Realme Narzo N65 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • మే 28న భారత్ లో Realme Narzo N65 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్
  • ఈ-కామర్స్ వేదిక అమెజాన్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో ఒక కొత్త నార్జో సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Realme Narzo N65 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. భారత్ లో ఈ ఫోన్ మే 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 3600 చిప్సెట్ తో వస్తోన్న ప్రపంచపు మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఓసారి Realme Narzo N65 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ వివరాలను తెలుసుకుందాం.

Realme Narzo N65 5G లాంచ్ తేదీ, ఫీచర్లు

భారత్ లో Realme Narzo N65 5G డివైజ్ మే 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ఐపీ54 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ని ఈ ఫోన్ లో అందించారు.

కంపెనీ షేర్ చేసిన టీజర్‌ని గమనిస్తే, డివైజ్ గోల్డెన్ కలర్ షేడ్ లో కనిపిస్తోంది. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Realme Narzo N65 5G డివైజ్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

ఇంకా భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

Realme Narzo N65 5G డివైజ్ 5జీ కనెక్టివిటీతో వస్తోంది. ఈ ఫోన్ పోకో ఎమ్6 5జీ, మోటో జీ34 5జీ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మే 28వ తారీఖున నార్జో ఎన్65 కి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రానుంది.

Realme Narzo N55 స్పెసిఫికేషన్స్

Realme Narzo N55 లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. ఈ హ్యాండ్సెట్ మినీ క్యాప్సూల్ ఫీచర్ తో వచ్చింది. ఆపిల్ తీసుకొచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ స్పూర్తితో ఈ మినీ క్యాప్సూల్ ఫీచర్ వచ్చింది. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, నోటిఫికేషన్స్ తదితర సమాచారం తెలుసుకోవచ్చు. అయితే, ఇదివరకు ఇదే ఫీచర్ కంపెనీ రియల్మీ సీ55 డివైజ్ లో ఇచ్చింది.

Realme Narzo N55 లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ ఎడ్జ్, 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ బ్రైట్నెస్ మరియు 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

Realme Narzo N55 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

డైనమిక్ ర్యామ్ ద్వారా 12జిబి వరకు ర్యామ్ ని పొందవచ్చు. 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్-వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme Narzo N55 లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Realme Narzo N55 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. 29 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 50 శాతం చార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.