V40 సిరీస్ మార్కెట్ లోకి వస్తోంది. Vivo V40 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యేందుకు ఇంకా సమయం ఉంది.

Vivo V30 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V30 లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. హీటింగ్ సమస్యలు లేకుండా అల్ట్రా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo V30 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మరియు 12జిబి వర్చువల్ ర్యామ్ లభిస్తాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo V30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఏఎఫ్ మరియు ఏఐ ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo V30 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo V30 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.